Bhagavad Gita
17.12
యజ్ఞే తపసి దానే చ స్థితి స్స దితి చోచ్యతే
{17.27}
కర్మ చైవ తదర్థీయం స దిత్యే వాభి ధీయతే
యజ్ఞదాన తపస్సులకు సంబంధించిన నిష్ఠయును, మరియు బ్రహ్మ సంబంధమైన కర్మలు కూడా "సత్" అని పిలువబడుచున్నవి
అశ్రద్ధాయా హుత౦ దత్తం తప స్తప్త౦ కృతంచ యత్
{17.28}
అసది త్యుచ్యతే పార్థ న చ త త్ప్రేత్య నో ఇహ
అర్జునా! శ్రద్ధలేకుండా ఆచరింపబడిన యజ్ఞ దాన తపస్సులు "అసత్" అని చెప్పబడుచున్నవి. వాని వలన ఈ లోకమునందును, పరలోకము నందును ప్రయోజన ముండదు ఀ
ఎప్పుడైతే శ్రద్ధ లేదో దాని పర్యావసానము అసత్ లేదా నిజం కానిది. మనం గుండె బరువుతో, ఏకాగ్రత లేకుండా, గౌరవం లేకుండా పనులు చేస్తే అవి దీర్ఘకాల౦లో నిరుపయోగమవుతాయి.
కొందరు ఉపయోగకరమైన అంతాలను, వాటిని పొందుటకు అవలంబించిన మార్గాలవలన సమర్థించుకోవచ్చని చెప్పుదురు. గీత చెప్పేది "ఏదైనా చేయచ్చు అనుకుంటే దానివలన ఏమీ రాదు". మహాత్మా గాంధీ తప్పుడు మార్గాలు ఉత్తమమైన ముగింపునివ్వవని తన జీవితం ద్వారా చూపించెను. అలాగే మంచి మార్గాలు మనకు మంచి ముగింపును ఇస్తాయి.
నా దృష్టిలో ముగింపు, దానిని పొందుటకు అవలంబించిన మార్గం మధ్య తేడా లేదు. అణ్వాశ్త్ర పోటీలో సమం ఎప్పటికీ రాదు. అది జీవితానికి వ్యతిరేకం. నువ్వు నన్ను భయపి౦చేవు, కాబట్టి నేను నిన్ను ఇంకా భయపిస్తాను. దీనిని శాంతి అంటారు. ఆర్థిక ఆంక్షలు, ఆహారాన్ని ఆయుధం గా వాడడం, ఆయుధాలను అమ్మడం, ఇతరుల స్వేచ్చను భంగం చేయటం, మొదలైనవి ఎటువంటి ముగింపుకయినా తప్పుడు మార్గాలు. శ్రీకృష్ణుడు చెప్పేది ఇవి అసత్. వాటి ఫలితము వ్యర్థము.
సముద్రపుటొడ్డున కట్టిన ఇసుక కోటలు ఏ విధంగా అయితే పోటు వస్తే చెరగిపోతాయో, అలాగే ప్రపంచ శాంతికి మంచి మార్గాలు -- ఒకరినొకరు అర్థం చేసికోవడం, దయ, జ్ఞానం, గౌరవం-- అవలింబించకపోతే ఫలితం శూన్యం. ఇది వ్యష్ఠి లేదా అంతర్జాతీయ సమిష్ఠికి కూడా వర్తిస్తుంది. ఈ శ్లోకాల్లో చెప్పే త్యాగం, క్రమశిక్షణ, దానం అన్నిటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా దానం లేదా సహాయములకు.
అసత్ అనగా అజ్ఞానము. దీనివలన తెలిసికొన్నదేమిటంటే ఇతరులకు, జాతులకు, దేశాలకు సహాయం చేయడం అన్నీ అసత్. నా ఇష్టం వచ్చినట్లు నేను చేయగలిగితే అందరి పరిస్థితి బాగుపడుతందనే ధీమా. ఇటువంటి దృక్పథం ఆర్థిక విధానం, విదేశాంగ విధానాలలో చూస్తాము.
ఎమర్సన్ "దుష్కర్మకి, తప్పుడు నిర్ణయానికి కారణం దురాలోచన" అని చెప్పెను. అదియే అసత్ కున్న శక్తి: చెడు యొక్క ఉనికి మన చెడు ఆలోచనతో దానిని సమర్థించటంవలన. ప్రసార మాధ్యమాలలో ఉన్న చెడు వార్తలను మనము పిలవనక్కర లేదు. కానీ వాటిని అధిగమించి ముందుకు సాగాలి. అలాగే కొన్ని మతాలు చెప్పే నరకంలో పడవలసిన యాతనలు ప్రక్కన పెట్టి, మన ఆలోచనలు సక్రమంగా ఉండడానికి ప్రయత్నించాలి.
బెర్క్లీ లో అనేకమంది వాళ్ళు వెళ్లవలసిన ఊరును ఒక అట్టమీద వ్రాసి రోడ్డు ప్రక్కన నుంచునేవారు. ఉదార స్వభావముగల వారు ఆ ఊరివైపు వెళితే వారిని తమ వాహనంలో ఎక్కించుకొని వారి ఊరి దగ్గర దింపేవారు. వారిని వాహనం ఎక్కించుకొని దింపడం మన బాధ్యత కాదు. వాళ్ళను చూసీ చూడనట్టు గా కూడా వెళ్ళవచ్చు. ఇలాగే ప్రసార మాధ్యమాలలో అనేకములైన చెడు ప్రచారములు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే అవి సత్ కావు.
ఎలాగైతే మన చుట్టూ భౌతికమైన వాతావరణం ఉందో, మన మనస్సు చుట్టూ సూక్ష్మ ఆకాశము ఉన్నదని వేదాలు చెపుతున్నాయి. మనం పీల్చే గాలిలో అనేక అణువులు, రేణువులు -- కొన్ని సహజమైనవి, కొన్ని కృత్రిమమైనవి, కొన్ని మంచివి, మరికొన్ని హాని కలిగించేవి --ఉన్నాయి. అలాగే మన సూక్ష్మ ఆకాశంలో అనేకమైన కాలుష్యాలు ఉండవచ్చు. మన వాహనాల, పరిశ్రమల వ్యర్థాలు నియంత్రించడానికి అనేక చట్టాలు ఉన్నాయి కానీ, మన మనస్సుని చెడు ఆలోచనల కాలుష్యం నుంచి రక్షించుకొనుటకు ఎటువంటి చట్టమూ లేదు. మన మనస్సుకి చెడు ఆలోచనలు ప్రభావితం చేయకుండా ఉండడానికి తర్ఫీదు ఇవ్వాలి. అంటే మంచి ఆలోచనలతో ఎప్పుడూ ఉండాలి.
చెట్లు తమ ఆకుల ద్వారా బొగ్గు-పులుసు వాయువుని పీల్చుకొని ప్రాణ వాయువును తయారు చేస్తాయని మనకి తెలిసినదే. కాలుష్యం వలన వాతావరణం స్మాగ్ తో నిండితే, చెట్లు --మనం పట్టించుకున్నా, లేకపోయినా--ప్రాణ వాయువును తయారు చేస్తూనే ఉంటాయి. అవే లేక పోతే పెద్ద నగరాలలోని వారు ఊపిరాడక బాధపడవలసి వస్తుంది. అలాగే నిస్వార్థపరులైన వారు తమ కర్మలను నిర్వహిస్తూ, ఎవరినీ బాధించక, ఎటువంటి గొప్ప కార్యాలను చేయకపోయినా వారు ప్రాణ వాయువులాంటి వారు. వాళ్ళే లేకపోతే సూక్ష్మ ఆకాశానికి ప్రాణాధారము లేకుండా పోతుంది. అప్రమత్తంగా ఉండి, చెడు ఆలోచనలను దూరంగా ఉంచితే, మనము ఇతరులికి హితవు చేయగల వార మౌతాము.
హిందువులు చెప్పే ఆకాశం అనగా రోదసి. భౌతికమైన రోదసి గ్రహాలు, నక్షత్రాలనే కాకుండా మన సృష్టి చరిత్రను కూడా పొందుపరుస్తుంది. ఎలాగంటే సృష్టి ఆరంభంలోని బిగ్ బ్యాంగ్ లో జనించిన తరంగాలు రోదసిలో ఎక్కడో ఉన్నాయి. మన జీవిత చరిత్ర అంతా రోదసిలో ఎక్కడో, ఒక గ్రంథాలయంలోని పుస్తకాలున్నట్లు, పొందుపరచబడినది. వాటిలోనుంచి మనము మంచి లేదా చెడువి ఎంచుకొని, వాటిని అధ్యయనం చేయవచ్చు. గురుత్వాకర్షణ సృష్టి ఆరంభంనుంచీ ఉన్నది. కానీ న్యూటన్ ఒక్కడే రోదసిలోని తరంగాలతో తన మనస్సును అనుసంధానం చేసి ఆ విషయం తెలియబరచేడు. వ్యతిరేకతను ఎన్నటికీ ఆహ్వానించరాదు. ప్రేమ ఎదురవుతే ఆహ్వానించండి. అలాగే ద్వేషాన్ని ఆహ్వానించకండి. ద్వేషం వ్యక్తులను, కుటుంబాలను, దేశాలను, జీవితాలను నాశనం చేస్తుంది. కానీ ప్రేమ అన్నిటినీ నయం చేస్తుంది.
మనం చెడు ఆలోచనలను సమర్థిస్తూ ఉంటే, మనం చేసే కర్మలు, మనం ప్రపంచానికి మేలు చెయ్యాలనుకున్నా, మంచి ఫలితాలు ఇవ్వవు. కానీ మనం మనస్పూర్తిగా నిస్వార్థ సేవ ఎటువంటి ఆశా లేకుండా, పొగడ్తను కోరక, పారితోషికమునకై కాక చేసిన అది సత్ అనబడును. అది తప్పక మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. మన సాధనకున్న అవరోధాలను తొలగిస్తుంది. 368
No comments:
Post a Comment