Thursday, March 10, 2022

Chapter 16 Section 10

16.10

అసా మయా హత శ్శత్రు ర్హనిష్యే చాపరానపి {16.14}

ఈశ్వరో అహమహం భోగీ సిద్ధో అహం బలవా న్శుఖీ

ఈ శత్రువును ఇపుడు చంపితిని, మిగిలిన వారిని ఇక ముందు చంప బోవుదును. నేను ప్రభువును, భోగిని, సిద్ధుడను, బలవంతుడను, సుఖవంతుడను.

ఆఢ్యో అభిజననా నస్మి కో అన్యో అస్తి సదృశో మయా {16.15}

యక్ల్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః

నేను ధనవంతుడను, గొప్పకులము వాడను, నాతో సమానుడు లేదు, నేను యజ్ఞము చేసెదను, సంతసించెదను ఀ

ఈ పై శ్లోకములలో చెప్పినవి ఒక మతి చెడినవానికి అన్వయించుకోవాలి. కలిగులా, నీరో మొదలైనవారు తాము దేవుళ్ళని చెప్పుకున్నారు. కానీ ఎక్కువ కాలం కాదు. ఈ రోజుల్లో ఒక సంస్థ యజమాని, లేదా దొంగల ముఠాకి నాయకుడు ఈ విధంగా తలచవచ్చు. మన వరకూ ఇవి వర్తించవని అనుకుంటాము. "నేను నీరో కాను. నాకు సమస్యలు ఉండవచ్చు. కానీ నేనెప్పటికీ అటువంటివాడను కాను" అని అంటాము.

ఈ అంశాలు నియంతలకు మాత్రమే వర్తించవు. ఇది అహంకారం వలన కలిగినది. ధ్యానం వలన తెలిసేదేమిటంటే మన గర్వము ఇట్టి మాటలు కలిగిస్తుందని. చాలా తక్కువమంది అటువంటి ఆలోచనలను వ్యక్త పరుస్తారు. అహంకారం పెరుగుతున్న కొద్దీ ఇటువంటి మాటలు నాగరీకత ముసుగులో వ్యక్తమవుతాయి. ఇది ఒక వ్యష్టి కి మాత్రమే పరిమితము కాదు. జాతులు, దేశాలు, సంస్థలు కూడా కావచ్చు.

అహంకారి "నా శత్రువులను నిర్మూలించేను. నా మాటకి అడ్డువస్తే తక్కిన వారిని కూడా నిర్మూలిస్తాను. నేను దేవుడ్ని కాదా?" అని అనుకుంటాడు. ముఠా నాయకులు ఉన్నతమైన పదవులలో ఉన్నవారలకు "గ్రేట్" అనే బిరుదులు కూడా ఉన్నాయి. కమోడోర్ వాండర్ బిల్ట్ పై శ్లోకంలో చెప్పిన విధంగా తలచి తన వ్యాపార కలాపాలు చేసేడు: నీకు కావలసినది తీసుకో, ప్రత్యర్థులను నిర్మూలించు. లియోపయాల్డ్, బేకర్ పాషా అనే వాళ్ళు కోట్ల విస్తీర్ణముగల ఆఫ్రికా భూమిని బెల్జియం, బ్రిటన్ కి ఇచ్చినపుడు ఇలాగే తలచేరు. వాళ్ళ పేర్లను ఇప్పటికీ గౌరవిస్తున్నారు. చక్రవర్తులైన అలెక్సాండర్ ది గ్రేట్, నెపోలియన్, డ్రేక్ , కోర్టేజ్, క్లైవ్ మొదలగువారు తమతో ఏది పట్టుకుపోయేరని కాదు, వాళ్ళు ఎటువంటి నాగరీకతను తమ విజయాల ద్వారా వ్యాప్తి చేసేరు అనేది ముఖ్యం.

వీరంతా రాజసికులు. వారు తమ విధివ్రాతతో ఆ విధంగా అయ్యారు. స్పర్థతో, అధికారంతో ఎవరుంటారో వారిని మన ప్రపంచంలో గౌరవిస్తారు. వారు గర్వంతో కూడిన శక్తితో ప్రపంచాన్ని శాసించేరు. అందువలన కోట్ల మంది దుఃఖం అనుభవించేరు. వారు చేసిన అపరాధము రాజసికుల త్రోవలో ఉండడమే.

ఈ రోజుల్లో శక్తి వ్యక్తులకు కాక ఒక సంస్థ యొక్క బోర్డు లేదా కమిటీ లకు ఇవ్వబడినది. వాళ్ళు తమను తాము దేవునిగా భావించక యున్నా, దేవుడు తమ పక్షాన ఉన్నట్టు భావిస్తారు. అనగా "నాకు లెక్క లేనంత శక్తి ఉంది. నాకు ఏది ఇష్టమైతే అది చేస్తాను" అని అనుకుంటారు.

అలెక్సాండర్ ది గ్రేట్ భారత దేశముపై దండయాత్ర చేసినప్పుడు కయబర్ పాస్ వద్ద ఒక భారతీయ సైనికుడు అతనితో పోరాడి అతన్ని గుర్రం మీదనుంచి క్రిందకు పడేశాడు. అలెక్సాండర్ ను ఆయన సైనికులు రక్షించేరు. దానికి ప్రతీకారంగా అలెక్సాండర్ ఆ సైనికుడి ఊరంతటికీ నిప్పు పెట్టి అనేకమంది పిల్లలను, స్త్రీలను, ముసలివారిని సజీవ దహనం చేసేడు. అలెక్సాండర్ తను దేవుడనని గర్వముతో అలాగ ప్రవర్తించేడు. డ్రెస్డెని మొదలైన జర్మన్ నగరాలను రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనం చేసేరు. దానికి కారణం జర్మన్ లు ఇంగ్లండ్ మీద చేసిన దాడి. డ్రెస్డెన్ లో ఉన్న సామాన్య పౌరులు, వారు సైనికులు కాకపోయినా, అసువులు బాసేరు. దాడిని చేయించింది ఒక నియంత కాదు. ఒక కమిటీచే నిర్ణయింపబడినది. పర్ల్ హార్బర్ మీద దాడి చేసేరని, హీరోషిమా, నాగసాకీలపై అణ్వాశ్త్రములు ప్రయోగింపబడినవి. దానితో మరణించినవారందరూ సామాన్యులే. అనగా సైనికులు కానివారు. తద్వారా రాజసికులు చెప్పేదేమిటంటే: మా శత్రువులను మారణ హోమం చేసేము. మాకెదురు తిరుగుతే మీకూ అదే గతి పడుతుంది.

నేను 1959 లో మొట్ట మొదటిసారి అమెరికాకు వచ్చినపుడు చాలామంది ఈ పై శ్లోకాలు చెప్పినట్లు ఉండేవారు. వారి గర్వానికి కారణం శక్తి మరియు దేశానికి రెండవ ప్రపంచ యుద్ధంలో కలిగిన విజయం. అమెరికా స్వేచ్చా ప్రపంచానకి నాయకునిగా, రక్షకునిగా చూసేరు. అమెరికా ఇప్పటికీ పశ్చిమ దేశాలకి రక్షణ కలిపిస్తున్నాది. అమెరికా వద్ద అనేక యుద్ధ సామాగ్రి ఉండి, అత్యంత సంపదతో అగ్ర రాజ్యంగా ఉద్భవించింది. అది శత్రువులను నిర్మూలించి, మిత్రులికి సహాయం చేసింది. నేను వచ్చినపుడు "అమెరికా భూగోళంపై అతి గొప్ప దేశం" అనే ప్రకటనలను చూసేను. అమెరికన్లు ఎంత సంపన్నులయ్యారంటే వారి సంపదను ఎలా ఖర్చు పెట్టాలో వారికి తెలియలేదు.

చాలామంది అమెరికన్లు దేవుడు తమ పక్షాన ఉన్నాడని నమ్మేవారు. ఆమెరికాని ఎదిరి౦చినవారిని గాఢాంధకార శక్తులుగా పరిగణించేవారు. జాన్ ఫోస్టర్ డల్లెస్ అమెరికన్ ప్రభుత్వములో సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా అప్పుడు వుండేవారు. భారత దేశం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాసామ్యం గా ఉండి, ఎవరి పక్షానా ఉండబోదని నెహ్రూ చెప్పినపుడు అతనికి కోపం వచ్చింది. డల్లెస్ "భారత దేశం నైతిక విలువతో లేనిది" అని అన్నారు.

ఆర్నాల్డ్ టోయిన్ బీ అనే ఇంగ్షీషు చరిత్రకారుడు ఇలా అన్నారు: 1987 లో క్వీన్ ఎలాజబెత్ డైమండ్ జూబిలీ పురస్కరు౦చుకొని తమ రాజ్యం ఉత్కృష్ఠమైన స్థితిలో ఉంది. నేను అటువంటి ప్రపంచంలో పుట్టేను. నా పాఠ్య పుస్తకాలలో వలస రాజ్యాలు ఎర్ర రంగుతో చూపేవారు. "సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం" అనేవారు. నా కజిన్ "సూర్యునికి కూడా భయం" అనేవాడు. బ్రిటన్ ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రప౦చ సముద్రాలను, వనరులను స్వాధీనంలో పెట్టుకొంది. సాంకేతిక విజ్ఞానంలో ముందు వుండి పారిశ్రామిక ఉత్పత్తులలో బ్రిటన్ ప్రపంచాన్ని శాసించ గలిగే స్థితిలో ఉండేది. అందువలన ప్రపంచ శాంతి నెలకొల్పబడి -- బ్రిటిష్ సేనల వలన--ప్రపంచంలో వాణిజ్యం అధికమైనది.

బ్రిటిష్ తమలో నైతిక విలువలు ఎక్కువ అని తలచి ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్య పౌరులిగా తమను భావించుకొన్నారు. ఆ పదవిని తెలివితో వాడేరు. కిప్లింగ్ తెల్లవాని బరువు (white man's burden) గురించి వ్రాసేరు. వారిలో విషాదమే ఎక్కువ ఉంది. ఇటువంటి అధిక శక్తివలన ప్రజల చావుబ్రతుకలను నిర్ణయించే దేవుని వారసులుగా తలచేరు.

బ్రిటన్ 19 వ శతాబ్దములో ఎలా వుందో, అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అలాగయింది. ఇందువలన శక్తితో వచ్చిన అహంకారం యొక్క కర్మను వివరించవచ్చు.

బ్రిటన్ భారత దేశంలో 250 సంవత్సరాల పాటు ఏమిచేసిందో ప్రపంచంలో అతి తక్కువ మందికి తెలుసు. అమెరికన్ పాత్రికేయులు విలియం షైరర్ , లూయీ ఫిషర్, జాన్ గుంతర్, వెబ్ మిల్లర్, మార్గరెట్ బౌర్కె-వైట్ మొదలైనవారు, భారత దేశంలో బ్రిటన్ చేసిన ఆగడాలు గురించి ప్రపంచానికి అవగాహన కల్పించేరు. భారతీయులికి తమ ఊర్లో లేదా చుట్టుప్రక్కల ఊర్లలో ఏమవతున్నాదో తెలుసుకాని, మిగతా చోట్లలో ఏమవుతుందో తెలియదు. అతితక్కువ బ్రిటిష్ అధికారులకు దేశం మొత్తంలో ఏమవుతున్నాదో తెలుసు. భారత దేశంలో ఉన్న 700 వేల పల్లెల్లో జరగిన విషయాలగురించి ఎవరూ చెప్పలేరు. కానీ బ్రిటిష్ కంపెనీలు వాటిని ఊచకోత కోసేరు. మనకి తెలిసిందల్లా: ఒరిస్సా, బెంగాల్ లో బ్రిటిష్ భూస్వాములు పంటను స్వాధీనం చేసికొని కరవు కలిగించేరని. దానివలన కోట్ల మంది మరణించేరు. అలాగే 1857 లో భారతీయుల విప్లవానికి జవాబుగా అనేక గ్రామాలకు నిప్పు పెట్టేరు. దానివలన లెక్కపెట్టలేని ప్రజలు, పిల్లలతో సహా, అసువులు బాసేరు.

నేను బ్రిటిష్ సైనికులు చేసిన అన్యాయాలాను గురించే మాత్రమే మాట్లాడ దలచుకోలేదు. నేను ఒక వలస దేశాన్ని పాలించేవారి మానసిక స్థితిని పరిశీలిస్తున్నాను. ఇది స్వతహాగా మంచివారలకు కూడా వర్తిస్తుంది.

చాలామంది బ్రిటిష్ వారు భారత దేశాన్ని పరిపాలించడానికి వచ్చినపుడు సదుద్దేశంతో ఉన్నారు. కానీ వారు అడుగుపెట్టిన ప్రపంచం తారతమ్యములతో కూడుకొని ఉన్నది. అది నిర్లక్ష్యం లేక ఉండలేదు. తమ స్వంత దేశంలో సహించని ఆగడాలను వాళ్ళు వలస దేశాల్లో సహించేరు. అలాగే వలస రాజ్యంలోని పేదరికాన్ని చూస్తూ అది తమ పాలన వలననేనా అని ఎప్పుడూ ఆత్మ విమర్శ చేసికోలేదు. విలియం షైరర్ గాంధీ గురించి వ్రాస్తూ ఇలా అన్నారు:

"ఇంగ్షీషు వారిని భారతీయులు ప్రేమించక వెనక్కి పొమ్మంటున్నారు. వాళ్ళు భారత దేశానికి పాలకులుగా దేశాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం ఎన్నటికీ సరి కాదు. భారతీయుల సంస్కృతి పురాతనమైనది, గొప్ప నాగరీకితతో కూడినది. కాని వాళ్ళను ఇంగ్షీషు వారు చిన్న చూపు చూసేరు. వాళ్ళ జాతి తక్కువదని, సాంఘిక౦గా, సాంస్కృతంగా, మేధలో కూడా తక్కువ వారని, అందువలన వారు తమని తాము పాలించుకోవడం చేతకాదని తీర్మానించేరు. అది భారతీయులకు తీరని అవమానం. "

షైరర్ సిమ్లా కి వెళ్ళినపుడు అక్కడి బ్రిటిష్ వారి జీవన శైలి తమ స్వదేశంలో కన్నా ఉన్నతమైనదన్నారు. బ్రిటిష్ వారు సిమ్లా నుంచి సంవత్సరానికి 7 నెలల పాటు పాలించేవారు. ఎందుకంటే అది సముద్రమట్టం నుండి 7 వేల అడుగుల ఎత్తులో నుండి మంచి వాతావరణంతో కూడియున్నది. 1903 వరకు ఇంగ్షీషు వారి సరంజామాని -- అంటే వారు త్రాగే మద్యం, ఆఫీసు ఫైళ్ళు మొదలైనవి -- వేలకొద్ది కూలీలు తమ భుజానేసుకొని మోసేవారు. ఎందుకంటే దేశ రాజధానిని డిల్లీ నుంచి సిమ్లా కి తాత్కాలికంగా మారుస్తున్నారు కాబట్టి.

సిమ్లాలో ఇంగ్షీషు వారు తప్ప ఇంకెవరూ వాహనాలు నడపడానికి వీలు లేదు. అక్కడ భారతీయులు రిక్షా లు మాత్రమే నడిపేవారు. వాళ్ళు వందలకొద్ది కిలోల బరువును ఎత్తైన కొండలమీదకి క్రిందకి మోసుకెళ్ళేవారు. ఒక్కొక్కప్పుడు కొందరు బరువులను తమ వీపుపై తీసికెళ్ళేవారు. అదే నాగరీకులు ఉండే స్థలంలో అయితే గుర్రపు బగ్గీ లేదా మోటార్ వాహనాలు వాడేవారు. కానీ అటువంటివి సిమ్లాలో లేవు. కొందరు ఇంగ్షీషు వారు ఆ శ్రామికులను చూసి హేళన చేసేవారు.

భారత దేశంలో కొన్నాళ్ళు నివశిస్తే పేదవారిపట్ల నిర్లక్ష్యం ఆవహిస్తుంది అని ఇంగ్షీషు వారు తలచేవారు. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న మనుష్యుల కష్టాన్ని గుర్తించకుండా ఉంటే, ఇక దేనియందూ దైన్యము ఉండదు.

వలస రాజ్యాధికారులు తాము నాగరీకతను, సంస్కృతిని పేద దేశాల్లోని ప్రజలకి పంచి పెడుతున్నామని తలచేవారు. వారు ఫ్రెంచ్, బెల్జియన్, డచ్ ఎవరైనా కానీ అలాగే తలచేవారు. దానికి బదులుగా వాళ్ళు ఆ దేశ సంపదను కొల్లగొట్టేవారు.

కొందరు చదువుకున్న భారతీయులు బ్రిటిష్ వారు స్థాపించిన రైల్వే వ్యవస్థని వాళ్ళ మంచితనానికి నిదర్శనముగా చెపుతారు. నిజానికి రైల్వే వ్యవస్థ వారి సైనికులను తరలించడానికై సృష్టించేరు. అలాగే బ్రిటిష్ వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సృష్టించేరని అంటారు. అది తిరగబడినవాళ్ళని జైళ్ళలో పెట్టడానికి ఉపయోగపడేది. వీటివలన భారతీయుల కన్నా వారికే ఎక్కువ ఉపయోగం ఉంది.

ఇకపోతే ఇంగ్షీషు వారి divide and rule లేదా విభజించి పాలించు సిద్ధాంతం భారత దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. 273 ఏళ్లు క్రీస్తు పూర్వం అశోకుడు అఖండ భారతదేశాన్ని పాలించేడు. కాబట్టి భారతీయులకు కలసిఉంటే కలదు సుఖమని తెలుసు. ఇంగ్షీషు వారు ఐక్యమత్యంగా ఉన్న భారతీయులలో తేడాలు చూపెట్టి వారి మధ్య చిచ్చు పెట్టేరు. ఇదే స్కాట్ లాండ్ లో కూడా జరిగింది.

1817 లో సర్ థామస్ మన్రో "చరిత్రలో ముందెన్నడూ జరగని రీతిలో భారతీయులిని ఇంగ్షీషు వారు అవమానించేరు. వారిని నమ్మక, అవసరమైనంత మటుకే వారితో కార్య కలాపాలు చేసేరు." అన్నారు.

ఒక ఇంగ్షీషు మిత్రుడు నన్ను "మీకు మా వలన కలిగిన ఇబ్బంది ఏమిటి?" అని అడిగేడు. "మీరు మమ్మల్ని మాటల గారడీతో మభ్య పెట్టేరు. మీరు నిజం ఎందుకు చెప్పరు. మీరు మమ్మల్ని వాడుకోడానికే ఇక్కడకు వచ్చారు. వేరే సదుద్దేశమేమీలేదు" అన్నాను. అతడు నాతో అంగీకరించేడు.

నిజానికి ఏ శక్తివంతమైన దేశమైనా ఇలాగే ప్రవర్తిస్తుంది. అది ఒక బ్రిటన్ కే పరిమితం కాదు. అమెరికా కూడా అలాగే ఉంది. నేను బ్రిటన్ గురించి చెప్తుంది నా స్వీయానుభవం.

అమెరికా వలస రాజ్యాలు లేకుండా ప్రపంచాన్ని శాసిస్తోంది. అది కొంచెం మేలే. కాని అమెరికన్ లు సదుద్దేశంతో మరొక దేశ అంతర్గత విషయాల్లో తల దూర్చినా అది బెడుసు కొడుతోంది. ఉదాహరణకు వియత్నాం. అక్కడ ప్రజల్ని నియంతల బారినుండి కాపాడడానికి ప్రయత్నించినా వారు వాళ్ళ నమ్మకాన్ని పొందలేకపోయేరు. ఇలాగే లాటిన్ అమెరికాలో ఆమెరికన్ల ఆర్థిక పెట్టుబడుల శక్తి పని చేయక పోతే సైన్యాన్ని తీసికొస్తామని చెప్పేరు. అలాగే యూరప్ లో చాలామంది అణ్వాశ్త్రాలకి ఎదురుతిరిగి ఆమెరికాని నిందించారు.

సోవియట్ యూనియన్ మీద కూడా ఇటువంటి నిందలు వేయవచ్చు. అది తక్కిన వారికంటే ఎక్కువ క్రూరత్వం చూపింది. శక్తి ఎక్కడ ఉందో గర్వం, నిర్లక్ష్యం పెరుగుతాయి. నేను ప్రతి దేశాన్ని విమర్శిస్తున్నాన్ని అనుకోకండి. నేను శక్తి వలన కలిగే సహజ పర్యావసానాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తమను తాము దేవునిగా తలచుట. మనమెప్పుడైతే ఇతరులను నియంత్రించగలమని అనుకొంటామో అప్పుడు కర్మ బీజ రూపం పొందుతుంది. గర్వము దాని వలన కలిగేది . దానికి కర్మ ఫలము ఉండాలి. ఇతరులను వాడుకోవడం ఒక కామం. అలాగే మత్సరం. అలాగే భయం. మనకన్నా శక్తిమంతుడు వచ్చి మనని ఆక్రమిస్తాడానే భయం.

ఇటువంటి భయం వలన, లోభము వలన యుద్ధాలు వస్తాయి. బ్రిటన్ కున్న సంపదను చూసి తక్కిన దేశాలు అసూయ పడ్డాయి. దాని నెలాగైనా కబళించాలని యోచించాయి. ముఖ్యంగా జర్మనీ. దానివలన రెండు ప్రపంచ యుద్ధాలు జరిగేయి. అందువలన బ్రిటన్ యొక్క సంపదంతా హరించుకు పోయింది.

శక్తి చివరకు క్షీణిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఒక శక్తివంతమైన దేశానికి సవాలు ఎదురవుతుంది. రోమన్ సామ్రాజ్యము కొన్ని శతాబ్దాల తరువాత అంతర్ధానమయింది. క్వీన్ విక్టోరియా పరిపాలన అలాగే ప్రపంచ యుద్ధాల వలన తిరోగమమయింది. అమెరికా ప్రస్తుతం సవాలు లేకుండా ఉన్నది. వెండెల్ విల్కీ చెప్పినట్లు మనమ౦తా ఒకే ప్రపంచంలో ఉన్నాము లేదా మనమంతా లేకుండా పోయేము. ఏ దేశమూ తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. అలా కాకపోతే మన ప్రపంచానికంతటికీ ముప్పు కలుగుతుంది. 280

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...