16.8
ఆశా పాశశతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః
{16.12}
ఈహంతే కామభోగార్థ మన్యాయే నార్థసంచయాన్
ఆశా పాశములచే బద్దులై, కామక్రోధ పరాయణులై, ఆ కామోప భోగార్థము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనము చేయుచున్నారు
ధనమునకై కామముతో కొందరు బంధాలను త్రెంచుకొంటున్నారు. అలాగే వస్తువులు కొనేవాళ్ళు, వాటిని అమ్మేవాళ్ళు, ధనాశతో చేయుచున్నారు. మనకి ధనాశ ఎంత శక్తివంతమైనదో, ధ్వంసము చేయునదో పూర్తిగా అవగాహన లేదు. మన సున్నిత స్వభావాన్ని అది కఠినంగా మార్చుతుంది.
ఏ ఒక్కరూ ధనాన్ని ప్రేమిస్తున్నానని ఒప్పుకోరు. "దానితో ఏదైనా కొనుక్కోవచ్చు. నాకు కావలసినది కొనుక్కోవాలని ఉంటుంది. కానీ దానిపై ప్రేమ లేదు" అంటారు. ఇది చేతన మనస్సు పైపై జరిగే ఆలోచన. మనం దేనిగురించి నిరంతరము ఆలోచిస్తామో, మన ఏకాగ్రతను దేనిమీద ఎల్లప్పుడూ పెడతామో, దానిని మనము ప్రేమిస్తున్నాము. ఆ లెక్కలో ధనం అన్నిటికన్నా ఎక్కువగా ఆరాధింప బడేది.
మనము ఎప్పుడు ధనాన్ని ప్రేమిస్తున్నామో --దాని గురించి ఆలోచిస్తూ, చదువుతూ, తాపత్రయ పడుతూ; వ్యక్తులను దానితో తూచి, మన ఏకాగ్రతను చూపుతామో, మన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తామో -- మనం మన యాతనని అన్ని చోట్లా వ్యాపింప జేస్తున్నాము. ధనం అనగా నోట్లనే కాదు. ఎటువంటి స్థిరాస్తి, చరాస్తి నయినా ధనమనవచ్చు.
ఇది నైతిక విలువల విషయమే కాదు. నేను చెప్తున్నది దాని పర్యావసానము. మనము సుఖంగా ఉండాలని ఖరీదైన కార్లు, బట్టలు, నగలు, మొదలైనవి పోగు చేసుకొంటాం. అది మన చేతనాన్ని ఆవహించి తండ్రీ - కొడుకుల, భార్య - భర్త ల మధ్య సంబంధాలను చెడుపుతుంది.
కొందరు భార్యా-భర్తలు పిల్లలు భారం అనుకొంటారు. ఒక కథనం ప్రకారం పిల్లల్ని పెంచటానికి 150 వేల డాలర్లు, 18 ఏళ్లలో ఖర్చవుతుంది. కొన్ని జంటలు సంపాదించిన సొమ్మును తమపైనే ఖర్చు పెట్టడానికి ఇష్ట పడతాయి.
ఇక్కడ విచారించవలసిన విషయమేమిటంటే ఆ ఆలోచనలు పిల్లలు పుట్టేక వస్తాయి. ఒక పిల్లడు తలిదండ్రులచే ప్రేమింప బడక, వాళ్ళకు భారమై, చికాకు కలిపిస్తాడు. అమెరికా లో ఇంటిని వదిలి పారిపోయేవాళ్ళు ఇలాంటి వారే. వాళ్ళ మీద కొంచెం ప్రేమున్నా తిరిగి వస్తారని కొందరంటారు. వాళ్ళు వదిలేసిన ఇళ్ళు ఖాళీవి. తలిదండ్రులు ఉదయాన్నే పనికి వెళ్తారు. సాయంత్రం షికారు కెళ్తారు. ఎక్కువ మంది తమపై దుర్మార్గము చేయడం లేదా దుర్భాష లాడుతున్నారని అంటారు. ఒక అక్కరలేని పిల్లాడి వలన ఒక స్వార్థపూరిత తండ్రి అనేక మానసిక ఒత్తిడులను అనుభవిస్తాడు. పిల్లడన్న తరువాత వాడిపై సమయాన్ని వెచ్చించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, వాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇవన్నీ కొందరికి చేయడం ఇష్టంలేదు. పిల్లలపై దుర్మార్గాలు వేల కొలది జరుగుతున్నాయి. ఒక పాత్రికేయుడు ఇంటినుంచి పారిపోయిన బాలుడ్ని ఎందుకలా చేసేవు అని అడిగేడు. వాడి సమాధానం: "నా తలిదండ్రులతో ఉంటే నువ్వూ అదే చేస్తావు".
ఒక వైద్యుడు "పిల్లల్ని భారంగా తలుస్తారు. జంటలకు పిల్లలు కావాలనే ఉంటుంది. కానీ వారిగురించి ఏదీ త్యాగం చేయడం ఇష్టంలేదు. వాళ్ళు పిల్లల్ని ఆశిస్తారు. అలాగే వారు తమకి వస్తువులు, హోదా, మంచి ఉద్యోగము ఉండాలని ఎక్కువ ఆశిస్తారు" అన్నారు.
ఇటువంటి కోర్కెలవలన తలిదండ్రులు తమ పిల్లలకై సమయాన్ని కేటాయించ లేక పోతున్నారు. అమెరికన్ హుమేన్ అసోసియేషన్ కి పనిచేసే వ్యక్తి "కుటుంబంలోని ప్రతి ఒక్కరు రైలు బండి లాగ ఏడున్నర కి పట్టాలెక్కి రాత్రి ఎప్పుడో పట్టాలు దిగుతారు" అన్నారు.
ఒక మనస్తత్వవేత్త "తలిదండ్రులు తమ అవసరాలను పిల్లల అవసరాల కన్నా ముందే ఉంచుతున్నారు. పిల్లలు ప్రేమించ బడకపోతే, వాళ్ళు ఇతరులను ప్రేమించకుండా ఎదుగుతారు. దానివలన వారు క్రోధం, కఠినత్వం కలిగి ఎవ్వరితోనూ కలువరు." అన్నారు.
సాన్ ఫ్రాన్కిస్ కో లో ఒకచోట వృద్ధులు పేదరికంతో, భయంతో బ్రతుకుతున్నారు. కొంతమంది ఒక చవకబారు హోటల్ లో ఉంటారు. వాళ్ళు౦డే గదుల్లో ఎటువంటి సదుపాయాలు ఉండవు. వాళ్ళకి చలికాలంలో, వేసవిలో ఎటువంటి ఉష్ణోగ్రతను లేదా సీతల్లాన్ని కలిగించే పరికరాలు లేవు. తిండి, బట్టలు కూడా కరవే. కొంతమంది దాతలు వాళ్ళకి రోజుకు ఒక పూట ఉచిత భోజనం ఇస్తారు. వేల మందికి హోటల్ లో ఉండే స్తోమత లేదు. వాళ్ళ వస్తువులన్నిటినీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టుకొని పార్కుల్లోనూ, రోడ్డు ప్రక్కన భయాందోళనలతో ఉంటారు. వాళ్ళందిరికీ కుటుంబాలు లేవా? ఉంటే వారు ఎందుకు వారిని చేరదీయరు? ఇటువంటి పరిస్థితి అన్ని నగరాల్లోనూ ఉంది.
అమెరికా కున్న వనరులతో వృద్ధులు తమ అంతిమ ఘడియలు పేదరికంతో బ్రతకకూడదు. అలాగని ప్రభుత్వం వారిని పోషించాలని నేననటంలేదు. కుటుంబ౦లోని పేదవాళ్ళకి సహాయం చేయడం మన బాధ్యత. ఇది చెప్పినంత సులభం కాదు. కాని దానినే ప్రేమ అంటారు. మన౦ కోర్కెల, ఉద్యోగాల వెంట వెళ్ళి మన కుటుంబాన్ని ఖాతరు చేయకుండా ఉండడం ఒక శోచనీయమైన అంశం.
కొన్ని వేలమంది వృద్ధులు నర్సింగ్ హోమ్ లలో ఉంటారు. వాళ్ళకి ఉండడానికి, తినడానికి వసతులు ఉండవచ్చు. కాని వారిని కుటుంబ సభ్యులు వదిలేసారు. వాళ్ళ పిల్లలు గ్రీటింగ్ కార్డ్ లు పంపించవచ్చు. కాని వారు నిజం గా చెప్పేది "మేము చాలా పనుల్లో ఉన్నా౦. నా భార్యా పిల్లల్నీ చూసుకోవాలి. మీరు డబ్బు సంపాదించి సుఖాలు అనుభవించేరు. ఇప్పుడు మేమూ అదే చేస్తున్నాం" . వాళ్ళు తమ పిల్లలకు కూడా అటువంటి నైతిక విలువలను నేర్పిస్తున్నారు.
చాలామంది వృద్ధుల దగ్గర సంపాదించిన ఆస్తి ఉంది. వాళ్ళ పిల్లలు పెద్దవారైపోయేరు. వాళ్ళు తమకై తాము బ్రతకదలచుకున్నారు. "నేను నా అప్పులు తీర్చేసాను" అన్నది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళకి తక్కినవాళ్ళకి ఏమైనా పట్టదు. వాళ్ళకి పాఠశాలలు కొరకు వేసిన పన్నులను కట్టడం ఇష్టం లేదు. యుక్త వయస్కులు చేసే ఆగడాలను పట్టించుకోరు. వాళ్ళ స్వార్థం కొరకై బ్రతుకుతారు. సాటర్ డే రివ్యూ అనే పత్రికలో ఇలా వ్రాసేరు: వృద్ధులు బాల్యాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకున్న అనుభవానికి, శక్తి సామర్థ్యాలకి, ఇతరులకు ఉపకరించే కార్యాలెన్నో చేయవచ్చు. కాని వారు సుఖాలలో మునిగి తేలుతున్నారు. డాక్టర్ సెల్యే "పని మనకి చాలా అవసరం" అన్నారు. నేనంటాను అది అధ్యాత్మికకూ అవసరమే. మనం కర్మ చేయాలి, ఇతరులకు ఇవ్వాలి, ప్రేమించాలి. అలా కాకపోతే ఏ వేయస్సులోనైనా మనం మరణించినట్టే.
ఆశ ఒక ప్రక్రియ. అది వ్యక్తిత్వాన్ని క్షయం చేస్తుంది. అది మన జీవితాలను, రోజు తరువాత రోజు, మనకు తెలియకుండా, మార్పిడి చేస్తుంది. మన౦ వృద్ధులమయ్యాక తెలుస్తుంది మనం ఎలా తయారయ్యామో. కానీ అలా కాకుండా చేసికోవడం మన చేతులలోనే ఉంది. పై శ్లోకాలు ఎవర్నీ ఖండించటంలేదు. మనకి స్వార్థమనే అరణ్యాన్ని కామం ఎలా పెంచుతుందో చెప్పబడింది. మనం చేయవలసిందల్లా ప్రతి రోజూ కామాన్ని తగ్గించుకొని ఆ అరణ్యం లోని కలుపును తీసేయాలి. 263
No comments:
Post a Comment