Thursday, March 10, 2022

Chapter 18 Section 1

Bhagavad Gita

18.1

అర్జున ఉవాచ:

సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్ {18.1}

త్యాగస్య చ హృషీకేశ పృథ క్కేశినిషూదన

కృష్ణా! హృషీకేశా! కేశినిషూదనా! సన్న్యాసము యొక్కయు, త్యాగము యొక్కయు స్వరూపామును వేరువేరుగ తెలియ గోరుచున్నాను

శ్రీ భగవానువాచ:

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః {18.2}

సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః

కామ్య కర్మలను వదలుట సన్న్యాసమనియు, సర్వకర్మల యొక్క ఫలమును విడుచుట త్యాగమనియు పండితులు తెలిపిరి

ఆల్బర్ట్ జెంట్ గ్యోర్జీ అనే శాస్త్రజ్ఞుడు (నోబెల్ ప్రైజ్, 1937) ఇట్లు చెప్పెను: "పాములు కుబుసమును వీడి పెరగగలవు. అలా చేయడం వాటికి ఎంతో నొప్పిని కలిగించవచ్చు. అది గాని సరిగా చేయలేక పోతే అవి మరణిస్తాయి. మానవాళి పాతపడిన ఆలోచనలను, పద్దతులను, సంస్థలను విడనాడి ముందుకు సాగుతుంది." మానవాళి నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. స్వార్థం అనబడే కుబుసాన్ని, అది గతంలో ఎంత ఉపయోగపడినా, విడనాడాలి. లేకపోతే మానవాళి అంతమవ్వచ్చు.

పాత ఆలోచనలు తిరోగమించే సమయంలో మనం అవి ఎన్నటికీ ఉంటాయనుకుంటాం. నా చిన్నప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో మానవాళి కనుగొన్న విషయాలు -- గుర్రం బగ్గీ నుండి, రాకెట్ లవరకు-- నిక్షిప్తబడినవి. దాని రచయితలు మానవాళి అత్యున్నత స్థాయికి చేరికొందని భావించేరు. ప్రతి వ్యాసం సంపూర్ణ అధికారంతో వ్రాయబడినది. కానీ అవి ఇప్పుడు పాతబడిన ఆలోచనలు. జాతులు, సామ్రాజ్యాలు, భౌతిక ప్రపంచం, అభివృద్ధి, మానవుని స్వభావం మొదలగు అంశాలు అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులు చెందేయి. యుద్ధం గురించి వ్రాస్తూ ఒక బ్రిటిష్ దేశస్థుడు ప్రస్తుత యుద్ధాలు సాంకేతిక జ్ఞానం వలన పూర్వపు కత్తి ఢాలు వలె మిక్కిలి బాధను కలిగించనివని పేర్కొనెను. హాన్స్ కోని౦గ్ అనే రచయిత న్యూ యార్క్ టైమ్స్ లో ఇలా వ్రాసెను: "నెపోలియన్ నాటి యుద్ధాలలో సైనికులు ఎలాగ తమ ఆయుధాల గురించి పూర్తిగా తెలియకపోయినా అవి గొప్పవని భావించేరో, అలాగే ప్రస్తుత కాలంలో అణ్వాస్త్రముల గూర్చి ఏమీ తెలియకుండానే సైనికులు గొప్పవని భావిస్తున్నారు."

పాత ఆలోచనలు ప్రభుత్వములు లేదా సంస్థల వలన అంతరించవు. వాటిని వ్యక్తులు విడనాడి, మిగతా వ్యక్తులను ప్రభావితం చేస్తేనే సాధ్యం. మన సమస్యలు ఎంతో పెద్దవియై పాత ఆలోచనల యందు విశ్వాసం సడలుతుంది. మనం పరిమితమైనా మన శక్తి అపరిమితం. పరిస్థితులను మార్చ గలిగే శక్తి సాధారణ మానవులకు సైతం ఉంటుంది. మనం అట్టి శక్తిని ప్రదర్శించం. కాబట్టి అది లేదని తలుస్తాం. మానవాళి పురోగమన౦ వ్యష్ఠి వలననే సాధ్యం. మనమందరము చరిత్రను మన కోర్కెల సముదాయంతో వ్రాస్తాము.

ఆల్బర్ట్ జెంట్ గ్యోర్జీ "మనం శోచనీయమైన భూగోళంలో ఆర్థిక వ్యవస్థ క్రుంగినదై యుండగా, గొప్ప ఆయుధాలు మన చేతిలో ధరించి , భయం, అపనమ్మకం మన హృదయాల్లో ఉంచుకున్నాం" అని అన్నారు. వేరే ఎవళ్ళూ ఆయుధాలను మన కిష్టం లేకుండా బలవంతంగా చేతిలో పెట్టలేదు. మనమే మన ఆర్థిక వ్యవస్థను, మేధా శక్తిని ఫణంగా పెట్టి వాటిని పోగుచేసుకున్నాము. కొన్నిటిని మిత్రులకు ఇచ్చేము, కొన్నిటిని అధిక లాభంతో అమ్మేము. మొత్తానికి భూగోళాన్ని ఎంత భయంకరంగా చేయాలో అంత చేసేం. భయం, అపనమ్మకం ఎక్కడనుంచి వచ్చేయి? వాటిని దూరం చెయ్యడానికి ప్రయత్నించేమా లేక పెద్దవి చేసేమా?

కర్మ సిద్ధాంతం ఎవ్వరూ అధిగమించలేని, తిరుగులేని విధి వ్రాత కాదు. అది మనం చేసే ఎంపిక -- ప్రస్తుతం చేస్తున్నాము, భవిష్యత్ లో చేస్తాము--యొక్క పర్యావసానము. మన ఆయుధాల పోగు ఎంత పెద్దదైనా, పర్యావరణము ఎంత కాలుష్యంతో నిండి ఉన్నా, మన మధ్య సంబంధాలు ఎంత హింసతో కూడినవైనా, వాటినన్నిటినీ ప్రస్తుతము, భవిష్యత్ లో చేసే ఎన్నికతో మార్చుకోగలం. కర్మ శిక్షించే శక్తి కాదు. పరిణామంలో దాని లక్ష్యం మనను శిక్షించడం గాక, మన చేత జ్ఞానవంతమైన ఎంపికలు చేయించి, తక్కిన జీవులతో సామరస్యంగా బ్రతకడానికి తగిన జ్ఞానం ఇస్తుంది. మన సమస్యలకు ఆధ్యాత్మిక కారణముంది: మనను పరిణామం చేయించడానికి, ముందుకు లాగి మన జీవిత లక్ష్యం వైపు వెళ్ళడానికి ప్రోత్సహించేందుకు.

ఇందిలో వ్యష్ఠి, సమిష్ఠి అంశాలు ఉన్నాయి. మానవాళి యొక్క జయాపజయాలు మనను ఐకమత్యంతో, సామరస్యంతో బ్రతకడానికి దోహదం చేస్తున్నాయి.

యుద్ధం, కాలుష్యం, పేదరికం మనయొక్క సమిష్ఠి కర్మలు. అవి గతంలో శాంతి, సంపద, అందరికీ కలగుతాయనే చేసిన తప్పుడు అంచనాలవలన. మనం ఇటువంటి దురాలోచనలు చేసేమని మనను దూషించుకోవడంలో అర్థం లేదు. వీటికి మూలకారణం పారిశ్రామిక విప్లవం. అది ఎన్నో గొప్ప ఆశలను కలిగించింది. కాని అది తగిన వసతులను కల్పించలేకపోయింది. ఇది మనం దాటవలసిన ఘట్టం. మన పరిమితుల గూర్చి తెలిసికొని ముందుకు సాగాలి. జెంట్ గ్యోర్జీ చెప్పినట్లు మనం ఒక మలుపు దగ్గర ఉన్నాం. మన పురాతన ఆలోచనలు, సంస్థలు అనబడే కుబుసాన్ని వీడి ముందుకు సాగాలి లేదా మానవాళి అంతాన్ని చూస్తాం.

ఒక నాగరీకతను గుణాల దృక్పథంతో చూద్దాం. మొదటిది తమస్. అది సాధారణంగా ఉండి, తక్కువ వాంఛలతో --ఎందుకంటే మన ప్రాణ శక్తి బ్రతకడానికే ఉపయోగిస్తాం --ఉంటుంది. ఈ దశలో మానవుడు ప్రకృతికి, భౌతికమైన శక్తులకు బానిసగా ఉంటాడు. మనం ఇప్పుడు రాజసిక దశలో ఉన్నాము. అది క్లిష్టమైన సమస్యలను సృష్టిస్తుంది. మానవ అవసరాలను తీర్చుటకై పురోగమిస్తుంది. దానివలన లెక్కపెట్టలేని ఆశలు కలుగుతాయి. అది ఎన్ని సమస్యలను పరిష్కరిస్తే అంతకన్నా మిన్న క్రొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఈ దశలో మనం ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతాం. మనం వస్తువులను తయారుచేసేది వాటిని తయారుచేయడం కోసం, వాటిని అనుభవించేది అనుభవం కోసం, వాటిని కోరేది కోరికల కోసం.

రాజసిక ఆలోచన అనబడే కుబుసాన్ని వదలివేయాలి. దానివలనే మనం మన నాగరీకత మూడవ దశ సాత్త్వికంకు భద్ర౦గా చేరగలం. ఇక్కడ మన కోర్కెలను నియంత్రించుకొని అతి తక్కువ చేసికొ౦టాము. సత్త్వ వలన సాధారణ జీవితం -- అంటే గుహలలో బ్రతికే మానవునిలాకాక--కోరి మన నిత్యావసారాలకు కావలసిన వస్తువులనే పోగుచేసికొ౦టాము. సాత్త్విక మైన నాగరీకత పేదది కాదు. అది మానవుని ఉన్నతమైన జీవన శైలికి కావలసిన వస్తువులను సూచిస్తుంది. దానిలో జీవితాన్ని అంతంచేసే వస్తువులకు స్థానం లేదు. అలాగే సహజ వనరులను అంతం చేయదు. అది త్యాగం చేస్తు౦ది. ఎందుకంటే జీవితానికి అక్కరలేని వస్తువులను త్యజించి అత్యంత ముఖ్యమైనవాటినే ఉంచుకొంటుంది.

మనం వస్తువులను పోగుచేసుకొని ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్నాము. వస్తువులవలెనే ఆనందం పొందనక్కరలేదు. అది ఎలా సాధ్యమంటే ఆధ్యాత్మికత వలన. నేను ఉటోపియ (utopia) గురించి చెప్పటంలేదు. ప్రపంచం సెయింట్ లతో నిండకుండా మనలాంటి సాధారణ మనుష్యులకు జీవితం సుఖమయం కావచ్చు. అది ఒక్క ఆధ్యాత్మికత వలననే కాదు. ఉన్నతమైన ఆలోచనలను మన బంధాలలో, పనిలో, చదువులో, రాజకీయాలలో, ఆర్థిక రంగంలో పాటించాలి.

ఈ అధ్యాయం పేరు "వైరాగ్యంతో స్వేచ్చ" అనవచ్చు. నేను దీన్ని "ప్రేమ తో కర్మ" అంటాను. వైరాగ్యం చాలా మందికి వెగటు కలిగిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు అది స్వేచ్ఛను, సామరస్యమైన ప్రపంచాన్ని, కోరికలులేని జగతిని, యుద్ధాలనుండి విముక్తిని కలిగిస్తుంది. ప్రేమ అనగా ఇద్దరి వ్యక్తుల మధ్యనే కాదు. ఎప్పుడైతే అందరి సంక్షేమం మనకన్నా ముందు ఆశిస్తామో అది కూడా ప్రేమే. ప్రేమ కొందరి యందే కాక వారు వాడుకున్న, దోపిడీ చేసిన వారియందు కూడా. ఆహారము అందరికీ కానీ, లాభం కోసం కాదు. ప్రేమతో ఒక పూర్తి సమాజాన్ని నిర్మించవచ్చు. అందులో అందరి చట్టబద్ధమైన అవసరాలు, కర్మలు నిర్వర్తించవచ్చు.

పదార్థములనాశి౦చు జీవితము చెడు కాదు. కాని అది మానవుల యందు అతి కనికిష్ఠమైన దృక్పథం. క్రిష్టియన్ మతములో ఇది మొదటి తప్పు; దాని పర్యావసానము. గీత తప్పు గురించి విభేదించదు. కానీ అది చెప్పేది మొదటి అమాయకం; ప్రేమ దాని పర్యావసానము. ప్రేమ అనబడే అద్దం చేతన మనస్సు లోతులలో ఎప్పుడూ ఉన్నది. అది అందరిలోనూ, అన్ని సమాజాల్లోనూ, ఉన్నది. మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా, మన కర్మ ఏవిధంగా ఉన్నా అది ఉన్నది. మనము చేయవలసిందల్లా దాని మీదని దుమ్ము దులపడం. 374

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...