15.3
స రూపమస్యేహ తథోపలభ్యతే
{15.3}
నా౦తో న చాదిర్న చ సంప్రతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా
తతః పదం తత్పరిమార్గితవ్యం
{15.4}
యస్మిన్ గతా న నివర్తంతి భూయః
తమేవ చాద్య౦ పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ
ఈ లోకమునందు ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము తెలియ శక్యము కాదు. దాని యొక్క ఆదిగాని, మధ్యముగాని, అంతముగాని తెలియకున్నది. పాతుకుపోయిన వేళ్ళు గల ఈ సంసారవృక్షమును అసంగ శస్త్రము చేత గట్టిగ ఛేదించి, ఆ పిమ్మట ఏ స్థానమును చేరిన పిదప పునరావృత్తి కలుగదో , ఎవని నుండి అనాదియగు ఈ ప్రవృత్తి కదలినదో అట్టి ఆద్యపురుషుడగు భగవానుని శరణు బొందుచున్నాను అను భావముతో భగవానుని అన్వేషింపవలెను.
శ్రీకృష్ణుడు చెప్పిన అశ్వత్థ వృక్షము యొక్క అధిక భాగము మన అంతర్గతములో ఉన్నది. మనము దాని ఆదిని కనుగొనుటకై ప్రయత్నించాలి.
కొందరు ఆ వృక్షము ఒక భ్రాంతి అని చెప్పుదురు. కాని దాని ప్రతి ఆకు విలువైనది. ప్రతి వ్యక్తికి గౌరవం, ప్రేమ, భద్రత మనమివ్వగలగాలి. చెట్లను నరికి వేయడం గురించి మాట్లాడడంకన్నా, మన చైతన్యం లోతులలో వున్న అశ్వత్థ వృక్షం యొక్క వేళ్ళు గురించి మాట్లాడతాను.
ధ్యానంతో మన చైతన్య లోతులను తెలిసికోవాలి. ఒక మహా వృక్షాన్ని వేళ్ళతో పెకలించాలంటే అతి కష్టం. అలాగే ధ్యానంలో అనేక జన్మలలో పోగుచేసుకొన్న మన సంస్కారాలను దాటుకొని వెళ్ళాలి. అందుకై మన ధ్యానం పదునుగా ఉండాలి. పనిముట్టులాగ మన౦ దాన్ని వాడగలగాలి. దాన్ని కొన్నాళ్ళు వాడకపోతే, పనిముట్టుకు ఎలా తుప్పు పడుతుందో, అలా నిరుపయోగం అవుతుంది.
మన చైతన్యం యొక్క పై పొరను త్రవ్వడం సులభం. "ఇది చాలా సరళం. ధ్యానం చేయడం అంత కష్టం కాదు" అనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఒక అవరోధం వస్తుంది. అది ఆధారశిల (bed rock). అనగా తమస్.
తమస్ వలన ధ్యానంలో నిద్రపోతాం. దానిని ఎట్టి పరిస్థితులలోనూ అధిగమించాలి. మనం ఎన్నో పొరలను దాటాలి. ఎవరైతే ధ్యానం తొలి దశలలో నిద్రని అధిగమించరో వారికి తరువాత దశలు కష్టం అవుతాయి.
అందుకై ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు ఒక గురువు అవసరం. మీరు పట్టును వదలక, ఇంద్రియాల ఆధీనంలో ఉండకపోయినా, సాధన చేయాలి. అలా చేయకపోతే దైనిందన కార్యాలలో కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు నేను ధ్యానం యొక్క కాలాన్ని క్రమంగా పొడిగించవద్దని చెప్తాను. మనకు తగినంత వ్యాయామం అవసరం. అలాగే పోషక ఆహారం తినాలి; తగినంత నిద్ర కూడా అవసరం. ప్రపంచంలో పాల్గొని మన కార్యకలాపాలు చేస్తూ ఉండాలి.
మీరు ధ్యానంలో పరిపక్వం అయ్యేరని తెలుసకోడానికి సూచనలు: అధిక శక్తి, ఇంద్రియ నిగ్రహణ, అహంకారంలో మార్పు, జీవితంలో ఆనందం.
మీకు సహనం, భద్రత అధిక మయ్యేయా? మీరు కఠినమైన వ్యక్తులతో సులభంగా మైత్రి చేస్తున్నారా ? ఇంద్రియాలను నిగ్రహించుకో గలుగుతున్నారా? పరుల శ్రేయస్సుకై ఎంతో కొంత చేస్తున్నారా? అలా మీరు చేయగలిగితే మీ చైతన్యంలో మార్పు వచ్చింది. అలా కాకపోతే మీరు మార్పుకు సిద్ధంగా లేరు.
శ్రీ రామకృష్ణ గుణాల ప్రభావం గూర్చి చెప్తారు. జీవితం కొనసాగాలంటే త్రిగుణాలు ఉండాలి. తమస్, ఆయన చెప్పేరు, పెద్ద అడ్డు; త్రవ్వడం సాధ్యం కాని రాయి. రజస్ శక్తితో కూడినది. అనగా త్రవ్వడానికి సహకరించేది. సత్త్వ గుణం అంతర్గతమైన తమోగుణాన్ని అదిమి పెట్టగల ప్రజ్ఞ. 182
No comments:
Post a Comment