16.5
ప్రవృత్టీం చ నివృత్తి౦చ జనా న వీడురాసురాః
{16.7}
న శౌచం నాపి చా ఆచారో న సత్యం తేషు విద్యతే
అసుర స్వభావముగల మనుజులు ఇది ఉచితము, ఇది అనుచితము అని ఎరుగరు. వారి యందు శుచి ఉండదు. ఆచారము అగుపించదు. సత్యము గోచరించదు
అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్
{16.8}
అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్
వారు ప్రపంచము అసత్యమనియు, ప్రతిష్ఠలేనిదనియు, భగవంతుడు లేనిదనియు, కామము యొక్క కారణముగ స్త్రీపురుషులు పరస్పర సంబంధము వలననే కలిగినదనియు, దానికి వేరే కారణము లేదనియు చెప్పుదురు
ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మా నో అల్ప బుద్ధయః
{16.9}
ప్రభవ న్తుయుగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః
ఈ భావము నవలంబించి చెడిన మనస్సు గలవారై, అల్పబుద్దులై, క్రూరకర్ములై, లోక కంటకులగు ఈ అసురస్వభావము గలవారు ప్రపంచ నాశము కొరకై జన్మించు చుందురు ఀ
"దేవుడు లేడు, సత్యము లేదు, నీతి లేదు. జీవితానికి పరమార్థం లైంగిక ఆనందం". ఈ పదాలు నేటి ప్రపంచానికి వర్తిస్తాయి. కాని ఇవి ఆశ్చర్యకరంగా కొన్ని వేల సంవత్సరాల క్రిందట చెప్పబడినవి. మీరు ఏ పత్రిక తిరగేసినా ఈ వాదనే మరల మరల వినిపిస్తున్నాది. అది ఎట్ల౦టే జీవుల్లో ఐకమత్యం లేదు, సృష్టిలో ఒక క్రమం లేదు, మన ఇంద్రియాల స్పందన తప్పిస్తే ఏమీ లేదు అనుట. ఒక్క మాటలో: "భౌతిక౦ తప్ప వేరేది లేదు".
జి కె చెస్టర్ సన్ అనే వానితో ఎవరో ఇలా అన్నారు: "ఈనాటి సమస్య ఏమిటంటే నమ్మడానికి ఏమీ లేదు".
ఆయన సమాధానం: "సమస్య ఏమిటంటే ఏదీ నమ్మకం కలిగించేది లేదని, అన్నిటినీ నమ్ముతారు"
కనబడినదంతా నమ్మడంవలన సంఘంలో కలిగే సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఇది తమస్ యొక్క క్రియ. టివిలో లేదా ప్రముఖ పత్రికల్లో ఇది చేస్తే మీకు నచ్చుతుంది అని చెప్పడం తరువాయి ప్రజలు అందరూ చేస్తుంటే అదే చేస్తారు. దానికి ఎక్కువ శ్రమ అక్కరలేదు.
మనకి సంకేతం లేకపోతే, శ్రీకృష్ణుడు చెప్పేది, నువ్వు ఏది చేయాలో అది చేయకున్నావు, ఏది చేయకూడదో అది చేస్తున్నావు. ఏది చేయాలో చేయకూడదో చెప్పేదాన్ని వివేకమంటారు. అది జీవితంలో గొప్ప గుహ్యమైనది. నా అమ్మమ్మ ఒక సంస్కృత సామెత చెప్పేది: "అవివేకం పరం ఆపదాం పదం" . అనగా "వివేకము లేకపోవుట మిక్కిలి ఆపదలను కలిగిస్తుంది." వివేకం లేకపోతే, ఏదీ చేయకపోవడానికి కారణం లేదు. మనలో ప్రతిభావంతులు, చదువుకున్నవారు, తెలివైనవారు తమ శక్తిని, వనరులని ఎవ్వరికీ ఉపయోగంలేని --అవి హాని కలిగించేవైనా-- సంస్థలకు ధారపోస్తున్నారు.
క్రిందటి నెల నా మిత్రుడు ఒక కథనం పత్రికకు వ్రాసేడు. అది ఒక కాలేజీకి వెళుతున్న అమ్మాయి గురించి. ఆమె తన తప్పుల్ని కడిగివేయడానికి కావలసిన వస్తువులన్నీ తీసికెళ్తున్నాది: క్రెడిట్ కార్డ్ లు, ఎందుకంటే తలకు మించిన అప్పు చేయడానికి; గర్భ నియంత్రణ మాత్రలు; వలం ఎక్కకుండా ఉండడానికి మాత్రలు; మొదలైనవి. ఆర్ట్ హోప్ చెప్పినట్లు కొవ్వు పట్టకుండా మాత్రలు, రక్తంలో చెక్కెర ఎక్కువ వుండకుండా చేసే మ౦దులు, మద్యం తాగితే మరుసటి రోజు మత్తు రాకుండా చేసే మాత్రలు ఎందుకు లేవు? దేనికీ పర్యావసానము లేకుండా, ఒక్క అపరాధం తప్పిస్తే, ఉండడానికి మందులు కనిపెడుతున్నారు.
మనము సాంకేతికంగా చాలా ఎదిగేము. ఆలాగే ప్రకృతిని మన స్వాధీనంలో పెట్టుకొన్నాం. మన ఇష్టమైన కర్మలు చేసి, దానివలన కలిగే పర్యావసానములు కప్పి పుచ్చుకుంటున్నాము. దానివలన మనకి పర్యావసానములు లేవని సులభంగా నమ్మగలుగుతున్నాం. మనం ఇష్టమైన పనిచేసి, దానికి అపరాధ సొమ్ము కట్టనక్కరలేదని నమ్ముతున్నాం. ఇది ఒక వ్యక్తి బలహీనత మాత్రమే కాదు. మనం ఆ కాలేజీకి వెళ్ళే పిల్లను హేళన చేయవచ్చు. ఆమె ధర తెలిసికోకుండా క్రెడిట్ కార్డ్ లను వాడచ్చు. కానీ పర్యావరణంకి వస్తే, ప్రస్తుత సంస్థలు, వ్యవసాయం, భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఇప్పటికి కావలసిన లాభాల కోసం పనిచేస్తున్నాయి. "ఇప్పుడు కొను, తరువాత డబ్బు ఇయ్యి" అని చెప్పే సంస్థలు ఉన్నాయి.
అసుర మనస్సు వాటిని బహిరంగంగా లేకుండా చేసినా, దానికి పర్యావసానాలు ఉన్నాయి. మనం క్రెడిట్ కార్డ్ వాడి ఇప్పుడు కొనవచ్చు. కాని కొన్ని వారాలలో వాటికి డబ్బు కట్టమని బ్యాంక్ అడుగుతుంది. మొదట వడ్డీ కట్టచ్చు. చివరికి మొత్తం కట్టాలి. అలాగే గర్భ నియంత్రణ మందులు స్త్రీలకు అనేక సమస్యలు తెచ్చి పెడతాయి: హార్మోనులలో మార్పులు, ఆడవాళ్ళ సమస్యలు, గుండె ఊపిరితిత్తులకు కలిగే వ్యాధులు మొదలగునవి. రక్తంలో చక్కెరని నియంత్రించే మందులు వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది.
కానీ ఇవి భౌతికమైన సమస్యలు. సాంకేతిక విజ్ఞానంతో వాటిని దాటవచ్చు. గీత చెప్పేది మానసిక సమస్యల గురించి. వాటిని దాటడం బహు కష్టం.
మనం గర్భ నియంత్రణ మందులవలన భౌతిక పరమైన మార్పులు లేవని అనుకుందాం. నేను ఒక వ్యాసం వ్రాయ దలచుకున్నాను: మన నడవడి వలన కలిగే సమస్యలను లేకుండా చేసే మందు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ప్రతి రోజు మన ఇష్టం వచ్చినట్లు చెడు పర్యావసానము లేకుండా గడపచ్చు. మనము ఒక ఔన్స్ బరువు పెరగకుండా మనకిష్టమొచ్చినంత తిండి తినవచ్చు. మనకు కావలసినంత మద్యాన్ని ఏ సమస్యలూ లేకుండా త్రాగవచ్చు. ఇది అతిశయోక్తిగా లేదూ? గీత దాన్ని "అది దారుణమైనది" అని అంటుంది. మన భౌతిక శరీరానికి ఎటువంటి హానీ కలుగకపోయినా, మన బుద్ధిని పాడు చేస్తాయి. బహు తక్కువ మంది బుద్ధిని గురించ ఆలోచిస్తారు. ఎవరైనా ఖండించి మాట్లాడితే, మనము డీలా పడతాము, లేదా వారిపై కక్ష పెంచుకుంటాము. మన౦ వాటిని బుద్ధితో అనుసంధానం చేయము. కాని బుద్ధి అంటే: మనం చెప్పినట్లు నడిచే మనస్సు.
పై శ్లోకాలలో అంతర్లీనమై ఉన్నది: "మనము వద్దు అని దేనికీ చెప్పలేక పోతే , నిషిద్ధ కర్మలు చేస్తాం, చేయవలసిన కర్మలు చేయం". క్రమంగా కర్మలు, నిజాయితీగా, శుద్ధ మనస్సుతో, సత్యంతో చేయం.
లైంగిక కర్మను ఉదాహరణగా తీసికొందాం. ఒక అసురుడంటాడు "జీవితానికి మూలం లైంగిక కర్మ." చాలా మంది అది ఒప్పుకోరు. కానీ బ్రతకడం ఎలాగ? మన సినిమాలను, ప్రకటనలను, పాటలను, పుస్తకాలను చూస్తే మనమే విలువలను పాటిస్తున్నాం?
క్రిందటి వేసవిలో పత్రికలలో ఇద్దరు వనితలు వ్యాయామం, దాని వలన కలిగే ఆరోగ్యం గురించి వాదించుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన కారణం నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసింది. "మంచి ఆరోగ్యం అవసరమే. దానికన్నా అందంగా ఉండడం మరింత ముఖ్యం" అని ఒక వనిత అంది. అతి పెద్ద వనితల పత్రికకు సంపాదకురాలు, తనకు వ్యాయామం స్వస్థతకు అవసరమని, ఇంకా ఇలా చెప్పింది: "మనం ఎక్కువ సుఖము పొందవచ్చు. స్త్రీలు లైంగిక క్రీడాకారులుగా మారుతున్నారు. ఆరోగ్యం వారికి కావలసిన బలం ఇచ్చి లైంగిక కర్మలలో మరింత రాణించవచ్చు".
ఇది భవిష్యత్తులో సమస్యలు తెచ్చేది. మనం ఇతరులను ఆకర్షించుటకై మన దేహాన్ని మలుచుకోవచ్చు. అది అత్యంత సుఖం ఇవ్వచ్చు. కానీ మనమెంత సాఫల్యం చెందేము? మనకి వృద్ధాప్యం వస్తే బ్రతకాలని ఎంత ఆశ ఉంటుంది? గొప్ప ఆదర్శవంతులు, ఈ అవరోధాన్ని దాటలేకపోయారు. అందువలన భయాందోళనలకు గురి అయ్యేరు. ఒకమారు వృద్ధాప్యం వస్తే, వారి జీవితాలు విచారంతో కూడుకుంటాయి.
అసుర మనస్సులు ఇవి గ్రహించలేవు. వాటికి భౌతికమైనవే నచ్చుతాయి. ఇంద్రియ సుఖమే జీవిత లక్ష్యం. "నీకు నమ్మకం దేని మీదా కలుగకపోతే , నువ్వు ఇంద్రియ సుఖములను నమ్ము" అని రజస్ అంటుంది. అది లైంగిక కర్మ దివ్యమైనదని చెపుతుంది. రాజసికుడు ఇలా తలుస్తాడు: కొంచం మాత్రమే ఇంత గొప్పదైతే, ఎక్కువ ఇంకా ఎక్కువ గొప్పది కావచ్చు.
ఒక పుస్తకము అసురుల ఆర్తనాదాలకు బదులుగా లైంగిక సుఖాన్ని ఎలా పొడిగించవచ్చో ఈ విధంగా వ్రాసింది: "గణాంకాల బట్టి ఆ సుఖం 10 సెకండ్ లు ఉంటుంది. దానిని అనేక నిమిషాలు, గంట కన్నా ఎక్కువ పొడిగించుకోవచ్చు. ఇదే మానవులు భౌతికంగా అనుభవించే ఉత్కృష్టమైన ఆనందం." ఇది ఏదో చెత్త దుకాణంలో దొరికే పుస్తకం కాదు. దీన్ని పత్రికలో విశ్లేషణము చేసి, అందరినీ చదవమని ప్రోత్సాహించేరు.
ఎక్కువ మంచిదనేదానికి ఉపసిద్ధాంతం "ఏదైనా ఫరవాలేదు". ఈ రోజుల్లో ఎటువంటి నడవడికనైనా సమర్థించే పత్రికలు ఉన్నాయి. అది పత్రికలకే పరిమితం కాదు. శాస్త్రీయ పుస్తకాలలో కూడా అలాగే జరుగుతున్నాది. అప్రాకృతమైన రతిని ఒక సంపాదకుడు సమర్థిస్తూ: "ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్కరికీ ఒక దృక్పథం ఉంది" అన్నారు.
క్రిందటి సంవత్సరం క్రిస్టమస్ లో పిల్లల నుద్దేసించి కొన్ని పుస్తకాలను విడుదల చేసేరు. వాటి ధ్యేయం పిల్లలు రతి గురించి తమకున్న అపోహలను తొలగించుకోవడానికని. ఒక రచయిత డాక్టర్. మరొకరు మనస్తత్వవేత్త. వాళ్ళ వాదనలు నన్ను ఆశ్చర్యానికి గురి చేసేయి. ఒక పిల్ల వాడు అతి గారాబంగా, భద్రంగా పెరగడానికి ఈ విధంగా తోడ్పడవచ్చనని నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదు.
ఎవ్వరూ ఇటువంటి తర్కం ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తుందో చెప్పలేదు. ఎప్పుడైతే జీవితం భౌతికమనుకుంటే, దానికై ఎటువంటి తీర్పు లేదు. ఎవరూ అది మనస్సుకు హాని కలిగించేదని చెప్పలేదు. ఏ పిల్లవాడైతే రతికి సంబంధించిన జ్ఞానం పొందుతాడో, కొంత కాలం ఎదిగిన తరువాత, ఇంకా బాల్యంలో ఉండగానే, వాని ఇంద్రియాలు వాడి స్వాధీనంలో ఉండవు. ఇంకా యువకుడు కాకుండానే వాడికి సమస్యలు మొదలవుతాయి. వాని మనస్సు కోపంతో నిండి ఉంటుంది. తన మీద అతి ప్రేమ ఉండడంవలన మానసిక సమస్యలు వస్తాయి. వాడు శాశ్వతమైన బంధం కావాలంటే ఏమి చేయాలి? ప్రేమ, విశ్వాశాలను ప్రక్కన పెడితే, వానికి జీవితంలో సవాళ్ళని ఎదుర్కొనే బుద్ధి ఉండదు. అటువంటివారిని జీవితం నిరంకుశంగా శిక్షిస్తుంది. ఏ తలిదండ్రులు తమ పిల్లలికి ఇటువంటి ముప్పును కోరరు.
అందరూ "రతి లేకుండా జీవించడం వ్యర్థం" అని తలుస్తారు. ఏ వ్యక్తీ "నాకు కావాలి. నీకు అవసరంలేదు" అని స్వార్థంతో చెప్పడు. నేను పిల్లలకై రతి మీద పుస్తకాలను చూసేను. అలాగే వృద్ధులకై పుస్తకాలు ఉన్నాయి. వైద్యుల సహాయంతో ఒక పిల్లవాడు నుంచి వృద్ధుడి వరకు రతిని కొనసాగించవచ్చు అన్న కాలం వచ్చింది.
నేను తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు. వైద్య శాస్త్ర పరిభాషాలో ఇది దేనికి దారి తీస్తుందో చూడండి. ఇక్కడ ప్రాణం, అనగా మన జీవితాన్ని నడిపేది, ముఖ్యం. బాల్యంలో మనకి సుఖాలతో ప్రయోగం చేసి వాటివలన కలిగే లాభనష్టాలను తెలిసికోవాడానికి సరిపడా ప్రాణ శక్తి ఉంటుంది. మనం వాటివలన చేసిన ప్రయోగమే మరల మరల చేయకుండా, పాఠాలు నేర్చుకోవాలి. మితిమీరి ఏది చేసినా ప్రాణం వ్యర్థమౌతుంది. అందువలన పెద్దవాళ్లయినప్పుడు రతికి కావలసిన ప్రాణశక్తి వారికుండదు .
ఒక వ్యక్తి తీవ్రమైన వ్యాధినుంచి కోలుకుంటున్నాడనుకొందాం. ఆ వ్యక్తి వృద్ధుడు. వైద్యులు లైంగిక కర్మలకై హార్మోన్లు, ఇతర మందులు ఆ అలసిపోయిన వృద్ధుడికి ఇచ్చేరనుకొందాం. ఇది చకిత్సకు వ్యతిరేకం. వాని శరీరానికి ఇవ్వవలసినది విరామం, ఎందుకంటే వాని ప్రాణశక్తి వానిని స్వస్థతకి అవసరం. రతిని కోరితే వానికి ముప్పు. మనస్సు సుఖాన్ని కోరుతుంది, కానీ శరీరం బాధని అనుభవిస్తుంది.
ఒకరోజు మా ఆశ్రమంలో కొందరు పిల్లలు ఆడుకోవడం చూసేను. ఒక తల్లి "వాళ్ళు రోజంతా అలాగే ఆడుకొంటారు" అని సంతోషంగా అన్నది. అది చిన్న పిల్లలైతే పరవాలేదు. వాళ్ళ తండ్రులు వాళ్ళతో ఆడుతున్నారని ఊహించుకోండి. ఒక కంప్యూటరు ఇంజినీరు, ప్రొఫెసర్, డాక్టర్ ఒకరి బొమ్మలను మరొకరి బొమ్మలతో ఢీ కొట్టిస్తున్నారనుకొందాం. అలా చేస్తూ బొమ్మకి దెబ్బ తగిలిందని ఏడుస్తే ఎలాగ ఉంటుంది. బొమ్మలాడడానికి ఒక వయోపరిమితి ఉంది. కాబట్టి వృద్ధులు అవసాన దశలో యువకుల్లా ఉందామనుకోవడం అతి విచారకరమైన విషయం.
శరీరం మరణిస్తే అయిపోలేదు. సంస్కారములు మరొక జన్మకి తీసికెళ్లబడుతాయి. ఒక మిత్రుడు కాటికి కాళ్ళు చాపి, తన యుక్త వయస్సులో చేసిన కర్మలగురించ కలలు కంటూ "నేను ఆ అనుభవం మళ్ళీ పొందితే ఎంత బాగుండును?" అని అన్నాడు. నాకు ఇంతకన్నా విచారకరమైనది లేదనిపించింది. ఇటువంటి చివరి కోరికలు మన జీవితాన్ని క్లుప్తంగా అనుభవించేవి.
తర్కవాదులు "మీ లైంగిక సుఖం పోతే ఎందుకు బ్రతకడం? ఇంకా జీవితం మీకేమిస్తుంది?" అని అంటారు. ఒక పత్రికలో ఇలా చదివేను: ఒక గొప్ప తత్త్వ వేత్త, ఆయన భార్య, తమ వృద్ధాప్యం వలన ఎవరికీ లాభం లేదని తలచి నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసికొన్నారు. వాళ్ళు నాస్తికులు కారు. కొన్ని చర్చిలలో "పాపరహిత ఆత్మహత్య" గురించి బోధిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయేను. ఒక గొప్ప వేదాంతి ఆ వృద్ధ జంట మంచి పని చేసేరు అని తీర్మానించేడు.
వీటన్నిటికీ కారణం జీవితం భౌతికమనుకోవడం. మనం శరీరమునకే పరిమితం అని తలచడం. మీరు దానికి ఒప్పుకోకపోతే, "పాప రహిత ఆత్మ హత్య" అర్థంకాదు. వృద్ధాప్యం ఎప్పుడు వ్యర్థమంటే స్వార్థం గురించి బ్రతికితే. పరోపకారము చేస్తే ఊపిరి చివరివరకు మంచి కార్యాలను చేయవచ్చు. ఒకరు కుర్చీకే పరిమితమైనా తమకు చేరువైన వారిని ప్రభావితం చేయవచ్చు. దీనిలో విచిత్రమేమిటంటే అలా చేస్తే జీవితం మీకు ముఖ్యమైన, అవసరమైన, ప్రాణశక్తిని అందిస్తుంది. 240
No comments:
Post a Comment