Thursday, March 10, 2022

Chapter 16 Section 6

16.6

కామ మాశ్రిత్య దుష్పూరం దమ్బమానమదాన్వితా {16.10}

మోహాద్గృహీత్వా అసద్గృహా స్ప్రవర్తన్తే అశుచి వ్రతాః

వారు తృప్తి చెందని వాంఛలు కలవారై, దంభ దర్పాభిమానములతో కూడిన వారై, భ్రష్ఠ ఆచారవంతులై, దురాచారములను మోహ ప్రభావముతో ఆచరించుచుందురు

ఒక రోజు ఆర్థికశాస్త్రానికి సంబంధించిన గ్రీడ్ ఈస్ నాట్ ఇనఫ్ అనే పుస్తకాన్ని చూసేను. అది అసుర సంబంధిత మైనదని ఆ పుస్తకం పేరులోనే ఉంది. ఆసురిక సంస్థలు రజస్, తమస్ తో కూడినవి. వాని పాత్ర పట్టించుకోకపోవడం, సంకోచించటం, వాయిదా వేయటం, మనసు మార్చుకోకపోవడం, అవసరమైనప్పుడు ఏమీ చేయక పోవటం. రజస్ తను స్వతంత్రం అనుకొంటుంది. ఆత్మ జ్ఞానముంటే అది తమస్ మీద పూర్తిగా ఆధారపడినదని తెలిసికొంటుంది

తమస్ మార్పును కోరుకోదు. కాని రజస్ సమస్య ఉన్నప్పుడు వృద్ధి చెందుతుంది. పరిస్థితులు సంక్షోభంగా ఉంటే లేదా సాంకేతిక విజ్ఞానం ఎక్కువగా ఉంటే దానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు చేసికోవాలని, లాభాలు పొందాలని, అధికారాన్ని సంపాదించాలని ఉంటుంది. రాజసికుడు తను ఎన్ని అవకాశాలపై పని చేస్తున్నా, ఉంకో అవకాశంవస్తే సరే నంటాడు. వాని పద్దతి గమ్యం తెలియకపోయినా పని చేస్తూ ఉండడమే.

థోరియు "నువ్వు పనిచేస్తూఉంటే సరిపోదు. నువ్వు దేని మీద పనిచేస్తున్నావో ముఖ్యం" అని అన్నారు. నా అమ్మమ్మ ఒక సంస్కృత నీతిని చెప్పేది: "అవివేకం పరం ఆపదాం పదం." అంటే వివేకం లేకపోవడం అత్యంత ప్రమాదకరం. ఇది అతిశయోక్తి కాదు. మన చుట్టూ చూస్తే, పొంచి ఉన్న ప్రమాదాలు కుటిలత్వము వలన కాదు. అవి దేనివలనంటే తెలివైన, చదువుకున్న, మంచి ఉద్దేశ్యములున్న వ్యక్తుల వలన. వాళ్ళ గమ్యాన్ని ఎంతో వేగిర౦గా చేరాలనే ఆతృతతో ఉన్నారు. కానీ వారికి ఎక్కడికి వెళ్లాలో తెలీదు.

రాజసికునికి దానికై మంచి కారణముంది: ఆగి చుట్టూ చూస్తే మీకు నచ్చనివి కనిపించచ్చు. అలాగే ఆగి ఆలోచిస్తే, వచ్చిన అవకాశం పోవచ్చు. సమస్యలు ఎదురవుతే ఆసురిక సంస్థలు ఇలా చేస్తాయి: రజస్ వాటిని ప్రక్కకు నెట్టి ముందుకు సాగుతుంది; తమస్ వాటిని పట్టించుకోకుండా, వాటంతట అవే పోతాయని తలుస్తుంది.

ఉదాహరణకు అణు శక్తిని చూడండి. చాలా మంది దానిపై పనిచేసి, మన దేశంలో చాలా ఆవేశం కలిగించేరు. ఇది ఒక మానసిక పరిస్థితి యొక్క శక్తిని తెలిపేది. అది రజస్ కావచ్చు లేదా తమస్ కావచ్చు. వాటికి నిజాలు, పరిస్థితులు అవసరం లేదు.

1940 - 1950 సంవత్సరాలలో అణు శక్తి అత్యంత గొప్పదని అనుకొనేవారు. అది అపరిమిత శక్తిని, ప్రపంచ శాంతిని ఇవ్వగలదని అనుకొనేవారు. రాజసికుడు "మానవాళిలో మొదటిసారి సూర్యుని పై ఆధార పడకుండా శక్తిని ఉత్పన్నము చేసేము" అనుకొంటాడు. వాడు సూర్యుని అవసరం లేదని తలుస్తాడు. మనకి కూరగాయాలను నీటిలో, కృత్రిమ కాంతితో పెంచగలము. అలాగే మనం ఆహారాన్ని రసాయనాలతో చేసి, రోదశిలో ఇళ్ళు కట్టి, అక్కడి ఆహార, నీటి అవసరాలు స్వతంత్రంగా కలుగజేయవచ్ఛని రాజసికుడు తలుస్తాడు. మనము పదార్థాన్ని శక్తిగా మార్చ గలం. మనమేది చేయలేం అని ప్రశ్నిస్తాడు. ఇంకో దశాబ్ద వ్యవధిలో శక్తిని ఉచితంగా పంచి పెడతాం అంటాడు.

అణ్వాశ్త్రాలు ఒక ప్రక్క ఊహించలేనంత వినాశనాన్ని కలిగిస్తాయి, మరొక ప్రక్క ప్రపంచ శాంతికి ఉపయోగ పడతాయి అంటారు. ఇది ప్రతి రక్షకభటుని కల నిజం చేసేది. మన శత్రువు చేతిలో అణ్వాశ్త్రముంటే మనకు ముప్పు. మన చేతిలోనే ఉంటే ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతాయి.

ఇది ఎంత మంచి బేరమంటే దానిని వీడటం చాలా కష్టం. కానీ దాని పర్యావసానాలను విశ్లేషించకుండా మనం కొంటున్నాం. అణువుల శక్తిని -- మంచికైనా లేదా చెడుకైనా-- గురించి మనకు పూర్తి అవగాహన లేదు. మనకు తెలిసిందల్లా గొప్ప శక్తి అణువులనుంచి విడుదల అవుతుందని. చాలా శాస్త్రజ్ఞులు చెప్పేది అణుశక్తి విడుదల చేయడం సులభమే గాని, దానిని నియంత్రించడం అతి కష్టమని. మన సహజ వివేకం "నెమ్మదిగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్లాలో తెలిసికో౦డి" అని చెపుతుంది. ఆసురిక సంస్థలు దేనిని ప్రశ్నించక ఒక పెద్ద ఊహ వెంట వెళ్తాయి.

నా హై స్కూల్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు జడత్వం (inertia) గురించి పాఠం చెప్తూ "జడత్వం అనగా కూర్చొని ఏమీ చేయకపోవడం కాదు. ఒక కదులుతున్న వస్తువు, లేదా కదలకున్న వస్తువు, తమ స్థితిని బయట నుండి వచ్చిన శక్తివలన మార్చుకోవచ్చు". ఉదాహరణకు మద్ నారాయణ వాడిన రాతి బండను తీసికొందాం. దానికి జడత్వం చాలా ఉంది. దాని గతి మార్చడం చాలా కష్టం. దానిని ఆప గలడానికి చాలా శక్తి అవసరం.

తలంపులు అటువంటివే. నేను ఆలోచనలు పదార్థాలని అంటాను. కదులుతున్న తలంపుకు చాలా జడత్వం ఉంది. దాన్ని ఆపడం చాలా కష్టం. దాని దారి మళ్ళించడం అంతకన్నా కష్టం. అది ప్రశ్నింపబడక ముందుకు సాగుతుంది. ఇది తమస్ కున్న శక్తి.

అణుశక్తిని గురించి "మన౦ పులిని తోకతో పట్టేం" అంటాడు రాజసికుడు. "మనం దానితో ఎంత ఖర్చయినా ముందుకు సాగాలి" అంటాడు. నాకు ఆ ఖర్చులేమిటో తెలియాలి. అటువంటి పెద్ద తలంపుల వలన ఘోరమైన దుఃఖం కలిగింది.

ఇక్కడ మనం ఆసురుని మనస్సునందలి చీకటి గుహను చూస్తాం. పెద్ద అణ్వాశ్త్రము తయారు చేయకముందే తామసికులు యుద్ధం చేస్తున్నారు. ఒక పట్న౦లోని వారందిరినీ నిర్మూలించడానికి మానవత్వం లేకుండా వుండాలి. మామూలు అశ్త్రాలతోనే వారిని అనేక కష్టాలు కలిగించవచ్చు. అమెరికన్ సేనల క్షేమం కొరకై అణ్వాశ్త్రము ప్రయోగించి ఉండచ్చు. నన్ను ఆశ్చర్య పరిచేది యుద్ధం ముగిసిన తరువాత జరిగిన సంఘటనలు. ఎందుకంటే వారికి ఖాతరు లేకపోవడం ఎంతో ఉద్దేశ్యపూర్వకమైనది,

తామసికుడికి వివేకము లేదు. వాని పని స్పందించక ఉండడం. వాడు మొదట తన శత్రువులను ఖాతరు చేయడు. తరువాత తన వారలిని కూడా ఖాతరు చేయడు.

నాగసాకిపై అణ్వాశ్త్రము ప్రయోగించిన 45 రోజుల తరువాత అమెరికన్ సైనికులను అక్కడి పరిస్థితులు చూడడానికి పంపేరు. వాళ్ళకి రేడియేషన్ గురించి తెలీదు. రాజసికుడు "మేము ఎవ్వరినీ కలత పెట్ట దలచుకోలేదు. మాకు కొన్ని రోజుల తరువాత రేడియేషన్ వలన అపాయం ఉండదని నమ్మకం". (అక్కడికి వెళ్ళిన శాస్త్రజ్ఞులు మాత్రం రక్షణ కవచాలను ధరించేరు). కొన్ని వారాలు ఆ సైనికులు రేడియేషన్ కు గురై అక్కడే ఉన్నారు. అలాగే రేడియేషన్ గాలి ద్వారా చుట్టుప్రక్కల వ్యాపించింది. వాళ్ళు అక్కడ బ్రతికున్న వారి లాగానే అక్కడి ఆహారాన్ని తిన్నారు, నీళ్ళు త్రాగేరు, గాలి పీల్చేరు. కొన్ని దశాబ్దాల తరువాత వారందరూ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.

"మమ్మల్ని నాగసాకి కి వెళ్ళమన్నందుకు నా ప్రభుత్వం మీద కక్ష లేదు. మాకు చెప్పకుండా ఉండడానికి చాలా కారణాలు ఉండవచ్చు. నేను ఒక సామాన్య సైనికుడ్ని. నేను నా దేశానికై చావడానికి సిద్ధ పడిన వాడను. నాకు బాధ కలిగించే విషయమేమిటంటే -- మేమంతా వ్యాధిగ్రస్తులై మరణిస్తూ ఉంటే -- ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసికోకపోవడం." అని ఒక అమెరికన్ సైనికుడు వాబోయేడు. ప్రభుత్వ పరంగా అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెప్తున్నారు: "మొదటి 5 రోజుల తరువాత హీరోషిమా నాగసాకి లలో రేడియేషన్ వలన ఎట్టి ప్రమాదం లేదు."

ఈ సందిగ్డావాస్తకు ఒక కారణం ఉంది. ప్రభుత్వ పరంగా అణ్వాశ్త్రము ఉంది కనుక దానిని ప్రయోగించాలి. దానికి కొన్ని పర్యావసానాలు ఉన్నాయి. ఇష్టమున్నా లేకున్నా మనము అణ్వాశ్త్రాలను తయారుచేయాలి. పౌరుల్ని హెచ్చరించి వారికి అణ్వాశ్త్రముల గురించి అవగాన కల్పించాలి. అలాగే అణుశక్తిని తయారుచేయాలి. కావున ఆసురికుడు అణ్వాశ్త్రములు ఎందుకనడం వ్యర్థ ప్రయత్నమని తలుస్తాడు. మనకు తెలిసినంత మటుకు పౌరుల్ని గాబరా పెట్టడం క్షేమకరం కాదు. మనం అణ్వాశ్త్ర౦ ప్రయోగించకుండా ఉంటే శత్రువు వ్యూహం లోకి వెళ్ళినట్లే. మనము శాంతిని కోరి, యుద్ధానికి వెళ్ళేం.

అణ్వాశ్త్రాల తయారీకి వాటిని గూర్చి తెలియాలి. అందుకు అనేక పరీక్షలు చేయాలి. మైక్రోనీసియా అనే ద్వీపాన్ని దానికై వాడుకున్నారు. అది దేశానికి దూరంగా, నిర్మానుష్యంగా ఉన్నది . కొందరు ఆది మానవులు మాత్రమే ఉన్నారు. వాళ్ళను అక్కడి నుంచి ఖాళీ చేయించి 1946 లో, హీరోషిమా మీద ప్రయోగించిన సంవత్సరం తరువాత, శాంతియుతంగా ఉండి అణ్వాశ్త్రాన్ని బికినీ అనబడే ద్వీపం మీద పరీక్ష చేసేరు. ఆ తరువాత అమెరికన్ లు, ఐక్య రాజ్య సమితితో ఆ ద్వీపవాసులను అన్నివిధాలా ఆదుకొంటామని, వారి ఆరోగ్యం, వనరులు, భూమిని ఏమీ అవ్వకుండా చూసుకుంటామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 నెలల తరువాత ఎనివిటోక్ అటోల్ ను ఖాళీ చేయించి, కొన్ని పరీక్షలు చేసేరు. అలా చేసి 5 ద్వీపాల్ని ముంచేశారు.

మైక్రోనీసియా వాసులకు అది నచ్చలేదు. వారికి జాపనీస్ తో మైత్రికన్నా అమెరికన్ లతో మైత్రి ఇష్టం. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: "మాకు నమ్మకముంది; మీకు భూమి ఉంది". ఆ ద్వీపాలు అమెరికన్ సైనికులకు వలస రాజ్యం (colony). మనలో చాలామంది అటువంటి రాజ్యంలో బ్రతకలేదు. ఆ రాజ్యంలో పౌరులకు ఆస్తిపాస్తులు ఉండవు. స్వతంత్రత ఉండదు. ఆర్థిక వ్యవస్త ఆ రాజ్యాధిపతి చెప్పుచేతల్లో ఉంటుంది. అంటే మనకు కావలసిన వస్తువులు తయారుచేయలేం.

సాన్ ఫ్రాన్కిస్ కో లో మీ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎవరో వచ్చి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆల్ కట్రాజ్ కు వెళ్ళండి అన్నట్టు ఊహించుకోండి.

మీరంటారు ఆల్ కట్రాజ్ సముద్రమధ్యలో ఉన్న ఒక పెద్ద బండ రాయి. అక్కడ నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. అక్కడ ఆహార, నీటి వ్యవస్థ లేదు.

"ఏమీ ఫరవాలేదు. అక్కడ పునరావాసం చేసినవాళ్ళు ఉన్నారు. మేము మీకు ఆహారం, నీళ్ళు తెస్తాము." మనం వాళ్ళు చెప్పినట్టు చేసి ఆల్ కట్రాజ్ కు నివాసం మార్చుకొంటాం. మరుసటి రోజు మీ పాత నివాసం రేడియేషన్ తో నిండిఉంటుంది.

మిమ్మల్ని పోషించుకోవడానికి మీకు ఆల్ కట్రాజ్ మీద ఉద్యోగం ఉండాలి. అక్కడ ఉన్నవన్నీ కూలీ పనులు. అనేకమంది దానికై వేచిచూస్తుండగా, వేతనం అతి తక్కువ.

పేద దేశాల పౌరులికి ఇటువంటి నిర్లక్ష్యత గురించి తెలుసు. మనం అలాగే బ్రతికేం. అమెరికన్ పౌరులు మనపై సానుభూతి చూపేరు. వాళ్ళు గాంధీ, స్వతంత్ర పోరాటాన్ని సమర్థించేరు. మైక్రోనీసియా ప్రజలు అణ్వాశ్త్ర పరీక్షలు ఇక చేయడానికి వీలు లేదని చెప్పేరు. అలాగే అమెరికన్ సైనికులను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పేరు. వాళ్ళకి ఉన్న కోపం అమెరికన్ ప్రభుత్వముమీదనేగాని అమెరికా ప్రజల మీద కాదు. "మా పరిస్థితి తెలిసుంటే మాకు మద్దతు ఇస్తారు. మేము వాళ్ళు కోరుకున్నదే మాకూ కోరుకుంటున్నాము".

1946-1958 మధ్య కాలంలో 66 అశ్త్రాలను ప్రయోగించేరు. ఆ ద్వీప వాస్తవ్యులకు ఎటువంటి హెచ్చరిక ఇవ్వ లేదు. అలాగే వారికి రేడియేషన్ వలన కలిగే అనార్థాల గురి౦చి చెప్పలేదు. ఆ ప్రయోగాలకు సహకరించటానికి సైనికులను పంప లేదు. తామసికులు వారు ఇచ్చే ప్రసంగాలలో రేడియేషన్ గురించి పూర్తిగా వివరించలేదు. ఎందుకంటే అక్కడకు వెళ్ళిన శాస్త్రజ్ఞులు రక్షణ కవచాలను వేసికొన్నారు. కానీ సైనికులు రేడియేషన్ కి బలై పోయేరు.

శాస్త్రజ్ఞులు చేసింది సరి అయినది కాదు. తామసికులు ఇలా అంటారు: "మాకు రేడియేషన్ గురించి ఎక్కువగా తెలీదు. మేము అది ఎముకల్లోకి, రక్తంలోకి, మొత్తం శరీరంలోకి చొచ్చుకు పోతుందని ఊహించలేదు. కొందరికి కలిగిన కాన్సర్ వ్యాధి దానివలననే అని నిర్ధారించలేము. ఈ రోజుల్లో చాలామందికి కాన్సర్ అనేక ఇతర కారణాల వలన వస్తున్నాది"

పశ్చిమ అమెరికాలో వందల కొద్దీ బాంబ్ లను పరీక్ష చేసేరు. అక్కడి ప్రజల గగ్గోలుకు స్పందించ లేదు. అక్కడి వార్తలు విని నేను నమ్మలేకపోయేను. థామస్ సేఫర్ 23 ఏళ్ల వయస్సులో అమెరికన్ సైన్యములో ఉండేవాడు. 1952 లో సైనికుల్ని అణ్వాశ్త్ర ప్రయోగము చేసిన ప్రదేశానికి 4 మైళ్ళ దూరంలో ఉంచారు. కొన్ని సంవత్సరాల తరువాత 2 మైళ్ళు. క్రమంగా 900 అడుగుల దూరంలో ఉంచారు. ప్రభుత్వం చెప్పేది: "వైద్య సహాయం అవసరం లేకపోతే సైనికుడ్ని ఆపదలో ఉన్నాడనం." నిజానికి క్యాన్సర్ 20-30 ఏళ్ల తరువాత వచ్చే వ్యాధి.

సేఫర్ 2 మైళ్ళ దూరంలో హీరోషిమాలో ప్రయోగించిన దానికన్నా 3 రెట్లు శక్తివంతమైన అణ్వాశ్త్రాన్ని పరీక్ష చేయడం చూసేడు. అతనిని కళ్ళు మూసుకోమని హెచ్చరించేరు. "నా మెడ వెనుక అత్యంత ఉష్ణోగ్రత కలిగింది. నా కళ్ళు మూసుకొని ఉన్నా నా చేతి ఎముకలు xరే ఫోటో లోలాగ కనిపించేయి. సూర్యునికన్నా అనేక రెట్లు తేజస్సుతో కాంతి బయట పడింది. ఒక దుష్ట శక్తి నా శరీరాన్ని కబళిస్తున్నట్టుగా అనిపించింది. నాకైతే ప్రపంచ౦ ఇక లేదు అని అనిపించింది. మమ్మల్ని అంత దగ్గరగా ఎవరు ఉండమన్నారు?" అని సేఫర్ వాపోయేడు. తిరిగివచ్చిన సైనికుల దుమ్ముని దులిపి, స్నానం చేయమని చెప్పి, తరువాత భోజనం చేయమన్నారే తప్ప ఇంక ఏమీ చేయలేదు.

శాస్త్రజ్ఞులు మాత్రం 10 మైళ్ళ దూరంలో దళసరి అద్దంతో చేయబడ్డ భూగర్భ రక్షణ గృహం (bunker) నుండి చూసేరు.

సేఫర్ లాంటివాళ్లు ఇంకా దేశ భక్తితో అణ్వాశ్త్ర పరీక్షల్లో పాల్గొన్నారు. సుమారు 250 వేల సైనికులు, 150 వేల పౌరులు 17 సంవత్సరాల పాటు రేడియేషన్ ని అనుభవించేరు. అందులో 1200 పౌరులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పు పట్టి తమకు వైద్య సహాయం చేయమని కోరేరు. కొందరు న్యాయవాదులు వారిది గొంతెమ్మ కోర్కె అన్నారు. న్యాయాధిపతి మాత్రం వాళ్ళు చెప్పేది నిజమని నమ్మేడు.

ఆర్విల్ కెల్లీ అనే సైనికుడు 1958 లో మైక్రోనీసియాలో జరిగిన పరీక్షల వద్ద ఉన్నాడు. అతను, అతని భార్య తమలాంటి సైనికులికి సహాయం అందించాలనే ప్రయత్నించేరు. కానీ కెల్లీ 1980 లో క్యాన్సర్ తో మరణించేడు. "నేను అణ్వాశ్త్రాలతో యుద్ధం ఎప్పటికీ జరగకూడదని ఆశిస్తాను. పౌరులు సైనికులు అనుభవించిన రేడియేషన్ గురించి తెలిసుకొంటే, వారు ఐక్యమత్యంగా అణ్వాశ్త్రాలు విస్తరించకుండా ఆపగలరు." అని కెల్లీ అన్నాడు.

అణుశక్తిని గృహాలకు పంపే కరెంటు క్రింద మార్చుటకు అనేక ప్రయోగాలు చేసేరు. రాజసికులు "అది ఎన్నటికి తరగనిది. తనను తానే తయారు చేసుకొంటుంది. ఉచితంగా సరఫరా చేయబడుతుంది" అని అణుశక్తి గురించి ఆశలు కలిగించేరు. దాని వలన కలిగేది అనారోగ్యం లెక్కలేనంత నష్టం. వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం ప్రకారం అణుశక్తిని తయారుచేయడం చవక కాదు. ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు పెట్టేరు. కానీ దాన్ని భద్రంగా తయారుచేయలేకపోయేరు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పౌరులకు తీవ్ర నష్టం కలిగించింది. యురేనియం ఖనిజాన్ని త్రవ్వి బయటకు తెచ్చే వారు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆ ఖనిజం ఎక్కువగా అమెరికా లోని ఆదివాసుల భూములలో ఉన్నది. నిజానికి అమెరికా భూమి అంతా ఒకప్పుడు ఆదివాసులదే. వారు తమని చేయమనకుండా, అమెరికన్లు స్వయంగా త్రవ్వుకొంటే అభ్యంతరం లేదని చెప్పేరు. దానికై భూములను అద్దెకు ఇచ్చేరు. వారికి ఆ ఖనిజం యొక్క రేడియేషన్ గురించి తెలిస్తే అలా చేసిఉండేవారుకారు.

ఒక వైద్యుడు "ఆ ఖనిజం మనం తట్టుకోగలిగే రేడియేషన్ కన్నా 100 రెట్లు శక్తివంతమైనది" అని చెప్పేడు. ఆ త్రవ్వకాలు ఇప్పటికీ జరుగుతున్నాయి.

కోట్ల టన్నుల రేడియేషన్ తో కూడిన వ్యర్థ పదార్థాలను పౌరుల ఇళ్ల దగ్గర పడేసి ఉన్నాయి. ఒక ఆది వాసుడు "మా పూర్వీకులు వేల సంవత్సారలు ఇక్కడ నివసించేరు. ఇప్పుడిదంతా రేడియేషన్ అనే విషంతో కప్పబడింది. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ పడి ఉంటుంది" అని అన్నాడు. అది నీరు, గాలి కే పరిమితం కాదు. ఇళ్ళు కట్టే వనరులను కూడా విషపూరితం చేసింది.

మేధావంతులైన శాస్త్రజ్ఞులు, ఇంజనీర్ లు ప్రయత్నించినప్పటికీ అణు వ్యర్థాలను (nuclear waste) ఎలా వదిలించుకోవాలో మనకు తెలీదు. ఇది ఎలాగంటే పొరుగూరుకి ప్రయాణం పెట్టుకొని వెళ్ళక ఇంటి గుమ్మం దగ్గరే ఉండటం.

కొన్ని నెలల క్రిందట మా ఆశ్రమంలో పెద్ద విందు జరిగింది. చాలామంది శుభ్రం చెయ్యడానికి ముందుకు వచ్చేరు. మీరూ అందుకై వచ్చారని ఊహించండి. "మా దగ్గర చెత్తబుట్ట లేదు. మీరు దాన్ని మీ వాహనం లో పెట్టి తరువాత ఎక్కడైనా పడేయండి." అన్నామనుకోండి. మీరంటారు "కనీసం నాకు ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వండి." "మా దగ్గర దళసరి బ్యాగ్ లు లేవు. ఈ సన్నాపాటి బ్యాగ్ లో పెట్టండి. అది 2 - 3 గంటల్లో కారడం మొదలెడుతుంది, జాగ్రత్త" అన్నామనుకోండి. వాటి గురించి మాట్లాడవలసిన అవసరమేమిటి? మీరు చేయవలసినది విందు భోజనం. చెత్తని మీ వాహనంలో పెట్టి, విందుని ఆనందించండి. మీ ఇంటికెళ్ళే దారిలో చెత్త పడేసే చోటు వస్తుందేమో. అలా కాకపోతే ఇంకో 20 ఏళ్లలో అది పరివర్తన చెందుతుంది.

ఇదే అణుశక్తి వ్యర్థాలను గురించి చెపుతున్నది. మనం బంగాళా దుంప తొక్క గురి౦చి మాట్లాడుటలేదు. ప్లూటోనియం అనే పదార్థం గురించి మాట్లాడుతున్నాం. అది చాలా విషపూరితం. అది పరివర్తన చెందడానికి 25 వేల సంవత్సరాలు పడుతుంది. దాన్ని మనకేమి చేయాలో తెలీదు. మనమెంత దురాశపరులమంటే దానిని భూస్థాపితం చేసి ఇంకా క్రొత్త వస్తువులు కనిపెట్టడానికి పూనుకొన్నా౦. అలా భూమిలో ఉన్న ప్లూటోనియం మన నదుల్లోనూ, వాటి ద్వారా సముద్రాల్లోనూ చేరి మానవాళికి, సర్వ జీవులకు తీరని నష్టం కలిగిస్తుంది.

రాజసికుడు "ఇది ముందు చెయ్యి. మిగతాది తరువాత చూద్దాం. సాంకేతిక శాస్త్రం పురోగమిస్తుంది. ఒకవేళ మనం దానిపై ఏమీ చేయలేకపోతే, రోదసి లోకి పంపచ్చు" అంటాడు. ఇలాంటి వాదనలో ప్రేమ, తర్కం రెండూ లేవు. మనకి అలాంటి ఆలోచన సముద్రాలు, గాలి మీద వచ్చింది. ఇప్పుడు మనం పీల్చే గాలి, సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయని బాధ పడుతున్నాం.

మన దగ్గర అణుశక్తి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అవి పెట్టిన డ్రమ్ లలోంచి భూమిలోకి కారుతున్నాయి. దానివలన జీవుల, మన జన్యువులు మనకు తెలీకుండా మార్పులు చెందుతున్నాయి. అలాగే అవి ఉగ్రవాదుల, నియంతల చేత బడితే వారు అణ్వాశ్త్రాలను తయారుచేసి మనపై ప్రయోగిస్తారు. మనము అణుశక్తికి ఎంత అలవాటు పడ్డామంటే దాన్ని ఎక్కువగా తయారుచేసి, దాని వ్యర్థాలను రోదసి లోకి పంపవచ్చని అనుకుంటున్నాం. సముద్రాలను దాటు, గాలిలో ఎగురు, భూమిలో స్థాపితమవ్వు, కానీ కర్మను తప్పించుకోలేవు 249

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...