16.4
ద్వౌ భూత సర్గౌ లోకే అస్మి న్దైవ ఆసుర ఏవ చ
{16.6}
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు
ఈ లోకమున భూతములు జన్మములు దైవ సంబంధ మనియు, అసుర సంబంధ మనియు రెండు విధములు. పార్థా! ఇంతవరకు దైవ సంబంధమైన దానిని గూర్చి విపులముగ చెప్పితిని. ఇక అసుర సంబంధమైన దానిని గూర్చి వినుము.
నా డాక్టర్ మిత్రుడు ప్రతి రోజూ ధూమపానం చేసేవారిని పరీక్షిస్తాడు. అతను ఇలా చెప్పేడు: "శాస్త్రజ్ఞులు చెపుతున్నది ధూమపానమువలన వేలకొలది అమెరికన్ లు ప్రతి సంవత్సరము మరణిస్తారు. కానీ సామాన్యులకు గణాంకాలు అర్థం కావు. వాళ్ళకి ఆ అలవాటుని వదిలించుకోడానికి ప్రయత్నించమని సలహా ఇస్తాను. కాని వాళ్ళు సాధ్యం కాలేదని అంటారు".
"మరి ఏమి చేద్దాం?" అని అడిగేను.
"అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎవర్నీ భయపెట్టను. వాళ్ళకు ఊహా శక్తి ఉంటే, ముఖ్యంగా చిన్న వయస్సులో ఉన్నవారు అయితే, నేను వాళ్ళు పోగొట్టుకొన్న సమయాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు ఒక 30 సంవత్సరాల తరువాత ఎలా ఉంటారో ఊహించగలగాలి"
"నేను సాధారణంగా 20, 30 ఏళ్ల వయస్సున్న వాళ్లను చూస్తాను. వారు ఇంకా చలాకీగా ఉండి, కొంచెం దగ్గు తప్ప ఏ బాధా లేని వారు. వాళ్ళు కలకాలం అలాగే ఉండిపోతామని అనుకొంటారు. చిరకాలం ధూమపానం చేసే వారికి ఊపిరి ఎంత కష్టంతో తీసికోగలరో వివరిస్తాను. తగినంత ప్రాణ వాయువు లేకపోతే ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతారో చెప్తాను. వాళ్ళ ఊపిరితిత్తులు, రక్త నాళాలు ఎలా అవుతాయో చూపిస్తాను. గణాంకాలను అర్థం చేసికొనేలాగ చేస్తాను. మీకింక ఎంఫిసీమా, ఊపిరితిత్తుల వ్యాధి, స్ట్రోక్ మొదలైనవి కలుగవచ్చును" అని చెప్తాను.
మనం చెడు అలవాట్లను అలవాటుచేసికొంటే, ఒక మంచి వైద్యుడు వాటి పర్యావసానాలను గూర్చి చెప్పాలి. అతనికి శరీరం గురించి బాగా తెలుసు. అలాగే చాలా మంది వ్యాధిగ్రస్తులను పరీక్షిస్తాడు. అతను భవిష్యత్తులో ఏమవుతుందో ఖచ్చితంగా చెప్పలేడు. కానీ అతనికి శరీరంలో జరిగే కార్య-కారణ (cause-effect) సంబంధం గూర్చి బాగా తెలుసు. మనకది నమ్మ శక్యం కానిది లేదా అసాధారణ మైనదని లేదా మనకు వర్తించదని తలుస్తాం. కాని అతనికి అది ఎంత సత్యమంటే, ఒక వ్యాధిని ఆరంభ దశలో చూస్తే, దాని అంతం చెప్పగలడు.
అలాగే శ్రీకృష్ణుడు మన కాలంలో ఉన్న చిహ్నాలను, లక్షణాలను చూసి, మన౦ మన పద్దతులను మార్చుకోకపోతే ఏమి జరుగుతుందో చెప్పాలి. మనం బాగుపడడానికి ఆలస్యం కాదు. మన మానసిక స్థితి లోభం, ఎడం, క్రోధం అనే దుర్గుణాలతో కూడినది. వాటిని నిర్మూలించకపోతే అవి వినాశన౦ కలిగిస్తాయి. మనం స్వార్థపూరిత ఆలోచనలను -- అవి ఎంత సంతోషమును కలిగించినా, లేక హాని లేనివైనా -- నియంత్రించకపోతే అవి దేనికి దారి తీస్తాయో గ్రహించగలగాలి. 233
No comments:
Post a Comment