16.2
దంభో దర్పో అతిమానశ్చక్రోధః పౌరుష్యమేవచ
{16.4}
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్
పార్థా ! దంభము, గర్వము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము అసురసంపద కలవానికి కలుగుచున్నవి
శ్రీకృష్ణుడు అర్జునినికి జీవితంలో చీకటి కలిగించే గుణాలను గూర్చి చెప్పుచున్నాడు. ప్రతి ఆధ్యాత్మిక గురువు శాస్త్రము చెప్పినట్లుగా నడవక పోతే ఏమి అవుతుందో చెప్పక తప్పదు. ఇది జీవితంలో మంచి దృక్పథం ఏర్పడుటకు దోహదమవుతుంది.
దేవ అనగా దేవుడు. దేవ పదమునకు మెరుయుట, దేదీప్యమానమైన కాంతి, తేజస్సు అని అర్థములు చెప్పవచ్చు. అసురులనగా రాక్షసులు. వారు దేవతల శత్రువులు, చీకటిని పోలు గుణములు గలవారు. వీరి శక్తులు సదా పోట్లాడుకుంటాయి. ఆసురులు ఎప్పుడైతే విజృంభిస్తారో మనకు తీరని దుఃఖం కలుగుతుంది. ఆ కాలమందు దేవుడు అవతరించి మంచిని పెంచి ధర్మాన్ని పునఃప్రతిష్ఠిస్తాడు. మహాబారత కాలంలో శ్రీకృష్ణుడుగా అవతరించేడు.
ఇది ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చెప్పబడిన చరిత్ర. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయినప్పటికీ అవి మనలోని మంచి చెడు గుణములుగా ఆవిర్భవిస్తాయి. పరమాత్మ విశ్వమంతా పాలించేవాడు. ఆయన దుష్ట శిక్షణ చేసినప్పుడు ప్రపంచం అల్లకల్లోలం అవ్వవచ్చు. కాని యుద్ధము, అహింస, క్రౌర్యము, ఉగ్రవాదం, పర్యావరణ కాలుష్యం ఇవన్నీ మనుష్యులవలన కలిగినవి.
దేవతలను సురులు అనికూడా అందురు. సురులు లేదా దేవతలు కానివారందరు అసురులగా పరిగణింపబడతారు. అసురుడుగా తయారవ్వాలంటే సురులు చేసిన పనులు చేయకుండావుంటే చాలు. అసురులకు రాజు అవ్వాలంటే వ్యక్తిత్వాన్ని క్రమంగా పతనం చేసుకోవాలి. అది ఎంత సహజంగా, మెల్లమెల్లగా, అవుతుంద౦టే మనం రోజు విడిచి రోజు తెలిసికోలేం. మద్ నారాయణ చూపినట్లు, ఒక బండను కొండ శిఖరము నుండి క్రిందకి ద్రొల్లించినంత సులభంగా మన వ్యక్తిత్వం క్రింద పడుతుంది.
క్రిందటి శ్లోకంలో శ్రీకృష్ణుడు దైవగుణాలను వర్ణించేడు. మీకొక సహచరుడు ఉన్నాడని ఊహించండి. అతడు దుష్టుడు కాదు కానీ జీవితంలో సులభమైన మార్గాన్ని ఎన్నుకొంటాడు. అతని ఆలోచనలు, మాటలు, క్రియలూ లేదా కోర్కెలు స్వాధీనంలో లేవు. అతను 24 గంటలూ స్వార్థంతో అస్థిరంగా ఉంటాడు. ఇంకా అతను ఎప్పుడూ అబద్దాలు చెప్తాడు. అలాగే పగ సాధించాలనుకొంటాడు. అతడు వ్యాకులతతో, గర్వంతో, దురాశతో, కోపంతో ఉంటాడు. ఇటువంటి వ్యక్తిని అసురుడంటారు.
ఏ ఒక్కడూ పుట్టుకతోనే అసురుడు కాడు. ఆత్మ ప్రతి శరీరంలో నుండి, ఎల్లప్పుడూ స్వార్థపూరిత కర్మలు చేయించక, ఇతరుల బాగుకై ఎంతోకొంత మ౦చి కర్మ చేయిస్తుంది. వ్యక్తిత్వం ఒక ప్రక్రియ: మనం మనల్ని దేవతలగా లేదా అసురులుగా మలుచుకొంటాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన గుణాలు మనని నీచుల్ని చేస్తాయి. అందరూ వాటి వలన విచారము పొందుతారు. ఆ గుణాలు ఉంటే, వాటిని ప్రదర్శిస్తూ ఉంటే, మన భౌతికత , మానసికత , ఆధ్యాత్మికత క్షీణిస్తాయి.
అహంకారము మనకు తెలిసిన వ్యాధులన్నిటికన్న నీచమైనది. అది మనకు చెడు కలగజేయడమే కాకుండా ఇతరులను ప్రభావితం చేస్తుంది. దానిని చెడుగా ఎందుకు చూడమంటే మనకు కార్య-కారణము (cause-effect) మధ్య చాలా కాల వ్యత్యాసము ఉన్నది కనుక. పెద్ద అమ్మవారు వచ్చిన వారు, ఒకటి రెండు రోజులు దగ్గి, మరుసటి రోజు మరణిస్తారు. కానీ అహంకారము అలా కాదు. మనం దగ్గితే, అది పూవుల పుప్పొడి వలన అని అనుకొంటాం. దాని ప్రతికూల పర్యావసానము గుర్తించుట చాలా కష్టం.
భౌతిక వ్యాధులు కూడా ఇటువంటివే. రేడియేషన్ వలన మనకు తెలియకుండా క్యాన్సర్ వ్యాధి 20-30 సంవత్సరాల తరువాత వస్తుంది. అహంకారం వలన మన బంధుత్వాలు చెడుట, మనకు నచ్చిన ఉద్యోగం దొరకుకుండుట, రక్తపు పోటు ఎక్కువ వుండుట, మొదలగునవి తెలియకుండా జరుగుతాయి. మన ప్రక్కన నివసించేవారు తుపాకులతో బ్రతుకుట, కుటుంబ వ్యవస్థ చితికిపోవుట, ద్రవ్యోల్బణం వలన ఇబ్బంది పడుట, ఆర్థిక పరిస్థితి ఆస్తావ్యస్తం అగుట, అస్త్రాలను పోగుచేసుకొనుట, మన పిల్లలను యుద్ధానికి అనాలోచితంగా పంపుట, వీటన్నిటికీ కారణం దేశాల కున్న అహంకారమే. అది ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. దాన్ని నిర్మూలించకపోతే మనము స్వార్థపరులమై, ఇతరుల స్వార్థమునకు వత్తాసు పలుకుతాము. మనం ఎవరికి ఓటు వేస్తామో, ప్రభుత్వం, సంస్థలు చేసే దురాగతాలను పట్టించుకోకపోవడం ఇవన్నీ అహంకారంయొక్క పర్యావసానములు.
ప్రళయం వస్తుందన్నవాడు తన స్వార్థం చూసుకొని, ఆహార నిల్వలు తగ్గుతాయి, ఎక్కువగా ఆహారాన్ని భవిష్యత్తుకై కొని పెట్టుకోండి అని చెప్తాడు. నా అమ్మమ్మ, గాంధీగారి స్పూర్తితో నా ఆలోచన వేరేగా ఉంది. "నేను నాకక్కరలేని వస్తువులతో ఏమి చేయగలను? వాటిని వదిలించకోవడంవలన నాకేమైనా లాభం ఉందా?" అనుకొంటాను. శాస్త్రజ్ఞులు మనలో చాలా మంది తక్కువ తినడంవలన నష్టపోరు అని చెప్తారు. దేశాలు ఆరోగ్యానికి ఖర్చుపెట్టే కోట్ల ధనాన్ని ఆదా చేసికోవచ్చు. నాకు ఆశ్చర్యపోయే విషయమేమిటంటే అతను సిగరెట్ లు, బీరు, ద్రాక్ష సారాయి, మిఠాయిలు నిల్వ చేసికోమని చెప్తున్నాడు. మన ప్రక్క నివసించేవారు ఆకలితో అలమటిస్తే చూసీ చూడనట్టు ఉండమని చెప్పకనే చెప్పాడు.
"నేను ఎంత ఆహారాన్ని పండించుకోగలను?" అని ఆలోచిస్తాను. నా అమ్మమ: ఆత్మ విశ్వాసంతో ఉండి, అవరోధాల్ని దాటాలి అని చెప్పింది. దుకాణాల్లో తినే వస్తువులను కొని, డబ్బు వదిలించుకొని, అవి ఎక్కువ ఏళ్లు ఉండేటట్టుగా క్యాన్ లో పెట్టుకొ౦టే లాభంలేదు. మనకు కావలసిన కూరగాయలు, పండ్లు మన ఇంటి ముందు, వెనుక, లోపల ఎక్కడైతే సూర్య రశ్మి ఉంటుందో అక్కడ పండించు కోవచ్చు. ఇది సాత్వికుల పద్దతి. దేశ ఆహార నిల్వలను హరించేవి కాకుండా, వాటిని ఎక్కువ చేసేవి. దీనివలన ఉన్నతమైన జీవన శైలి కలుగుతుంది.
అతను ఇచ్చే రె౦డో సలహా: అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోండి. అవి: వాహన విడి భాగాలు, సబ్బు, గెడ్డం గీసుకొనే రాజర్, ఏదైతే మీకు లేకపోతే జీవితం వ్యర్థమని తలుస్తారో. మన౦ జీవన శైలి మార్చుకోడానికి ఇష్ట పడం. కానీ మనం దాని ఖరీదు చూడాలి. మనం మన జీవితాన్ని అతి తక్కువ వస్తువులతో సులభతరం చేసికోవడం మంచిది.
మూడో సలహా: బంగారం, వెండి కొనండి. మన దాచుకొన్న డబ్బులో కొంత భాగంతో బంగారం, వెండి కొని బాంక్ లో దాచుకోమన్నది సలహా. అలాగే కొంత మన ఇంట్లో దాచుకొని అవసరానికి వాడాలి.
మన౦ దాచుకొన్న డబ్బంతా బంగారం, వెండిగా మార్చుకోమని చెప్పడం మంచిది కాదు. కొంత వాటిగా, కొంత ఆస్తి అని చెప్పగలిగే నిజమైన వస్తువుల రూపేణా మార్చాలి. ఆయన ఉద్దేశంలో ఆస్తి అంటే మన౦ వాడుకునేది లేదా బదలాయింపు (barter) చేయాడానికి వీలైనది. ఒక ముక్కలో చెప్పాలంటే: డబ్బు నోట్లను వస్తువులుగా మార్చుకోండి. "ప్రభుత్వం అప్పుల పాలైతే మీ జీవన శైలిని ఎందుకు మార్చుకోవాలి?" అని అడుగుతున్నాడు.
అతను ఇచ్చే మరో సలహా: మన డబ్బులో కొంత భాగం శాశ్వతంగా ఉండే వస్తువుల మీద పెట్టుబడి పెట్టండి. నేను అతను ఆధ్యాత్మికత గురించి చెప్తున్నాడనుకొన్నాను. ఆయన చెప్పేది: ప్రాచీన వస్తువులు, చిత్రాలు, స్టాంప్ లు, కామిక్ పుస్తకాలు, మొదలైన వస్తువుల ధర పెరిగేదేకాని ఎన్నటికీ తగ్గనిది.
జీసస్ ఇలా అడిగేడు: "ఎక్కడైతే నిధి ఉందో, అక్కడే నీ మనస్సు కూడా లేదూ?" మన జీవన శైలికి కావలసిన వస్తువులను నిల్వ చేసుకొంటే సరిపోలేదు. ఎవరైనా మీ సహాయ౦ లేదా ఆశ్రయ౦ కోరితే మీరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఆహారాన్ని, బంగారాన్ని, వాహన విడి భాగాల్ని సమర్థించుకోగలగాలి. చెడు ఉద్దేశం తో కాక, ద్వేషం లేకుండా, మన మార్గము౦డాలి. "నాకు యుద్ధం అక్కర లేదు. విజయం మాత్రమే కావాలి" అని బిస్ మార్క్ అన్నారు. మనమంటాం: "నాకు ఏది కోరితే అది ఉండాలి."
శ్రీకృష్ణుడు అర్జునునికి స్వార్థంతో బ్రతికే జీవనాన్ని -- అది వ్యష్టి లేదా సమిష్టి అయినా--గూర్చి చెపుతున్నాడు. "అటువంటి జీవితం కావాలంటే, ఎవ్వరూ నిన్ను ఆపలేరు. కానీ ప్రేమ గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే అది ద్వేషానికి దారి తీస్తుంది. శాంతి గురించి మాట్లాడ వద్దు. అది హింసని, యుద్ధాన్ని కలుగ జేస్తుంది." అర్జునుడు తన సమ్మతాన్ని చెపుతాడు. 224
No comments:
Post a Comment