15.7
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ
{15.9}
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే
ఈ జీవుడు చెవిని, కంటిని, చర్మమును, నాలుకను, ముక్కును మరియు మనస్సును ఆశ్రయించి సబ్దాది విషయములను అనుభవించుచున్నాడు ఀ
చిత్తమనగా మనస్సు యొక్క జ్ఞాపకాలను పొందుపరచునది. అది ఇంద్రియాలద్వారా, మన కోర్కెలానుసారంగా మనం దృష్టి దేనిమీద కేంద్రీకరించేమో అటు వెళుతుంది. మనం సంగీతం వింటూంటే చిత్తము మనస్సును౦డి చెవులు దగ్గరకు వెళుతుంది. దాన్ని మళ్ళీ ఉపసంహరించు కోవడం బహు కష్టం. ఇది బయటకు పోతున్న ప్రాణము. దానివలన జీవన శక్తి తగ్గుతుంది. అందువలననే పెద్ద శబ్దాలతో సంగీతం విన్నవారు వారి క్షేమమునకు దూరమై, వ్యాకులతతో అశాంతిగా ఉంటారు.
కొన్ని రోజుల క్రిందట నేను బెర్క్లీ లో రికార్డు లమ్మే దుకాణంకి వెళ్ళేను. లోపల పెద్ద శబ్దంతో సంగీతం వినిపిస్తోంది. దానికి అనుగుణంగా ప్రజలు అడుగులేస్తున్నారు. నేను అమితంగా ఆశ్చర్యపోయేను. ఇలా రోజూ చేస్తారన్నది నా ఊహకు అందలేదు. ఒకటి రెండు సంవత్సరాలు ఈ విధంగా పెద్ద పెద్ద శబ్దాల మధ్య ఉంటే దానివలన లోపల ఇలా అవుతుంది: కాళ్ళు, చేతులు, నరాల వ్యవస్థ దెబ్బతిని అచేతన ఊపు (jerk) వస్తుంది. అది నిద్రలో కూడా వస్తుంది. మీ శరీరం బాగుంటే, మీ మనస్సు దెబ్బ తింటుంది. మనస్సు సదా ఉత్తేజంతో ఉంటే అది త్వరగా మానసిక దుఃఖానికి దారి తీస్తుంది.
ఈ విధంగా మనస్సు మనను వీడి బహిర్గతము అవుతున్న కొద్దీ, ఆత్మతో సంబంధం సడలిపోతుంది. మనకు భద్రత, శక్తి, తెలివి, వివేకము, పట్టుదల కావలిసినప్పుడు రాక సతమతమవుతాము. మానసిక వ్యధ లేదా విచారం కలగచ్చు. తెలివి, వివేకం ఉండవు. మనకి శక్తి లేకపోయినా ఆనందానికై అఱ్ఱులు చాచుతాము. లంగరు లేని పడవ లాగ గాలి ఎటువీస్తే అటు వెళతాము.
ఇంద్రియాలద్వారా బహిర్గతమౌతున్న కొద్దీ మనం మన మూల స్వరూపము నుంచి దూరంగా వెళ్ళిపోతాము. మళ్ళీ స్వస్వరూపామును పొందాలంటే వీటిని దాటాలి: మన కోర్కెలు, గొప్పతనాన్ని చాటే మానసిక లాలసలు, ప్రతి దాని మీదా పట్టుదలతో ఉండడం. ఇవి మన చైతన్యాన్ని మూల స్వరూపం లోంచి దూరంగా నెట్టివేసే శక్తులు. మళ్ళీ మన స్వస్వరూపం పొందాలంటే ఆ శక్తులను నియంత్రించాలి.
అది చేయుటకు మనము ప్రతి వొక్కరిలోనూ ఉన్నట్టు, ప్రతిఒక్కరు మనలో ఉన్నట్టు అనుకోవాలి. మనం భౌతికంగా ఆలోచిస్తే మన చర్మానికే పరిమిత మౌతాము. చర్మము లోపల ఉన్నది మన ఇల్లు. దానిలో సుఖాలు, వసతి, ఆనందం, లాభం గురించి చూసుకోవాలి. మనం మన ఇంటిని సరిదిద్దక పోతే ఇంకెవరు చేస్తారు? కాని దానిని దాటి ఉన్న ప్రపంచమంటే మనకు లెక్కలేదు. "అది నా సమస్య కాదు. నా పొరుగింటివాడిది. అది వాడి ఇల్లు. నాది కాదు" అంటాము.
ఎవరైతే భౌతిక సుఖములకోసం ఆరాటపడతారో ఇటువంటి వేర్పాటుకు లోనవుతారు. వారు తమనుండి ఇతరులను ఎడ౦ చేసికొ౦టారు. ఎందుకంటే వారు తమనుండి తమనే ఎడబాటు చేసికొన్నారు. కానీ చేతనపు పై పొరను ఛేదించుకు పోతే ఆ వేర్పాటు క్రమంగా తగ్గుతుంది. మనము ఇతరులకు దగ్గర మవుతాము. ఎక్కడైతే మనకి మన భాగస్వామికి మునుపు ఆఘాతం ఉండేదో, ఇప్పుడు తేలికగా దాటగాలిగే చిన్న నది ఉంటుంది.
మన భాగస్వామితో విభేదం కలిగి వేర్పాటుకు దారి తీస్తే, మనం ఆలోచించ వలసినది మన భాగస్వామికి ఎంత దగ్గరకు వెళ్ళగలం. అనుభందం గురించి ఎంతవరకు మన నిశ్చిత అభిప్రాయములను వదులుకోగలం? మీ అహంకారాన్ని ఎంత వరకూ అణచి పెట్టగలరు? మనం ప్రేమించే వ్యక్తి పెడ దారిని పడితే, కొంచెం బాధకలిగినప్పటికీ, వారిని గౌరవంతో అభిమానంతో సరైన దారికి మార్చగలమా? ఇవన్నీ చేయగలితే మనం సాధనలో ముందుకు వెళ్ళాం. ఇవి నేటి తరంలో పూర్తిగా మరచిపోయిన ప్రేమపూరిత విద్య.
మనం అహంకారపూరితమైనప్పుడు మన భాగస్వామితోగాని, ఇతరులతో గాని ఎడంగా ఉంటాము. మీరు ఎంత దగ్గర అవుదామని ప్రయత్నించినా, అహంకారం వీడనిదే, సాధ్యము కాదు. మీరు ధ్యానం ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి, మనకి మన బంధు మిత్రులికి ఎంత ఎడబాటు ఉందో ప్రతి ఉగాది నాడు కొలత పెట్టండి. మన సహజ స్థితి, మన౦ కేంద్రం గా ఉండి, మన చుట్టూ వృత్తాకారంలో బంధుమిత్రులు ఉంటారు. అలా కాక మిమ్మల్ని బయట పెట్టుకొని, తక్కినదంతా కేంద్రంగా మార్చుకోండి. ప్రతి సంవత్సరము మనం కేంద్రానికి దగ్గరగా వెళ్ళాలి. అలా వెళ్ళడం కష్టమైతే సహనం, ఓర్పు, అవగాహన, క్షేమం అణు సుగుణాలను అలవరుచుకోండి.
మనం ఒకరికి దగ్గరవ్వాలంటే మన అహంకారాన్ని జయించాలి. మన స్వగతంలో ఎంత క్లేశము కలిగినా, ఇతరులకొరకై పాటుపడాలి. "మీరు జయిస్తారు" అని జీసస్ అన్నారు కానీ "నేను జయిస్తాను" అనలేదు. మీరు జయించడం అంటే ఐకమత్యం. నేను జయిస్తాను అనుకోవడం వేర్పాటు. ఇది సాధన చేయడం ఎంత కష్టమంటే చాలామంది ప్రయత్నించరు. ఒక వేళ ప్రయత్నించినా దానిని అలవరచుకోలేరు. కాని మీకు దృఢమైన నిశ్చయం ఉంటే, మీకు తక్కినవారికి మధ్యనున్న ఎడబాటు క్రమంగా తక్కువ అవుతూ వస్తుంది. చివరికి మీరు అందరితోపాటు కేంద్రంలోనే ఉంటారు. ఇక ఎడబాటుగాని, వేర్పాటుగాని ఉండదు. 196
No comments:
Post a Comment