Bhagavad Gita
17.4
యజన్తే సాత్త్వికా దేవా న్యక్షరక్షా౦సి రాజసాః
{17.4}
ప్రేతా న్భూత గణాం శ్చాన్యే యజన్తే తమసా జనాః
సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్షులను, తామసులు ప్రేతములను, భూతగణములను పూజించుచున్నారు
మన శ్రద్ధను బట్టి మన జీవితాన్ని చూస్తాము. అలాగే మనం పూజించేవారు మన శ్రద్ధను బట్టి ఉంటారు.
మనం అనుభవించే ప్రపంచం మన ఇంద్రియాలను బట్టి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తారు. నా పెంపుడు కుక్క మూకా నేను వినలేని శబ్దాలు వింటుంది. అలాగే నేను ఆఘ్రాణము చేయలేని వాసనలను అది ఆఘ్రాణము చేస్తుంది.
ఇలాగే తక్కిన ఇంద్రియాలూ పనిచేస్తాయి. కాలిఫోర్నియా లో ద్రాక్ష రసం తో చేసిన మద్యం (wine) యొక్క రుచి చూడడానికి రమ్మని వాటిని తయారుచేసే సంస్థలు ఆహ్వానిస్తాయి. వారి ఉద్యోగులు కొందరు కళ్ళకు గంతలు కట్టుకొని ఏ మద్యం ఏ సంవత్సరపు ద్రాక్ష పంట నుంచి తయారుజేయబడినదో వాసనచూసి లేదా దాని రుచిని చూచి చెప్పగలరు. నాకైతే వాటన్నిటి రుచీ ఒక్కటే. కాని కొందరికి కొన్ని వందల రకాల ద్రాక్షల రుచులు తెలుసు.
ఇంద్రియాలు పరిమితమైనవైనా మన౦ వాటివలన తెలిసికునే విషయాలు మన శ్రద్ధ మీద ఆధార పడి ఉంటుంది. వాటిపై శ్రద్ధ ఎక్కువ పెడితే మనం అంత వేర్పాటుతో బ్రతుకుతాం. వాటిమీద శ్రద్ధ తగ్గించుకుంటే, మనం ఇంద్రియాతీత స్థితని, ఏ విధంగా మూకా యొక్క వాసనాలతో గూడిన ప్రపంచము యున్నదో, అనుభవిస్తాం.
మనం ఇంద్రియాలతో అనుభవించే ప్రపంచ౦ కొంత మటుకే మనకు గోచరిస్తుంది. అది పూర్తిగా నిజం కాకపోలేదు. మనం మన శరీరాన్ని ఘన పదార్థంగా చూడవచ్చు. కాని x-ray ఫోటోలో మన అవయవాలన్నీ కనిపిస్తాయి. ఎప్పుడైతే మన శరీరంతో తాదాత్మ్యం చెందమో, మన౦ చూసే ప్రపంచం కూడా మారుతుంది. నేను బాల్యంలో చూసిన ప్రపంచానికి, ఇప్పుడు చూసే ప్రపంచానికి, చాలా తేడా ఉంది. అది నిజం కాకపోలేదు. కానీ నేనిప్పుడు చూసే ప్రపంచం కొంతవరకే నిజం. బాల్యంలో నేను ప్రపంచం పైపైనే చూసాను. ఇప్పుడు ప్రపంచం లోపల చూస్తున్నాను. నేను అందరిలోనూ పరమాత్మ యొక్క స్పందన ఎలా ఐతే ప్రతి హృదయంలోనూ ఉందో, అనగా ఆత్మను దర్శిస్తాను. ధ్యానంతో సమాధి స్థితిచేరినవారు ఇలాగే చూస్తారు.
అ స్థితి గుణాతీతం. కాని సాత్వికుడు ప్రపంచంలో సూక్ష్మంగా ఉండే దైవత్వాన్ని చూస్తాడు. అందుకే గీత చెప్పినది "సాత్త్వికుడు దేవతలను పూజిస్తాడు".
ఉదాహరణకి నేను పెరిగిన గ్రామం గురించి చెప్తాను. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సాత్త్వికులని చెప్పలేం. కాని వందల సంవత్సరాలినుంచి వారి జీవన శైలి సాత్త్వికమని చెప్పవచ్చు.
నీరుపై వారి దృక్పథము వరుణుడు అని చెప్పబడే దేవత. ఒక మంచి హిందువు మనకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోయినా, నీరుని దేవతగా భావించి, దానిని పూజిస్తాడు.
నేను పెరిగిన కేరళలో నీరు నిర్మలమై, శుద్ధంగా ఉండేది. దానిని గౌరవంతో చూసి ఎవరూ కాలుష్యం చేయరు. కేరళకి వెళ్ళిన ఒక అమెరికన్ అది ప్రస్తుత కాలంలో కూడా అలాగే ఉందని అన్నారు. నదులు, ఏర్లు ఇప్పటికీ స్వచ్ఛంగా ఉంటాయి. అది నీరుని దేవునిగా పూజించడం వలన. దానిని వృధా చేయక, శుద్ధంగా ఉంచబడినది.
రాజసికులు, తామసికులు నీటిని అవమాన పరుస్తారు. సాత్త్వికులు ఊహించే ప్రపంచం ఇక లేదు. నేనీమధ్యన లాంగ్ ఐలాండ్ సముద్రపుటొడ్డులలో విసిరేసిన ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి ఉన్నాయని చదివేను. ఇదంతా అపవిత్రీకరణ.
గీత అనేది అన్ని జీవులలోనూ దైవత్వం ఉందని. దానిని మనమందరమూ గౌరవించాలి. పర్యావరణాన్ని సాత్త్వికుడు గౌరవించి, తగినంతగా వాడుకొని, దానిని రక్షిస్తూ ఉంటాడు. అది మనమేదో యుద్ధం చేసి గెలుచుకున్నట్టు కాదు. కాని ఆసురికుడు ప్రకృతిని --మనము దానిలో ఒక భాగమైనప్పటికి -- నియంత్రించి దాని నుండి లబ్ది పొందాలని తలుస్తాడు. వానికి తెలియనిది ప్రకృతి తో యుద్ధం చేస్తే అది మనమీద యుద్ధం చేసికొన్నట్టే. వాని ఉద్దేశం ప్రకృతిని ఇష్టం వచ్చినట్లు వాడుకోవాలి. కానీ ప్రకృతిని హీన పరిస్తే మనను మనం హీన పరచుకొన్నట్టే.
కొందరి శ్రద్ధ దృష్ట్యా కావలిసినంత వనరులు వృధా చేసికోవచ్చు అని. ప్రెసిడెంట్ ఐసెన్ హోవెర్ ను ఆర్థిక మాంద్యంలోనుంచి బయటపడడం ఎలాగ అని అడిగితే "కనపడినది కొనండి" అని సలహా ఇచ్చేరు. ఇప్పటికీ అదే సలహాను పాటిస్తున్నాం. కోటిలో ఒక్కరు మనం కొన్ని వేల పరిశ్రమలను అక్కరలేని వస్తువులను తయారుచేయడానికి నడుపుతున్నామని చెపుతారు. ఆర్థిక శాస్త్రవేత్తలు అందరినీ బజారులో వస్తువులను కొనమని ప్రోత్సాహిస్తారు. అది అవసరమున్నా లేకపోయినా సరే. మనం ఎందుకు అలా కొనాలి? మనకు వాటి వలన ఉపయోగం లేక పోయినా లేదా అవి పర్యావరణానికి హాని కలిగించే వైతే ఎందుకు కొనాలి? అలాగే మనకి ఒక వస్తువువలన ఉపయోగం ఉన్నా, గీత చెప్తుంది, "నీకది అవసరం లేక పోతే, దాన్ని కొనకు. వేరొకరికై ఉంచు". ఇది ప్రేమ క్రియా రూపం దాల్చిన విషయం.
క్రిందటి వారం నా మిత్రులలో 5 మందికి క్యాన్సర్ సోకింది. అది నన్ను చాలా కలవర పరచింది. ఎందుకంటే అది మనం చేజేతులా చేసికొన్నది. అక్కరలేని వస్తువులను పరిశ్రమలు తయారుచేయడం వలన క్యాన్సర్ ప్రబలుతోంది. ఎందుకంటే శాస్త్రజ్ఞులు మన శారీరిక సంభందిత (organic) కృత్రిమ రసాయనాలు 50 వేల కు పైగా కనుక్కొన్నారు. వాటి పర్యావసానము మన శరీరాల మీద చూపుతుందో లేదో అని అధ్యయనం చేయక, మనమందరము కలసి ఉండే పర్యావరణంలో వాటిని విడుదల చేసేరు. మరొక ప్రక్క క్యాన్సర్ ను కలుగ జేసే సూక్ష్మ క్రిమి (virus) ఏమైనా ఉందేమోనని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు.
పురోభివృద్ధిని కోరేవారు ధనం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని అనుకుంటారు. వారికి భరోసా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లోని వనరులు. ఆ దేశాల వనరులను కాపాడి, పెంచి, పెంపొందించి తగినంతగా వాడుకోవాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. సంపన్న దేశాలు పేద దేశాల వనరులు తమకే చెందుతాయని, తమ సుఖాలకే పనికివస్తాయని అనుకుంటాయి.
జాగా మరొక విషయం. ఒకప్పుడు అపరిమితమైన జాగా ఉందని తలచేవారు. జాగాని ఏమైనా చేయవచ్ఛనే ఆలోచనలు ఈ విధంగా ఉండేవి: దాని మీద భవంతులు కట్టవచ్చు, వ్యవసాయం చేయవచ్చు, జంతువులకు పచ్చిక పెంచవచ్చు, దానిలోని ఖనిజాలు త్రవ్వ వచ్చు, వ్యర్థాలను దానిమీద పడేయవచ్చు మొదలైనవి. కాలిఫోర్నియా వంటి ప్రదేశాల్లో వనరులు ఎక్కువగా ఉండడం వలన పరిమితులు గురించి ఎవరూ పట్టించుకునేవారు కారు. వృధాని సహించేవారు. నిజానికి కూడిక చేయటమంటే మిగతావాళ్ళకంటే ఎక్కువ ఖర్చుపెట్టాలని.
ఈ కాలంలో వ్యవసాయానికి పనికివచ్చే సాగు భూమి కరవైపోతోంది. సాగు భూమిని వృధా చేయకుండా ఉపయోగించాలనే జ్ఞానం అందరికీ రావాలి. కాని కొందరు వాని పరిమితిని అంగీకరించరు. వారి ఉద్దేశంలో సాంకేతిక జ్ఞానంతో ఉన్నదానికన్నా అనేక రెట్లు పండించవచ్చు. రసాయనాలు, క్రిమి సంహారక మందులుతో సాగు భూమిను౦డి ఎక్కువ దిగుబడి తెచ్చుకోవచ్చు అనేది వారి భావన. అలాగే యంత్రాలతో సాగు చేసి ఎక్కువ పంటను పండించవచ్చు. ఎవరు చెప్పేరు మనం పొదుపు చేయాలని? మనం గొప్పవారమైతే వెళ్ళేది మీదకే.
రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం మనం మందులకు అలవాటు పడినట్లే. తల్లి భూమిని రసాయనాలను ఒక వ్యసనం గా మార్చేము. మొదట్లో పంట ఎక్కువగా రావచ్చు. ప్రతి ఏడాది ఫోస్ఫేట్ ఎరువుల వలన భూసారం తగ్గుతుందని తెలిసికొన్నాం. ఒకవేళ మరుసటి సంవత్సరం ఇంకా ఎక్కువ ఫోస్ఫేట్ ఎరువు వాడితే, భూసారం ఇంకా ఎక్కువగా తగ్గుతుంది. క్రిమి సంహారక మందులు అలాగే పనిచేస్తాయి. వాటిని ఎక్కువ వాడుతున్న కొద్దీ మొక్కలకు రోగ నిరోధక శక్తి తగ్గి, పంట దిగుబడి తగ్గుతుంది. ఒక రచయిత "DDT ని మొక్కలు ఆహారం అనుకొని భుజిస్తాయి" అని వ్రాసేడు. ఎలాగంటే ఆవులు, చేపలు, తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ను ఆహారం అనుకొన్నట్టు.
క్రిమిసంహారక మందుల తయారీలో పనిచేసే వారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అవి వాడబడిన కూరగాయలు, పండ్లు తింటే అవి మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యం కలిగించవచ్చు. శాస్త్రజ్ఞులలో అవినీతి పరులు, పెద్ద పెద్ద సంస్థలనుండి డబ్బు తీసికొని, క్రిమిసంహారక మందుల వలన ఎటువంటి నష్టం కలుగదని చెప్తున్నారు. వాటిలో అతి తక్కువ మందులు విష పూరితం, కాబట్టి ఎందుకు భయపడడం? నిజానికి వారి వాదన తప్పని నిరూపించడానికి చాలా కాలం పడుతుంది. మనకి కలిగే ఎన్నో వ్యాధులకు -- నరాల వ్యవస్థకి ముప్పు, పుట్టుకతో అంగవైకల్యం, సంతాన విహీనత, రోగ నిరోధక శక్తి క్షీణించడం, క్యాన్సర్ -- ఒకే కారణముందని చెప్పలేము. కాబట్టి క్రిమిసంహారక మందుల వలననే అవి కలుగుతాయని గంటాపథంగా చెప్పలేము. ధూమపానం, ఆస్బెస్టాస్, బొగ్గు ధూమం, x-rays వలన కలిగే వ్యాధుల పరిశోధన కొన్ని దశాబ్దాల పాటు సాగింది. ఇదే విధంగా క్రిమిసంహారక మందుల గూర్చి కూడా పరిశోధనలు సాగుతున్నాయి. వాటి నిర్ణయం ఈ తరంలోకాక వచ్చే తరంలో జరుగవచ్చు. అంతవరకూ ఈ శాస్త్రజ్ఞుల పేరు ప్రఖ్యాతలకు ఏ ఢోకా లేదు. కీర్తి గొప్ప భోజన పదార్థమైతే, చచ్చినవారు దాన్నే తింటారు. అలాగే అపకీర్తి. కానీ ఎవరూ కర్మనుండి తప్పించుకోలేరు. మనం క్రిమిసంహాకార మందులు వాడే వారిని వాటి వాడకం క్షేమమని నిరూపించ మని అడగగలగాలి. అలా అయితేనే వాటిని మనం పరిశ్రమలలో తయారుచేసి, వాటి సహాయంతో పండించిన కాయగూరలు, పండ్లు తినాలి. కానీ అంత వరకు లాభానికై ప్రజలమీద ప్రయోగాలు చేయడం మంచిది కాదు. 331
No comments:
Post a Comment