15.15
ఇతి గుహ్యతమం శాస్త్రం
{15.20}
ఇదముక్తం మయా అనఘ
ఏతద్బుద్డ్వా బుద్దిమాన్స్యా త్
కృతకృతశ్చ భారత అర్జునా! మిక్కిలి రహస్యమైన యోగ శాస్త్రమును నీకు చెప్పితిని. దీనిని తెలిసినవాడు బుద్ధిమంతుడగును. కృతార్ధుడగును.
"ఏది చెయ్య వలసి ఉందో అది అప్పటికే చేయబడినది" అనునది బుద్ధుని వాక్యం. పెద్ద కవిత్వం, జయభేరి లేకుండా జీవుని యొక్క శ్రేష్టమైన గమ్యం చెప్పబడినది.
దాని స్థితి కి వెళ్ళనిదే ఏదీ చేయబడలేదు. శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి "నేను ఎవరెస్ట్ శిఖరాన్నెక్కేను, మార్స్ గ్రహానికి వెళ్ళేను, లాటెరి గెలిచేను" అని చెప్తే ఆయన ఇలా సమాధానమిస్తాడు: "ఇవి కావు చేయవలసినవి. నువ్వు ఏది చేయాలో జీవితంలో ఇంకా చేయలేదు".
ఎప్పుడైతే మీరు చెయ్యదలచుకొన్నది చేసేరో ధనకాంక్ష ఉండదు. కాబట్టి ఒకరిని బాధ పెట్టడం గానీ, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపడంగాని చేయబుద్ధి వెయ్యదు. లోభం, భయం, క్రోధం మిమ్మల్ని వీడుతాయి. స్వార్థానికై పనులు చేయరు. మీరు జీవితాన్ని స్పష్టంగా చూసి, మనకు మాత్రమే సంతోషాన్నిచ్చే పనులు చేయరు. జీవితం నుంచి ఎక్కువ ఆశించరు. ఒక్క పరోపకారం తప్ప. 215
No comments:
Post a Comment