Thursday, March 10, 2022

Chapter 16 Section 3

16.3

దైవీ సంప ద్విమోక్షాయ నిబంధా యాసురీ మాతా {16.5}

మా శుచ స్స౦పదం దైవీ మభిజాతో అసి పాండవ

దైవీ సంపద మోక్షమునకు, అసూరీ సంపద బంధమునకు కారణమగు చున్నది. అర్జునా! నీవు దైవీ సంపద గలవాడవు. అందుచేత దుఃఖి౦పకుము

వినాశ కాల౦ వస్తున్నాదని చెప్పిన వ్యక్తి తనను తాను ఎవరుమీదా ఆధార పడనివాడుగా తలంచును. అతను స్వతంత్రత కాంక్షిస్తాడు. అతనికి గీత ను చదివితే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు అతడు స్వతంత్రుడు కాడని అంటాడు. "నువ్వు నీ కోర్కెలకు బానిసవు. పరిస్థితులు మారినప్పుడు నువ్వు మార్పు చెంద లేవు. నీవు చేయగలిగింది ఉన్న దాన్ని పట్టుకోవడమే." ఒక దొంగని తుపాకీతో కాల్చడమనే నిర్ణయం పరిస్థితులను బట్టి తప్పదని తీసుకోవడంకన్నా తక్కువ స్వతంత్రం ఏముంది?

మనలో అతి తక్కువమందికి స్వతంత్రం ఉంది. మన సమాధానాలు యాంత్రికం. మనం చేసే పనులలో వెసులుబాటు తక్కువ. కానీ మదర్ తెరెసా స్వతంత్రతకు ప్రతీక. ఆమెకి జీవితం ఏది ఇచ్చినా, దానిని ఇతరులకి ఇవ్వటానికి స్వతంత్రం ఉంది.

మన మానసిక స్థితి, మన కర్మలను నిర్ణయిస్తుంది. మన మిత్రుడు ఎవర్నీ తుపాకీతో కాల్చడు. అలా చెయ్యడానికి తనకు మనసొప్పదని నిజాయతీగా చెప్తాడు. అయినప్పటికీ మిగతా వారికి ఇచ్చే సలహా వేరేగా ఉంటుంది. అది అతని మానసిక స్థితి వలన. అది విత్తు వంటిది. దాని ఫలము బంధం. అనగా మన విలువలకి పర్యావసానమైనది బంధం.

1970లో అనేక దేశాలలో కరవు వచ్చింది. ఒక కాలిఫోర్నియా శాస్త్రజ్ఞుడు ట్రైయాజ్ అనే పదాన్ని వాడేడు. అది మొదటి ప్రపంచ యుద్ధం లో మొదటిసారి ప్రయోగించ బడింది. వైద్యులకు దెబ్బ తిన్న సైనికులను వేరు వేరు గుంపులగా చెయ్యవలసివచ్చింది. ఎందుకనగా ఎవరికి ముందు వైద్య సహాయం ఇవ్వాలో నిర్ణయించడానికి. ఒక గుంపు వారికి వెంటనే సహాయం చెయ్యనక్కరలేదు. రెండవ గుంపు వారికి వెంటనే సహాయం చేస్తే బ్రతుకుతారు. లేకపోతే మరణిస్తారు. మూడవ గుంపు వారు సహాయం చేసినా రేపో మాపో మరణిస్తారు. వైద్యులు నిర్ణయం ఇలా చేయాలి: "వీళ్ళకి ఎంత వైద్య సహాయం ఇచ్చినా మరణిస్తారు. దానికి మనమేమీ చేయలేం. మనం చేయగలిగిందల్లా వాళ్ళ ఏడుపు విని, వాళ్ళ కళ్ళల్లో చూడకుండా, వారికి చావు త్వరగా రావాలని ప్రార్ధించడం."

ట్రైయాజ్ ఇప్పటికీ ఆసుపత్రుల్లో వాడుతారు. 1970 లో దాని ప్రయోగం కరవు కాటకానికి వాడేరు: ఆహారాన్ని ఎంత పరిమాణంలో (ration) ఎవ్వరికి ఇవ్వాలో. కొన్ని దేశాలు కరవు నుంచి బయటకు వచ్చి అమెరికాకి రాజకీయ, ఆర్థిక, సైనిక దన్నుగా ఉంటారు. ఆ దేశాలకి ఆహారం పంపడం ఉత్తమం. కానీ కొన్ని దేశాలు, వారి అంతరంగ స్పర్థలవలన, కరవు నుంచి బయట పడలేవు. కావున వాటికి ఆహారం ఇచ్చినా లాభం లేదు.

శాస్త్రజ్ఞుడు పేదరికాన్ని తన మేధతో చూస్తాడుగాని మనిషిగా చూడలేడు. ఆయన కరవు వచ్చిన ప్రాంతాల్లో ఎక్కువ పంట వస్తుందన్న ఆశతో రైతులు భూమిమీద భారం పెంచేరని చెప్పెను. అట్టి దేశాలు "బుట్టల స్థితి" (basket case) అని చెప్పబడ్డాయి. ఇది యుద్ధానికి చెందిన పరి భాష. పూర్వ కాలం యుద్ధాలలో చేతులూ, కాళ్ళూ పోగొట్టు కొన్నవారిని బుట్టల్లో ఎత్తి మోసేవాళ్ళు. బుట్ట స్థితి లో ఉన్న దేశాలకు ఏ సహాయం చేయనక్కరలేదు అని నిర్ణయించబడింది. సంపన్న దేశాలు ప్రాణాన్నిచ్చే పడవల వంటివి. ఆ దేశాల పౌరులు పేదలు నీళ్ళలో మునిగిపోతూ ఉంటే చూస్తూ ఊరక ఉంటారు. వారిని రక్షించి పడవ మీదకు ఎక్కించుకొంటే తమ పడవ మునుగుతుందని భయం. కావున వాళ్ళు ఎంత వేర౦ చనిపోతే వాళ్ళకీ, మనకీ మంచిది అని భావిస్తారు.

ఒకడు తర్కంతో ఈ వాదనని తునాతునకలు చేయవచ్చు. అది నిజంగా తర్కంతో కూడిన వాదన కాదు. అది ఉన్నది పోతుందేమోనన్న భయం, స్వార్థంతో కూడినది. అది ఎలాగంటే: "నాకు ఏమి కావాలో అది ఉంది. నాకా అర్హత ఉంది. ఎవ్వరూ నా దగ్గర నుంచి తీసికిపోలేరు." వాళ్ళ దృక్పధం మార్చాలంటే వాళ్ళ భయాలను తొలగించాలి. వాళ్ళ దృష్టిని పేదల కష్టాల వైపు సున్నితంగా మార్చాలి.

ఫుడ్ ఫస్ట్ అనే పుస్తకంలో ఫ్రాన్ సెస్ మూర్ లాపే, జోసెఫ్ కోలిన్స్ , రోడ్ టు సర్వైవల్ అనే పుస్తకంలో ఇట్లు ఉన్నదని పేర్కొన్నారు: విలియం వోట్ అనే రచయిత ఒక అధికంగా జనాభా ఉన్న దేశం తమ పౌరులకు తగినంత ఆహారం పండించ లేక పోతున్నదని పేర్కొన్నారు. "కోట్లమంది మరణించనున్నారు. ఒక ప్రక్క జనాభా పెరుగుదల, ఉంకో ప్రక్క బంజరు భూములుగా మారుతున్న నేల. అలాటప్పుడు పెద్దలు, పిన్నలు పస్తు౦డాలి. "మనం ఇలాటి వార్తలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా గురించి విన్నాము. అవి నిజమని అనుకుంటాం. జనాభా అధికమవుతే, పరిమితమైన భూమిలో అందరికీ సరిపోయే పంట రాదని నమ్ముతాము.

విలియం వోట్ వ్రాసినది 1948 సంవత్సరములోని చైనా గురించి. అప్పటినుంచి చైనా జనాభా ఎలా ఉంది? అది 75% పెరిగింది. చైనా రెండు తరాల్లో కరవుని నిర్మూలించింది. నేను తక్కిన దేశాలు చైనాని ఆదర్శంగా తీసికోమని చెప్పటం లేదు. కాని ఏది సంభవమో చెపుతున్నాను. అలాగే గర్వంతో గూడిన అవిద్య ఎంత అపాయకరమో చెపుతుంది. అంటే ఒక దేశ౦ మారదు అని దాని పౌరులకు కరవనే మరణశాసనం విధించడం.

వోట్ కాలంలో "బుట్ట స్థితి" అన్న పదం భారత దేశానికి, చైనా కీ వర్తించేది. ఈ రోజుల్లో అది బాంగ్లాదేశ్ కి వర్తిస్తుంది. "కాని ఆ దేశం ఆహార విషయంలో తన కాళ్ళ మీద నిలబడడమే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేయగల సామర్థ్యం ఉంది" అని అమెరికా కాంగ్రెస్ కి ఒక లేఖలో వ్రాసేరు. లాపే, కోలీన్స్ ఏ దేశమూ బుట్ట స్థితిలో లేదని, ప్రతి దేశం తమ పౌరులకు ఆహారం స్వయంగా పండించగలదని అభిప్రాయపడ్డారు.

జనాభా నియంత్రణ అతి ముఖ్యం. కానీ మన సమస్యలు అధిక జనాభా వలననే అని నిర్ణయించలేము. శాస్త్రజ్ఞులు మన భూమిమీద 800 కోట్ల జనాభాకి సరిపోయే ఆహారాన్ని పండించగలమని పేర్కొన్నారు. దాని కొరకై కృత్రిమ మాంసము తయారు చేయనక్కరలేదు. వాటికి నిరోధాలు భౌతికము కాక ఆర్థికముగా ఉన్నాయి. పేద దేశాలు తమ పంటను ఎక్కువ ధరకమ్మవచ్చనే ఆశతో సంపన్న దేశాలుకు ఎగుమతి చేస్తున్నాయి. దానివలన తమ దేశ పౌరలకు కావలసిన పోషకాహారాన్ని అందించలేకపోతున్నాయి. అందుకే అవి ఆహారాన్ని దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఎగుమతుల వలన వచ్చే లాభాలు వ్యాపారవేత్తలు, మధ్యవర్తులు తన్నుకు పోతున్నారు. అందువలన పేదలు నిరుపేదలైనారు. వారు కావాలనుకొనే ఆహారాన్ని కొనలేరు. ఎందుకంటే సంపన్న దేశాలవలన వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇది కొంతమందికి లాభం చేకూర్చగా, చాలా మంది పేదరికంలోకి త్రొయ్యబడ్డారు. ఎవరైతే ఆహారం ఎక్కువ ధరకు కొనలేరో, వారు పస్తులుండవలసినదే.

ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లలో ప్రజలు పస్తులు౦డడానికి కారణం వారిని తరతరాలుగా బాహ్య శక్తులు పాలించేయి. వారి ఖనిజాలు, శ్రమ వలన వృద్ధి చెందుతున్న దేశాలు సంపన్న దేశాలుగా మారేయి. ఇందువలన 50% జనాభా పేదరికంలో బాధ పడుతూ ఉండగా, 17% జనాభా ధనికులై సుఖంగా ఉన్నారు. అమెరికా "ప్రాణ పడవ" లో అధిక ఆహార నిల్వలున్న కారణం, చుట్టూ సముద్రంలో మునిగిపోతున్నవారల శ్రమ వలన.

కొందరు "ప్రాణ పడవ" బదులు "భోగ పడవ" అనే పద సమూహాన్ని వాడాలన్నారు. దేశాలు వేర్వేరు పడవలు కావు. మన భూగోళమంతా ఒక పెద్ద పడవ. అందులో 100 మంది ఉన్నారని ఊహించుకొందాం. వారిలో 6 మంది పడవ ముందు కూర్చున్నారు. వారి దగ్గర 67 మందినే పోషించగల ఆహారం నిల్వ ఉంది. అది తక్కిన 94 మంది కికూడా చెందినది. ఈ 6 మంది తమ ఇష్టానుసారం ఆహారాన్ని వాడడం వలన, ఎవరినైతే అధికంగా ఉన్నారని తలుస్తారో వారిని సముద్రంలోకి తోసేస్తున్నారు. ప్రపంచంలోని పేదలు పడవనుంచి ఇంకా సముద్రంలోకి పడలేదు. వాళ్ళను ఆక్రమించి వాళ్ళ ఖనిజాలను, శ్రమను వాడుకుంటున్నారు. సంపన్న దేశాలలో ఉన్న మనం వాళ్ళని నీటిలోంచి పడవ మీదకి తేవాలి.

నేను ఆహారాన్ని ఉదారంగా దానం చేయమని అడగటం లేదు. ప్రతీ దేశం తమను తాము పోషించుకో గలగాలి. నేను చెప్పేది ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళని సమయానికి ఆదుకోవాలని.

రిచర్డ్ బార్నెట్ ఇలా వ్రాసేరు: "ఆకలి గుప్తంగా ఉన్న మారణ హోమం. దానిని నిరోధింపవచ్చు. కాబట్టి ఈ తరం జనాభా హిట్లర్ చేసిన మారణ హోమంకి సహకరించిన వారల లాగ ఉన్నారు." ఇది ఒక విచారకరమైన ప్రతిపాదన. చాలామంది అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులను కాపాడిందని విన్నారు. కానీ వారు పడవలలో శరణార్థులై వచ్చిన యూదులను తక్కిన దేశాలలాగ వెనక్కి పంపించేరు. ఇలాగే ఈ తరంలో మునిగిపోతున్న పడవలో ఉన్న కోట్ల మందికి సహాయం చేయకుండా దిక్కులు చూస్తున్నారు. ఐరిష్ దేశంలో కరవు వచ్చినపుడు అమెరికా కు వచ్చిన శరణార్థులను అమెరికన్ లు వెనక్కి పంపించలేదు. అలాగని వాళ్ళను ఆహ్వానించనూ లేదు. వాళ్ళని అలా రక్షింపక పోతే అమెరికా నిజంగా ఒక పేద దేశం అనబడుతుంది. అలాగే కటకట లాడుతున్న కోట్ల జనాభాని వారిపాటికి వారిని వదిలేస్తే ఈ ప్రపంచమే నిజమైన పేదలు. అమెరికాలో ఉన్నవారు కరవు రాకుండా మరింత చేయగలరు.

కొందరు శాస్త్రజ్ఞులు అధిక జనాభాని నిర్మూలించడం మంచిది కాదని తలంచేరు. కానీ గుండె మెదడుని నియంత్రించకూడదని వాళ్ళ నమ్మకం. మెదడు ఒక దేశం రాణించలేదని తలుస్తే దాని పాటు అది పడనీ అని వదిలివేయడం మంచిది అని వారు భావిస్తారు. ఇంకా ఇలా వ్రాయబడినది:

మొదట ప్రశ్న "ఎవరికి సహాయం చేయాలి?" తర్కం వాడితే ఏ దేశాలైతే మనలాంటి విలువలు పాటిస్తాయో, మనకు కావలిసిన ఖనిజాలు పొంది ఉన్నవో, యుద్దం వచ్చినప్పుడు మన పక్షంలో ఉంటాయో, వారికి సహాయం చేయాలి. (మనమనుకున్న పేదలగూర్చి ఇక్కడ ప్రస్తావన లేదు.) మనకు శత్రువులుగా మారే పిల్లలను ఎందుకు పోషించాలి? ఈ యుక్తి గడచిన రెండు దశాబ్దాలుగా వాడబడినది. కాని దురదృష్టవశాత్తూ మనలాంటివార్లలో నియంతలు ఎక్కువ వున్నారు. ప్రజాస్వామ్యం కావాలనే వారు తక్కువ. ఈ విధంగా నిజమైన పేదలను పట్టించుకోక ఆహారాన్ని ఒక ఆయుధంలాగ వాడుతున్నారు. కటకటలాడుతున్నవారల్లో సగం మంది పిల్లలున్నారు. ఇది హీనాతి హీనమైన తంత్రం. నాజీలు రష్యా కి కావలసిన ఆహారం లేకుండా చేసినట్లే, ఈ నాడు ఆహారం ఆయుధమైనది.

పేద దేశాలు మనన్ని బెదిరించవచ్చు. మనకు కావలసినది, వాళ్ళ దగ్గర ఉన్నది, ఇవ్వకుండా మనపై కృతఘ్నత చూపవచ్చు. ఉగ్రవాదం మనకు కలిగే తీవ్రమైన ముప్పు. దానికై మనం మన రక్షక భటులను ఉపయోగించాలి. వారితో మంతనాలాడడం దండుగ. మన మనుగుడ సాగాలంటే వారితో పోరాడాలి. ఇది నాగరికతకు చెల్లించవలసిన ధర. మనం పరుల యుక్తిని తెలిసికొని వారు మనమీద యుద్ధం ప్రకటించక ముందే వారిని మట్టుబెట్టాలి.

ఇక మనం అమెరికాకి పిలవక వచ్చిన ప్రతి పరదేశిని తీసికోవాలి. ఇది ఒక ఆయుధాలులేని యుద్ధం వంటిది. వాళ్ళని ఆపే ప్రయత్నం చేయకపోతే, మనం వారిలాగ నిరుపేదలమవుతాం.

ఇటువంటి వాదన మనందరికీ అపాయకరమైనది. కాలిఫోర్నియా పక్షం: "ఆసియాలోని పేద దేశాలు నశిస్తే నశించనీ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలు కటకట లాడితే అవ్వనీ" అంటుంది. వారు చాలా దూరం లో ఉన్నారు. పైపెచ్చు వారు మనలాంటి వారు కారు. రిచర్డ్ బార్నెట్ చెప్పేది "కటకటలాడే దేశాలు" అనడం తప్పు. ఆ దేశాలలోని సంపన్నులు అమెరికా లేదా ఐరోపా లోని సంపన్నుల కన్నా విలాసంగా బ్రతుకుతున్నారు. అలాగే సంపన్న దేశాలలో అనేక మంది కటకట లాడుతున్నారు. 1972 గణాంకాల ప్రకారం కోటి అమెరికన్లు పస్తు౦టున్నారు. ఆ సంఖ్య ఇప్పటికీ ఇంకా పెరిగి 7 మందిలో 1 అమెరికన్ పేదరికంలో ఉన్నారు. అమెరికాలో 20% పిల్లలు పస్తు౦టున్నారు. తక్కినవారు వృద్ధులు. వారి ఆస్తి ద్రవ్యోల్బణమువలన క్షీణిస్తోంది. వారికి ఇంటి అద్దె కట్టి, రెండు పూటలా తినడానికి డబ్బు లేదు. సంపన్న దేశాలలో ఒక కోటి పౌరులు ఆకలితో అలమటిస్తూఉంటే, ఎప్పుడో ఒకప్పుడు కొన్ని కోట్ల మంది ఆ దశ చేరుకొంటారు. అప్పుడు కాలిఫోర్నియా పక్షం ఏమని సమాధానం ఇస్తుంది? వృద్ధులు చనిపోతే ఫరవాలేదా? అ౦గ వైకల్యం ఉన్నవారు మరణిస్తే ఏమి చేస్తారు? ఇప్పటికే పరులపై ఆధారపడిన నిరుపేద కుటుంబాలకి చెందిన పిల్లలు మరణిస్తే అది సబబా? ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నేతలు తమను సమర్ధించుకోడానికి "మేము కాలిఫోర్నియా గురించి మాట్లాడటం లేదు. వేరే రాష్ట్రంలో ఏమి జరుగుతుందా అని విశ్లేషిస్తున్నాము" అని చెప్తారు. ఇదే ప్రపంచ దేశాల విషయాల్లో కూడా జరుగుతోంది.

కొన్ని నెలల క్రిందట ది డైరీ ఆఫ్ ఆనీ ఫ్రాంక్ అనే నాటకం చూసేను. ఆఖరిలో ఆనీ, ఆమె కుటుంబం, ఆమె తండ్రి మిత్రుని కుటుంబం, గుర్తుతెలియని వ్యక్తి నాజీల బారిన పడకుండా ఒక అటక మీద ఒక సంవత్సరం పైన తల దాచుకుంటారు. ఆహారం పెద్ద సమస్య అవుతుంది. అది ఆనీ కే కాదు బయట వాళ్ళకి కూడా. కొన్ని నెలల తరువాత ఆనీ ఫ్రాంక్ మిత్రుడు అందరూ పడుకున్నప్పుడు ఆహారాన్ని దొంగతనంగా తింటున్నాడని వాళ్ళకి తెలుస్తుంది. "నువ్వు పిల్లల ఆహారాన్ని దొంగిలిస్తున్నావు. నీ పిల్లలే ఆకలితో ఆర్తనాదాలు చేస్తున్నారు" అని వాడిని మందలిస్తారు. మనమున్న ఇంట్లోని పిల్లలను మన వారాలుగా తలుస్తాము. వాళ్ళ ముఖాలను చూడకపోతే, వాళ్ళ ఆకలి కేకలు వినకపోతే వాళ్ళని పట్టించుకోమా?

నేనీ మధ్య మదర్ తెరెసా గురించ వ్రాసిన వ్యాసాన్ని చదివేను. ఆమె ఉంటున్న కలకత్తాలో హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మదర్ తెరెసా ఇలా అన్నారు:

"కొన్ని వారాల క్రితం ఒక హిందూ కుటుంబం కొన్ని రోజులుగా ఆహారం లేక అలమటిస్తున్నారని విని నేను వాళ్ళని చూడడానికి ఆహారం పట్టుకొని వెళ్ళేను. ఆ తల్లి నేనిచ్చిన ఆహారాన్ని రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని ప్రక్కింటి ముస్లిం కుటుంబానికి ఇచ్చింది. నేనడిగేను మిగిలిన ఆహారం ఎన్ని భాగాలు చేయాలని. మీరు పది మంది. ఆమె సమాధానం ఈ కుటుంబంలో అందరూ పస్తులున్నారు."

నేను స్వతంత్రత గురించి మాట్లాడేను. ఈ ఇద్దరిలో ఎవరు స్వతంత్రులు: ఇలా ఇచ్చే తల్లా లేదా పుచ్చుకున్న కుటుంబమా?

ప్రపంచంలోని సంపన్న దేశాలు, చిన్న దేశాలు మధ్య నున్న సంబంధాలలో స్వతంత్రత లేక పోవడం చూస్తాం. సంపన్నమైన దేశాలు అది అవమానంగా భావించి కొన్ని సార్లు హింస సాగించి ఎవరు యజమానో నిరూపించుకుంటాయి. అమెరికా విదేశీ సంబంధాలు స్వతంత్రత మీద ఆధారపడిలేవు. అగ్ర రాజ్యమైన అమెరికాకి ఎంత స్వతంత్రత ఉందో నిక్కచ్చిగా చెప్పలేము. అమెరికా సాధారణంగా ఒక దేశం ప్రకోపిస్తే దాన్ని ప్రతిబింబింప చేస్తుంది. కొన్ని ఖనిజాల అవసరం వలన, మద్దతు కొరకై నియంతలను, క్రూరులను సమర్థించి కోట్లు నష్టపోయిన, వేలకొద్ది సైన్య౦ అసువులుబాసిన సంఘటలను చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు పెట్రోలియం కొరకై ప్రపంచానికి ఆవలనున్న చిన్న దేశంపై యుద్ధానికి వెళ్ళడ౦ చూస్తున్నాము. పెట్రోలియం ఒక్కటే కాదు, కంప్యూటర్ లకు కావలసిన అరుదైన ఖనిజాల కోసం నియంతలచే పాలింపబడే, ప్రజాస్వామ్యం లేని దేశాలతో వాళ్ళకి అనుకూలమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికా పద్దతి వినాశ కారణమే: కొను, నిల్వ చేయి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు.

స్వార్థం ఇటువంటి ప్రపంచాన్ని సృజిస్తుంది. దీని వైరస్ అందరిలోనూ ఉంది. దాన్ని నిరోధించక పోతే అహంకారం ఒక మంచి మనిషి -- లేదా దేశం యొక్క-- వ్యక్తిత్వాన్ని ఇతరులకు తీరని కష్టాలను కలిగించేదిగా చేస్తుంది. 232

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...