Thursday, March 10, 2022

Chapter 15 Section 6

15.6

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః {15.7}

మనః షష్ఠాణీ౦ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి

సనాతనమైన నా అంశమే జీవలోకమునందు జీవుడై ప్రకృతిలోని ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రా మతీస్వరః {15.8}

గృహీతవ్ఐ తాని సంయాతి వాయుర్గంధానివాశయాత్

ప్రభువగు జీవుడు శరీరమును త్యజించునపుడు, నూతన శరీరమును పొందునపుడు పుష్పాది స్థానముల నుండి గాలి సువాసనలను గొనిపోవునట్లు మనస్సుతో కూడిన పంచేంద్రియములను గ్రహించి వెళ్ళుచున్నాడు

సాధనలో మూడు అంశాలు ఉన్నాయి. మొదటిది సర్వత్ర వ్యాప్తి అయిన పరమాత్మ. పరమాత్మ అన్నిట్లోనూ వున్నాడు. మన గుణములను బట్టి అతడు మనయందు స్థితుడై ఉన్నాడు. రెండవది, జీవుడు. అనగా అహంకారముతో కూడిన శరీరము గలవాడు. మూడవ అంశము మాయ. ఎవెలిన్ అండర్ హిల్ చెప్పినట్లు మన జ్ఞానోదయమునకై వెళ్ళు మార్గములో అది భ్రాంతి కలిగించునది, కలవర పెట్టునది, ప్రలోభము చేయునది.

మాయ యోక్క శక్తి ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తున్నది. ఎందుకనగా పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవులు జంతువులనుండి పరిణామము చెందేరు. దాని శక్తి మన అనుభందాలలో చూడవచ్చు. ఎట్లనగా పైపై మెరుగులవలన కలిగిన బంధం ఎన్నటికైనా విడదీయబడేదే. అట్టి బంధం అతి త్వరలో వేర్పాటుకు దారి తీస్తుందని కాదు. భౌతిక కోర్కెలు అనుభవించుటకై ఆశ వుంటుంది. ఎప్పుడైతే కోర్కెలు సాధింపబడవో అది నిరుత్సాహానికి దారి తీస్తుంది. ఇదంతా మాయ యొక్క బలమైన విభ్రమం. ఏదైనా సినిమాలో ఒక పాత్ర చిక్కులలోపడి దుఃఖాన్ని ప్రదర్శిస్తే నేను కృష్ణ భగవానుని శ్రీ రామకృష్ణుడు ప్రార్థించినట్టు "నేను మాయ యొక్క భ్రమలో పడకుండా చూడుము" అని వేడుకొంటాను.

ఆ మూడు అంశాలలో ఆత్మ నిజమైనది. మనం జీవిగా భావించినంత కాలం, అనిత్యమైన, సదా మార్పు చెందే ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకొంటాం. మన అహంకారం, ఇంద్రియాలు అందుకు సహకరిస్తాయి. మనం అధ్యాత్మికతలో ముందుకు సాగుతున్న కొలదీ భౌతిక ప్రపంచంతో ఉన్న తేడా తెలుస్తుంది. క్రమంగా సమాధి స్థితిలో ఆ రెండు ప్రపంచాల -- భౌతిక మరియు ఆధ్యాత్మిక--మధ్య ఒక వంతెన ఏర్పడుతుంది. శ్రీ ఆరొబిందో చెప్పినట్లు పరమాత్మ భౌతిక ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఆవిర్భవించి నట్లు మనకు అగుబడుతాడు.

శ్రీకృష్ణుడు "ప్రతి వస్తువులోనూ నా అంశ ఉన్నది" అని చెప్పెను. మానవులలోనే కాదు, ప్రతి చిన్న జీవిలోనూ ఎంతోకొంత పరమాత్మ యొక్క స్పురణ ఉన్నది. ఈ చిన్న స్పురణ, గీతలో అర్జునునికి చెప్పినట్లు, జీవియొక్క పునర్జన్మకు కారణభూతమై ఉన్నది. జీవులు కోట్లాది జన్మలు పొంది మరణించు చున్నారు. మనం ఒంటి కణము గల అమీబా నుండి అనేక జన్మలెత్తి, పరిణామం చెంది, మానవులుగా పుట్టేము అనడంలో అతిశయోక్తి లేదు. శాస్త్రజ్ఞులు చెప్పేది అదే. ఆధ్యాత్మికత పరిణామం గమ్యంగలది అనదు. అలాగే అది కట్టడిలేనిదనదు. వాటిమధ్య యున్న పెద్ద తేడా: మన పరిణామం మన వలనే అవుతుంది. దేశకాల పరిమితులు ఉన్నా మన జీవితానికి మనమే బాధ్యులం. బుద్ధుడు "మనము మన ఆలోచనలతో చేయబడ్డవారలము" అని చెప్పెను. దానిని బౌద్ధులు మనోమయ మందురు. జీవుడు మనస్సుతో అనేక జన్మలు ఎత్తినాడు. దీనిలో ఏదో దివ్య శక్తి ఉంది అని కాదు. మన జీవితం సంపూర్ణంగా మన చేతిలోనే ఉంది. మన ఆలోచనలు, గుణములతో జీవితాన్ని మలచుకుంటాం.

ఇదే మన౦ పొందబడే దేహాన్ని నిర్ణయిస్తుంది. గీత చెప్పినట్లు, మన దేహం అనేక జన్మల కర్మచే తయారైనది. మన మనస్సుకు దేహానికి మధ్య బంధం ఉన్నది. మన ఆలోచనలు ఆహారం, నిద్ర, వ్యాయామం మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే మనం నివసించడానికి ఎన్నుకొన్న ప్రదేశం, చేసే ఉద్యోగం, సహవాసం చేసేవారు, వొత్తిడికి ఎలా స్పందిస్తామో ఇవన్ని మన దేహాన్ని ప్రభావితం చేస్తాయి. మన స్వస్థతకు ఇవన్నీ కారణాలు. గీత చెప్పేది రాబోయే జన్మల గూర్చి. మనమెలా అయితే ఆలోచనలతో ఆరోగ్యం, భౌతిక దేహం తయారుచేసికొన్నామో, అలాగే వచ్చే జన్మలో తదనుగుణంగా దేహమును పొందుతాము.

దీనిలో చాలా సూక్ష్మ అంశాలు ఉన్నాయి. ఒకని వ్యక్తిత్వమును వివరించుట అంత తేలిక కాదు. కాబట్టి ఒకడు ఎందుకు ఒకరకమైన దేహమును పొందేడు లేదా అంగవైకల్యంతో ఉన్నాడో, క్రిందటి జన్మలో చేసిన కర్మ వలననా అని విశ్లేషించుట సరైన పద్దతి కాదు. అలాగని గత జన్మలు కారణం కాదని చెప్పలేము. ఎటువంటి దేహమున్నా అది సంస్కారములతో కూడి మన ఆధ్యాత్మిక పురోగతికి సహకరించాలి.

ఎలాగైతే జీవి తన శరీరమును ఆలోచనలతో తయారుచేసికొంటాడో, అతడు తన ప్రపంచాన్ని అలాగే మలచుకొంటాడు. మనము అనుభవిస్తున్నది, స్పందిస్తున్నది, మార్పుచేసికొ౦టున్నది మనం ఊహించుకొన్న ప్రపంచాన్నే. ఒక క్రిస్టియన్ ఇలా అన్నాడు: "నా పాపము ప్రపంచం మీద ముద్ర వేసింది." ఒక హిందువు ఇలా అంటాడు: "నా పుణ్యము ప్రపంచం మీద చెరగని ముద్ర వేసింది". రెండూ నిజమే. కానీ ఒక తేడా: ఒకటి జీవుని యొక్క దృక్పథంతో, రెండవది ప్రపంచాన్ని ఆత్మతో చూచునది.

ఆత్మ ప్రతి జీవీయందు కలదు. ఆ జీవి ఏ జాతి అయినా కావచ్చు. ఇది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. ఆత్మ జ్ఞానమును సంపాదించిన తరువాత జీవితాన్ని అలాగే చూస్తాము. కొన్ని రోజులు క్రింద, మా మేక ముందుగా కన్నది. నా మిత్రుడు నన్ను, ఆ పసికందును కలిపి ఫోటో తీసేడు. ఆ ఫోటో ను చూసి నేనన్నాను "ఇది ఒక ఫోటో మాత్రమే కాదు. నా ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాలు పరిణామం చెంది నాలా కనిపిస్తున్నాది. అలాగే ఆ మేక పిల్ల కూడా. ఆ మేకపిల్ల నన్ను చూస్తున్నప్పుడు: నీ లాగే ఒకరోజు నేనవుతా అనుకొంటుంది. నేను వేల సంవత్సరాల క్రింది నీ లాగే ఉండేవాడిని అని అనుకుంటా." ఆ అనుభూతి నా హృదయాన్ని అమిత ఆనందంతో నింపింది. దాని వలన అన్ని జీవులిని రక్షించాలనే కోరిక కలిగింది. ఎందుకనగా అవి నా బిడ్డలు కానప్పిటికీ, వాటి ఆత్మ మన ఆత్మ ఒక్కటే.

ఆత్మ పరిణామం చెందుతూ పరమాత్మతో ఐక్యం చెందటానికై ప్రయత్నిస్తుంది. నా కుక్క మూకా యొక్క ఆత్మ ఒక పెద్దపులి ఆత్మ కన్నా పరిణామం ఎక్కువ చెందింది. అలాగే మా ఆవు శోభ. మానవులలో హింసకి పాల్పడేవారు చూడడానికి సామాన్యంగా ఉంటారు కాని, వారు ఉండేది జంతు ప్రపంచంలో. అలాగే నిరహంకారి సామాన్యంగా కనిపించి ఉత్కృష్టమైన దైవ సన్నిధిలో ఉంటాడు.

అనేక జన్మ లెత్తిన జీవి, ప్రతి జన్మలోనూ సంస్కారము పోగుచేసుకొంటాడు. మూకా ప్రతిరోజూ సంస్కారము పొందుతుంది. మా ఇంటిప్రక్కనున్న నల్ల పిల్లి దాని సంస్కారమును పోగుచేసుకొంటుంది. అది ఆహారం పెట్టే చేతుల్ని బక్కురుతుంది. అది మనవజన్మ నెత్తుతే ఆ అలవాటును మార్చుకోవచ్చు. ఇలాగ ప్రతి జీవి ఎంతోకొంత సంస్కారాన్ని పోగుచేసుకొంటుంది. జీవుడు గాలిలాగ కొన్ని కోట్ల సంవత్సరాల క్రింద మొదలుపెట్టి, క్రమంగా వృద్ధి చెందుతూ వచ్చేడు. ఒక పూల తోట మీద వీచే గాలి ఆ పూల సువాసనను పొందుతూ ఉంటుoది. అలాగే జీవుడు తన సంస్కారాలను జన్మజన్మకీ పొందుతాడు. మన అభౌతిక ఆత్మ ఆ సంస్కారాలను ప్రాణము వలన క్రొత్త శరీరమును ధరించునప్పుడు పొందుతుంది.

అనేక జన్మల సంస్కారముల పోగు అతి క్లిష్టమైనది. దానిలో మంచి-చెడు, స్వార్థం-నిస్వార్థం మిళితమై, పరిమళమౌతుంది. అనగా వ్యక్తిత్వము తయారవుతుంది. ఒకని స్వార్థ కర్మ, మరొకని క్రోధము కొన్ని వేల సంవత్సరాల క్రిందవి కావచ్చు. ఏ ఒక్కడూ పూర్తిగా స్వార్థపరుడు లేదా క్రోధపూరితుడు కాడు. వానిలో ఎంతోకొంత మంచి గుణాలు ఉండక పోవు: మత్సరమును అరికట్టే ప్రేమ, దయ, కరుణ వంటివి.

ఈ శ్లోకం చెప్పే మరొక ముఖ్యాంశం సంస్కారాలు మనస్సుకే పరిమితం కావు, ఇంద్రియాలకు కూడా వర్తిస్తాయి. మనస్సును ఆరవ ఇంద్రియమన్నారు. ఇంద్రియ సంస్కారాలు కూడా అనేక జన్మలలో పోగు చేసుకొన్నవి. వాటి ప్రభావము మన స్వస్థత మీద ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత వైద్య రంగం ఒక వ్యాధికి కారణం బయట ప్రపంచంలో ఉందని అంటుంది. భౌతికముగా అది నిజమనవచ్చు. కానీ అది సంపూర్ణముగా కాదు. కాన దానిలో అసంపూర్ణత ఉంది. బయట ప్రపంచమువలన వ్యాధిగ్రస్తులము కాలేమని అనడానికి లేదు. కాని మన మానసిక పరిస్థితి ప్రతి వ్యాధినీ ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనస్సు, ఇంద్రియములు కలసి మన రోగ నిరోధిక శక్తిని నిర్ధారిస్తాయి. కాబట్టి బుద్ధుడు చెప్పిన సిద్ధాంతము "మనము ఆలోచనల వలన తయారయ్యేము", వ్యాధులకు, ఆరోగ్యానికి వర్తిస్తుంది.

గీత వైద్యరంగం కన్న ఒక అడుగు ముందుకు వేస్తుంది. భౌతిక శరీరం తో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా గీత చెపుతుంది. అలాగే ఒక వ్యాధికి కారణము సూక్ష్మ జీవులే కావు. ఆ వ్యాధి మనస్సు, ఇంద్రియములయొక్క ఉదాసీనత వలన కూడా కలిగినది. ఒక సూక్ష్మజీవి పదిమందికి సోకితే వారిలో 9 మందికి వ్యాధి వచ్చి, 10 వ వానికి రాకపోవడానికి కారణ మేమిటి? కొందరు దాన్ని అదృష్టం అంటారు. వారి భౌతిక శరీరాల్లోని, జన్యువులలోని భేదములు రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసేయని వైద్యులు చెప్తారు. కాని అది భౌతిక పరమే. నేను చెప్పేది మన రోగ నిరోధక శక్తి మానసిక స్థితి వలన కూడా మార్పు చెంద వచ్చు. రోగ నిరోధక శక్తి భౌతికమే కాదు. దానికి ఎన్నో కారణాలు ఉండగా, మనస్సు అన్నిటికన్నా పెద్ద కారణం.

మనకి ఎక్కువ రోగ నిరోధక శక్తి కావాలంటే పరులకై బ్రతకడానికి ప్రయత్నించాలి. ఇది వృద్ధాప్యం వలన కలిగే భౌతిక మార్పులకు కూడా వర్తిస్తుంది. నా అమ్మమ్మ దానికి ప్రత్యక్ష తార్కాణం. వృద్ధాప్యానికి సంభందించే కష్టాలు--అనగా బలహీనత, జ్ఞాపక శక్తి నశించుట, ఓపిక తగ్గుట మొదలగునవి-ఎప్పటకి రావు.

ప్రతి వృద్ధుడు, ధ్యానం చేయకపోయినా, ఈ చిన్న ఉదాహరణను పాటించవచ్చు. నా శక్తి ఇప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉన్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది. అలాగే జీవిత లక్ష్యాన్ని చేరుటకు నా శక్తి 100 రెట్లు ఎక్కువ ఉంది. నేను అప్పటిలా పరిగెత్త లేక పోవచ్చు. నా వివేకము, జ్ఞానము, ఓపిక వృద్ధి చెందాయి. నేనిప్పుడు గంటల తరబడి పనులు విసుగు విరామం లేకుండా చేయగలను.

మీరు సామాన్య వృద్ధులు లాగ ఉండదలచుకొంటే, చాదస్తం ఎక్కువగా ఉంటుంది. స్వార్థం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, లక్ష్యం లేకుండుట వలన వృద్ధాప్యంలో మనకి అత్యవసరమైన ప్రాణం వ్యయమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పేది మీరు ఇతరులకోసమై కర్మల నాచరిస్తే, హృదయం ప్రేమ పూరితంగా మార్చుకొంటే ఆయన మీలో అనేక మంచి మార్పులు తెస్తాడు: జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, ఇతరులను ఆకర్షించి వారిచే ప్రేమ, గౌరవము పొందగలిగే శక్తి,. తద్వారా వారి జీవితంలో మంచి మార్పులు తెచ్చిన వారవుతారు. ప్రాణాన్ని సద్వినియోగం చేసుకొంటే ఇవన్నీ సాధ్యమవుతాయి.

ఇతరుల కోసం బ్రతకడం మనందరి ఆకాంక్ష కావాలి. మనస్తత్వవేత్తలు బ్రతకటానకి గల ఆకాంక్షగూర్చి మాట్లాడుతారు గాని అది స్వార్థంతో బ్రతకడం. అది అహంకారమును దాటి వెళ్ళదు. మనం వ్యక్తిత్వం యొక్క పైపై మెరగులు చూస్తాము కనుక, అహంకారం యొక్క బ్రతకాలనే ఆశ ఎంత స్వార్థపూరితమో తెలుసుకోలేము. జీవులందరి కోసం బ్రతకడం నేర్చుకొంటే అది మన హృదయ లోతులకు దారితీసి మనల్ని ధృడ నిశ్చయము గలవారిగా చేస్తుంది.

రెండవ ముఖ్యా౦శమేమిటంటే, మన హృదయ౦ ప్రేమపూరితమైతే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. నేను ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పటంలేదు. ప్రపంచాన్న౦తా ప్రేమించగల స్వభావం, లేదా వస్తువు లేకున్నా కలుగు ప్రేమ గురించి చెబుతున్నాను. అది రోజల్లా లెక్కలేనన్ని చిన్న చిన్న నిర్ణయాల వలన కలిగి, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

నా స్వీయ ఉదాహరణ ఇస్తాను. మనం రెండు మూడు రోజులు పడుకోకపోతే, అందరికీ తెలిసినట్లు, మన మానసిక, భౌతిక శక్తి క్షీణించి పోతుంది. అలాంటప్పుడు మనం, ముఖ్యంగా మనలోని వృద్ధులు, మధ్యాహ్నం వరకూ పడుక్కొని ఒక కప్పు టీ కలుపుకొని వసారాలో కూర్చుంటాము. ఇది భౌతిక కారణాల వలన సహజంగా జరిగే విషయం. అలాగే శరీరం ఆధ్యాత్మికత వలన కూడా మారుతుంది. దానివలన ప్రాణ ప్రసరణ మారుతుంది. ప్రాణం వలన శక్తిని పుంజుకొ౦టాము. మానసిక వ్యధ ప్రాణాన్ని క్షీణింపజేసి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అలాగే మనమెప్పుడైతే ఇతరులను మనకంటే ఎక్కువగా ప్రేమిస్తామో ప్రాణ౦ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

నేను కొన్నేళ్ళుగా మూడు నాలుగు గంటలు మాత్రమే పడుకొంటున్నాను. ఇది సమాధి స్థితి వలన కలుగుతుంది: అచేతన మనస్సును మేల్కొలిపితే, భగవంతునితో కలిగిన సంభందాన్ని ఒక నిమిషం కూడా విడదీయ దలచుకోము. నేను పడుకోవడ మెలాగో నేర్చుకోవలసి వచ్చింది. నేను మంత్రం జపిస్తూ అలా నిద్రలోకి జారుతాను. ఇటువంటిది దేహానికి ఒత్తిడి కలిగిస్తుంది. ఒక మారు నిద్రపోతే బారెడు ప్రొద్దెక్కే దాకా పడుకోవాలనిపిస్తుంది. కానీ నేను ప్రొద్దున్నే లేచి ధ్యానం చేసికొని, బీచ్ కి వెళ్ళి నడుస్తాను. ఇక్కడ బీచ్ లు ఉదయం మంచుతో కప్పబడి ఉంటాయి. నేను వ్యాయామం చేయడానికి తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందువలన నా శరీరం ఆరోగ్యంతో దృఢంగా వుంటుంది. ఇది జీవితాన్ని పొడిగించు కొనడానికి కాక నా ధ్యాన సెంటర్ ని నడిపి వేల మందికి మంచి చేద్దామని.

దీనివలన నేను చెప్పదలచుకొన్నదేమిటంటే పరోపకార బుద్ధి వలన భౌతిక పరిమితులను దాటవచ్చు. ఇది స్వార్థం గురించి కాదు. ఎందుకంటే అది చెడు కలిగిస్తుంది. నేనీ దైనిందన కార్యక్రమాన్ని ఏళ్ల తరబడి చేసి, అలసట లేకుండా ఉన్నాను. కాబట్టి వృధ్యాప్యంలో అందరికీ కలిగే కష్టాలను నిరోధించవచ్చు. నడివయస్సు తరువాత అంతకు ముందుకన్నా ఎక్కువ పని చేయగలం.

వ్యాధికి కారణాలు బాహ్య ప్రపంచం మరియు మానసిక స్థితి. రోగ నిరోధక శక్తికి వాటితో సంభందం కలిగి ఎక్కువా, తక్కువా అవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పే కర్మ సిద్ధాంతం మన మనస్సుకు సంభందించిన సంస్కారములకే కాక ఇంద్రియాలకు సంభందించినవి కూడా. అవి ఒక జన్మ నించి వేరొకజన్మకు తీసికొనబడతాయి. మనస్సులోని సంస్కారాలు క్రమంగా భౌతికమైనవి అయి శరీరంపై ఇంద్రియాల ద్వారా దాడి చేస్తాయి. ఇది అనారోగ్యంకి దారి తీస్తుంది.

అతిగా తినడం, ఆహారం గురించి చదవడం, దాని గురించ మాట్లాడడం, వంట చేయడం, పరిశీలించడం, ఊహించడం, ఒక్క మాటలో జిహ్వ చాపల్యం, సంస్కారముల వలన కలిగేవి. కొన్ని జన్మల నుండి, ఒక అలవాటు జిహ్వ చాపల్యం కి దారి తీసి క్రమంగా శరీరానికి వ్యాపించి వ్యాధికి దారి తీస్తుంది. ఒకని మానసిక పరిస్థితిని పరిశీలిస్తే వానికి మరుజన్మలో కలిగే సమస్యలను ఊహించ వచ్చు.

ఆ సమస్యలు బాహ్య కారణాల వలన కలిగి, చికిత్స చేయడానికి వీలుపడవు. మందులు కనిపించే లక్షణాలను కాక వ్యాధిని సమూలంగా తీసి నయం చేయలేవు. భౌతిక సమస్యను పరిష్కరించడానికి మనస్సులోపల వెదకాలి. ధ్యానం చేయడం, మంత్రం స్మరించడం ఇందుకే.

ఉదాహరణకు కోపాన్ని చూద్దాం. ఒక కోపిష్ఠిని పరిశీలిస్తే వాడికి కలిగే భౌతిక, మానసిక సమస్యలను ఊహించవచ్చు. దీనిలో ఎటువంటి నిఘూడమైనది లేదు. ఒకని పుట్టుకతో వచ్చిన ప్రవృత్తి, వానిని ఆ ప్రవృత్తిని రెచ్చగొట్టే పరిస్థితులవైపు ఆకర్షింపజేస్తుంది. తెలియకనే ఒక కోపిష్టి తనను రెచ్చగొట్టే విషయాలలో తల దూరుస్తాడు. తద్వారా వాడు మరింత వైరం, విరోధం పెంచుకొంటాడు. ఇవి కోపం అనే సంస్కారం వలన సహజంగా కలిగేది. వాటి ఉద్దేశ్యము ఆలోచనలను మార్పు చేసికొనవలెనని.

మనం మన చెడు నడవడిక మార్చుకోకపోతే సంస్కారములు క్రమంగా మన దేహంపై దాడి చేస్తాయి. మనమందరికి లెక్కలేనన్ని సంస్కారాలు ఉంటాయి. అవి మనకు మేలైన కీడైనా చేస్తాయి. కోపం అనేక వ్యాధులకు దారి తీస్తుంది: జీర్ణ కోశంలో పుండు, ఊపిరి పీల్చుకోవడంలో కష్టం మొదలైనవి. కోపం మన ఊపిరి తీసికొనే క్రమంపై దాడి చేస్తుంది. ఇలాగ కొన్ని వేల జన్మలు గడుస్తాయి లేదా ఈ జన్మలోనే జరుగవచ్చు. సంస్కారం పాతుకుపోవడం వలన ఒకడు మరుజన్మలో ఊపిరి సమస్యలతో పుడతాడు. వానిని ప్రేరణ చేసిన పరిస్థితులు ఎదురైతే భౌతిక సమస్యలు ఎదురవుతాయి.

ధ్యానం ఈ సమస్యలకు పరిష్కారం. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చు, మన మనస్సును పరిశుద్దం చేసికోవచ్చు. ఒకానొక పరిస్థితి గతంలో ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది అయితే, ధ్యానం వలన దాన్ని నిరోధింప వచ్చు. ఒకడు మనయందు కోప౦తో ఉంటే, వానితో నవ్వుతూ మాట్లాడండి. వానిని ఆదరణ చేసి మీ మంచితనాన్ని చూపించండి. అది వానికి ఉపయోగపడుతుంది. అది మన భౌతిక మానసిక సమస్యల పరిష్కారానికి మరింత ఉపయోగపడుతుంది.

ఇలా చేయడం అతి కష్టం. కాని శస్త్ర చికిత్స అంత కష్టం కాదు. బుద్ధుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేడు. శస్త్ర చికత్స భయాన్ని కలిగించేది. కాని ఎందరో సాహసించి దాన్ని చేయించుకొంటారు. నాకైతే శస్త్ర చికిత్స వలన కలిగే గాయాలు అనుభవించడం కన్నా, నా ఆరోగ్యం నేనే మెరగుపరచుకోవడం మంచిదనిపిస్తుంది.

దీని కొరకు సమాధి స్థితికి వెళ్ళ నక్కర లేదు. కానీ మన జీవన, ఆలోచనా శైలిని మార్చుకోవాలి. ధ్యానంలో లోతుకు వెళుతున్న కొద్దీ మన ఎరుక వృద్ధిచెందుతుంది. ప్రాణం క్రమంగా ఇంద్రియాలలోంచి ఉపసంహరింపబడి మనకు మరింత చేతనత్వము కలిగిస్తుంది. అలాగే మనపై వొత్తిడి తగ్గిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి నిస్తుంది. 193

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...