Thursday, March 10, 2022

Chapter 15 Section 8

15.8

ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం {15.10}

విమూఢా నానుపశ్యంతి జ్ఞానచక్షుషః

వెడలు వాడును, ఉండువాడును , అనుభవించు వాడును, గుణములతో గూడిన వాడును యగు ఈ జీవుని అజ్ఞానులు చూడలేరు. జ్ఞాననేత్రము గలవారు మాత్రమే దర్శించుచున్నారు

మనస్సును స్థిరముగా నుంచనిదే మన౦ సృష్టిలో జీవుల ఐకమత్యం చూడలేము. మన మనస్సుకు అది తెలీదు. అది జీవితపు పైపై మెరుగులలో కలుగు మార్పులను చూచును గాని, ఎక్కడైతే మార్పు లేనిది, విభాగములు లేనిది ఉన్నదో దానికి తెలీదు.

బుద్ధుని సిద్ధాంతంలో మనస్సు ఒక స్థితి మాత్రమే కాదు; అది ప్రక్రియ కూడా. జేమ్స్ జాయ్స్, వర్జీనియా వుల్ఫ్ మొదలగువారు చేతనము యొక్క ప్రవాహమును గూర్చి చెప్పియున్నారు. కాని బౌద్ధులు దానిని 2500 ఏళ్ల క్రిందటనే ప్రతిపాదించేరు. క్షణికవాదమనగా ఒక ఆలోచన, పుట్టి, చస్తుంది. ఆలోచనలు విడివిడిగా ఆవిర్భవించి, అంతమవుతాయి. సినిమా రీళ్ళలో ఒక్కొక్క ఫిల్మ్ ఒక ఆలోచన వంటిది. ఆ ఫిల్మ్ ల సరమును వేగముగా కదిలించితే మనకు సినిమా కనబడుతున్నాది. ఇదే విధంగా మన ఆలోచనల గొలుసు వలన మనకు జీవితం అనుభవానికి వస్తున్నాది.

నా మిత్రుడు ఒకమారు ఒక పాత సినిమా రీల్ ని పట్టుకొచ్చేడు. మేము కొన్ని గంటలపాటు అనేక కొట్లాటలతో కూడిన సినిమా చూసేము. నేను ఆ రీలును పరీక్షించేను. భూతద్దంతో పరీక్షిస్తే అందులో కొట్లాట లేదు. ఎవడో చేతులెత్తి నుంచొని ఉన్నాడు. మరొకడు వంగి ఉన్నాడు. కాని దెబ్బ ఎవడూ కొట్టలేదు. మనం ఒక ఫిల్మ్ చూసి, దాని తరువాత ఫిల్మ్ ని చూసి, "ఆహా వీడు వాడిని కోట్టేడు" అని భావిస్తాము.

మనస్సులోనూ జరిగేది ఇదే. వేగవంతమైన మనస్సు అంటే అనేకమైన ఆలోచనల సముదాయం ఒకేమారు కదలడం . ఆలోచనలు గుంపులు గుంపులుగా తయారయ్యి మనస్సును ఉక్కిరిబిక్కిరి చేయడం.

దీనినే అహంకారం అంటారు. అది మనను ఇతరులనుండి వేరు చేస్తుంది. ఇదే సినిమాలాగ మన చేతన మనస్సులో పనిచేస్తుంది. నిద్రలో కూడా ఇదే. మనము ధ్యానము ద్వారా మనస్సు వేగాన్ని అరికట్ట గలిగితే, మనకి ఒక్కొక్క ఆలోచన విశిదమౌతుంది. ఎక్కడైతే ఆలోచనలు గుంపులు గుంపులుగా ఉన్నాయో, మనము వాటిని విడివిడిగా చూడవచ్చు. పొట్టేలు ఎలాగయితే కొండతో ఢీ కొడుతుందో, ధ్యానంతో ఆలోచనల సముదాయాన్ని ఢీ కొట్టి విడివిడి చేయగలం. క్రమంగా మన ఆలోచనల క్రమం యొక్క వేగము తగ్గి ఒక ఆలోచన ఉ౦కో ఆలోచనను వెంటపెట్టుకొని రాకుండా ఉంటుంది. ఈవిధంగా ఆలోచనలు స్వతంత్రంగా ఉండి, మన స్పందనను కూడా స్వతంత్రంగా చేస్తాయి.

ఆలోచనలు గుంపులు గుంపులుగా వస్తే, అవి ఒక నియంతలాగ పనిచేస్తాయి. మనం అప్పుడు నిస్సహాయులం. ఇది వృత్తాకార పరిస్థితికి దారి తీస్తుంది. అంటే ఒకే ఆలోచన మరల మరల వస్తుంది. ఎలాగంటే : "నేను ఆమెను ద్వేషిస్తున్నాను" అనే ఆలోచన మరల మరల వచ్చిందనుకోండి, అది ద్వేషం వలన. అది భరించరానిదైతే --సాధారణంగా మనము పడుక్కొని అటు ఇటు దొర్లుతాం--మనము "నేను ఆలోచించకపోతే బాగుండును" అని బహిరంగంగా అంటాము.

ఇటువంటి ఆవేశం అరిగిపోయిన రికార్డు లాగ ఉంటుంది. ఎలాగయితే అరిగిపోయిన రికార్డు పాటను మరల మరల వినిపిస్తుందో, మన మనస్సు కూడా ఒకే ఆలోచనను పదే పదే స్ఫురణకి తెస్తుంది. మొన్న ఒక మిత్రుడు బీటిల్స్ పాటను పెట్టేడు. నాకు అది పూర్తిగా అర్థమవ్వలేదు. జాన్ లెనన్ కాబోలు "నేను గ్రుడ్డు వంటి మనిషిని. నేను వాల్ రస్ ను" అని పాడుతున్నాడు. "మంచిది. ఇది మన ఐక్యతను చాటిచెప్పేది" అని అనుకున్నాను. కాని జాన్ అదే చరణాన్ని మరల మరల పాడుతున్నాడు.

నేనడిగేను "ఎందుకు జాన్ అలా పాడుతున్నాడు?"

నా మిత్రుని సమాధానం "ఆ రికార్డు అరిగిపోయింది"

మన మనస్సు రికార్డు లాగా అరిగిపోతే, ఎంత అరచినా, గీ పెట్టినా వినదు. మనము ఆలోచనలను విశ్లేషించగలిగితే వాటిని ముందుకు తోయగలం. అందువలన ఒకే ఆలోచన వృత్తాకారంలో రాకుండా ఉంటుంది. ఇది ఊహకందని ప్రక్రియ. మనం కోపంగా ఉన్నప్పుడు, ద్వేషించనప్పుడు, భయపడినప్పుడు, లేదా ప్రకోపించినప్పుడు, ఆలోచనలను ముందుకు నడపలేము. ధ్యానమవలననే అది సాధ్యం.

మనమెంత అహంకారపూరితమైతే మన ఆలోచనలు అంత దగ్గరగా ఉంటాయి. అలా కాకపోతే ఆలోచనలు ఒక క్రమంలో వస్తూ పోతాయి. ఎవరైనా మనను అవమానించినా మనము వారిపై క్రోధం పెంచుకోము. సహజంగా కొంత విచారం కలుగవచ్చు, కాని దానిని ప్రక్కన పెట్టి ముందుకు సాగగలం. 198

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...