15.4
నిర్మానమోహా జితసంగదోషాః
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః
{15.5}
ద్వంద్వైర్విముక్తా స్సుఖదుఃఖసంజ్ఞఐః
గచ్ఛ౦త్యమూఢాః పదమవ్యయంతత్
అభిమాన మోహములను త్యజించినవారు, సంగత్వము లేనివారు, ఆత్మజ్ఞానము కలవారు, కోరికలను పరిత్యజించినవారు, సుఖ దుఃఖము లనెడి ద్వంద్వములను దాటినవారు నైన జ్ఞానులు నిత్యమైన మోక్షపదమును పొందుచున్నారు
అహంకారము ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక సమస్యలకు కారణము. దానివలన బంధములు తెగుట, అవిశ్వాసము, ఆధ్యాత్మక సాధనలో అవరోధాలు కలుగును. ఎవరైతే పరమ ఉత్కృష్టమైన పథమును పొందదలచిరో వారు అహంకారమును వీడవలెను. అది కష్టమైన యుద్ధం.
ఒక పద్ధతి ప్రాణులందరి అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం. ఎప్పుడూ మీకు నచ్చిందాన్నే చేయవద్దు. తక్కినవారికి మంచి జరగాలంటే, స్వార్థమును త్యజించి, విజయం వచ్చేవరకూ పాటుపడాలి.
ఈ యుద్ధం కలకాలము చేయాలి. మనకి అంతర్గతము, బహిర్ముఖము అయిన వ్యక్తిత్వములు వేర్వేరుగా ఉన్నవి. దీనివలన చాంచల్యము, అస్థిరము, సంఘర్షణ, ఉద్రిక్తత కలుగును. అహంకారమును తగ్గించు కొంటే, అట్టి వేర్పాట్లు తొలగిపోవును. పిదప అంతర్గత, భహిర్ముఖ వ్యక్తిత్వాలు ఏకమై సదా సమత్వంతో కూడి ఉంటాము.
స్వార్థపూరితమైన ఆశలు చిరకాలం ఉండవు. కొన్నిమార్లు అవి కోరేవి కష్టసాధ్యమైనప్పుడు చిరకాలం ఉన్నట్లనిపిస్తుంది. వాటిని గూర్చి ఎక్కువ ఆలోచించకుండా వుంటే వాటంతట అవే మాయమవుతాయి. వాటి గూర్చి మాట్లాడకపోయినా అవి సమసిపోతాయి. ఎప్పుడైనా అవి తిరిగి వస్తే పరోపకారానికి పూనుకోవాలి.
మనం కర్మలు ఆచరించుచున్నప్పుడు, తక్కిన వేళల అందరికీ సమ్మతమైన కార్యాచరణపై దృష్టి పెట్టాలి. దీర్ఘ కాలం మన ఇష్టాయిష్టాలతో ఘర్షణ ఉంటుంది. అయినప్పటికి మనకి మంచి జరుగుతుంది. ఇష్టాయిష్టాలు ఎంత ఎక్కువ ఉంటే, మన మానసిక శక్తి అంత క్షీణిస్తుంది. ఇష్టాయిష్టాలను జయించిన వారు, క్షేమంగా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రం గా ఉంటారు. శ్రీకృష్ణుడు అట్టి స్థితిని పొందితే చిరకాలము అక్కడే ఉంటారని చెప్పుచున్నాడు. తిరిగి అభద్రత, అవిశ్వాసము, కలవరములను అనుభవించరు. 183
No comments:
Post a Comment