Thursday, March 10, 2022

Chapter 16 Section 11

16.11

అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః {16.16}

ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకే అశుచౌ

అజ్ఞానమోహితులై, భ్రాంతికి లోనైన చిత్తము గలవారై, కామభోగము లందు ఆసక్తి కలిగి మలిన పూరితమైన నరకము నందు పడుచున్నారు

నరకమనగా ఎక్కడో లేదు. అది మరణించిన తరువాత కొంతమంది పొందేదని అనుకోవడం అపోహ. తామసమే నరకం. సున్నితత్వములేని తామసికుడు తన జీవితాన్ని నరకం చేసికొంటాడు. తామసికుడు ఎంతో మంది దుఃఖంలో బ్రతుకున్నా పట్టించుకోడు. ఇటువంటి నిర్లక్ష్యం మన పర్యావరణ విషయంలో చూడవచ్చు. అలాగే పేదరికం, యుద్దాలు మొదలైనవి కూడా.

జూన్ 1982 లో ఇస్రాఎల్ లెబనాన్ మీద చేసిన దాడులు దారుణంగా ఉన్నాయి. వేలమంది ఇస్రాఎల్ ప్రయోగించిన అస్త్రాలతో మరణించేరు. అవి సామాన్య మనుష్యులుండే ప్రదేశాలను నాశనం చేసేయి. పాఠశాలలు, ఆసుపత్రులు నేల మట్టం అయ్యేయి.

పాత్రికేయులు అక్కడ జరిగిన దారుణాన్ని అనేక విధములుగా బాధతో వివరించేరు. అది నాకు వియత్నాం లో జరిగిన యుద్ధం వలె అనిపించింది. ఆ యుద్ధం తరువాత అమెరికాను ఒకప్పుడు నాయకునిగా ఆదరించిన పేద దేశాలు అమెరికాపై తమ నమ్మకాన్ని కోల్పోయాయి. ఆ యుద్ధంలో కోట్ల మంది వియత్నాం పౌరులు మరణించేరు. లెబనాన్ లో లాగే అనేక స్త్రీలు, పిల్లలు ప్రాణాలు వదిలేరు.

ఈ కాలంలో జరిగే యుద్ధాలలో అస్త్రాలను సైనికులపై కాక సామాన్య పౌరులు మీద ప్రయోగించి అనేక స్త్రీల, పిల్లల, వృద్ధుల మరణానికి కారణమౌతున్నాయి. సైనికులు తామసముతో నిండి, ఎవరో ఒకరిని చంపాలని చూస్తారు. ఈనాటి సాంకేతిక పురోభివృద్ధితో అనూహ్యమైన అస్త్రాలు తయారు చేయబడినవి. అస్త్రాలు పోగయినకొద్దీ వాటిని వాడాలనే అభిలాష ఎక్కువైంది.

యుద్ధం చేసేవారిలో మానవత్వం లేక ఇష్టంవచ్చినట్లు అహంకార పూరితులై వ్యవహరిస్తున్నారు. ఒక దేశం యొక్క ప్రజలు తామసముతో నిండి యుండి, భయంతో, పగ సాధించాలని, తమ కర్మల వలన ఇతరులకు కలిగే దుఃఖాన్ని నిర్లక్ష్యం చేసి విజయం కొరకై యుద్ధాలను చేస్తున్నారు.

పూర్వ కాలంలో యుద్ధం సైనికుల వరకే పరిమితం అయి ఉండేది. వారిని సేనాధిపతులు చదరంగంలోని పావులుగా కదిపి శత్రువుని తుద ముట్టించాలని చూసేవారు. ఒక వ్యూహంలో అనేకమంది సైనికులను, ఒకరి తరువాత ఒకరిని, శత్రువు వ్యూహంలోకి పంపేవారు. దానివలన శత్రువు యొక్క సైనికులు అసువులు బాసి, ఇక సైనికులు లేక యుద్ధం నుండి విరమించేవారు. ఆ సమయంలో సేనాధిపతులు గణాంకాలను లెక్క పెడుతూ, తమ వ్యూహాన్ని సమర్థించుకొనేవారు. అమెరికా సేనాధిపతులు వియత్నాం యుద్ధంలో "మనం 50 మంది సైనికులను కోల్పోయేం. కాని వందలమంది శత్రువులను, వాళ్ళ ఇళ్లను, పంటలను నాశనం చేసేం" అని హర్షాన్ని వ్యక్తం చేసేవారు. వారు వాడిన క్రిమిసంహారక మందులవలన వచ్చే తరంలోని వియత్నామీస్ ప్రాణాలు బలి అవుతాయి. అలాగే ఆ యుద్ధం శత్రువు భూమిపై జరిగింది. అమెరికన్ ప్రజలు తమ దేశంలో సుఖంగా ఉన్నారు.

అణ్వాశ్త్రములు కాని అస్త్రాలు మిక్కిలి ప్రమాదకరమైనవి గా ఉన్నాయి. వాటి ప్రయోగం యుద్ధ భూమి పైనేకాక నగరాలు, పల్లెలు మీద కూడా జరుగుతున్నది. ఈ నాటి యుద్ధాలలో శాంతి అంటే ఒక దేశ ప్రజలను బందీగా ఉంచడం. యుద్ధం అంటే వారినికూడా హతమార్చడం.

ఒకటవ ప్రపంచ యుద్ధం విష వాయువు, మర తుపాకులు (machine guns) కని పెట్టిన తరువాత జరిగింది. సేనాధిపతులు మునుపు జరిగిన యుద్ధాల వ్యూహాల్ని పన్నేరు. రాజధానిలో నిర్ణయాలు చేసి సేనాధిపతులకు తెలియ జేసే వారు. జాన్ కెన్నెత్ గాల్ బ్రైత్ దానిని "మూర్ఖత్వం" అని అన్నారు. ఆ విధంగా మూర్ఖులు నిర్ణయాలు తీసికొన్నారు. వారు ఏ నీతీ నియమములేక యుద్ధాన్ని కొనసాగించేరు.

70 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు జరిగేయి. ఈనాడు కంప్యూటర్లు, సాటిల్లైట్లు సహకారంతో యుద్ధానికి ముందే పెంటగాన్, క్రెమ్లిన్ వ్యూహాలను పన్నుతున్నారు. రష్యా ఈ అస్త్రం ప్రయోగిస్తే, అమెరికా మరొక అస్త్రం ప్రయోగిస్తుంది. వాని వలన రష్యన్ పౌరులు ఎక్కువ మరణిస్తే, ఆమెరికాదే పై చేయి. విచిత్ర మేమిటంటే కంప్యూటర్లుతో, సాటిల్లైట్ల తో మన వాతావారణం వచ్చే నెలలో ఎలా వుంటుందో చెప్పలేరు గాని వాటి సహాయంతో యుద్ధాలకు పూనుకొన్నారు.

ఒక వ్యూహంలో రష్యా తమ సేనను కదపకముందే అమెరికా, గూఢచారుల వలన తెలిసికొని, రష్యా మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. రష్యా తిరిగి సమాధానం ఇస్తుంది. దానివలన కొన్ని కోట్లమంది ఇరువైపల మరణిస్తారు. కాని అమెరికా లోని పరిశ్రమలు ఇంకా వున్నాయి. వాటిద్వారా వారు తిరిగి యుద్ధానికి కావలసిన సామాగ్రి తయారు చేసికోవచ్చు.

ఇంకో వ్యూహంలో రష్యా పావులను యూరప్ లోకి కదుపుతుంది. దానికి ప్రతీకారంగా యూరప్ చిన్నపాటి అణ్వాశ్త్రాన్ని ప్రయోగిస్తుంది. దానివలన యుద్ధం రాజుకొని కోట్లమంది జర్మనీలో మరణిస్తారు.

యుద్ధం 4 విధాలగా సాగుతుంది. మొదట రష్యా తో మామూలు అస్త్రాలతో పోరాడుతారు. అందులో రష్యాని ఓడించకలేకపోతే చిన్న చిన్న అణ్వాశ్త్రాలను ప్రధానంగా యుద్ధభూమిలో ప్రయోగిస్తారు. అప్పటికీ రష్యా ఓడకపోతే పెద్ద ఎత్తున అణ్వాశ్త్రములను ప్రయోగించి రష్యన్ సేనను, ప్రజలను నిర్మూలిస్తారు. కానీ ఈ వ్యూహం రష్యాకి తెలుసు. కాబట్టి వారు యుద్ధం మొదలయిందే తడవు పెద్ద పెద్ద అణ్వాశ్త్రాలను ప్రయోగిస్తారు.

ఈ వ్యూహాలు పాతవి. క్రొత్త పద్దతి ఏమిటంటే దేశాన్ని పూర్తిగా నిర్మూలించకుండా, కొన్ని నగరాలను మాత్రమే నాశనము చేయడం. ఒక విధంగా ఇది చిరకాలం సాగేది. రష్యా అమెరికా లోని డెట్రాయట్ నగరాన్ని ధ్వంసం చేస్తే, అమెరికా లెనిన్ గ్రాడ్ నగరాన్ని ధ్వంసం చేస్తుంది. యుద్ధం ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ పద్దతిలో ఒకే మారు సైన్యాన్నీ, అస్త్రాలనీ వాడకుండా మోతాదులో యుద్ధం కొనసాగుతుంది.

హీరోషిమా, నాగసాకిలని శాస్త్రజ్ఞులు బాగా అధ్యయనం చేసేరు. వాటి మీద జరిగిన దాడి వలన తక్కిన ఊర్లకేమీ అవ్వలేదు. మిగతా దేశమంతా క్షేమంగానే ఉంది. కాబట్టి కంప్యూటర్లలో చేసిన వ్యూహాలు లో చూపే మృతుల సంఖ్య వాటి మీద ఆధారపడి ఉంది. నిజానికి యుద్ధం జరిగితే అమెరికాలో పలు పెద్ద నగరాలను ధ్వంసం చేయడానికి రష్యన్ లు చూస్తారు. అంతకన్నా ముందు సాంకేతిక పరమైన యుద్ధం జరగవచ్చు. ఫోన్లు, టివి, రేడియొ, మొదలగు వాటిని పని చేయకుండా చేయవచ్చు. అణ్వాశ్త్రములతో కూడిన యుద్ధమైతే పలు మంది రేడియేషన్ వలన వ్యాధిగ్రస్తులై వారిని పరీక్షించడానికి వైద్యులు లేక, నానా యాతనలూ పడవచ్చు. అలాగే జన్యులు మార్పు చెంది, వచ్చే తరాన్ని నిర్వీర్యులను చేయవచ్చు.

అనేక శాస్త్రజ్ఞులు పలు వ్యూహాలను కంప్యూటర్ల సహాయంతో అధ్యయనం చేసేరు. వారి లెక్క ప్రకారం 200 కోట్ల మంది మరణించవచ్చు. ఇది వారికి అంగీకారమే. యూదులపై జరిగిన మారణహోమంలో 60 కోట్లమంది మరణించేరు. అలాగే కరవులు కొన్ని కోట్లమంది మరణానికి కారణ భూతము. వాటితో పోలిక పెడితే 200 కోట్ల సంఖ్య ఎక్కువే. అది యుద్ధం శాస్త్రజ్ఞులు ఊహించిన పద్దతిలో జరిగితే. యుద్ధం అణ్వాశ్త్రాలతో జరిగితే 1400 కోట్ల మంది మరణిస్తారని అంచనా.

ఈ విధంగా వ్యూహాలు పన్నే వారు ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నారు? మనం అణ్వాస్త్రములతో కూడిన యుద్ధమునుండి బ్రతికి బయటపడగలం అని అంటారు. ఆ "మనం" ఎవరు? వీళ్ళు క్రూరులు కాకపోయినా ఎటువంటి సున్నితత్వము లేని వారు.

లియోన్ వుల్ఫ్ మొదటి ప్రపంచం గురించి ఇలా అన్నారు:

దానివలన ఎటువంటి లాభం లేదు. అది దేన్నీ నిరూపించలేదు. దానికొక అర్థం లేదు. 85 కోట్ల మంది మరణించేరు. 2 కోట్ల మంది దెబ్బలతో బ్రతికి బయటపడ్డారు. 77 కోట్ల మంది శత్రువు చేజిక్కేరు. అందులో 10 కోట్లమంది ఆచూకీ లేదు. ఈ విధంగా ఒక్క సైన్యం లోనే 100 కోట్ల మంది మరణించేరు. ఇక సామాన్య పౌరుల గురించి చెప్పనవసరము లేదు.

వియత్నాం యుద్ధం వలన తెలిసినదేమిటంటే యుద్ధం వలన ఒరిగేదేమీ లేదు. అనేక దేశాలు నిరాయుధీకరణ సమావేశాల్లో పాల్గొన్నారు. వారు అటు శాంతి గురించి మాట్లాడుతూ ఇటు యుద్ధ వ్యూహా రచనలు చేస్తున్నారు.

కాల్విన్ కూలిడ్జ్ ఇలా అన్నారు :

"ప్రపంచం అసూయ, స్వార్థంతో కూడిన మారణహోమంతో విసుగు చెందింది. దేశాలు ముందుకు సాగడానికి నిస్వార్థత, నమ్మకం, శాంతి అవసరం. మన నైతిక విలువలను పెంచుకొని సామరస్యంతో మెలాగాలి. "

అలా అన్న 2 దశాబ్దాలలోపే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆర్నాల్డ్ టోయిన్ బీ ఇలా అన్నారు:

"పేదలు, మధ్య తరగతి, సంపన్నుల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నాది. అలాగే జాతీయత, జాత్యాహంకారం వలన అనేక క్రూర కార్యాలు నెలకొన్నాయి. ఈ యుద్ధాలు ఒకే ప్రపంచంలో మాత్రమే కాకుండా, ఒకే దేశంలో, ఒక్కొక్కప్పుడు ఒకే ఆత్మలో జరుగుతున్నాయి. "

జాకోబో టిమ్మర్ మాన్ ఇస్రాయల్ లెబనాన్ యుద్ధం తరువాత ఇలా అన్నారు: "ఇస్రాయల్ దృష్ట్యా రెండు పక్షాలా పిల్లలు మరణించలేదు. లేబనీస్ ఇల్లు ధ్వంసం కాలేదు. కానీ ఇది శూరత్వం కాదు. ఇవన్నీ ఇస్రాయల్ ప్రభుత్వం చేతకానిదని ఎవ్వరూ అనుకోనీయకుండా చేసిన పన్నాగం. కానీ ఏదైతే లెబనాన్ లో జరిగిందో, యూదులకు యూరోప్ లో అంతకు మించిన ఊచకోత కలిగింది. "

ఇది ఇస్రాయల్ గురించి మంచి అభిప్రాయం కలిగించేది. వాళ్ళు యూరోప్ లో జరిగిన యుద్ధాల వలన చాలా నష్టపోయేరు. వియత్నామ్ లో జరిగిన యుద్ధంలో నాపా౦ అనే విషముతో కప్పబడిన పిల్లలు మరణించడం, లేదా నలు దిక్కులా పరిగెత్తడం చూసేము. సానుభూతి గలవారు, తమ పిల్లలికే అదే అయితే ఏమి చేస్తామని ప్రశ్నించుకున్నారు. వారు అట్టి క్షోభను కలుగకుండా ఉండాలని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఎవరైతే అట్టి దృశ్యాలను చూసి స్పందించలేదో వారు స్వార్థంతో, క్రౌర్యంతో ఉన్నవారు.

క్రమంగా అమెరికాలో ప్రజలు కన్నులు తెరిచి తమ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలని చూసేరు. మనమందరమూ దేవుని సంతానమే అనే జ్ఞానోదయం కలిగింది. అమెరికా కొరియా మీదకి యుద్ధానికి వెళ్ళినపుడు ప్రజలు దానిని అంతం చేయాలని విప్లవం చేసేరు. ఈ విధంగా ప్రజాస్వామ్యం లో నాయకులు మొదలుపెట్టిన యుద్ధాలు, ప్రజలు పరిసమాప్తం చేయడం హర్షించవలసిన అంశం.

యుద్ధాలు దేవుడు కలిగించేవి కావు. అవి మానవుని చేతిలో యున్నది. దేవుని ప్రమేయమేమీ లేదు.

అలాగే దుఃఖము మనం తయారుచేసికొన్నదే . మిగిలిన వారి మీద దయా దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించేవారి వలన కలుగునది. మనం అట్టివారితో కలహం పెట్టుకోవడం కన్న, వారి హృదయాన్ని కదిలించి, వారి కన్నులను తెరిపించాలి.

కొంతమంది ప్రపంచ పౌరులు అణ్వాశ్త్రములతో కూడిన యుద్ధానికి వ్యతిరేకంగా విప్లవం తీసికొస్తున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయం. దశాబ్దాల తరబడి జరుగతున్న యుద్ధాలను ప్రేక్షకులిగా చూసి, వారు అవి ఇక జరగకూడదని తీర్మానించుకొన్నారు.

గాంధీ అనుచరుడు జ్ ఆర్ క్రిప్లాని గొప్ప చరిత్రకారుడు. ఆయన గాంధీ చెప్పే అహింసా పోరాటం గురించి ఆయన నోటినుండే విన్నారు. అప్పుడు క్రిప్లాని యుక్త వయస్సులో ఉన్నారు. ఆయన గాంధీ వద్దకు వెళ్ళి "గాంధీజీ మీకు చరిత్ర గురించి తెలియదు. ఎప్పుడూ ఏ దేశం అహింసతో స్వతంత్రం సంపాదించలేదు" అన్నారు. గాంధీ గారు "నీకు చరిత్ర గురించి తెలీదు. ఒకటి చరిత్రలో జరగనంత మాత్రాన భవిష్యత్తులో జరగదని గంటాపథంగా చెప్పలేము" అన్నారు. అందుకే నేననేది నేటి కాలం గాంధీదిగాని అణ్వాశ్త్రములది కాదు. 290

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...