15.5
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
{15.6}
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ
ఆ దివ్య స్థానమున సూర్యుడుగాని, చంద్రుడుగాని, అగ్ని గాని ప్రకాశింప జేయలేవు. దేనిని పొందినచో మఱల తిరిగి రారో అదియే నా పరమ ధామమై యున్నది
పరమాత్మ కాంతికి మూలము. శ్రీ రామకృష్ణ ఇలా అన్నారు: ఆయనను పొందితే మీరు కాంతి అనే సముద్రంలో చేపల వలెను౦దురు. అజ్ఞానముతో నిండిన చీకటి మాయమవును.
మనం చీకటికి అలవాటుపడి అదే నిజమనుకొంటాము. మనం కాంతిని ఎందుకు గుర్తించ లేమ౦టే, చీకటే కాంతని నమ్ముతాము గనుక. మనని కులమత మొదలగు భేదాలతో విభజించువారిని గొప్పవారని తలంతుము. యుద్ధాలకు కారకులైనవారి విగ్రహాలను పూజిస్తాము. ఇది చీకటి బ్రతుకు అని శ్రీ కృష్ణుడు అంటాడు. అట్లే చీకటిని వెలుగులా భావిస్తాము. నిజమైన ద్రష్టలు పరోపకారానికై తమను తాము మర్చిపోయినవారు.
సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా అంటారు ఆత్మ అనే కోటలో చైతన్య పొరలు పెద్ద పెద్ద భవనాలు. ఒక అంతస్తు నుండి ఉంకో అంతస్తుకు వెళుతుంటే కనులు మిరుమిట్లు గొలిపే కాంతి ప్రసరిస్తుంది. ఇది ధ్యానంలో లోతుగా వెళ్ళినపుడు అనుభవంలోకి వస్తుంది. మంత్రం ద్వారా మనస్సును కేంద్రీకరించి శక్తిని నిశ్చలముగా చేయుదురు. మన మనస్సు గాలిలేని ప్రదేశంలో పెట్టిన దీపంగా ఉన్నదని గీత చెప్పినది. సెయింట్ అగస్టీన్ ఇలా అన్నారు:
"నా ఆత్మలోని రహస్యమైన గదికి వెళ్ళేను. నా జ్ఞాన చక్షువులతో నేను మార్పులేని కాంతిని చూసేను. అది నా ఆత్మ కన్నుకు మీదనుంది. నా మేధకి పైన ఉంది. అది మనమందరమూ చూసే కాంతి లాగ లేదు. అది అంతకన్నా శక్తివంతమైనది. మనం చూసేది ప్రజ్వలమైన సూర్యకాంతి ఆకాశాన్ని ఆవరించడం. ఈ కాంతి అలా లేదు. ఎవడైతే సత్యాన్ని తెలిసికొన్నాడో వానికి ఆ కాంతి గురించి తెలుసు. ఎవడికైతే తెలుసో, వానికి శాశ్వతత్వం తెలుసు. ప్రేమకి అది తెలుసు. "
ప్రజ్వలించే ప్రకాశము మాత్రమేకాదు, అంతములేని ప్రేమ హృదయంలో ప్రసరిస్తుంది. దానినే బుద్ధుడు సర్వ ప్రాణులను తాకే మహా కరుణ అంటాడు. ఫ్రాన్సిస్కన్ యోగి జాకపోన్ ద టోడి ఇలా చెప్పేరు
భాషకు అతీతమైన ప్రేమ
ఊహకందని మంచితనము
లెక్కపెట్టలేని కాంతి
నా హృదయంలో ప్రసరిస్తోంది
"భాషకు అతీతమైన ప్రేమ" అనగా: హృదయం ప్రేమతో నిండి, లోపలి ఆనకట్టను ఛేదించి, గొప్ప సముద్రమువలె పొంగిపొరలడం
"ఊహకందని మంచితనము" అనగా: అన్ని జీవులపైన, అందరి వ్యక్తులపైన, అన్ని దేశాలపైన, చివరకు మన శత్రువులపైన, ఎనలేని ప్రేమ.
"లెక్కపెట్టలేని కాంతి" అనగా: ప్రపంచాన్ని వెలిగించే సూర్యుడు మన హృదయాల్లో ప్రజ్వలించే కాంతిపై ఆధారపడతాడు
దీన్ని అర్థం చేసుకోవడం ఒక ప్రశస్తమైన మానవునికే సాధ్యం 185
No comments:
Post a Comment