Thursday, March 10, 2022

Chapter 17 Section 11

Bhagavad Gita

17.11

ఓం తత్సదిటి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతహ {17.23}

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా

బ్రహ్మము ఓం, తత్ , సత్ అని మూడు విధములుగ నిర్దేశింపబడినది. ఆ నిర్దేశము నుండి బ్రాహ్మణులు, వేదములు , యజ్ఞములు పూర్వము యర్పరుపబడెను

తస్మా దో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః {17.24}

ప్రవర్తనే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్

బ్రహ్మ వాదినులగు వారు శాస్త్ర విహితములైన యజ్ఞ, దాన, తపస్సుల నాచరించునపుడు ముందుగా ఓం అని పలికి ఆరంభింతురు

త ది త్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః {17.25}

దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః

ముముక్షువులగువారు యజ్ఞ దాన తపస్సుల నాచరించునపుడు ఫలాపేక్ష లేకుండా తత్ అని పలుకుచు వానిని ఆచరి౦చెదరు

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే {17.26}

ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే

అర్జునా! సద్భావము నందును, సాధుభావము నందును, ఉత్తమమైన కర్మము నందును "సత్" పదము వాడబడుచున్నది

ఓం ఒక మంత్రానికి ప్రతీక. తత్ అనగా అది అనబడే బ్రహ్మన్. సర్వమునకు కారణమైన బ్రహ్మన్ ను మాటలతో వివరించలేము, ఆలోచనలతో పట్టుకోలేము. సత్ అనగా భౌతికమైనది. కానీ అది అన్నిటిని ఆవరించి, మార్పులేనిదై, శాశ్వతముగా నుండునది. సత్ నుండి సత్యము వచ్చినది. మహాత్మా గాంధీ యొక్క నిర్వచనం దేవుడు సత్యము. గాంధీ దుష్టశక్తికి ఉనికి స్వతహాగా లేదు; దానికి మనం ఉనికినిస్తే అది ఉంటుంది అని చెప్పెను. దైవశక్తి ని ఎవరూ ఏమీ చేయలేరు. దానిని గుప్తంగా ఉంచవచ్చు. గాంధీ ఇంకా ఇట్లు చెప్పెను:

నా చుట్టూ ఉన్నవన్నీ సదా మారుతూ, మరణిస్తూ, ఉండగా వాటి మధ్యలో ఎన్నటికీ మార్పు లేనిది, అన్నిటినీ ధరించినది, సృజించునది, లయము చేసెడిది , మరల సృజించునది అయిన ఒక నిజమైన శక్తి గలదు. దేవుడనగా అట్టి శక్తి. నా ఇంద్రియాలతో గాని, మనస్సుతో గాని చూసేవన్నీ ఎన్నటికీ శాశ్వతము కావు; ఒక్క దేవుడు తప్ప. మరణముల మధ్య జీవిత మున్నది, అసత్యాల మధ్య సత్య మున్నది, చీకటి మధ్య వెలుగున్నది. కనుక ప్రాణం, సత్యం, వెలుగు దేవుడు

యుద్ధానికి స్వతహాగా ఉనికి లేదు. అది అవసరమైన దుష్ట కార్యమని కొందరంటారు. కానీ ఏ దుష్ట కార్యము అవసరము లేదు. యుద్ధం మన చెప్పు చేతలలో ఉంది. అనేకులు యుద్ధం వద్దనుకుంటే అది ఉండదు. దానివలన ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. మనంతట మనమే యుద్ధం మొదలపెడతాము. అది ఏ ఇతరమైన శక్తివలన కాదు. 361

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...