Thursday, March 10, 2022

Chapter 16 Section 7

16.7

చింతామపరమేయా౦ చ ప్రలయాన్తాముపాశ్రితాః {16.11}

కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాః

వారు అపరిమితమైనదియు, మృత్యువే అంతముగా గల విషయచింతను ఆశ్రయించినవారై, కామోపభోగమే ఉత్తమమని భావించుచు, అదియే పరమార్థమని నిశ్చయించుచు

అహంకారం కామము, క్రోధం, భయములతో నిండినది. అవి మనస్సులో లోతుగానుండి మనకు అనేకమైన సమస్యలను కలుగజేస్తాయి.

వీటిలో కామం, క్రోధం ఇతరులకు హాని కలిగించేవి. ఈ రోజుల్లో అవి ప్రబలంగా ఉన్నాయి.

కామం రతికే పరిమితంకాదు. అది సంతృప్తికై చేసిన ఏ కార్యమునకైనా వర్తిస్తుంది. డబ్బు గురించి కొందరికి కామం ఉంది. అలాగే సుఖాలకొరకు. రతి అన్నిటికన్నా ఎక్కువ వ్యక్తమయ్యేది. అలాగే రాజకీయ నాయకులు మొదలైనవారికి అధికారానికై చాలా కామం ఉంది.

"కొన్ని తక్కువమంది మంచి సైనికులకై వెదుకుతున్నాము" అని కామం ఎక్కువగా ఉన్నవారు ప్రకటనలు ఇస్తారు. కానీ వాళ్ళు నిజంగా ఎటువంటి వారిని సైనికులుగా చేర్చుకుంటారో ఖాతరు చెయ్యరు. ఎవడైతే స్వార్థ పరుడో, స్థిరభావుడో వాడు కూడా సైనికుడిగా చేరవచ్చు.

అలాగే కామ పూరితమైన సేనాధిపతి తనకు ఏమి కావాలో అది పొందుతాడు. వాడు ఇతరులను లెక్క చేయకుండా బ్రతుకుతాడు. చేతి మీద పచ్చ బొట్లు వేయించుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా వాహనాన్ని నడుపుతాడు. ధూమ పానం విచ్చల విడిగా చేస్తాడు. వాడు పై శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు క్రోధ పూరితుడవుతాడు. ప్రతి స్వార్థ పూరిత కోర్కెతో గుప్తంగా భయ౦ కూడా వుంటుంది. ఎందుకంటే కామం కర్మలో ఒక భాగం. అది వేరే శిక్ష కాదు. కామం నాణెం యొక్క ఒక వైపు ఉంటే, మరో వైపు భయం, క్రోధం ఉంటాయి.

భయం మనస్సును పూర్తిగా ఆవరిస్తుంది. మనం దాన్ని చేతనంతో చూడలేము. కాని మనం చేతనం లో చేసే ఆలోచనాలలో, కర్మలలో అది నిక్షిప్తమై ఉంటుంది. కార్ల్ జంగ్ అనే మానసికవేత్త "చేతనమనస్సు లోతులలో మరణం అంటే భయం ఉంటుంది. అంటే తన ఉనికి ఇక ఉండబోదు అనే వ్యధ" అని అన్నారు. ఇది --అంటే ప్రాణ భయం--అన్ని భయాలకీ మూలం. ప్రతి వ్యక్తి తనకు తెలియకుండా భయానకమైన ప్రపంచంలో ఉంటాడు అది మన క్షేమం కొరకు. మన అచేతన మనస్సులోని భయాలన్నిటినీ చేతన మనస్సులోకి తెచ్చుకుంటే మన మనుగడ సాగదు. వాటి గురించి ఎంత మరచిపోతే అంత మనకు మంచిది. మనకు కొన్ని మార్లు భయాలున్నాయని కూడా తెలియదు. ఒక అనుభవశాలికి అవి విదితమే. ఎవడైతే కోపం ఎక్కువగా ప్రదర్శిస్తాడో లేదా తన మాట నెగ్గక పోతే కఠినంగా ఉంటాడో, వాడిలో అనేకమైన భయాలు ఉన్నాయి. ప్రతి అభద్రత లేదా వ్యాకులత, గీత చెప్పినట్లు, భయం వలన కలిగేవి.

భర్తృహరి ఒక పద్యంలో ఇలా వ్రాసేడు: ఇంద్రియ లోలత్వంలో, భయం దాగి ఉంటుంది. అది భోగిని రోగిగా మారుస్తుంది. భర్తృహరి పద్యాన్ని అర్థం చేసికోవాలంటే కొంత వైరాగ్యం అవసరం. మనం అర్థం చేసికోగలిగేది భౌతికమైన పర్యావసానాలు. అది మనలో చాలా మందికి నచ్చదు: నువ్వు ఇటువంటి సుఖాలకు బానిసవైతే, నీకు ఇటువంటి శిక్ష పడుతుంది. ఈ రోజుల్లో శిక్షగురించి ఎవరికీ ఖాతరు లేదు. శాస్త్రజ్ఞులు ఇంద్రియ సుఖాలవలన భౌతిక శిక్ష పడకూడదని ప్రయోగాలు చేస్తున్నారు.

ఇది అందరికీ తెలుసు: ఎక్కువ తింటే వలం అవుతాం. ఆహారం తయారుచేసే సంస్థల యజమానులకూ తెలుసు వలం ఎక్కువవుతే ఆరోగ్యానికి హాని అని. కొవ్వు వలన గుండె నొప్పి, రక్తపు పోటు, మధుమ్లేహం మొదలైనవి కలుగుతాయి. ధూమ పానం చేస్తే ఆ వ్యాధులు ముదురుతాయి. ఇదంతా శాస్త్రజ్ఞులు మనకు రోజూ చెప్తారు.

ఇది తెలిసినవారికి అతిగా తింటే రోగం వస్తుందని భయంతో ఉంటారు. ఎంతో రుచికరమైన వస్తువు తింటున్నంత సేపూ స్వగతంలో "ఇది నాకు చేటు" అనుకుంటారు. మనం ఈ రోజుల్లో మన స్వగతాన్ని పట్టించుకోవటంలేదు. "నాకేమీ లెక్క లేదు. నేను అంత వలంగా లేను. నేను ఎక్కువ తింటే ఏమీ అవ్వదు" అనుకుంటాం. గీత చెప్పేది: చేతనపు పొరల క్రింద మరొక భయమనే విత్తుని నాటేం. కొంత ఎక్కువ బరువు శరీరానికి, భవిష్యత్తులో రాబోయే రోగాలికీ ఇచ్చేమని భయపడతాం.

ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలు మన ఆరోగ్యానికి హానికరం. నేను ఆ వ్యసనాలున్నవారిని పరిహసించను. ఎందుకంటే వాటికి అతి సులభంగా బానిసలవుతాం. పాఠశాలలకు వెళ్ళే బాలలు ఈ వ్యసనాలకు గురి అవుతున్నారు. కొందరు ఈ వ్యసనాలవలన భవిష్యత్తులో ముప్పని తలచరు. వాళ్ళకి ఖాతరు లేదు. ఎక్కువమందికి జీవితంలో గమ్యం లేదు. వాళ్ళు యువకులు కాబట్టి ప్రయోగాలు చెయ్యడానికి వెనుకాడరు. క్యాన్సర్, ఎంఫిసీమ మొదలైన వ్యాధులు ఎప్పుడో ముసలితనంలో వస్తాయని భ్రమ పడతారు. నాకు ధూమపానం చేసేవాళ్ళు నిజాయితీగా తమకు భయము౦దని చెప్పేరు.

ఇటువంటి భయం వలన ఒక ఉపయోగం ఉంది. అది మనని అతిగా చెడు అలవాట్లకు బానిసగా చేయదు. మనకు ప్రాణం వృధా అవుతున్నాదన్న భయం ఉంటుంది. కాబట్టి మనమేమి చేయాలి? మన ప్రాణం నష్టం అవ్వకూడదంటే, కొంచెం భయముండాలి. ఆ భయముతో పట్టుదల, ఋజుత్వం కలపాలి. క్యాన్సర్ గురించి భయము లేనివాడు పెద్ద వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు. ఒట్టి మూర్ఖుడు.

మనం మనకి కలిగే ముప్పులని మంచివని తలచము. మనము భోగాలనుభవిస్తూ, ఒక లక్ష్మణ రేఖను దాటితే వాటితో రోగాలు వస్తాయి. రాజసికులు "దానిని దాటే ఉపాయమాలోచించు" అంటారు. మానవాళి ఇలా వేల సంవత్సరాలనుంచి ఉంది. రోమనులు జీర్ణకోశంకి పట్టే దానికన్నా, ఎక్కువ తిండి తినగలిగే స్తోమతను సంపాదించేరు. కాని ఈనాటి సాంకేతిక శాస్త్రం వారిని మించి ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యం ఇచ్చింది.

ఎన్నో సంస్థలు ఈ భావాలతో స్థాపించబడ్డాయి. వాళ్ళు చెప్పేది: "ఏ సుఖాన్నైనా శాశ్వతంగా అనుభవించవచ్చు. ప్రతికూల పరిస్థితులు తటస్థి౦చవచ్చు. అవి భౌతికమైనవి కాబట్టి, ఎలాగైతే వ్యాధిని నివారించవచ్చో , వాటినీ నియంత్రించవచ్చు. మనం కనుక్కోవలసినది ఒక రసాయనము లేదా సాధనము." నేను అమెరికాకు వచ్చినపుడు ఇటువంటి భావాలు అన్ని వైపులనించీ చూసేను. సాంకేతిక జ్ఞానము నా కన్నులను తెరిపించింది. కడుపునొప్పి లేదా కడుపులో మంట అనిపిస్తే ఈ మాత్రలు వేసుకోండి. గర్భ నియంత్రణ మాత్రలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టమైన వారితో తిరగచ్చు. మీకు ఇంకా సుఖం కావాలంటే క్రొత్త ముఖ౦ తయారుచేసుకోండి (plastic surgery). ఆసురిక సంస్థలు చెప్పేది: "మీ ప్రతి భయానికి, మా వద్ద మందు ఉంది."

ఆసురిక సంస్థలకు కూడా సమస్యలు ఉన్నాయి. మాత్రలు వలం అవ్వకుండా ఆపలేవు. అందంగా ఉండాలని శస్త్ర చికిత్స చేసుకొనేవారికి మరల మరల చికిత్స చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వైద్యుడు చేసే తప్పులను ఇంకొకడు సరి చేయాలి. గర్భ నిరోధక మాత్రలు 5 కోట్లమంది వాడుతున్నారు. వాటి వలన రక్త సంబంధిత వ్యాదులు, ఎక్కువ గుండె పోటు కలుగుతున్నాయి. గీత అడిగేది: పర్యావసానాలను ఎలా తప్పించు కొంటావు? అది ఎప్పడికీ సాధ్యం కాదు. ఒక పర్యావసానాన్ని తప్పించుకుంటే ఉంకొకటి వస్తుంది. ఆ రెండిటినీ నిరోధిస్తే మూడోది తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడా కర్మ నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే క్రియ, దాని పర్యావసానము రెండూ ఒక్కటే.

ఒకడు నూతన గర్భ నిరోధక మాత్ర తయారుచేస్తే ప్రపంచం దాని వైపు మొగ్గుతుంది. శాస్త్రజ్ఞులు క్రొత్తవి కనిపెడుతూ ఉన్నంత కాలం మన భయం తొలగుతుంది. పిండి (carbohydrate) వస్తువులు తింటే వలం అవుతామని మందులు వాడుతున్నారు. అలాచేసి వాళ్ళ ఇష్టం వచ్చినంత పిండి పదార్థాలను తింటున్నారు. చెడు పర్యావసానము లేని గర్భ నిరోధక మాత్ర గురించి ఇంకా అన్వేషణ చేస్తున్నారు. ప్రస్తుతము రసాయనిక లేదా యంత్ర సహాయంతో చేసినవాటికి సమస్యలున్నాయి. శాస్త్రజ్ఞులు తమ అన్వేషణను అంకిత భావంతో, ఐకమత్యంతో చేస్తున్నారు. ఆడవారూ, మగవారూ, కమ్యూనిస్ట్ లు, క్యాపిటలిస్ట్ లు దానికై ఎదురు చూస్తున్నారు. వారు అన్వేషణకై వెచ్చించిన శక్తి ప్రపంచ శాంతికై ఉపయోగిస్తే మనకి కొన్ని దశాబ్దాలలోనే పూర్తి శాంతి కలుగుతుంది.

నాకు మా పిల్లలు సముద్రపు ఒడ్డున చేసిన ఆట గుర్తుకు వస్తున్నాది. వాళ్ళు ఒక నది లాగ కాలువని త్రవ్వి దానికడ్డుగా ఆనకట్టలా కట్టేరు. మొదట నీరు ఆనకట్ట క్రింద నుంచి వెళ్ళేది. దాన్ని అరికట్టితే, నీరు పక్కనుంచి పోయేది. దాన్నీ అరికట్టితే నీరు మీదనుంచి వెళ్ళేది.

కర్మసిద్ధాంతం కూడా ఇలాగే పనిచేస్తుంది. ఒక దారి మూస్తే, ఉంకో దారి తెరుస్తుంది. ఇది నీతి కాదు. ఇది కార్య-కారణ సంబంధం.

రాజసికుడు పర్యావసానాలను ఇలాగే ఎదుర్కొంటాడు. అక్కరలేనివి వస్తే వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చోట నిరోధిస్తే సమస్య ఉంకో చోట వస్తుంది. దాన్నీ నిరోధిస్తే మూడవ చోట వస్తుంది. వానికి ఆనకట్ట ఎటువంటి సమస్యలు లేకుండా కట్ట లేమని చెప్తే మనల్ని మూర్ఖులుగా, నిర్లక్ష్యం కలవారిగా, అధర్మము పాటించే వారలలాగ చూస్తాడు. అలాగ సమస్యలులేని మందులు గురించి అన్వేషణ చేస్తూనే ఉంటాడు. వాటివలన ఎన్ని రోగాలు వచ్చినా లెక్క చేయడు.

1970 దశాబ్దంలో గర్భ నిరోధక మాత్రలతో, సూక్ష్మ జీవ సంహారక మందులతో ఎటువంటి లైంగిక సమస్యలనైనా ఎదుర్కోవచ్చు అనుకొన్నారు. వాటివలన విచ్చలవిడిగా రతి సుఖం పొందవచ్చుననుకున్నారు. కొన్నాళ్ళకు హెర్పిస్ అనే వ్యాధి ప్రబలింది. అది లైంగిక కర్మల వలన వ్యాపిస్తుంది. దానిని నిర్మూలించే మందు అప్పటికి లేదు. ఆ వ్యాధి రావడానికి ముఖ్య కారణ౦ మానసిక ఒత్తిడి. అది లైంగిక కర్మల ద్వారా వచ్చే అంటువ్యాధి. ఒకమారు ఒక వ్యక్తికి ఆ వ్యాధి వస్తే, అది ఎన్నటికీ పోదు. ఆ సూక్ష్మ జీవి వ్యాపించిన కొన్నాళ్ళకు శరీరంలో గుప్తంగా ఉంటుంది. దాని లక్షణాలు రెండు నెలలకి ఒకమారు మళ్ళీ రావచ్చు, లేదా ఎప్పటికీ రాక పోవచ్చు. ఎవరికీ అలా ఎందుకు అవుతుందో తెలీదు. మానసిక ఒత్తిడి, రోగ నిరోధక శక్తి క్షీణించడం వలన రావచ్చని నమ్ముతున్నారు.

హెర్పిస్ వలన మనం తెలిసికోవలసినది రతి వలన సమస్యలు ఉంటాయని. దానివలన భయంతో చాలామంది విచ్చల విడిగా తిరగడం మానేశారు. ఒకప్పుడు వేశ్యగా ఉండే స్త్రీ ఇలా చెప్పింది: "అది చాలా ఆనందం కలిగించేది. నేను ఇప్పుడొక అందగాడిని కలిస్తే, వానికి నా మీద మోజు కలుగుతే, హెర్పిస్ గురించి అవగాహన ఉండడంతో, వాని నుండి తప్పించుకుంటాను"

ఉచితమైన రతి గురించి ఒక స్త్రీ ఇలా చెప్పింది: "రతి ఉచితం కాదు. దాని ఖరీదు హెర్పిస్". అది ఎంత సత్యమంటే కొన్ని సంవత్సరాల తరువాత ఎయిడ్స్ వ్యాధి ప్రబలమైంది.

ఒక పాత్రికేయుడు "ఇప్పుడు గర్భం గురించి తలచుకొని భయపడేవారికి మున్ముందు ఏమి జరుగుతుందో అని అడుగు ముందుకు వెయ్యరు". కాని ఎందరు దానిని పాటిస్తారు? నడవడి సమస్యల వలన మారితే, అది చావుగురించి భయం వలన కూడా మారాలి. కానీ ఆ భయం అతి పెద్దది, అది ఆలోచింప శక్యం కానిది. చాలా అమెరికన్ లకు ఎయిడ్స్ ఉన్నా తమ నడవడికను మార్చుకోలేదు. 1988 లో హార్వీ ఫైన్ బర్గ్ ఇలా అన్నారు:

"అమెరికాలో 90 శాతం మందికి రతి వలన లేదా మాదక ద్రవ్యాలు శరీరానికి ఎక్కించుకొనే సూదుల వలన ఎయిడ్స్ రావచ్చని తెలుసు. కాని వారికే ఎయిడ్స్ వస్తే ఏమి చేస్తారని అడుగుతే, వారు తమకు వచ్చే విపత్తు ఏమీ లేదని అంటారు"

వ్యాక్సీన్లు, గర్భ నిరోధక సాధనాలవలన తమకేమీ కలుగదనే మొండి ధైర్యంతో బ్రతుకుతున్నారు.

కాని కర్మకు ఫలితం ఉంటుంది. బ్రతకడం అంటే బాధ్యతతో కూడినది. ఎయిడ్స్ వ్యాక్సీను, హెర్పిస్ నిర్మూలక మందు, లోపం లేని గర్భ నిరోధక సాధనాలు, ఉన్నా నాకైతే నియంత్రించని లైంగిక కర్మలు సమస్యలు తెచ్చి పెడతాయని అనిపిస్తుంది. ఎందుకంటే అది మనని బాధ్యతా రహితంగా చేసి సృష్టికి వ్యతిరేకంగా నడిపిస్తుంది.

దాని చెడు పర్యావసానము ఆరోగ్యం మీద చూపిస్తుంది. ఎందుకంటే శరీరము, మనస్సు ఒకదాని మీద ఇంకొకటి ఆధార పడి వున్నాయి. భాద్యతలను విస్మరించి స్వార్థ పరుడుగా నివసించే ప్రతి మానవునికీ ప్రఘాడమైన చింత ఉంటుంది. మనము వ్యష్ఠిలో ఒక భాగమని తెలిసినా, ఆదిగా ఉన్న కోర్కెలు -- సుఖం, ఆనందం, రతి మొదలైనవి-- అన్ని దిక్కులా లాగుతాయి. ఫ్రాయిడ్ మనం ఈ సమస్యలని అచేతనమనస్సుకు అప్పగించి బ్రతుకుతున్నామని అన్నారు. కాని అణచివేసుకొన్న కోర్కెలు ఎప్పటికైనా బయటకు రాక పోవు. ఇలా నిరంతరము నియంత్రించికోవడం ప్రాణానికి హాని. ప్రాణం అన్నిటికీ మూలం. తక్కువ ప్రాణం వలన చైతన్యం తక్కువై, రోగ నిరోధక శక్తి క్షీణించి, మానసిక వ్యధ కలిగి ఉంటారు.

మానసిక సమస్యల మన రోగ నిరోధక శక్తిని క్షీణింప చేయవచ్చు. ఎందుకంటే మానసిక వ్యధవలన కొన్ని రోగాలు శరీరానికి వస్తాయి. వాటివలన, దీర్ఘమైన వ్యాధులు వలన, ఇంద్రియ సుఖాల వలన, ప్రాణం తక్కువవుతుంది. అలాగే మనస్సును, ఇంద్రియాలను నియంత్రించుకొంటే ప్రాణాన్ని వృద్ధి చేసి, మనము స్వస్థతను పొందవచ్చు.

మనం ఇంతవరకు భౌతిక సమస్యల మీదే దృష్టి పెట్టేం. ఇది ఉపరితలం మాత్రమే. మనస్సులో జరిగే మథనం వ్యాధి గురించి కలిగే భయం కన్న లోతుగా ఉంటుంది.

గీత చెప్పేది: హాని కలిగించే భౌతిక సమస్యలు లేకపోయినా, మనశ్సాక్షి వాటిని చూసి మనను అపరాధి అని తీర్పునిస్తుంది. ఇది ఒక మంచి చిహ్నం. అలా చూసేది మన ఆత్మ. అది మన చెడు లేదా మంచి నడవడిక, లేదా సమస్యల గూర్చి పట్టించుకోదు. ఎందుకంటే అది భౌతిక మైన వస్తువు కాదు. కాని మనశ్సాక్షి చెప్పేది మన మానసిక స్థితి, భావాలు, ఇంద్రియాలు సృష్టికి వ్యతిరేకమని.

మనం లోపల మథన పడుతూఉంటాం. అంటే మన మీద నమ్మకం పోయి, వ్యాకులతో నుండి, అభద్రతతో కూడి ఉంటాము. ఇది భయమునకు నాంది. ఆ భయం ఎందుకంటే, మన నడవడిక క్రమంగా మనను ఆత్మ నుండి దూరంగా తీసుకు వెళ్తుంది. మనకెంత స్వార్థపూరిత కోర్కెలు ఉంటే భయమంత పెరుగుతుంది. ఎవరైతే స్వార్థపూరిత కోర్కెలను తప్పని సరిగా తీర్చుకోవాలని ఆశిస్తారో వారికి కలిగే ఫలితం బలహీనత. అట్టి వారికి తమపై నమ్మకం తగ్గి, జీవితంలో అతి తక్కువ ఆశించి, క్రమంగా తమ మీద గౌరవమును తగ్గించుకొంటారు. ఇటువంటి సమస్యలు వస్తాయనే భయం మన మనస్సు లోతులలో ఉంటుంది. ధ్యానం చేయకపోతే చాలా మంది తమచే నియంత్రించబడని ఒక దారుణమైన శక్తి లాక్కు పోతున్నాదని భయపడతారు. ధ్యానం అట్టి వారిని సక్రమమార్గంలో పెడుతుంది.

మూడో అంశం మనకి సుఖాలు ఎంతో కాలం ఉండవనే భయం. ధ్యానంలో ముందుకు వెళ్ళకపోతే మేధావులకైనా ఇది అంతుబట్టదు. మన తెలివి "నేనది నమ్మను" అంటుంది. అది ఒకవేళ నిమ్మినా, మన మనస్సు "నీవు, నీ సిద్ధాంతాలు. నేను సుఖంగా ఉంటే నాకేదో క్లేశముందని అంటున్నావు. అది నమ్మశక్యం కానిది" అంటుంది. నా వైద్య మిత్రులు ఆ భయం ఉంటుందని ఏకగ్రీవంగా అంటారు. సులభంగా చెప్పాలంటే: మనకి భయమే లేకపోతే, సుఖాలను పొంది వాటినే పట్టుకొని వేళ్ళాడవలసిన గతి పట్టదు.

చివరగా ప్రాణ భయం. దీన్ని గీత అంతక అంటుంది. అనగా "ఎవరు అన్నిటినీ అంతం చేసేవాడు." అనేక జన్మలు ఎత్తిన జీవికి చేతన లోతులలో ఆ భయం ఉంటుంది. పశ్చిమ దేశాలలో "చావు గూర్చి ఎప్పటికీ తెలిసికోలేం" అంటారు. గీత అంటుంది: నీకు తెలీని దాని గూర్చి నువ్వు భయపడలేవు. మనము చావుని అనేక సార్లు అనుభవించేము గనుక, మనందిరికి చేతన మనస్సు లోపల దాని గురించి తెలుసు. మనం పడే బాధ ఒక చిన్న జీవికి కూడా ఉంటుంది. యోగా చెపుతుంది: సుఖం, శక్తి, గౌరవం,వస్తువులు భయం వలననే పట్టుకొని ప్రాకులాడుతాం. ఆ భయం మనస్సును పూర్తిగా ఆవహిస్తుంది. ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా దానిని నిరోధించవచ్చు. ఆధ్యాత్మిక జీవితం అభద్రత నుండి ఉపశమనం ఇస్తుంది. 258

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...