16.14
య శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః
{16.23}
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమ్
ఎవడు శాస్త్ర విధిని విస్మరించి, ఇష్టానుసారము కామోప భోగములకై వర్తించుచున్నాడో వాడు సిద్ధిని బడయలేడు. సుఖమును పొందలేడు. మోక్షమును పొందజాలాడు
తస్మా చ్చా స్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
{16.24}
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి
కార్యాకార్యములను నిర్ణయించుటకు నీకు శాస్త్రమే ప్రమాణము. కనుక నీవు శాస్త్రమునందు తెలుపబడిన కర్మను తెలిసికొని ఆచరింపుము ఀ
గీత ఒక శాసనము కాదు. అది మన స్వచ్ఛంద మనస్సుతో ఏమి ఎన్నుకోవాలో తెల్పే గ్రంథము.
పండితులు చేసిన అనువాదాలలో నా ఆక్షేపణ ఏమిటంటే వారు శ్రీకృష్ణుని బోధను ఎలా ఆచరణలో పెట్టాలో తెలపరు. వారు గీతా మకరందాన్ని వాడుకలో లేని భాషలో చెప్పి ఎవరికీ న్యాయం చేకూర్చలేరు. శ్రీకృష్ణుని బోధ ఎప్పటికీ అన్వయము చేసికోగలది. అది అభ్యాస సిద్ధమైనది. అతడు మన మనస్సులోని శక్తులను వివరించి అవి మన కర్మలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్తాడు. అది సమిష్టికి వర్తింప జేస్తాడు. మనం అతడు చెప్పిన మార్గములలో ఒకటి ఎన్నికచేసి తదనుగుణంగా కర్మలు చేయవచ్చు.
నేను చిన్నప్పుడు స్కౌట్ గా ఉండేవాడిని. మా ఉపాధ్యాయుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పేవారు. ఆయనని ఎందుకు ఉండాలి అని అడిగితే నాకు ఎలా తెలుసు అని తిరిగి ప్రశ్న వేసేవారు.
మేమ౦తా ఒకరోజు ఒక అరణ్యానికి వెళ్ళేము. ఆయన మాకు అనేక జాగ్రత్తలు చెప్పేరు. ఇది చేయండి, అది చేయకండి అని వివరించేరు. నేలమీద ఒక చిత్ర పటం గీసి మీరు ఈ దారిన వెళ్ళండి అని సూచించేరు.
నా మిత్రుడొకనికి సురక్షితమైన దారుల వెంట వెళ్ళడానికి ఇష్టంలేదు. వాడు ప్రమాదమును సవాలుగా తీసికొ౦టాడు. అతడు స్కౌట్ ఉపాధ్యాయుని ఉద్దేశించి "మేము నది ప్రక్క నుంచి ఈ దారిలో వెళ్దామని అనుకుంటున్నాము" అన్నాడు.
"అది క్షేమం కాదు" అని ఉపాధ్యాయుడు అన్నారు.
"ఎందుకు కాదు? ఏమవుతుంది?"
"అక్కడ పులులు ఉంటాయి. మీరు వాటి చేత తినబడితే మీ తలిదండ్రులకు నేను జవాబు ఇవ్వవలసి ఉంటుంది"
వాళ్ళు అనుకున్నట్టే నది ప్రక్కని దారిలో వెళ్ళేరు. వాళ్ళు ఏ పులిచే తినబడకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఉపాధ్యాయునిచే రక్షింపబడ్డారు.
శ్రీకృష్ణుడు ఇక్కడ స్కౌట్ ఉపాధ్యాయుని లాగ వ్యవహరిస్తున్నాడు. "ఇది ఒక మార్గం. అది వేరొకటి. ప్రతి నిమిషం నీవు నాలుగు రహదారుల కూడలి లో ఉన్నావు. ఒక రహదారి సుఖంగా ఉన్నా, క్రూరమృగాలతో నిండి ఉన్నది. ఆ రహదారి క్రమక్రమంగా భయంకరమైనదిగా మారుతుంది. చివరకు ఘోరంగా ఉంటుంది".
అర్జునుడు అడుగుతాడు: "నేను కర్మని ఇష్టపడతాను. నాకు అపాయమంటే ఇష్టం. అలాగే సవాళ్ళు. కానీ దానికొక కారణం ఉండాలి. కృష్ణా, దానికి బదులు వేరొకటి చెప్పు"
దానికి శ్రీకృష్ణుని సమాధానం "అదే నేనిప్పుడు చేయబోయేది"
క్రిందటి వేసవిలో ఒక మిత్రుడు కాలిఫోర్నియా ఎడారిలో చేసిన ప్రయాణం గురించి చెప్పేడు. వాళ్ళు వాహనంలో వెళుతూ వెళుతూ డెత్ వ్యాలీ అనే ప్రదేశానికి వచ్చేరు. అది సముద్ర మట్టం నుంచి 300 అడుగులు క్రిందనుంది. ఎండకూడా తీవ్రంగా ఉంటుంది. అక్కడ పాములు, తేళ్ళు తప్ప వేరే జీవి ఉండదు. దాన్ని దాటి 80 మైళ్ళు వెళితే మౌంట్ విట్నీ అనే పర్వతం కనిపిస్తుంది. అది అమెరికాలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం.
శ్రీకృష్ణుడు "నీవు డెత్ వ్యాలీలోనే బ్రతుకుతున్నావు" అంటాడు. క్రిందకి వెళ్ళే మార్గము ఎండిన, శుష్కించిన ప్రదేశానికి వెళుతుంది. అక్కడ అన్నీ విచ్ఛిన్నమైనట్టు కనిపిస్తాయి. కానీ మనం డెత్ వ్యాలీలోంచి సముద్ర మట్టానికి ఎక్కవచ్చు. అలా ఎక్కి మౌంట్ విట్నీ పైకి చేరవచ్చు. అప్పుడు మన ముందున్న ప్రపంచం విచ్ఛిన్నంగా కాకుండా అఖండంగా కనిపిస్తుంది. 305
No comments:
Post a Comment