16.13
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
{16.21}
కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేత త్త్రయ౦త్యజేత్
కామము, క్రోధము, లోభము అనునవి నరకమునకు మూడు ద్వారములై యున్నవి. ఇవి వినాశమును కలిగించును. కనుక ఈ మూడింటిని విడువవలెను
ఏతై ర్విముక్తః కౌన్తేయ తమోద్వారై స్త్రి భిర్నరః
{16.22}
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్
అర్జునా ! అజ్ఞాన ద్వారములైన ఈ మూడింటిచే విడువ బడిన నరుడు తనకు శ్రేయమును కలిగించుకొనుచు, ఆ తరువాత పరమోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు
క్రోధము అన్నిటికన్నా హీనమైన గుణము. అది ఇళ్ళలో, వీధుల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో, వివిధ జాతుల మధ్యలో, దేశాల మధ్యలో, మతముల మధ్యలో కూడా వ్యాపించి యున్నది. పుస్తకాలలో క్రోధాన్ని అనేక విధములుగా వర్ణించేరు. టివి, సినిమాలు, క్రోధాన్ని, అశ్లీల భాషని, హింసాత్మక దృశ్యాలను పలువిధాలుగా చూపించేయి.
కామము, లోభము క్రోధమునకు దారి తీయునవి. యోగి పతంజలి కామము, లోభము మధ్య పెద్ద తేడా లేదని చెప్పెను. కామమనగా రతి గురించి మాత్రమే కాదు. ఒకనికి ధనమునకై, ప్రతిష్ఠకై, పేరుప్రఖ్యాతులకై కామము ఉండవచ్చును. అదేవిధముగా లోభము కూడా. అవి స్వార్థముతో కూడినవి. మనకు రావలసినది రాకపోతే క్రోధము, మానసిక వ్యధ, ఆగ్రహము కలుగుతాయి.
ఆగ్రహము ఒక మారు వచ్చి తగ్గిపోతే పెద్ద ప్రమాదము కాదు. కానీ స్వార్థ పూరితమైన కోరిక తీరకపోతే తీవ్రమైన ఆగ్రహం పలుసార్లు వస్తుంది. అప్పుడు అది ఒక అలవలె కాక, సముద్రంలా మన చేతన మనస్సును ఆవహిస్తుంది. అది ఒకని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.
జీవితం మనకు కావలసిన ప్రతీ వస్తువుని ఇవ్వలేదు. మన మనస్సు ఒకానొక వస్తువును, అనుభవాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. దాని ఆనందం వస్తువు పొందడంలో ఉంటుంది. అలా కాకపోతే దానికి దుఃఖం కలిగి ఆ వస్తువు దక్కలేదని మదన పడుతుంది. తక్కిన వాళ్ళ కోరికాలన్నీ తీరుతున్నాయి, నాకే మోసం జరుగుతున్నాదని తలుస్తుంది
మనం ఈ భావాలను వ్యక్తపరచలేము. అచేతన మనస్సు చిన్న పిల్లవాడు వంటిది. దాని కోరికలు సదా తీరాలని కోరుకొంటుంది. దానికి శాస్త్రం అక్కరలేదు. దానికి ఒక కోరిక తీరితే: "మంచిదే ఇది తీరినది. కానీ ఇంతేనా" అని ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుకొంటుంది. ఈ విధంగా అది ఆశించే కోర్కెలు అధికమవుతాయి. అవి ఎంత పెద్దవంటే వాటిని సాధించడానికి ఒక జన్మ సరిపోదు. అందువలన ఫలితం దీర్ఘ కాల మానసిక వ్యధ.
ఈ మూడులక్షణాలతో, సంస్కారములతో ప్రతి వాని వ్యక్తిత్వము ఏకమైనది (unique). అచేతన మనస్సులో కోపాన్ని తగ్గించే మంచి ఆలోచనలూ వుండవచ్చు: ఓర్పు, వైరాగ్యం వంటివి. ఎక్కువ మందికి చేతన మనస్సు పై పొరలో కోర్కెలు తీరటంలేదన్న క్లేశం కోపాన్ని కలిగించి క్రు౦గదీస్తుంది. దాని వలన ఓర్పు తగ్గి ప్రతి చిన్న విషయానికి చికాకు పడి కోపాన్ని ప్రదర్శిస్తారు.
మనము వైరాగ్యంతో చూస్తే ప్రపంచం లైంగిక విషయాలను, డబ్బుని ఆరాధిస్తోంది. ప్రజలు వాటికై ఎగబడతారు. వారి ఆశలు తీరుస్తామని స్టాక్ మార్కెట్, మానసిక తత్త్వవేత్తలు వాగ్దానం చేస్తారు. ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పటికాలంలో పూర్వీకులకన్న ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎవరు చెప్పగలరు? నేటి ప్రజలు ఎప్పటికన్న క్రోధంతో, మానసిక వ్యధలతో, కోరికలు తీరక, సంతోషము లేక, తమ కోపాన్ని ప్రదర్శించి హింసా వాదాన్ని పెంచుతున్నారు.
డాన్టే అనే క్రిస్టియన్ "ఆశలు తీర్చుకోవడానికి , ఈ ద్వారం లో రండి" అని 3 ద్వారాలు కామ, క్రోధ, లోభములకై ఏర్పరిచాడు. మనం కోటి సార్లు ఆ ద్వారాల గుండా వెళ్ళి దుఃఖాన్ని పొందినా మన౦ మంచి ఎన్నిక చేయవచ్చు.
ఈ రోజుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన అసుర గుణాలు పోవాలంటే ఎక్కువ సహన౦, జాగరూకత అవసరం. ప్రతి ఒక్కరు దుః:ఖాన్ని కలిగించే ద్వారాలముందు నిలుచొని తమ మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో లో జూదానికై సంస్థల ప్రకటనలు రహదారి ప్రక్కన చూస్తాము. "రండి, మీ సెలవు దినాలు మాతో గడపండి. మీకు ఉచితంగా భోజనం పెడతాము. మీ పెట్రోల్ కూడా మేమే ఇస్తాము" . మనకు తెలుసు ఆ సంస్థలు 100 రెట్లు లాభం మన౦ జూదానికి ఖర్చు పెట్టిన డబ్బువలన వస్తాయని. అలాగే డాన్టే ఏర్పరిచిన ద్వారాల ముందు అనేక వ్యాపారస్తులు మనకి అరచేతిలో స్వర్గం చూపిస్తారు.
దీర్ఘ కాల పరిమితిలో (long term) ఇటువంటివి మనని అధోగతి పాలు చేస్తాయి. ప్రసార మాధ్యమాలలో నేడు లైంగిక, హింసాత్మక విషయాలు లాభానికై ప్రసారం చేస్తున్నారు.
ఈ రోజుల్లో ఒక మనిషి యొక్క గౌరవం అతని వద్ద ఉన్న ధనం మీద ఆధారపడి ఉంది. ఒక స్త్రీ ఉద్యోగం చేసి సంపాదిస్తేనే గౌరవించ బడుతుంది. ఒక ప్రదేశంలోని వాహనాల సంఖ్య మీద దాని సంపదను ఆపాదిస్తారు. అలాగే ఒక దేశ సంపదను జి ఎన్ పి (Gross National Product)--అనగా సమిష్ఠి ధనం--ద్వారా లెక్కకడతారు.
ప్రసార మాధ్యమాల లోని విశేషాలు ఇలా ఉంటాయి: సాంఘిక బంధాలను త్రెంపి వేయడం, కుటుంబంలో చిచ్చుపెట్టడం, ఆడవారిని వాడుకొని వాళ్ళ పరపతిని తగ్గించడం, చెడు వ్యసనాలను ప్రోత్సాహించడం వంటివి. వీటిలో మనము మానవ నైజంలో మిక్కిలి చేటయిన విషయాలు చూడవచ్చు.
ప్రేక్షకులు వీటికి ఎంత అలవాటు పడిపోయేరంటే, వాటి సంస్కృతిని, నైతిక విలువలను విశ్లేషణము చేసే శక్తిని పోగొట్టుకున్నారు. టివి చూస్తున్నప్పుడు అశ్లీల, విరసముకలిగించు, లేదా వికారమైన ప్రోగ్రామ్ వస్తే టివి ని ఆపు చెయ్యచ్చు లేదా ఉ౦కో చానెల్ కి మార్చవచ్చు. కాని అవి చేయక వాటినే చూస్తూ ఉంటారు.
అలాగే టివి లో ఉచితంగా బహుమతులు ఇచ్చి నటులచే వ్యంగ్య పనులు చేయిస్తారు. అలాగే వార్తలు వినోదముతో కూడినవి కాని సామాజిక స్పృహ కలిగించునవి కావు. అలాగే సీరియళ్ళు ఉంకొకరు చేయరనుకొనే నిషిద్ధ కర్మలను పాత్రలు చేసి చూపిస్తున్నారు.
వ్యక్తి యొక్క విలువ వాని ధనం మీద ఆధారపడిఉండడం ఒక ఎత్తు, వాని అందం మీద ఆధారపడిఉండడం మరొక ఎత్తు. ఆడవారిని ఆట బొమ్మలుగా వాడుకొంటున్నారు. కానీ కొందరు స్త్రీలు మగాళ్లను మి౦చి పోయేరు. అది పరిణామం దృష్ట్యా కాలాన్ని వెనక్కి తిప్పడం. పరిణామం ఎందుకంటే మనం మన శరీరం కామని, జీవితము భౌతికము మాత్రమే కాదని తెలుసుకోవడానికి. దీన్ని మనం శక్తి అంటాము. అనగా సృష్టిని చేసినది. ప్రతి స్త్రీకి అటువంటి శక్తి ఉంది. అలాగే ఆమెకి ఆధ్యాత్మికత అలవరుచుకోడానికి తగిన శక్తి ఉంది. సంఘాన్ని ప్రభావితం చేసి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే శక్తి ఉంది. ఇన్ని అంశాలు ఉండి, స్త్రీలు మగవారి వలె కామ, క్రోధ, లోభాలనే ద్వారాల వద్ద వేచిఉండడం శోచనీయం.
ధ్యానం కొన్నాళ్ళు చేస్తే మన అచేతన మనస్సులోని కామ, క్రోధ, లోభాలను గుర్తించవచ్చు. మనం అచేతనములో మెలకువగా ఉండి వాటిని నియంత్రింప వచ్చ. నిద్రలో కూడా అప్రమత్తంగా ఉండి వాటిని మన కలల్లో కూడా రాకుండా చేసికోవచ్చు. కొన్నాళ్ళకి వాట౦తట అవే ఆగిపోతాయి. ఆ స్థితిలో మనం కోపంగాని స్వార్థంగాని ప్రయత్నించినప్పటికీ చూపలేము. మన చేతన మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. 302
No comments:
Post a Comment