Thursday, March 10, 2022

Chapter 17 Section 6

Bhagavad Gita

17.6

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః {17.7}

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిము౦ శృణు

సర్వజనులకు ఆహారము కూడ మూడు విధములుగ ఇష్టమగుచున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము, కూడ మూడు విధములుగ ప్రియమగు చున్నది. ఈ భేదమును ఆలకించుము

ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః {17.8}

రస్యా స్ప్నిగ్దాః స్థిరా హృద్యా ఆహారా స్సాత్త్విక ప్రియా

ఆయువును, సత్త్వగుణమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, సంతోషమును వృద్ధిచేయునవియు, రసవంతములైనవియు, చమురు గలవియు, చిరకాలముండునవియు, మనోహరము లైనవియునగు ఆహారములు సాత్త్వికులకు ప్రియములు

కట్వామ్లలవణా త్యుష్ణ తీక్షరూక్ష విదాహినః {17.9}

ఆహారా రాజసస్వేష్టా దుఃఖశోకామయప్రదాః

చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురు లేనిదిగను, దాహము కలుగ జేయునదిగను, దుఃఖమును, శోకమును కలుగజేయునవియును, అగు ఆహారములు రజోగుణము గలవారికి ప్రియములు

యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ {17.10}

ఉచ్ఛిష్టమపి చామేధ్య౦ భోజనం తామసప్రియమ్

వండిన తరువాత ఒక జాము నిలువ యున్నదియు, రసహీనమైనదియు, దుర్గంధమైనదియు, ఒకరోజు నిలువ యుండినదియు, తినగా మిగిలినదియు, అశుద్ధమైనది యును నగు భోజనము ఏది కలదో అది తామసులకు ప్రియమైనది ఀ

మనం చేసే ప్రతి కార్యములోనూ శ్రద్ధ ఉంటుంది. అందువలన, ఒక అనుభవశాలి అయిన ఆధ్యాత్మిక గురువు ఒకటి రెండు నిమిషాలలో ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసికోగలడు.

మనకు రుచిని తెలిపే ఇంద్రియము నాలుకకు మనస్సుకు చాలా దగ్గర సంబంధముండి, మనకు ఇష్టాయిష్టమైన రుచులు తెలియబడతాయి. సాత్త్వికుడు ఆహారము సహజంగా ఇచ్చే అనుభూతిని పొందుతాడు. ఆహార౦ సహజంగా అనుభూతిని ఇవ్వకపోతే, అది వ్యర్థం. అది తాజాగా, రుచిగా -- అనగా నూనెలో వేచడం, ఉప్పగా చేయడం వలన కాక-- ఉండి మితంగా తినబడాలి.

సాత్త్వికమైన ఆహారము మన ప్రాణాన్ని లేవనెత్తాలి. అనగా మన శక్తిని, చైతన్యాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఉత్తేజ పరచాలి. శ్రీకృష్ణుడు చెప్పే విషయం అటువంటి ఆహారాన్ని ఎలా ఆస్వాదించాలో. మన శ్రద్ధ చెప్పేది ఏమిటంటే చెత్త తిండి మనకు సుఖం ఇస్తుందని. పోషకాహారము అంటే మంచిదే కాని మనకు ఆనందం ఇవ్వదని అపోహగలదు. ఇది మన విలువలు ఎంత వక్రంగా ఉన్నాయో సూచిస్తుంది. చెత్త తిండి మన ఆనందాన్ని హరిస్తుంది. ఒక పండిన పండును, చెట్టు నుంచి కోసి, "ఆహా ఇది ఎంత మధురంగా ఉందో. దుకాణాల్లో ఇటువంటివి ఎందుకు అమ్మరు?" అనేవారు అతి తక్కువ మంది. కాని వారు భోజనానికి తోటలో పండిన కూరగాయలను తాజాగా ఉన్నా సరిగా వండుకొని తినరు. వాటిని వేపించి, వాటిపై ఉప్పు, కారం, కృత్రిమ రసాయనాలతో కూడిన మసాలా దినుసులు పోసి వండి తింటారు. ఇదంతా తప్పుడు శ్రద్ధ. మన నాలుకను నియంత్రించి, ఆహారం గురించి తప్పుడు సమాచారాన్ని మరచి, సహజంగా భోజన పదార్థాలను పొందికగా వండి తింటే చెత్త తిళ్ళను తినబుద్ధి కాదు. అలాగే మనకు ఉప్పు, చక్కెర ఎక్కువగా వేసి, కృత్రిమ రసాయనాలతో కూడిన ఆహారం రుచిగా అనిపించదు. దుకాణంలో నెలల తరబడి నిలువ చేసిన ఆహారం కొనుక్కొని వండుకుని తినడం మనకు రుచించదు.

ఆధ్యాత్మిక జీవనమంటే చప్పవి తినడమని కాదు. మన౦ రుచిగల ఆహారాన్ని తినాలి. దానికి అవసరమైన దినుసులు ప్రాణాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని పెంపొందించేవిగా ఉండాలి. అందరూ తింటున్నారని అదే పనిగా చెత్త తిండి తినకూడదు.

శ్రీకృష్ణుడు "రాజసికులు చేదు, పులుపు లేదా ఉప్పు గా ఉన్న పదార్థాలను ఎక్కువగా తింటారు" అని చెప్పెను. అట్టి తిండ్లు ప్రతి రెస్టారెంట్ లేదా హోటల్ లోనూ చేస్తారు. చాలా మంది బీర్ తాగేవాళ్ళు అది ఎంత చేదుగా ఉంటుందో అన్న విషయం పట్టించుకోరు. ఆ రుచికి అలవాటు పడాలంటే కొంతకాలం బీర్ తాగాలి.

భారత దేశంలో సాంప్రదాయక వంటలో ఘాటైన మసాలా దినుసులు వాడుతారు. ఆహారము ఎంత కారంగా ఉంటే అంత రుచిగా ఉంటుందని భావిస్తాం. భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత సర్ సి వి రామన్ నోరును ఒక తెరిచివున్న పుండని చెప్పెను; కారం గల ఆహారం తినడమంటే పుండు మీద కారం జల్లినట్టు. అట్టి రుచి భారతీయులకు అలవాటైపోయి అనేక అవస్థలు పడుతున్నారు. నేను నా నోరును నియంత్రించి రుచిని అతి కష్టంతో మార్చకొన్నాను. ఉదాహరణకు నేను ఆకు కూరను సున్నితంగా వండి దానిలో వెన్న వేసికొని తింటాను. సాత్త్వికునకే సహజమైన రుచి తెలుసు. రాజసికుడు సహజమైన రుచిని మసాలాతో లేదా కృత్రిమమైన రసాయనాలతో కప్పి పుచ్చి తింటాడు.

రాజసికుడు ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్ని కూడా తింటాడు. వాడు నాలుక మండే, ఇబ్బంది కలిగించే ఆహారాన్ని కోరుకొంటాడు. గణాంకాలు చెప్పేది నూటికి 40 మంది పీకలదాక తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకొంటారు. దానివలన మనకు కడుపు మంట లేదా నొప్పి కలిగితే ఏంటాసిడ్ మాత్రలు వేసుకొంటాము. ప్రతి రోజూ అలాగే చేసి దాని పర్యావసానాన్ని విస్మరిస్తాము. అలాగే బరువు ఎక్కువై, మన పట్టుదలను సడలించి, మున్ముందు అనేక రోగాలకు గురౌతాము.

నేనీమధ్య "భర్తను ఎలాగ చంపాలి" అనే అంశాన్ని పత్రికలో చదివేను. దాని సారాంశం ప్రభుత్వం సిఫారసు చేసే ఉప్పు, కొవ్వుతో కూడిన అమెరికన్ తిండి తింటే వేగ౦గా కాటికి చేరుతారని. మనం తిన్నదాల్లో ఎంత శాతం హాని కలిగించదు? ఈ రోజుల్లో వాడే కృత్రిమ రంగులు, 0 కాలరి కృత్రిమ పంచదార, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వచేసికోడానికి వాడే రసాయనాలు, మొదలగునవి మద్యంతో కలిపి మిక్కిలి హాని కలిగిస్తాయి.

గీత చెప్పేది తామసికుడు అతి ఉష్ణంతో వండినవి, చప్పవి, క్రుళ్లినవి, కల్తీవి తింటాడు. కల్తీవి అంటే బియ్యంలో రాళ్ళని కలపడం మాత్రమే కాదు. కృత్రిమ రంగులు, రసాయనాలు కలిపినవి కూడా. క్రుళ్లినవి అంటే కాన్ లలో అమ్మే నిలవ ఆహారం. ఉదాహరణకి టొమాటోలు తీసుకుందాం. వాటిని పండించి కాన్లలో పెట్టి ఒకటి రెండు నెలల తరువాత దుకాణానికి తీసికెళ్తారు. దుకాణంలో అవి ఉంకో నెల పడి ఉంటాయి. తామసికుడు దానిని కొని ఒక నెలపాటు ఇంట్లో ఉంచుతాడు. ఈ విధంగా 3 నెలల క్రిందటి టొమాటోలను ఆవురావురుమని తింటాడు. వానికి తాజా టొమాటోలు ఇస్తే, తీసికోక కాన్ టొమాటోలే ఇష్టపడతాడు.

ఫిలిప్ వైలీ అనే రచయిత ఇలాగ వ్రాసేరు: "అమెరికన్ లు తినే ఆహార పొట్లాలు చాలా అందంగా ఉంటాయి. అవి సాధారణంగా కల్తీ కానివి, శుభ్రంగా ఉన్నవి. అవి ఎక్కువకాలం నిల్వ ఉండడానికి శీతలీకరణ యంత్రాలు వాడుతారు. కానీ అది ఒక సంవత్సరం తరువాత తింటే నోటికి రుచించదు. అది కళ్ళకు ఇంపుగా ఉంటుంది. కళ్ళతో ఎవరైనా తింటారా?" రాజసికులు, తామసికులు అటువంటి ప్రశ్నలు అడగరు. సాత్త్వికమైన ఆహారం చూడడానికి మరియు తినడానికి బాగుంటుంది. ఈ రెండు గుణాలు రజస్, తమస్ తో గూడిన ఆహారానికి లేవు.

వైలీ ఛీస్ గురించి ఇలా చెప్పేరు: పూర్వం చీస్ చిన్న చిన్న సంస్థలు తయారుచేసి ప్రక్కనే ఉన్న దుకాణాలకి సరఫరా చేసేవారు. వాటిలో అనేక రకాలైన రుచులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తాజా చీస్ ని అనుభవించేవారు.

ఈ పాత కాలంనాటి చీస్ దూర ప్రదేశాలకి పంపడానికి వీలు కాదు. నేను అడిగేది వీలు కానిది ఎవరికి? పెద్ద పెద్ద ఆహార పదార్థాలను అమ్మే దుకాణాలు అడిగేది చీస్ అతి దూర ప్రదేశానికి పంపబడాలి, నిల్వ చేయగలగాలి. వాళ్ళకు కావలసినది లాభం. వైలీ "పరీక్షల వలన తేలిందేమిటంటే చాలా మంది వారికి ఏది దొరికితే అదే కొంటారు. " అన్నారు. వైలీ శాస్త్రజ్ఞులను వేలెత్తి చూపేరు. వారి వలననే ప్రజలు మోసపోతున్నారు. సైన్స్ మంచిదికాదు, చెడ్డది కాదు. నేను అనేది ఇది మన లోభం వలన. మితిమీరిన ధనదాహం వలన. వినియోగదారులు ఏది దొరికితే అది కొంటే, ఇక నాణ్యత అవసరం లేదు. చీస్ చేసేవారు నాణ్యతను నేల రాస్తే, ఇక మిగిలింది లాభసాటికే. ఎవ్వరూ నష్టానికి అమ్మరు. కానీ నాణ్యత లేని వస్తువును మన వీపుకు రుద్దుతున్నారు. అలాగే నాణ్యత మీద ఖాతరు లేకపోతే: నిల్వ కాలం, ధర, ఏ దుకాణంలో కొన్నా ఏకాకృతి మొదలైనవి ముఖ్యం.

ఇంకా వైలీ ఇలా వ్రాసేరు: "తక్కువ ధరకి ఎక్కువ పరిమాణం, ఎక్కువ నాణ్యత గల ఛీస్ ని చేయడం అతి కష్టం. అలాకాక తక్కువ నాణ్యత, తక్కువ ధర, నిల్వ ఉండే చీస్ దేశకాల పరిమితులు లేకుండా కూడా చేయడం కుదరదు. ఉదాహరణకు ఒక ఊరిలో డిసెంబర్ నెలలో కొన్న ఛీస్ ఉంకో వూరులో ఏప్రిల్ నెలలో కొన్న చీస్ తో పోలిక పెడితే, రెండూ ఒకే రుచి కలిగి ఉండాలి. అది సాధ్యం కాని పని. కాని ఏది సాధ్యం అంటే చప్పని, ఎవరికీ వర్తించని, ఎప్పటికీ పాడవ్వని --అనగా లెక్కపెట్టలేనన్ని రోజులు నిల్వ చేసుకోబడే -- చీస్ అతి తక్కువ ధరకు తయారు చేయడం. ఇంకా రెండు రుచికరమైన చీస్ ముక్కలను తిని ప్రజలు భిన్న అభిప్రాయాలకు రావచ్చు. కానీ రుచి-పచి లేని నిల్వ చీస్ తిని అందరూ ఏకీభవిస్తారు.

ఛీస్ చేసే సంస్థలు ఒకే రకమైన ఛీస్ తక్కువ ధరకు -- అనగా దానిని శీతలంలో ఉంచడానకి, దూరంగా తరలించడానికి అయిన ఖర్చులు మినహాయించి--ప్రపంచమంతా అమ్మగలరు. అందువలన చిన్న తరహా ఛీస్ చేసే సంస్థలు చాలామటుకు మూత బడ్డాయి. మిగిలినవారు తమ ఛీస్ ను నాణ్యతతో చేసి ఎక్కువ ధరకి మాత్రమే అమ్మగలుగుతున్నారు. ఇటువంటి సంఘటన గాంధీ గారికి నచ్చదు. ఈ కాలంలో ఛీస్ కి బదులుగా అనేక పదార్థాలు వాడుతున్నారు. వేరే విధంగా చెప్పాలంటే, మనము సంస్థలకు "మీరు ఇష్టం వచ్చినట్లు మార్పిడి చేసికోవచ్చు, కాని ధర మాత్రం తక్కువ ఉండాలి" అని చెప్పేం.. కాబట్టి, ఎవరు ఆ సంస్థలను తప్పు బట్టగలరు? మనం నాణ్యత గల వస్తువులను అమ్మే చిన్న చిన్న సంస్థలను ప్రోత్సహించి, వారి ధరలు కొంచెం ఎక్కువున్నా వారి వద్దే కొనడం ఉత్తమం.

వైలీ కూరగాయాలగురించి చెప్పిందేమిటంటే: జన్యు మార్పిడి మొదలగు ప్రక్రియల ద్వారా శాస్త్రజ్ఞులు అనేక రకములైన కూరగాయలు, పండ్లు తయారుచేసేరు. ఇది వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. వారు చేయలేనిది రుచి. వారు చేసిన కూరగాయలను, పండ్లను ఎక్కువ కాలం నిల్వ చేసికోవచ్చు. అలాగే రైతులకు ఎక్కువ సౌకర్యం కలుగుతుంది. ఎలాగంటే బటానీ సెనగలు అన్నీ ఒకేమారు కోతకి సిద్ధం గా ఉంటాయి. కొన్ని రకాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ వుండి, క్రిముల వలన పంట అంత ఎక్కువగా చెడిపోదు. కానీ ఆ సెనగలు రుచి ఉడకబెట్టిన అట్ట ముక్కల లాగ ఉంటుంది.

జన్యు మార్పిడివలన ఇప్పుడు ఒకటి రెండు హైబ్రిడ్ సెనగలు రకాలు వాడుకలో ఉన్నాయి. 1954 కు ముందో కొన్ని వందల రకాల సెనగలు ఉండేవి. అవి కోతకి ఒకే మారు రాక పోవచ్చు, కాని అవి రుచికరంగా ఉండేవి. హైబ్రిడ్ రకాలు పెంచడానికి కావలసిన విత్తనాలు అతి తక్కువ సంస్థలలో చేస్తారు. వారి చెప్పుచేతల్లో రైతులుండాలి. వారి ఒక రాష్ట్రానికో, దేశానికో పరిమితం కావు. మొత్తం ప్రపంచానికి వారు సరఫరా చేస్తారు. ఇంతకుముందు ఒక చిన్న గ్రామంలో పంట చేతికందక పోతే, రాష్ట్ర సమిష్ఠిలో ధరలు పెరిగేవి కావు. ఇప్పుడు అలా కాక, దేశం మొత్తంలో పంట చేతికందక, ధరలు విపరీతంగా పెరుగుతాయి. చిన్న చిన్న రైతులు దివాలా తీస్తారు. పేదలు ఆకలితో అలమటిస్తారు.

వైలీ చివరిగా ఇలా అన్నారు: సైన్స్ చెప్పినవిధంగా పంటలు పండిస్తే డబ్బును ఆదా చేసికోవచ్చు. వారి చెప్పే పద్దతులతో ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసికోవచ్చు. ఇంట్లో పని తగ్గుతుంది. అంటే మన జీవితానికి పరమార్థం పని తగ్గించుకోవడం.

అనాలోచితంగా మనం ఒక విషయం ఒప్పుకొంటున్నాము: తినే ఆహారంలో నాణ్యత లేనట్లే, మన దేశ ప్రజల్లో కూడా నాణ్యత లేదు. మన ఆహారానికి వాడే కొలతలు, మన పిల్లలపై వాడితే, మనకి తెలివైన పిల్లలు అక్కరలేదు, తెల్లగా ఉంటే చాలు. అలాగే వాళ్ళు ఎంత వేగరంగా పట్టభద్రులవుతే అంత మంచిదని అనుకుంటున్నాము. ఇటువంటి తామసిక శ్రద్ధ మన మానసిక స్థితిని కుంటి పరుస్తుంది. కాబట్టి అది మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తుంది. ఇది అసలు సంగతి. రుచి ఒక్కటే కాదు. గీత చెప్పే విషయం, ఇంట్లో కలసి పని చేసి, కలసి భోజనం చేసి, కలసి శుభ్రం చేసే అవకాశాల వలన ఆ ఇంట్లోవారల బంధాలు గట్టిపడి, వారి జీవన శైలి యొక్క నాణ్యత పెరుగుతుంది. ఇది పని యొక్క మొదటి అంశం. దానికి సమయం వెచ్చించాలి. కష్ట పడాలి. కానీ దాని అసలు అర్థం మన౦ ప్రేమ, గౌరవము ఇచ్చి పుచ్చుకొని ఐకమత్యంతో ఉండాలి. 340

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...