Thursday, March 10, 2022

Chapter 16 Section 9

16.9

ఇదమద్య మయా లబ్ద మిదం ప్రాప్స్యే మనోరథం {16.13}

ఇద మస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం

ఇది నాకు ఇప్పుడు లభించినది. ఇక మీదట ఈ కోరికను పొందగలను. ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నది. ఇక మీదట ఇంకనూ వచ్చును.

బెర్క్ లీ కి, నా ఇంటికి మధ్యనున్న దారిలో ఒక విషపూరిత గడ్డి గురించి ప్రకటన ఉన్నది. దానికి ఒక తర్కము గాని, ఇంద్రియ సంబంధిత విషయము గాని లేదు. ఆ పదార్థము యొక్క పేరు మోర్ అనగా ఇంకా ఎక్కువ.

ఆ ప్రకటన మన యుగానికి బాగా వర్తిస్తుంది. పారిశ్రామిక విప్లవము (industrial revolution) మన నాగరీకమును మార్చింది. దాని పరివర్తనములో ఇప్పుడు మనమున్నాము. దానిని పురోగతి లేదా సాంకేతిక శాస్త్ర విప్లవమని అందురు. నేను దానిని మోర్ అనగా ఎక్కువ అంటాను. దానికి రెండు కారణాలు: ఉన్నదానికన్నా ఎక్కువ ఇంకా ఉంది; మనకెంత ఎక్కువ ఉంటే అంత ఆనందం కలుగుతుంది.

కొన్ని సంవత్సరాల క్రితం నేను జీతాలు, ఉద్యోగాల గురించి చేసిన సరవేక్షణ (survey)చదివేను. నెలకి ఒక 100 డాలర్ల ఎక్కువ ఉంటే వాళ్ళకి సంతృప్తి కలుగుతుందని ఆ సరవేక్షణలో తేలింది. వారు పొందే జీతాలు 12 వేల నుంచ 40 వేల వరకు. వారికి ఎంత జీతం వస్తున్నా ఇంకా ఎక్కువ రావాలని ఆశ పడుతున్నారు.

మన మనస్సు ఎంతసేపూ కోర్కెలు కోరుతూ ఉంటుంది. కోర్కెలన్నీ తీరుతే మనస్సు నిరుద్యోగి అవుతుంది. "ఈ రోజు ఇంత ఉంది. రేపు ఇంకొంచెం ఉంటుంది" అన్న పదాలు మన శిలా యుగం నుంచి ఉండవచ్చు. చాలా యుగాలు మానవులు కొంచెము మాత్రమే ఆశించేవారు. పారిశ్రామిక విప్లవం దాన్ని అంతా కొన్ని దేశాల్లో మార్చేసింది. అక్కడ ఒక ప్రమాదకర పరిణామము చెందింది: అన్ని కోర్కెలనను సాధించు కొనవచ్చు. ఇది ప్రమాదకరమెందుకంటే మన వాంఛలు అనేకం. కానీ వాటిని తీర్చే పదార్థము పరిమితము. మన దురాశవలన మన గ్రహాన్ని కాలుష్యంతో నింపి, అనేక మందిని పేదరికములో ఉంచుతున్నాము.

1851 లో లండన్ నగరంలో పారిశ్రామిక ప్రగతి గురించి ఒక పెద్ద ప్రదర్శన (exhibition) జరిగింది. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం పరాకాష్ఠలో ఉంది. ఆ ప్రదర్శన జరిగే భవన్నాన్ని క్రిస్టల్ ప్యాలెస్ అనగా వజ్ర వైఢూర్యాలతో కూడినది అన్నారు. అనేక ఇంజిన్ లు, పారిశ్రామిక విప్లవం వలన కనుక్కొనబడిన వస్తువులు; భారత దేశం నుంచి, చైనా నుంచి కొల్లగొట్టి తెచ్చినవి; వాడే నిత్యావసర వస్తువులు అక్కడ చూపబడ్డాయి. శాస్త్రము ప్రకృతిని, వైద్యము వ్యాధిని, యూరప్ ఆసియా, ఆఫ్రికాలను జయించుచున్నాయి. ఆ ప్రదర్శనకి వెళ్ళిన వారికి రెండు విషయాలు విదిత మౌతాయి: అందరికి సరిపోయే వనరులు భూమి మీద ఉన్నాయి; మన౦ శాస్త్రముల వలన, వర్తకము వలన, పరిశ్రమల వలన శాశ్వత సుఖమును అనుభవించవచ్చును.

ఒక శతాబ్దం తరువాత దీనిని నమ్మేవారు చాలామంది ఉన్నారు. తేడా ఏమిటంటే మన ప్రగతిని నిర్దేశించేది గ్రేట్ బ్రిటన్ కాదు. ప్రస్తుతమిది అమెరికా కల: "ఎక్కువ, గొప్ప, వేగిర౦, మరింత ధనం".

అన్నీ ఎక్కువ: కనుక్కోవలసిన ప్రదేశాలు, జ్ఞానం, కనిపెట్టవలసినవి, వనరులు, ఆర్థిక బజార్లు, తయారుచేయబడే వస్తువులు మొదలైనవి అన్నీ ఎక్కువగా ఉండాలని ఆశ. ఐశ్వర్యము అన్నిచోట్ల ఉంది. మనిషి దాన్ని పొందడానికి ప్రయత్నించడమే కాక, ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలను కూడా చేయవచ్చు. చరిత్రకారులను ఏది మన పురోగతికి ఎక్కువ కారణము అని అడిగితే: బొగ్గు, ఇనుము, పెట్టుబడి సాంద్రీకరణం, సైన్స్ అని చెప్తారు. వానిలో చాలా నిజముంది. కానీ కోర్కె అన్నిటికన్నా మిన్నగా ఉంది. 19 వ శతాబ్ద పురోగతికి మూల కారణం మితిమీరిన కోర్కెలు. పురోగతి దురాశ వలన కలిగింది. ఇప్పుడు మనమా కర్మ ఫలమును అనుభవిస్తున్నాం.

శ్రీకృష్ణుడు చెప్పేది: మనం ఆశించే లాభం యొక్క పెరుగుదల విచ్చల విడిగా ఒక సహజ పరిమితిని దాటితే కలిగే ఫలితం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను లోభం గురించి చెప్తాను.

వ్యాపారస్తులు ఎప్పుడూ ఇంకా ఎక్కువ లాభాన్ని ఆశిస్తారు. దానికి వారి పెట్టిన పేరు గ్రోత్ లేదా పెరుగుదల. మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉండడము కాకుండా, దాని చక్ర వడ్డీ కూడా పెరుగుతూ ఉండాలి. క్రిందటి ఏడాదికన్నా ఎక్కువ సంపాదించాలి.

ఆ పెరుగుదల ఎక్కడినుంచి వస్తుంది? పరిమితి లేని పెరుగుదల పరిమితిలేని వాడుక వలన కలుగుతుంది: ఎక్కువ శక్తి, వనరులు, పెట్టుబడులు, శ్రామికులు మొదలైనవి. మనమెంత ఎక్కువ వస్తువులను వాడుతూ ఉంటామో అంత ఎక్కువ పెరగగలం.

ప్రగతి అపరిమితమైన, చవకైన వనరుల వలన లభిస్తుంది. రాజసికుడు దగ్గరనున్న, చవకైన వనరులను ముందు వాడుతాడు. అవి ఖాళీ అయితే లేదా ఖరీదైతే వేరే చోట వాటికై చూస్తాడు. అది వేరే గ్రహమైనా కావచ్చు. మనకు తెలిసింది వనరులు అయిపోయేముందు వాటి ధర పెరుగుతుంది. మన భూమిలో ఎక్కడో అక్కడ ఏదో ఒకటి వాడుకోవడానికి ఉన్నది. ఖనిజ సంపద, సేద్య వనరులు, చవకకు పనిచేసే శ్రామికులు ఎక్కడపడితే అక్కడ 66% భూమి మీద ఉండే ఖండాలలో ఉన్నారు.

ఆసురిక సంస్థలు క్రొత్త వనరులు, బజార్ల కై తమ పాలనను విధించేరు. ఇది దురాశకు పర్యావసానము.

బెర్నార్డ్ షా "సీసర్ అండ్ క్లియో పాత్ర" అనే నాటకాన్ని 1900 లో వ్రాసేరు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం పరాకాష్ఠ లో ఉంది. ఆ నాటకంలో ఱా అనబడే ఈజిప్షియన్ దేవత బ్రిటిష్ రోమన్ సామ్రాజ్యాలు ఎలాగ తయారయ్యాయో చెప్తాడు:

"పాత రోమ్ తమ ప్రజల్నే దోచు కున్నారు. వారిది ఒక పెద్ద కళ. వారు చేసే శాసనములు ధర్మమైనవిగా కనిపిస్తాయి. వాళ్ళ దేశంలోని పేదల్ని దోచుకున్నది సరిపోక మిగతా రాజ్యాల మీద పడ్డారు. ఇలా దేశాల్ని ఆక్రమించి క్రొత్త రోమ్ ని స్థాపించేరు. అది అత్యంత సంపన్న మైనది, విశాలమైనది. నేను, ఱా, వాళ్ళని చూసి నవ్వేను. ఎందుకంటే వాళ్ళ మెదడుల పరిమాణం మాత్రం మారక, వారి సామ్రాజ్యం విస్తరించింది."

షా ఐరిష్ వాస్తవ్యుడు. కాబట్టి ఆయనికి ఈ విషయాల మీద మంచి అవగాహన ఉంది. ఇంగ్షీషు వారు రోమన్ లాలాగే ముందు తమ ప్రజల్ని వాడుకొన్నారు. నేను భారత దేశంలో పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఐరిష్ కరవు గురించి చదివేను. అది ఇంగ్షీషు వారు వ్రాసినది. మా పుస్తకాలలో ఐరిష్ వాళ్ళ బరి తెగిన తీరు గురించి వ్రాసేరు. వాళ్ళు చాలా పేదవారని, ఒక్క బంగాళా దుంపలు పెంచడం తప్పిస్తే వాళ్ళ కేమీ తెలియదని వ్రాసేరు. వాళ్ళ జనాభా పెరగడంతో వారికి వాళ్ళ భూమి సరిపోలేదు. 1845 లో కొన్ని క్రిముల వలన వారి బంగాళా దుంప పంట అంతా నాశనమైంది. 5 ఏళ్లలో కొన్ని కోట్ల ఐరిష్ పౌరులు తినడానికి తిండి లేక మరణించేరు. ఒక కోటిమంది అమెరికాకు పడవలలో పయనమయ్యారు. దారిలోనే కొన్ని వేలమంది చనిపోయేరు.

షా చెప్పే క్రొత్త విషయం: ఐర్ లాండ్, భారత దేశంలాగే, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక వలస దేశం. చాలామంది భారతీయులికి ఈ విషయం తెలీదు. ఐరిష్, బ్రిటిష్ వ్యక్తులు చూడడానికి ఒకలాగే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ హయాంలో ఐర్లాండ్ , భారత దేశం ఆక్రమించబడినవి.

బ్రిటిష్ ఐరిష్ వారి భూములను లాక్కొని వాళ్ళ తొత్తులికి పంచి పెట్టేరు. అంతకు ముందు వాళ్ళను ఊచకోత కోయాలని చూసేరు. బ్రిటిష్ భూస్వాములు తాము బ్రిటన్ లో సుఖాలను అనుభవిస్తూ, ఐర్లాండ్ లో ఐరిష్ లకు కాక, తమకు కావలసిన పంటలను పండించుకొన్నారు. వాటిని ఇంగ్లండ్ లో అమ్మి భారీగా లాభం చేసికొన్నారు. దానితో పాటు ఇంటి అద్దెలను పెంచి సొమ్ము చేసికొన్నారు. ఇవే ఇంగ్షీషు వారు ఐర్లాండ్ ను ఆక్రమించడానికి ముఖ్య కారణాలు.

ఉత్తర ఐర్లాండ్ లో బట్టలు నేసే పరిశ్రమలు తప్ప, ఎటువంటి పరిశ్రమలు లేవు. దానివలన అనేకులు సాగుభూమి లేక నిరుద్యోగులయ్యేరు. ఇంగ్షీషు వారు వాళ్ళ దేశం నుండి ముడి సరకు తెచ్చి, వస్తువులు తయారుచేసి, వారికి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. వలసపాలనా విధానానికి ఇదే మూలం.

కొన్న కోట్లమంది ఐరిష్ రైతులు తాము పండించిన పంటను కొనుక్కొనే అంత ధనవంతులు కారు. ఎందుకంటే ధర ఇంగ్లండ్ బజార్లలో నిర్ణయింపబడినది. ఐర్లాండ్ లో ఉద్యోగాలు లేక, ఒక్క కౌలు రైతు గా తప్ప, వారికి నాలుగు ఎన్నికలు ఉన్నాయి: ఇంగ్షీషు పరిశ్రమలలో తక్కువ వేతనానికి ఉద్యోగం చేయడం, ఇంగ్షీషు సేనలో చేరడం, వలస పోవడం, లేదా పస్తులు౦డడం. చాలా మంది భూమిని కౌలుకు తీసికొని వ్యవసాయం చేసేవారు. ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటేయి. కొన్ని కోట్ల ఎకరాల భూమిని సాగుచేయక వదిలేసారు. ఎందుకంటే ఆహార దినుసుల ధరలు పడిపోవచ్చని.

అందువలన ఐరిష్ వారు పండించిన పంట సంపన్నులకే లభ్యం. పేదవారు బంగాళా దుంప లేదా బీట్రూట్ తినేవారు. వాళ్ళ కున్న భూమిలో పండించిన ఇతర పంటలను తాము అనుభవించే స్తోమత లేక, వాటిని అమ్మి తమ ఇంటి అద్దె కట్టేవారు.

నిజానికి ఐర్లాండ్ దేశస్తులకి వాళ్ళకి సరిపోయే భూమి ఉంది. కానీ కొంత భూమి బ్రిటిష్ వారికై కేటాయించబడినది. కోట్ల ఐరిష్ ప్రజలు కరవులో మరణించేరు. కాని అదే సమయంలో మాంసం, ధాన్యం ఇంగ్లండ్ కి ఎగుమతి చేయబడింది.

షా ఇదే పద్దతిని ఇంగ్షీషు వారు భారత దేశంపై ప్రయోగించేరని చెప్పేరు. ఆయన భారత దేశాన్ని బ్రిటిష్ రాణి యొక్క కిరీటంలో అతి పెద్ద వజ్రంగా వర్ణించేరు. ఐర్లాండ్ లో జరిగిన సంఘటనలు భారత దేశంలో కూడా జరిగేయి. కానీ ఇంకా పెద్ద మొత్తంలో. మూడవ ప్రపంచం అనబడే పేద దేశాలో యూరోప్ లోని దేశాలు ఇలాగే దోచుకొన్నాయి.

పాశ్చాత్యులు నేను ఒకప్పటి భారత దేశాన్ని అమెరికా తో పోలిస్తే ఆశ్చర్యపడేవారు. భారత దేశంలో ఒకప్పుడు గొప్ప సంపద, పాడి పంటలతో పొంగి పొరలే గ్రామాలు ఉండేవి. అలాగే వైద్యము, ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము, సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందినవి. వాటి మూలాన భారత దేశాన్ని పదే పదే -- సుమారు 20 సార్లు -- వివిధ జాతులవారు దాడులు చేసేరు.

1750 లో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ లో సైన్యాన్ని తయారుచేసింది. 200 ఏళ్ల పాటు భారత దేశ సంపదను బ్రిటన్ కి తరలించింది. మొదట సంపన్న పౌరులకు, ఆ తరువాత రాజ వంశానికి పంపింది. ఒక అమెరికన్ చరిత్రకారుడు "బహుశా ఎటువంటి పెట్టుబాడీ అంత భారీ ఎత్తున లాభం చూపలేదు" అన్నాడు.

పశ్చిమదేశాల పురోగతికి కారణం తూర్పున, దక్షిణాన ఉన్న వలస దేశాలు. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవ౦ తక్కినవాళ్ళ కంటే 50 ఏళ్లు ముందు జరిగింది. అలాగే వారికి కావలసిన ముడిసరుకు భారత దేశ౦ ను౦చి ఎక్కువగా వచ్చింది. ఒక వ్యంగ్య చిత్రంలో ఆవును ఇలా చూపబడినది. దాని పొదుగు నుంచి పాలు బ్రిటన్ లో పితుకుతున్నారు. దాని మూతి భారతదేశంలో గడ్డి తింటున్నాది.

భారతదేశంలో ఐర్లాండ్ పద్దతినే బ్రిటిష్ అవలంబించేరు. వారు భూమిని తమ ఆధీనంలో పెట్టుకొని, అనేక చిన్న పరిశ్రమలను ఊచకోత కోసేరు. దానివలన కొన్ని కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయి విలవిల్లాడేరు. వారు ముడి సరుకుకి, శ్రామికులికి తక్కువ ధరలు లేదా వేతనం ఇచ్చి, తలకు మించిన పన్నులు విధించి, ఇళ్ల అద్దెలు పెంచి వాళ్ళను దోచుకున్నారు.

1917 లో మహాత్మా గాంధీ ప్రారంభించిన అహింసా విప్లవం కౌలు రైతుల తరపున ఆరంభమైంది. వాళ్ళు అత్యంత పేదరికంలో, ఆర్థిక బానిసలై, ఐరిష్ లాగే బ్రతికేవారు. కానీ ఒక తేడా: బ్రిటన్ లో నివసించే వారికి ఐర్లాండ్ అంటే ఏమిటో తెలుసు. ఒక్క భూస్వాములుకు తప్ప తక్కిన వారికి భారత దేశం గురించి తెలియదు. అలాగే వాళ్ళకి భారత దేశంలో జరిగే బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, కరవు గురించి పూర్తి అవగాహనలేదు. అమెరికన్ పాత్రికేయుడు విలియం షైరర్ ఇలా వ్రాసేడు:

"చరిత్రలో మొదటి సారిగా ఒక సంస్థ (ఈస్ట్ ఇండియా కంపనీ) విశాలమైన, జనాభా ఎక్కువగా గల, దేశాన్ని ఉక్కు పాదంతో పాలించి తమ స్వంత లాభాన్ని పెంచుకొన్నది. బ్రిటిష్ వారి ప్రజ్ఞతో, సంస్థలు నెలకొల్పాలన్న ఆతృతతో, వారి జాత్యాహంకారముతో, ఆదివాసులను వివిధ వర్గాలుగా చేసి వారి మధ్యన స్పర్థలు పెంచి, అడ్డం వచ్చిన వారిని నిర్మూలించటం వలన పాలన సాగించేరు. "

వీటన్నిటికీ తగినంత ఆర్ధిక వనరులు అవసరం. దానికై పన్నులు వసూలు చేసేవారు. అలాగే బ్రిటిష్ వారి యుద్ధాలలో భారత దేశీయులను సైనికులుగా వాడుకున్నారు.

ఇంగ్షీషు చరిత్రకారులు ఎడ్వర్డ్ థామ్సన్, జి. టి. గారెట్ "బంగారమునకై కామము స్పానియర్డ్స్ లాగా బ్రిటిష్ వారిని ఆవహించింది. ముఖ్యంగా బెంగాల్ లో శాంతి లేకుండా చేసేరు" అని వ్రాసేరు. ఈ విధ౦గా బ్రిటిష్ తమ శక్తిని భారత దేశంపై చూపి, వారిని నిరుపేదలుగా మార్చేరు. ఒక తరం లోనే బెంగాల్ లో కరవు ఏర్పడి కోట్ల మంది మరణించేరు. జవహర్ నెహ్రూ ఇలా అన్నారు: బెంగాల్ చుట్టూ స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలు, అంత ధనవంతమైనవి కాక పోయినా, వాళ్ళ గ్రామాలు పంటలతో, పారిశ్రామిక ఉత్పత్తులతో క్షేమంగా ఉన్నాయి. ఆయన ఇంకా ఇలా అన్నారు: "బెంగాల్ ఒకప్పుడు అత్యంత ధనవంతమైన, వేగంగా వృద్ధిచెందుతున్న రాష్ట్రం. 187 ఏళ్ల బ్రిటిష్ పాలనలో ఇప్పుడు అక్కడ పేదరికం తాండవం చేస్తున్నది. అనేక మంది తిండిలేక మరణిస్తున్నారు." ఐర్లాండ్ లో లాగ ఇప్పటికీ బెంగాల్ లో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాము.

రాజసికుడు అంటాడు: "అయితే ఏమిటంట? ఇదంతా గత చరిత్ర. వలస పాలన అంతమయింది. " నిజంగా అది అంతమవ్వ లేదు. పేద దేశాలలోని చవకగా లభించే వనరులతో -- ముడి సరుకు, శ్రామికులను కలిపి -- సంపన్న దేశాలు వారికి, తమకు కావలిసిన వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే భూమిని తమ ఆధీనంలో పెట్టుకొని, పెట్టుబడులను ఆపి, పూర్వం బ్రిటిష్ వారు చేస్తున్నట్లే ఆగడాలు చేస్తున్నారు. బహుళ జాతీయ సంస్థలు పేద దేశాల భూమిని, శ్రామికులుని, ముడి సరుకును తమ ఆధీనంలో బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ మొదలైన యూరోపియన్ దేశాల లాగ పెట్టుకొన్నారు. ఈ పెద్ద సంస్థలు బ్రిటన్ వంటి వారి పాలన అంతమయిన తరువాత, వారి స్థానాన్ని ఆక్రమించేరు.

కొన్ని వేల టన్నుల గోధుమను ఐర్లాండ్ లోంచి తీసికెళ్లిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ సమయంలో ఐర్లాండ్ లో లాగే ఆఫ్రికా లో సహేల్ అనే ప్రదేశంలో కరవు కలిగింది. అక్కడి దృశ్యాలు దినపత్రికలలోనూ, టివిల లోనూ చూపించేరు. 1970 దశాబ్దంలో ఈ సంఘటన జరిగి అనేక వేలమంది మరణించేరు. అదే సమయంలో వేరుశెనగ, పత్తి, కూరగాయలు, మాంసం సహేల్ నుంచి ఎగుమతి ఎవుతున్నాయి. సహేల్ ఒకప్పుడు ఫ్రెంచ్ పాలించిన వలస రాజ్యం. అప్పటికీ ఇప్పటికీ తేడా ప్రభుత్వ పరంగా బహుళ జాతీయ సంస్థలు దోచుకొంటున్నాయి.

వలస రాజ్యాల స్థాపన మైత్రి గురించి కాక దోపిడీ కొరకై. వాటిలో ముఖ్యాంశం ఏమిటంటే ఒక రాజ్యంలోని వనరులు తమ స్వాధీనంలో ఉంచుకోవడం. ఇప్పుడు అలాంటి రాజ్యాలు లేక పోయినా, వాటివలన కలిగే లాభంతో సంపన్న దేశాలు సుఖాన్ని అనుభవిస్తున్నాయి. ఈ కాలంలో ఆర్థిక లేదా సైనిక వలసలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఆసురిక పళ్ల సంస్థ మధ్య అమెరికాలో వ్యాపారం చేస్తుంది. నాకు వీళ్లలో పెద్ద తేడా లేదనిపిస్తుంది. హైతీ, మెక్సికో, బాంగ్లాదేశ్ లోని రైతులు వారి పంట వారికి కాక ఇతరుల గురించి పండిస్తారు. వాళ్ళకి ఏమి పండించాలో, ఎంతకమ్మాలో ఇతరులు నిర్దేశిస్తారు.

ఆసురిక సంస్థలు కర్మ అనబడే న్యాయస్థానం ముందు ఎప్పుడోఒకప్పుడు నిలబడి జవాబు చెప్పాలి. అవి మునుపు ఎప్పుడూలేని ప్రగతి సాధించేము అని గొప్పగా తమని సమర్థించుకుంటూ జవాబులిస్తాయి. రాజసికుడు లాభాన్ని కోరే సంస్థలు లేకుంటే మానవాళి ఇప్పటికీ పొలాల్ని సాగు చేసుకుంటూ, మట్టి ఇళ్ళలో ఉండేవాళ్ళని అంటాడు. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. నేను లాభాలు లేకుండా సంస్థలు నడపమని అనటంలేదు. కాని అడ్డూ ఆపూ లేని లాభాలతో ఇతరుల కష్టాలను పట్టించుకోకుండా, పర్యావసానాల్ని తెలుసుకోకుండా, వారు మూడవవంతు మానవాళిని ధనవంతులుగా చేసి, రెండు వంతుల మానవాళిని పేదరికంలో ఉంచేరు. 271

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...