17.1
అర్జున ఉవాచ
{17.1}
యే శాస్త్ర విధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయా అన్వితాః
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వ మాహో రజస్తమః
కృష్ణా! శాస్త్ర విధిని అనుసరించక, శ్రద్ధతో కూడినవారై పూజలను చేయుచున్న వారి యొక్క స్థితి సాత్త్వికామా? రాజ్యసమా? తామసమా? ఀ
శ్రద్ద అనగా "హృదయములో పొందుపరచునది". మనలో నిక్షిప్తమైన నమ్మకాలు. మన స్పందన, ఆలోచన, జీవితాలు, ప్రభావితము చేసే శక్తి. ఇంకా శ్రద్ధ అనగా మనం నమ్మే సిద్ధాంతాలు, విలువలు మొదలగునవి.
శ్శ్రద్ధ మన చైతన్యము యొక్క ప్రతిబింబము. అది భవిష్యత్తులో మనమేవిధంగా అవుతామో చెప్పే సూచిక. శ్రద్ధ జడము కాదు. అది ఒక మానసిక స్థితి. దానివలన మన కర్మ, నడవడిక, ప్రపంచాన్ని చూసే దృక్పథం నిర్ణయింపబడతాయి.
నార్మన్ కజిన్ మన నమ్మకాలు అవయవ వ్యవస్థ వలె ఉన్నవని చెప్పెను. అది శ్రద్ధ యొక్క ఒక కోణం. అతను చెప్పేది స్వస్థత లేదా చేటు కలిగించే మన ఆలోచనల గూర్చి. ఒకడు తీవ్రమైన వ్యాధితో ఉండి ప్రపంచానికి మేలు చేకూర్చేనని నమ్మితే, స్వస్థత పొందుతాడు. మరొకనికి ఏ ఆశాలేకపోతే మరణం సంభవిస్తుంది. ఇది శ్రద్ధ యొక్క శక్తి. అలాగే మనస్తత్త్వ శాస్త్రజ్ఞులు చెప్పే "తన స్వ స్వరూపం" (self image) కూడా ఒకరకమైన శ్రద్ధ. ఒకడు తాను విజయాన్ని సాధిస్తానని నమ్మి ఎటువంటి అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాడు. మరొకడు తానేమీ చేయలేనని తలచి, ఎంత గొప్పవాడైనను అపజయం పొందుతాడు.
శ్రధ్ధ అనగా ఆత్మ విశ్వాసము కాదు. అది మంచి విలువలను సున్నిత౦గా వ్యక్తము చేయుట. విలువలు అనగా ఉన్న, కావలసిన, పొందవలసిన సద్గుణాలు. మనం దేనికోసం కృషి చేస్తున్నామో మన విలువలను బట్టి ఉంటుంది. శ్రద్ధని మన కాలంతో, శక్తితో, జీవితమంతా పాటిస్తాము. శ్రద్ధ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఉపనిషత్తులు చెప్పినది:
మనం మనలోని లోతైన కోరిక
మన కోరిక వలె మన బుద్ధి
మన బుద్ధి నుంచ కర్మ
మన కర్మ వలన విధి
మనలోని లోతైన కోరికే శ్రద్ధ. సెయింట్ జాన్ "మనము ప్రేమించేది మనమవుతాము" అని చెప్పెను. ఆ "ప్రేమ" ను శ్రద్ధ అనవచ్చు. బుద్ధుడు చెప్పినట్లు: "మనము మన ఆలోచనల యొక్క ఫలితము మన ఆలోచనలతో తయారు చేయబడిన వారలము. మన జీవితాలు ఆలోచనలతో రూపొందించబడినవి." బైబిల్ కూడా "ఒకడు తన హృదయం పెట్టి ఆలోచిస్తే, అలాగే అవుతాడు" అని చెప్పెను.
ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు శాస్త్రాన్ని అనుసరించి బ్రతకవలెనని, అట్లు గాక యున్న రజస్, తమో గుణములతో దుఃఖాన్ని పొందుదురని చెప్పెను. ఇప్పుడు అర్జునుడు శాస్త్రాన్ని విస్మరించి భగవంతుని పూజించిన వారి గతి ఏమిటి; వారిది క్రిందకు పోయే మార్గమా, పైకి తీసికెళ్ళే మార్గమా; వారు ఎట్టి ఫలమును పొందుతారు, అని అడుగుతున్నాడు.
ఆ ప్రశ్నలు పురాతనమైన భాషలో అడగబడినవి. వాటిని నేటి కాలానికి వర్తింప జేస్తే ఇలాగ అర్జునడు అడుగును: "ప్రస్తుత కాలము నాగరీకత తో అభివృద్ధి అయినదని చెప్పుదురు. మా నమ్మకాన్ని సైన్స్, సాంకేతిక విజ్ఞానం మీద పెట్టి వృద్ధినొందేము. ఎందుకు మా సమస్యలు మునుపెన్నడూ లేని విధంగా ఉన్నాయి?" సైన్స్ పరిణామానికి పరీక్ష అయితే, సాంకేతిక జ్ఞానము వలన అభివృద్ధి కొలిస్తే -- అనగా శ్రద్ధని సరిగా ఉపయోగించితే -- మనము చాలా సాధించేము. అలాగే మనము ఇతరులతో శాంతితో మెలగాలి. శరీరము, మనస్సు నుండి వ్యాధులను తరిమేయాలి. హింస, యుద్ధాలు కలుగకుండా ఉండాలి. సాంకేతిక విద్య మన పూర్వీకుల బిక్ష. అది ఇప్పుడు కొరకబడకయి ఉన్నది. మనం అర్జునుని లాగ దిగ్భ్రమ చెంది: మనము సైన్స్, సాంకేతిక విద్యతో ఇంత పురోగతి సాధించేము. అయినా ప్రపంచంలో ఆకలి, ఎడబాటు, సున్నితము లేకుండుట, హింసతో కూడిన, పరిస్థితులు నెలకొని ఒకరిద్దరు వ్యక్తులు మన దేశాలన్నిటినీ చెరబట్టి, భూమండలాన్నే నాశనము చేయగల శక్తిని ఎలా పొందేరు?
ఇది సైన్స్ ని కించ పరచడం కాదు. సైన్స్ సమస్య కాదు. అది ప్రకృతిని ఆలంబనముగా చేసికొను జ్ఞానము. సమస్య శ్రద్ధ లో ఉంది. అది లాభానికై , సుఖానికై , శక్తికై ప్రకృతిని ఆట పట్టిస్తున్నాది.
వైద్యం గురించి ఒక ఉదాహరణ ఇస్తాను. అంటువ్యాధులు --పెద్ద అమ్మవారు, టైఫాయిడ్ జ్వరము, మలేరియా మొదలగునవి- వలన వేలమంది మరణించేవారు. వాటికి మందు కనుక్కొని ముందుకు సాగేం.
తరువాత వ్యాక్సీన్ వచ్చింది. కొంత మందికి సూదితో మందు పొడిపించుకోవడానికి భయపడేవారు. బ్రిటిష్ వారు మన నమ్మకస్టులిని ఆ పనికై పంపేవారు. మన తల్లిదండ్రులు మనకు ధైర్యం చెప్పేవారు. వారి ప్రోత్సాహముతో మనమందరము వ్యాక్సీన్ తీసికొని పెద్ద అమ్మవారిని వెళ్ళ గొట్టే౦.
నాగరీకత కొన్ని విషయాల్లో ఎదిగి, తక్కిన విషయాల్లో వెనుకకు వెళ్ళింది. సంపన్న దేశాల్లో పెద్ద అమ్మవారు, ప్లేగ్ వంటి వ్యాధుల వలన భయం తగ్గినా, మన జీవన శైలి వలన కలిగే వ్యాధుల భయం పట్టుకొంది.
వాటిలో ముఖ్యంగా డిజెనెరేటివ్ వ్యాధులు జీవన శైలి వలన కలిగేవి. అవి మనను వ్యష్టిగాను; దేశాలను, ప్రపంచాన్ని సమష్ఠిగాను ఆవహించి ఉన్నాయి. గుండె జబ్బు, క్యాన్సరు ఈ కోవకు చెందినవి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన జాన్ బైలార్ అనే గణాంక శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పేరు: "క్యాన్సర్ వలన మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ధూమపానము లెక్కలోకి తీసికోకపోయునా ఆ సంఖ్య పెరుగుతోంది. మనం చేసిన పురోభివృద్ధి ఎంతో లేదు"
క్యాన్సర్ మన పరిశ్రమలు విసర్జించే కాలుష్యం వలన కావచ్చును. మన గాలి, నీరు, ఆహారం పలు రకాలైన రసాయనాలతో -- లెడ్ లేదా సీసం, రేడాన్, ఆస్ బెస్టాస్ మొదలగునవి --నిండి మనకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. అలాగే మనం తయారుచేసిన కృత్రిమ రసాయనాలు -- ఎరువులు, క్రిమిసంహారక మందులు తినే ఆహారంలో; బెంజీను పెట్రోల్ లో; క్లోరోఫామ్ త్రాగే నీటిలో-- వలన క్యాన్సర్ ప్రబలుతోంది.
వీటికి తోడు ఎయిడ్స్ వ్యాధి. "20 వ శతాబ్ద ఆదిలో ట్యూబర్క్యూలోసిస్ వ్యాధి ప్రబలింది. దాన్ని నియంత్రించిన తరువాత, అది ఎయిడ్స్ వ్యాధితో ప్రబలుతోంది" అని హార్వీ ఫైన్ బర్గ్ అనే శాస్త్రవేత్త అన్నారు. అలాగే అమెరికాలోని నగరాల్లో మారక ద్రవ్యాల మూలంగా, తుపాకీలతో మారణహోమం జరుగుతున్నాది. దుర్భాషలు, కుటుంబములో తగువులు, కొట్లాటలు ఎక్కువవుతున్నాయి. వీటి మధ్యలో అణ్వాశ్త్ర యుద్ధం. ఇలాగ ప్రపంచం అతలాకుతలం అవుతోంది.
మనం చాలా పురోగమమి౦చేమని గర్వంగా చెప్పడానికి లేదు. పూర్వ కాలంలో క్యాన్సర్ ఇంత విపరీతంగా లేదు. 17 వ శతాబ్దంలో గుండె జబ్బు అతి స్వల్పమైనవారికి వచ్చేది. సైన్స్ చాలా గొప్ప విషయాలనే కనుక్కొంది . దానివలన మన దురాశల పర్యావసానము మరింత ఎక్కువై, మన ఆలోచనా క్రమము వలన మరణాలు అతి తక్కువ వయస్సులో కలిగి, ప్రపంచమంతా ఒక అంటువ్యాధిలా ఏర్పడుతున్నాయి.
శ్రీకృష్ణుడు చెప్పేది: ఒకని శ్రద్ధ వాని వ్యక్తిత్వమును తెలపుతుంది. నేను దానిని వ్యష్టికి అన్వయించి ఒక దేశం కూడా శ్రద్ధ మీద ఆధార పడిఉందని అంటాను. అలాగే మన భూగోళ మంతా. ప్రతీ యుగంలోనూ భౌతిక సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి నాగరికతలోనూ వ్యాధులున్నాయి. దీనినే యుగధర్మమంటారు. ప్రతి దానికి ఒక కర్మ ఉంది -- అనగా కాలానుసారము మన నమ్మకాలు, విలువలబట్టి జటిలమైన సమస్యలు ఉన్నాయి. వచ్చే అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ సమస్యల చిక్కుని విడదీసే మార్గం చెపుతాడు. 310
No comments:
Post a Comment