Bhagavad Gita
17.5
అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపో జానాః
{17.5}
దమ్భాహంకారసంయుక్తాః కామరాగ బలన్వితాః
కర్శయన్త శ్శరీరస్థ౦ భూతగ్రామ మచేతసః
{17.6}
మాం చై వాన్తశ్శరీరస్థ౦ తాన్విద్ద్యసుర నిశ్చయాన్
శాస్త్ర విరుద్ధమైనట్టి భయంకర తపస్సును దంభాహంకారములతో కామరాగ బల సమన్వితులై ఎవ్వరు ఆచరించుచున్నారో, వారు శరీరములోని జ్ఞానేంద్రియములను, నన్నును కృశింపజేయుచున్నవారై యున్నారు. అట్టి ఆవివేకులను అసుర ప్రవృత్తి గల వారినిగ తెలిసికొనుము
మనిషిని రెండు దృక్పథాలతో చూడవచ్చు: ఒకటి భౌతికం. అది అన్నిటికన్నా హీనం. కాని అది నిజం కాదు, ముఖ్యంగా మానువుని పరిణామంలోని మొదటి దశలో. రెండవది జ్ఞానులు చెప్పేది అయిన ఆత్మ.
గీత మనిషిని భౌతికంగా చూడడాన్ని ఖండించదు. గీత చెప్పేది అది మన జ్ఞానంలో మొదటి మెట్టు. భౌతికంగా మనము వేర్పడి యున్నాము. అందువలననే ఒంటరితనము, అభద్రత, బంధాలను నిలుపుకొనలేకపోవుట జరుగుచున్నది. చివరిగా ఇది హింసకి దారి తీస్తుంది. ఎందుకంటే సమిష్ఠిలో భౌతికమైన ఎరుక మనుష్యుల మధ్య వైరం, ఆర్థికంగా పోటీ, దేశాల మధ్య యుద్ధం కలుగుచున్నవి. అందువలన జీవితాన్ని భౌతిక౦గా చూస్తే తప్పులేదు, కానీ అది భయంకరమైన పర్యావసానము కలది. గాంధీ గారు చెప్పేరు: మనిషి అధోగతికి గాని ఉన్నత స్థితికి గాని పరిమితిలేదు. అది వినడానికి ఇంపుగా లేకపోయినా ఈ నాటి క్లిష్టమైన కాలంలో వినక తప్పదు.
ప్రతి గుణానికి ఒక నమ్మకం, పూజించు విధానం ఉన్నది. సత్త్వ గుణం అంటే త్యాగం: ఇతరులకై తనకన్న ముందు ఆలోచించడం, ప్రతి వొక్కరిలోను దైవత్వాన్ని చూసి సేవించడం. రాజసికులకు, తామసికులకు వేరే విధానం ఉంది. నాటి కాలంలో మతం పేరుతో దేహాన్ని బాధించి తమ కామ్య వస్తువులను పొందడానికి తపస్సు చేసేవారు. ఇది ఇప్పటికీ ప్రాయశ్చిత కర్మ రూపేనా ఉన్నది.
ఉదాహరణకి ధూమపానం ఒకరకమైన పూజ. ధూమపానం చేసే వ్యక్తి తనలోని లాలస కొరకై ఆ ఆచారాన్ని పాటిస్తాడు. ఎక్కువగా ధూమపానం చేసేవారు అది ఒక ఆచారమని చెప్తారు. ఎవ్వరికీ ఊపిరి తిత్తుల్లో పొగనుంచుకోవడం ఇష్టం లేదు. దానివలన ఉపశమనం లాలసను తగ్గించుకోవడం వలన కలుగుతుంది. ఇటువంటి అలవాట్లు శరీరాన్ని బాధిస్తాయి. అలాగే మన శరీరాల్లో నెలకొనే దైవంలో కూడా బాధను కలిగిస్తాయి.
ఇది ఒక వ్యాధిని పూజించడం. అగరబత్తిని వెలిగించడానికి బదులు సిగరెట్ ను వెలిగిస్తారు. మనం పురాతన కాలంలో మతాల పేరిట జంతువులను లేదా మనుష్యులను బలి చేసేవారని విన్నాం. దానికీ దీనికీ గల తేడా ఏమిటి? ఆజ్ టెక్ అనబడే అమెరికాలోని ఆదిమానవులు మంచి పంటకై ఆడవారిని నూతుల్లోకి తోసేవారని విన్నాం. ఈకాలంలో సిగరెట్ ల పేరుతో మగవారిని, ఆడవారిని కూడా బలి చేస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం సిగరెట్ లు తయారుచేసే సంస్థలు యుక్త వయస్కులిని ఆకర్షించేందుకు కోట్ల వ్యయంతో ప్రకటనలు చేస్తారు. వారు తొందరగా మరణించినా, ధూమపానం చేసే పెద్దవాళ్లకన్నా, ఎక్కువ కాలం బ్రతుకుతారు. అందువలన వాళ్ళు ఎక్కువ సిగరెట్ లు కొంటారు. సిగరెట్ లు తయారుచేసే సంస్థలు తమ వినియోగ దారులు ముందుగా మరణిస్తే లాభం ఏమిటని అడగవచ్చు. దీనివలన కలిగే కర్మ వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్ల కొలది సిగరెట్ వినియోగదారులు మరణిస్తున్నారు. గీత చెప్పేది ధూమపానం అసురులను పూజించడం లాంటిది.
వయోజనులు ధూమపానం తగ్గిస్తున్నారు. అది సమిష్ఠి పరంగా మంచిదే. కానీ దానివలన సిగరెట్ సంస్థలు నష్ట పోతున్నాయి. కాబట్టి వారు లాభసాటిగా వ్యాపారం ఎలా కొనసాగించగలరు? వారు ఆడవారిని, పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రకటనలు ఇస్తున్నారు. అలాగే మూడవ ప్రపంచం లేదా పేద దేశాలకు సిగరెట్ లను ఎగుమతి చేస్తున్నారు.
జాన్ హ్యూస్ అనే రచయిత క్రిస్టియన్ సైన్స్ మానిటర్ అనే పత్రికలో సిగరెట్ సంస్థల లాభం ఆసియా లో ఉండే వారల వలన వస్తున్నాదని వ్రాసేరు. సిగరెట్ సంస్థలు చెప్పేది: ఆ దేశాల్లో ఇప్పటికే అనేక సంస్థలు సిగరెట్ లను తయారు చేస్తున్నాయి. మేము క్రొత్తగా ప్రజలకు సిగరెట్ అలవాటు కలిగించటంలేదు. అక్కడి సిగరెట్ సంస్థలతో పోటీ మాత్రమే పడుతున్నాం. ప్రసార మాధ్యమాలలో పాశ్చాత్యులను అనుసరించి ప్రకటనలు ఇవ్వడం వలన గొర్రెల వలె ప్రజలు వారిని అనుకరిస్తున్నారు. ధూమపానం పురోభివృద్దిని, అంతస్తును సూచిస్తుంది. విస్తృతంగా ప్రకటనలు ఇస్తే విమర్శికులు చెప్పేది: అంతకు ముందు సిగరెట్ అలవాటులేని అనేకమైన పిల్లలు, స్త్రీలు బలి అవుతున్నారు.
పేద దేశాలలో సమిష్ఠి ఆరోగ్యము బాగాలేదు. వారి ఆయుర్దాయము సంపన్న దేశాల పౌరులకన్నా తక్కువ. వినియోగదారులకు ఎటువంటి భద్రత లేదు. అలాగే సిగరెట్ సంస్థలు నాశి రకం పొగాకుతో చేసిన సిగరెట్లు పేదదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సంపన్న దేశాల్లో ఎక్కువగా అమ్మడానికి వీలులేని చట్టాలు ఉన్నా, వారు పేదదేశాల్లో విచ్చల విడిగా అమ్ముతున్నారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితికి మనం కూడా ఒక విధంగా బాధ్యులమే. మనం కడుతున్న పన్నులు ప్రభుత్వ పరంగా సిగరెట్ ఎగుమతులను పెంచడానికి వాడుతున్నారు. అలాగే సిగరెట్ సంస్థలకు మద్దతు ఇస్తున్నారు.
చైనా, రష్యా, జపాన్ దేశాల్లో ప్రభుత్వమే అతి పెద్ద సిగరెట్ సంస్థలను స్థాపించింది. అమెరికాలోని సంస్థలు ఇప్పటివరకూ ప్రభుత్వ హయాంలో లేవు. అలాగే కోట్ల సొమ్ము ప్రకటనలకై ఖర్చు చేస్తున్నారు. అది పేద దేశాల వ్యవసాయానికి సహాయం చేస్తే ఎంత బాగుంటుంది? సంపన్న దేశాల సంస్థలకు నిజాయితీగా లాభం వచ్చి, పేద ప్రజలకు చెడు అలవాట్లను అంటగట్టకుండా ఉంటుంది.
No comments:
Post a Comment