16.1
శ్రీ భగవానువాచ
అభయం సత్త్వసంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితిః
{16.1}
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జనమ్
అహింసా సత్య మక్రోధ స్త్యాగశ్శాంతి రైపెశునమ్
{16.2}
దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రాచాపలమ్
తేజః క్షమా ధృతి శౌచ మద్రోహో నాతి మానితా
{16.3}
భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత
భయము లేకుండుట, సత్త్వశుద్ధి, జ్ఞానయోగనిష్ఠ, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఋజుత్వము, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, భూతదయ, విషయ లోలత్వము లేకుండుట, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట, గర్వము లేకుండుట -- అర్జునా! ఈ సుగుణములు దైవ సంపద కలవారికి కలుగుచున్నవి ఀ
నేను ఒకరోజు దినపత్రికను చూసి, క్రిస్టీన్ తో "ఈ పత్రిక సంపాదకుడు గీతను చదువుతున్నాడని అనుకుంటాను" అన్నాను. అది చదివితే రెండు మార్గాలలో గీత చెప్పినట్లు ఒకటి ఎన్నుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది: అమిత ఆనందాన్ని ఇచ్చే ఊర్ధ్వ మైన దారి; అమిత దుఃఖాన్ని కలిగించే క్రిందికైన దారి.
ఎడమ పేజీలో ఒక వ్యక్తితో భేటీ ఉన్నాది. అతను ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంభందితమైన విషయాల్లో మానవాళి ఎలా నెట్టుకు రావాలో అన్న వాటి గురించి సలహా ఇస్తున్నాడు. ఆయన దృష్టిలో అవి తప్పక సమస్యలుగా అవుతాయి. మొదటి వాక్యంలోనే నాకు తెలిసింది ఆయని సలహా ఎక్కడికి దారి తీస్తుందో. ఆయన చెప్పేది మనం ఒకనినుంచి లాక్కోవడం గురించి గాని మళ్ళీ తిరిగి ఇవ్వడం గురించి కాదు. అది తప్పక క్రిందికి వెళ్ళే దారి.
అతను భవిష్యత్తులో వచ్చే సమస్యలు గురించి చెప్పేడు. ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, ఆహార౦ ఇంధనాల కరవు వస్తుంది, వీధిల్లో కొట్లాటలు మొదలగునవి జరుగుతాయిని చెప్పేడు. పర్యావరణ నాశనం, అణ్వాశ్త్రా లతో యుద్ధాలు మానవాళిని వెంటాడే సమస్యలు. ఆయన చెప్పేది మన భవిష్యత్తు వినాశనముతో కూడినదని. నేను అంతా చదివిన తరువాత గుహలలో నివశించే తిరోగతి పడుతుంది అని అనుకున్నాను.
కుడివైపు వున్న పేజీ చదివిన తరువాత నా మనస్సు కుదుటు పడింది. ఎందుకంటే దానిమీద మదర్ తెరెసా నోబెల్ బహుమతికై ఆస్లో లో తీసికొ౦టున్న చిత్రాలను ముద్రించేరు. ఇది అతి విశేషమైన విషయం. ఆమె పొందిన బహుమతి శాంతికి సంబంధించినదైనప్పటికీ, శాంతియుతులకు సాధారణంగా ఇవ్వరు. ఆమె యుద్ధాల గురించి మాట్లాడక, జీవితాన్ని పేద ప్రజల ఉద్ధరణకై అర్పించింది. ఆమెకు పిల్లలు అందరిదగ్గర దండుకుని వచ్చిన డబ్బులను బహుమానంగా ఇచ్చేరు. అది "బీద ప్రజల నోబెల్ బహుమతి". ఆమె బహుశా నిజం బహుమతికన్నా అది విలువైనదని తలంచి యుండవచ్చు. ఆమె సాధారణంగా నోబెల్ బహుమతి అందుకున్న వారి గౌరవార్థ విందుని వద్దని, ఆ డబ్బుని బీద ప్రజలకిమ్మని కోరేరు.
గీత చెప్పినట్లు మదర్ తెరెసా దేవునితో ఐక్యమవ్వుటకు ఉన్నతమైన మార్గాన్ని ఎన్నుకొన్నారు. ఆమె జీవితం, ఈ పై శ్లోకము చెప్పినట్లు, మనశ్శుద్ధితో దైవ లక్షణాలు ఎలా పొందగలమో దానికి తార్కాణము.
మదర్ తెరెసా యుగోస్లావీయా లో జన్మించేరు. ఆమె 18 ఏళ్ల వయస్సులో భారత దేశానికి వచ్చి, సిస్టర్ ఆగ్నెస్ అనే పేరుతో ఒక బాలికల పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరేరు. ఆమె మంచి ఉపాధ్యాయిని అయి ఉండవచ్చు. ఆమె అప్పటికీ పాఠాలు చెప్పడం తనకు ఇష్టమని చెప్పేరు. ఆమె ఉపాధ్యాయినిగా జీవితమంతా గడిపినా జీవితం సార్థకమయ్యేది.
ఆమె 35 ఏళ్ల వయస్సులో డార్జీలింగ్ కి వెళ్ళేరు. అది హిమాలయాలలో సముద్ర మట్టం నుంచి 7000 అడుగుల ఎత్తులో ఉన్నది. దారి పొడుగునా అనేక అందమైన ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. కాని ఆమె మనస్సులో ఏదో పరివర్తన జరిగింది. "ఆ రైలు బండిలో నేను జీవితాన్ని బీద ప్రజల పురోగతికై అర్పించాలని, అట్టి సేవ జీసస్ కి చేసిన సేవకు సమానమని గట్టి సంకల్పం కలిగింది" అని ఆమె చెప్పేరు.
కలకత్తా ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి రెండవ రాజధాని. అక్కడ భారత సంస్కృతి, బ్రిటిష్ శక్తి వ్యక్తమయ్యేవి. మదర్ తెరెసా పని చేసిన సెయింట్ మేరీ పాఠశాలలో అతి ధనవంతుల పిల్లలు చదివేవారు. ఆమె పాఠశాలను వదలడం, తన స్వంత ఇంటిని వీడడమంత కష్టమైనదని చెప్పేరు. సెయింట్ మేరీ ఆమె దృష్టిలో: అందము, మంచివారల సహవాసము, సుఖము, క్షేమం కలిగిన, నిస్వార్థ సేవ చేయు దేవత. ఆమె వెనక్కి చూడకుండా కలకత్తాలో నిరాశ్రయుల సేవకై ఒక సాధారణ వస్త్రాన్ని కట్టుకొని, కొన్ని రూపాయలు చేతబట్టుకొని, ఒక పథకం లేకుండా, జీసస్ చే ప్రభావితమై బయలదేరేరు. ఆమె ఆ పని ఉద్రేకముతో చేయలేదు. ఎందుకంటే ఆమె వైద్యం గూర్చి నేర్చుకొన్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ లాగ తనకు అగుపించిన పేద నిరాశ్రయులను చేరదీసి వారిని ఉద్ధరించేరు
ఆమె ఒక సంస్థను స్థాపించి, అందులో పేద నిరాశ్రయుల సేవకై పూనుకొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేరు. ఇప్పుడికీ అది అనేక దేశాల్లో ఉంది. వారందరూ ఆమెను సెయింట్ గా ఆరాధిస్తారు. ముఖ్యంగా మనము తెలిసికోవలసినది ఏమిటంటే ఆమె పుట్టుకతో సెయింట్ కాదు. ఆమె పెరుగుతున్నకొద్దీ జీవితంలో నిస్వార్థమైన నిర్ణయాలు తీసికొన్నారు. ఆమె గీత చెప్పినట్లు ఊర్ధ్వ లోకాలకు వెళ్ళే దారిని ఎంచుకున్నారు. మనము పుట్టుకతోనే సద్గుణాలతో పుట్ట౦. పెరుగుతున్నప్పుడు మనం వాటిని అలవరుచకొ౦టా౦.
ఈ విధంగా నేను చదివిన దిన పత్రికలో రెండు కథానాలు ఉన్నాయి: ఒకటి కారుచీకటికి దారి తీసేది; రెండవది మదర్ తెరెసా గురించి. మొదటి పేజీలో ఉన్నతను నడివయస్సులో ఉన్న మంచి ప్రతిభావంతుడు, శక్తి గలవాడు. ఆయన తనను, తన కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులలోనూ పోషించుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అతను తనకు ఉన్నత ప్రమాణాలను పెట్టుకొన్నాడు. అతను తను ఊహించినట్టి చీకటి ప్రపంచం వలన తీరని నష్టానికి గురి అవుతాడు.
కుడి పేజీలో ఉన్న మదర్ తెరెసా కథనం ప్రజ్వలమైనది. బక్కచిక్కిన చిన్నపాటి శరీరంతో ఉన్నా ఆమె చేతనత్వంతో కూడి తన శరీరాన్ని తను కట్టుకొన్న వస్త్రంవలె ధరించారు. ఆమె ఆస్లోలో, ప్రపంచ అధినేతలతో, కలకత్తాలోని నిరాశ్రయులతో తీసికొన్న ఫోటోలలో చిరునవ్వుతో అందరికీ ఊరట కలిగించేరు. ఆమె బ్రతకడమే కాదు, వర్ధిల్లుతారు. జీవిత౦ ఆమె నుంచి ఎంత తీసుకొంటే, అంతకన్నా అనేక రెట్లు ఆమె ఇస్తుంది. ఆమెను చూసిన వారెవ్వరూ ఆమె ఆనందముగా ఉన్నారా అని అడగరు. వాళ్ళ ముఖాలను చూస్తే ఏ మార్గము ఏ గమ్యానికి తీసికెళుతుందో తెలుస్తుంది. 219
No comments:
Post a Comment