17.2
శ్రీ భగవానువాచ :
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా
{17.2}
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు
శ్రీ భగవానుడు పలికెను
మనుష్యుల యొక్క స్వభావముచే జనించిన శ్రద్ధ సాత్త్విక మనియు, రాజసమనియు, తామసమనియు మూడు విధములుగ నున్నది. దానిని ఆలకించుము
త్రిగుణాలు ఏ విధముగా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయో చూసేం.
మనమొక వ్యక్తి యొక్క పెరుగుదల అతడు యెట్లు ప్రకృతితో అనుసంధానము చెంది యున్నాడో దాన్ని బట్టి చెప్పవచ్చును. ఇదేవిధముగా సమిష్ఠిలో ఒక కాలాన్ని లేదా నాగరీకతను గూర్చి కూడా కొలత వేయచ్చు. ఈ కొలత ద్వారా మన పురోగతిని --అనగా మనం సాధించినవి, మన విలువలు, అవసరాలు మొదలైనవి--చెప్పవచ్చు.
ప్రకృతి అనగా సాధారణంగా పదార్థము, శక్తి, మనస్సు అనుకుంటాం. అది భౌతికమైన ప్రకృతి. మనము తక్కిన జీవులకన్న గొప్పవారమని అనుకోవచ్చు. కానీ జీవులన్నీ ప్రకృతిలో మిళితమై ఉన్నాయి. మనము ఈ రోజుల్లో అటువంటి ప్రకృతిని మనకంటే వేరని తలచి కించ పరుస్తున్నాము. అది నిజానికి మనకంటే వేరు కాదు. అది అఖండమై మనను కూడా దానిలో ఉంచుకొంటుంది. దానిలో మార్పు చెందితే మనలో కూడా మార్పు వస్తుంది. అలాగే మన ఆలోచనలు, కర్మలు దాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రకృతి బయట ఉన్నదే కాదు, మనలో కూడా ఉన్నది. సమిష్ఠ పరంగా చూస్తే మనందరి ఆలోచనలు, ఊహలు, కోర్కెలు, భయాలు కూడా ప్రకృతికి సంబంధించినవే.
పర్యావరణంలో సమస్యలు ఎదురవుతే శాస్త్రజ్ఞులు మన నడవడికను మార్చుకోమని చెబుతారు. వారు చెప్పేది జీవితాన్ని జటిలం చెయ్యద్దని. మనము ఏది సూక్ష్మమో దాన్ని జటిలమైనదాని నుంచి వేరుచేసి చూడాలి. ఉదాహరణకు అవి సాంకేతిక జ్ఞాన దృక్పథంలో రెండూ ఒకటే. కాని శ్రద్ధ దృక్పథంలో వేర్వేరు. తమస్ జటిలం. కానీ సత్త్వ౦ సూక్ష్మం.
గీత సైన్స్, సాంకేతిక జ్ఞానం, వదిలిపెట్టి కొండ గుహాల్లో బ్రతకమని చెప్పదు. కొంతమంది సైన్స్ వలన ఏమీ లాభంలేదని ఊహాగానాలు చేస్తారు. వారి దృష్టిలో భౌతికవాదం (materialism) అనర్థ౦. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొందరు యంత్రాలను నిషేధించమన్నారు. మరికొందరు యంత్రాలను పూజించి, అవి కార్మికులిని నిరుద్యోగములో ముంచినా పట్టించుకోరు. ఆ రోజుల్లోదేశంలో ఉద్యోగాలు లేక, పెట్టుబడులు లేక పౌరులు నానా యాతనా పడేవారు. మహాత్మా గాంధీ యంత్రాలు పౌరుల్ని నిరుద్యోగులను చేయనంత కాలం వాడమని సలహా ఇచ్చేరు ఇది సత్త్వ గుణం. అంటే సమిష్ఠి యొక్క మేలుకై ఆలోచించడం.
నేను సైన్స్, సాంకేతిక జ్ఞానము మంచివని గాని చెడ్డ వని గాని చెప్పను. నేను సైన్స్ ను విమర్శించను. కానీ దానిని ఉపయోగించే విధానాన్ని విమర్శిస్తాను. దాని మీద శ్రద్ధ గురించి కొంచెం భయాందోళన నాకు ఉన్నాది. సైన్స్, సాంకేతిక విద్య మంచి సేవకుడ్ని చేస్తాయి కానీ ఎన్నటికి మనని శాసించేవి కావు. ఇది ఒక కత్తిమీద సాము. సైన్స్ వలన చాలా లాభాలు ఉన్నాయి. కానీ అది మన మానవత్వాన్ని రూపుమాపు చేయకూడదు. సైన్స్ మన సమస్యలను పరిష్కరించాలి. క్రొత్త సమస్యలను సృష్టించకూడదు. ఇటువంటి సమస్థితి పొందడం చాలా కష్టం. సైన్స్ వలన కలిగే పురోగతిలో పడి మానవ బంధాలను మరిచిపోకూడదు. జీవితం అన్ని జీవులకూ సరి సమానం. కాని సైన్స్ వలన మనమేమి పోగొట్టుకొంటున్నామో తెలిసికోని స్థితిలో ఉన్నాం.
కొన్ని భాషలలో ప్రకృతికి పర్యావరణమనే కాకుండా ప్రాచీనమైనదని కూడా అర్థం ఉంది. నా అమ్మమ్మ "ప్రక్రతం లాగా ఉండకండి" అని చెప్పేది. అనగా ప్రాచీనమైన గుహలలో ఉండే మనిషిలాగ ఉండవద్దని. పరిణామంలో గుహాల్లో బ్రతికిన మనుష్యులు తమో గుణమునకు ప్రతీక. వారు తమకేది దొరికితే అది తినేవారు. వర్షం పడితే జంతువులు లాగ గుహాల్లో తల దాచుకునేవారు. గుహ లేకపోతే కలవరపడకుండా వర్షం లోనే తడిసేవారు. గొడుగు లేదా తడవకుండా పైకప్పు (rain coat) అప్పటికి ఇంకా స్ఫురించలేదు. అది తామసికుని లక్షణం. ఈకాలంలో చిన్న పిల్లలు కూడా అలా ఉండరు. వాళ్ళు వర్షంలో ఆడవచ్చుగాని, అవసరమైతే పైకప్పు, బూట్లు వేసుకొంటారు. తామసికుడు మనో వ్యధతో "నేను తడిస్తే ఏమవుతుంది? నా గురించి పట్టించుకొనేవారెవరు?" అని అంటాడు. నా అమ్మమ్మ సమాధానం "గుహలలో బ్రతికే మనిషిలాగ ఉండకు".
మన చేతన మనస్సు పరిణామంలో, మనం చేతులు కట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. అనగా ఒక విషయం గురించి స్తబ్ధుగా ఉండనక్కరలేదు. గుహలలో బ్రతికే మనిషికి రోజు గడవడమే కష్టం. వానికి వర్షం గురించి ఆలోచించే సమయం లేదు. అలాగే ఆహారం. వానికి ఒక పండు నేల మీద దొరికితే దాన్ని తీసి తింటాడు. పండు కనబడకపోతే వాడికేమీ ఫరవాలేదు. తమస్ జడం. అది ప్రతీదీ ఉన్నది ఉన్నట్టే భావిస్తుంది. తామసికుడు పండ్ల చెట్లు విత్తననాలలోంచి వస్తాయి అని ఆలోచించడు. వానికి ఒక పండ్ల తోటను వేయమంటే, చెట్లను భూమితో పెకలించి తన గుహ ప్రక్కన పెట్టడం అని అనుకొంటాడు.
ఇది చరిత్రలో ఒక పుట అని మాత్రమే కాదు. ఇది మన చేతనం పరిణమించి ప్రతి ఒక్కరినీ ఒక కాల యంత్రం (time machine) గలవారిగా మార్చిన కాలం. నా విద్యాలయంలో కొందరు విద్యార్థులు చేయమన్న హోమ్ వర్క్ చేసేవారు కాదు. నేను ఎందుకని అడిగితే "నేను రోజంతా కూర్చొని జ్ఞానం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను" అని అనేవారు.
మనం చేయవలసిన పనులను జాప్యం చేస్తే అప్పుడప్పుడు మనమీదే విసుగు కలుగుతుంది. ఉదాహరణకు కొన్ని పటాలు ఉన్నాయనుకోండి. మీరు వాటిని గోడమీద వ్రేలాడగట్టాలని అనుకున్నారు కానీ జాప్యం చేస్తున్నారు. వాటిని అక్కడే వదిలేస్తే పోలే అని అనుకుంటారు. కానీ మీరు పూనుకొని ఒక పటాన్ని వ్రేలాడగట్టి దాని కనుగుణంగా ఇల్లుని సద్దుతారు. కొంత మ౦దైతే తమ పటాలను తామే చేసుకొంటారు. దానికి కావలసిన పని ముట్లను కొంటారు. ఇది కాల యంత్రం ఎక్కి పౌరాణిక కాలానికి వెళ్ళడం.
నేను చాలకాలం నా విద్యార్థులు చేసే జాప్యం చాలా చెడ్డదని అనుకునేవాడ్ని. తరువాత తరువాత తెలిసికొన్నదేమిటంటే తామసికులకు అది సహజం. వాళ్ళు పని చేయలేరు. నేను వాళ్ళు గుహల్లో బ్రతికే మానవులువ౦టివారని సద్ది పెట్టుకొనేవాడ్ని. ఇది ఎలాగంటే మనం చూస్తున్న నక్షత్రాలు కొన్ని వేల సంవత్సారల క్రిందటివి. ఎందుకంటే వాటి నుండి ప్రసరించే కాంతి మన వద్దకు రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఉపాధ్యాయునిగా నా సమస్య నా విద్యార్థులుని ప్రస్తుత కాలానికి ఎలాగ తీసికురావడం? వాళ్ళని మందలించ కుండా, వారిని రాజసికులిగా మార్చే ప్రయత్నం చేసేవాడిని.
తామసికుడు సమస్యలచే వేధింపబడడు. ఎందుకంటే వాడికి వాటి గురించి ఎరుక లేదు. వాని మనస్సు పరణితి చెందక అంధకారంలో ఉండును. పరిణామ సిద్ధాంతం ప్రకారం మనం ఎప్పుడోఒకప్పుడు మనస్సును తయారుచేసుకోవాలి. అది మంచికైనా చెడ్డకయినా. అలాగే మనకు ఆలోచించే శక్తి కూడా రావాలి. ఎవడూ నిశ్ఛలమైన మనస్సుతో భూమి మీదకు రాడు. మనం ఒక మనోవికారముతో పుట్టినప్పుడే మనస్సును నిశ్చలము చేయుటకై ప్రయత్నిస్తాము.
దీనికి భాష ఎంతో అవసరం. హిందువులు భాషాజ్ఞానం కలిగించే దేవత సరస్వతీదేవిని పూజిస్తారు. కొన్ని పదాలను ఒక మహోత్తరమైన కార్యానికి ప్రయోగిస్తే, అవి మనను ఉత్తేజ పరిచి, పైకి లేపి, జ్ఞానాన్ని కలిగిస్తాయి. భాష గొప్ప కవుల, రచయితల, వక్తల వలన మనకు విదితమౌతుంది. వారే లేకపోతే ఈ ప్రపంచమి౦త వృద్ధి కాకపోయేది.
తామస ప్రపంచంలో పదములు లేవు. అన్నీ జంతువుల అరుపులే. మనస్సు మొరటుగా ఉంటుంది. మాటలు అక్కర్లేదు ఎందుకంటే మాట్లాడడానికి ఏమీ లేదు కనుక. వర్షాన్ని లెక్క చేయని వానికి వర్షానికి ఒక పదం ఎందుకు? అన్నిటికీ ఒకే పదాన్ని వాడవచ్చు, కాబట్టి క్రొత్త పదాలవలన లాభం ఏమిటి?
నేను కొన్నిసార్లు ప్రపంచమంతా రాతి యుగానికి వెళ్తున్నాదని తలుస్తాను. భాష స్వచ్ఛతను, సాహిత్యం అందాన్ని కోల్పోయి, పరస్పర సంభాషణ యాంత్రికంగా కొనసాగుతున్నాదని నాకు విచారం కలుగుతుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉత్తరం వ్రాయాలంటే, ఒక రచయితకు డబ్బిచ్చి ఆ పని చేయించవచ్చు. అక్కడినుంచి ప్రత్యుత్తరము ఒక కంప్యూటరు ద్వారా చేయించవచ్చు. మనకిష్టమైన వారు ఆసుపత్రిలో ఉంటే వారికి ఉత్తరం బదులు, గ్రీటింగ్ కార్డ్ పంపవచ్చు. నేను సినిమాకి వెళ్తే హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ గురించి సంభాషణ వచ్చినపుడు వారు వాడే భాషను విశ్లేషి౦చి ఆనందిస్తాను. రోమియొ జూలియట్ కు తన ప్రేమని ప్రదర్శించుకోవాలంటే ఒక వీడియో తీసి "దీనిని చూడు" అని చెప్పవచ్చు. ఈ విధంగా మన మధ్య సంభాషణ ఉంటే, మనకు తెలిసిందల్లా జంతువులలాగ ఉండడం.
వాక్ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. తామసికునికి వాక్చాతుర్యము లేక వాని ఆలోచనలు కుంటు పడతాయి. ఇది మనం టివి లో చూడవచ్చు. 1960 లో టివి కనుగొనిన తరువాత ఇప్పటి యువకులు రోజుకు ఐదారు గంటలు టివి చూస్తున్నారు. పీటర్ సెల్లర్స్ అనే రచయిత బీయింగ్ దేర్ అనే పుస్తకం జర్జీ కోజిన్స్కీ వ్రాసిన నవల ఆధారంగా చేసికొని వ్రాసేరు. అందులో టివి ప్రోగ్రాంలలో వాడబడే ఊత పదాలను విశ్లేషించేరు. వాటి వీక్షకులు అవి తప్ప వేరే పదాలను వాడక వారి బుర్ర మొద్దుబారింది. వారికి స్వతహాగా ఆలోచనలు లేవు. ఉన్న ఆలోచనలన్నీ టివి చూసి నేర్చుకొన్నవే. వారి భావ వ్యక్తీకరణ శోచనీయం. వారు మానసిక స్థితిని వ్యక్త పరచడం చేతకానివారు. వానికి బుర్రలో ఏ ఆలోచనలూ ఉండవు. వారిని ఉద్రేక పరుస్తే వారి సమాధానాలు జంతువుల వలె: క్రోధం, భయం, వైరం, ఆకలి, మొరటుగా ఉంటాయి. వీధిలో ఒక హృదయవిదారక ఘటన జరిగితే, టివి లో చూసే వార్తల లాగ, వారు స్పందించరు. వారికి ఎటువంటి విచారము కలుగదు. ఒకవేళ ఏమైనా స్పందిస్తే అది నీళ్ళ మీద వ్రాతలాగ కొంత వ్యవధిలోనే కనుమరుగైపోతుంది.
ఇప్పుడు రాజసికుని విషయానికి వద్దాం. మన నాగరీకత ఇప్పుడు రాజసిక దశలో ఉన్నది. తామసికుడు పర్యావరణాన్ని పట్టించుకోక ఏదో విధంగా బ్రతికేస్తాడు. కాని రాజసికుడు అలా కాక, పర్యావరణాన్ని నియంత్రిస్తాడు. దాని నుంచి లబ్ది పొందాలని తలుస్తాడు. ఇది తామసికునికన్నా ఒక మెట్టు పైది.
అగ్నిని మొట్టమొదట కనుగొన్నవాడు రాజసికుడు. తామసికుడు రాళ్ళ మధ్య ఒక చోట కూర్చొని ఉంటే రాజసికుడు ఆ రాళ్ళను ఉపయోగించి అగ్నిని పుట్టిస్తాడు. ఈ విధంగా ప్రోమిథియస్ అనే గ్రీకు వాస్తవ్యుడు అగ్నిని కనుగొన్నాడు. అతను తప్పక రాజసికుడు.
అలాగే ఒక పండు తిన్నాక తామసికుడు దాని అవశేషాన్ని బయట పారేస్తాడు. రాజసికుడు దాని విత్తనాలను భూమిలో పాతి, మొలకెత్తడం చూస్తాడు. వాడు ప్రతీదీ అధ్యయనం చేసి, ఎల్లప్పుడూ ఏదో ఒకటి తెలిసికోవాలన్న ఇచ్ఛగలవాడు. తామసికుడిలా కాకుండా వాడు ఆలోచనల పుట్ట. ఆలోచన కలగాలేకాని శరవేగంతో ముందుకు వెళతాడు.
నిజానికి రజస్ వలననే మన పురోభివృద్ధి సాధ్యమైనది. సమస్య ఏమిటంటే మనం దాంతో తాదాత్మ్యం చెందేము. దానిని మనము సమముగా ఉపయోగించకోక చిందరవందర చేసేము. దాని ఫలితంగా రజస్ సమస్యల చిక్కులను విడదీయడమే కాక, మునుపెప్పుడూ లేని క్రొత్త సమస్యలను సృష్టిస్తుంది. వాటి వలన మానవాళి అంతమయ్యే రోజు ఎప్పుడా అని అనిపిస్తుంది. దీనినుండి మనము సత్త్వము వైపుకు వెళ్ళాలి. మనము ప్రకృతి ఒకటేనని, మనలో ఉన్న దైవత్వము అన్ని జీవులలో ఉన్నదని తెలిసికోవాలి. అలా చేయక పోతే మనం సమస్యల వలయంలో చిక్కుకుంటాం.
రాజసికునికి ఒకటి అడ్డంగా వస్తే దాన్ని తొలగించడానికి మార్గం కనుగొంటాడు. అది అతని పురోభివృద్ధి యొక్క రహస్యం. తామసికుడు ఏమీ చేయకుండా చేతులెత్తేస్తాడు. మనం ప్రతి రోజూ చిన్న చిన్న కార్యాలు విజయవంతంగా చేస్తున్నామంటే మన పూర్వీకులలో యున్న రాజసికుల వలనే.
చిన్నపుడు ఒక సంఘటన జరిగింది. ఆర్గురం ఈతకై వెళ్ళాము. ఒకడు తనకు ఈత రాకపోయినా మాతో కలిపి ఈదుతానన్నాడు. మేము సరే అన్నాము. అందరం కలిపి నీళ్ళలో గెంతేము. ఆర్గురం మాత్రమే తేలేము. ఏడవ వాడిగురించి వెతుకుతే వాడు నది అడుగున కూర్చుని ఎటువంటి ఆందోళన చెందక ఉన్నాడు. వాడిని బయటకు లాగి ఇంకెప్పుడు మాతో రావద్దని చెప్పేము.
తామసికునికి ఇదే అవుతుంది. రాజసికుడు మరణాన్ని కూడా జయించాలని ప్రతి విషయానికి పోట్లాడుతాడు. వానికి చావుకై ఒకచోట వేచి చూడడు. ఏదో మంచో, చెడ్డో, కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక రాజసికుడు నీళ్ళలో పడి కొట్టిమిట్టాడి ఈది బ్రతికి బయటపడ్డాడు. వాడు నేర్చుకొన్న విద్యను పదిమందికి నేర్పేడు. ఈ విధంగా మానవాళిలో అనేకమందికి ఈత కొట్టడం వచ్చింది.
ఈ విధంగా రాజసికుడు మానవాళిని ఉత్కృష్టమైన స్థితికి తీసికువచ్చేడు. విచారకరంగా అదే ఇప్పుడు మనకు సమస్యలు తెచ్చిపెట్టింది. మనం రాజసికుడిలాగ ప్రతి సమస్యతోనూ అంతర్యుద్ధం చేయవచ్చు. లేదా మనం ప్రకృతితోనూ, ఇతరులతోనూ యుద్ధాలు చేసి బ్రతకవచ్చు. మొదటి దారి మనని సత్త్వ యుగానికి తీసికేళితే రెండవ దారి అధోగతి పాలు చేస్తుంది. 317
No comments:
Post a Comment