Thursday, March 10, 2022

Chapter 17 Section 7

Bhagavad Gita

17.7

అఫలాకాంక్షి భిర్వజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే {17.11}

యష్టవ్య మేవేతి మన స్సమాధాయ స సాత్త్వికః

సముచితమైనదియే నని మనస్సుతో నిర్ణయించుకొని, శాస్త్ర సమ్మతముగా ఫలాపేక్షలేనివారి చేత ఆచరింపబడు యజ్ఞము సాత్త్విక మనబడుచున్నది

అభిసంధాయ తు ఫలం దమ్బార్థమపి చైవ యత్ {17.12}

ఇజ్యతే భారతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం

అర్జునా! ఫలాపేక్షతో గాని, దంభము కొరకు గాని చేయబడిన యజ్ఞము రాజస యజ్ఞమని తెలిసికొనుము

విధిహీనమసృష్టాన్న౦ మస్త్రహీసమదక్షిణమ్ {17.13}

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే

విధి రహితమైనదియు, అన్నదానము లేనిదియు, మంత్ర యుతము గానిదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ లేనిదియు నగు యజ్ఞము తామస యజ్ఞము అని చెప్పుచున్నారు ఀ

యజ్ఞము, హోమము, క్రతువు మొదలగునవి సాధారణముగా దేవతలను ప్రసన్నం చేసుకొనుటకు చేసే క్రియలు. యజ్ అనగా పూజించుట. నాకు యజ్ఞము అనగా ఆత్మార్పణం అనిపిస్తుంది. ముఖ్యంగా స్వార్థములేక మన సమయము, శక్తి, సామర్థ్యము, ఉత్సాహము ఉన్నతమైన లక్ష్యము కొరకు చేసేది. అట్టి సేవ దేవునికి నైవేద్యము. మనము ఎలాగ పని చేస్తాము, ఎవరికి సేవలందిస్తాము అన్నవి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.

నేటి నాగరీకత మానస స్థితిని పరిగణలోకి తీసికోదు. అది భౌతిక విషయాలు, కర్మలు -- ఏవైతే కొలత వేయగలమో, ముఖ్యంగా డబ్బుతో -- గూర్చి మాత్రమే పరిగణలోకి తీసికొంటుంది. దీనికి గీతకి ఉన్న తేడా భౌతికము మరియు ఆధ్యాత్మికము. మనం పత్రికలో ఒక సంస్థ బాగా నడుపుతున్నారని చదివితే, చెప్పకనే వారు డబ్బు విషయంలో లాభసాటి వ్యాపారం చేస్తున్నారని చెప్పబడుచున్నది. కాని ఆ సంస్థ సిగరెట్ లను అమ్మి లాభం చేసికొంటే గీత దృష్టిలో అది వైఫల్యం అయినది. దాని వ్యాపారము వెనుకనున్న మానసిక స్థితి తప్పక విపత్తుకు దారి తీస్తుంది. ఎందుకనగా అది నాటిన విషపూరిత బీజములవలన. నేను బూట్లు పోలిష్ చేసే వానిని, సిగరెట్ లు, మద్య౦, ఆయుధాలు అమ్మే వారికన్నా మిన్న అని తలుస్తాను.

వైద్యము మనకు కలిగిన రోగములను నయము చేయుటకై ఉన్నది. కావున మనం దానిని సాత్త్వికమైనదిగా భావిస్తాము. గీత చెప్పేది ఇక్కడ మానసిక పరిస్థితిని పరిశీలించమని. చాలామందికి తాము చేసే సేవ కన్నా తమకు కలిగే ప్రతిష్ఠకై ఉద్యోగాలను చేస్తారు. చెత్తలు తుడిచేవారు పేరుప్రతిష్ఠలకై తమ పనిని చేయటంలేదు. వారు చేసే సేవ అనిర్వచనీయం. రవీంద్రనాథ్ టాగూర్ ఒక పద్యంలో వీధిలూడ్చే వారి కర్మను యజ్ఞంతో పోల్చేరు. కుల వ్యవస్థలో అట్టి వారిని అట్టడుగు వర్గంగా తలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో కూడా వారిని హీనంగా చూస్తారు. గీత వారి కర్మను శ్రేష్ఠమైనదిగా చెప్తుంది. తక్కిన పేరుకై లేదా లాభానికై చేసే ఉద్యోగాలు దాని ముందు దిగతుడుపే అంటుంది.

గీత చూసేది ఒకని ప్రేరణ మాత్రమే కాదు, వాని పనిచేసే వైఖరిని కూడా. కొందరు వైద్యులు అనేక మందులు వ్రాసి ఇస్తే, వ్యాధికి మూల కారణం పోతుందని భావిస్తారు. అట్టివారు సాత్త్వికమైన వైద్యం చేయుటలేదు. ఇద్దరు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన వైద్యులు "బుద్ధిలేకుండా మందులు వ్రాసి ఇవ్వడం వలన అనేకమంది రోగులు మరణిస్తున్నారు" అని పేర్కొన్నారు.

నేను చదివిన పుస్తకాలలో, పనికిరాని మందులు ఇవ్వడం ఎందుకంటే, రోగులు వైద్యులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని అని వ్రాసేరు. అది నాకు అర్థంకాని విషయం. ఒక రోగి తనకు హాని కలిగించేది లేదా వృధా అయిపోయే ప్రక్రియను వైద్యునిని చేయమంటే, దానికి బదులుగా వైద్యుడు రోగికి బోధ పరచాలి. నాకు తెలిసి చాలా మంది వైద్యులు అట్లే చేస్తారు. వారి వైద్యం సాత్వికం. ఒక రోగి "నువ్వు నాకు నిద్ర వచ్చే మందు వ్రాసి ఇవ్వక పోతే నేను నీ దగ్గర వైద్యం తీసికోను" అంటే, వైద్యుడు రోగి అడిగినట్లు చేస్తే అది సేవ కింద రాదు. అట్టి వైద్యునుకి రోగి ఏ మందు అడిగితే అదే వ్రాసి ఇచ్చే వాడని అప్రతిష్ఠ కలుగుతుంది. అదే కాక ఆ వైద్యుడు తను చేసిన ప్రమాణం (hippocratic oath) విస్మరించినవాడు అవుతాడు. చాలామందికి తెలిసిన విషయమేమిటంటే నిద్ర మాత్రలు రోగాలను నయం చేయక, వాటికి అలవాటు పడేలా చేస్తాయి. వైద్యులు అట్టి మందులను ఎక్కువ వ్రాసి ఇస్తే దాని వలన రోగులకు నష్టం తప్ప లాభం లేదు.

అన్నిటికన్నా భయానకం ఈరోజుల్లో శస్త్ర చికిత్స చేయించు కొనడానికి ముందుకు వచ్చే రోగులు. నేను శస్త్ర చికిత్స కొన్ని సమయాల్లో అవసరమని ఒప్పుకుంటాను. కానీ ఎన్నో పనికిరాని శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవి చాలామటుకు అవసరం లేనివి. శస్త్ర చికిత్స అంటే శరీరానకి గాయం కలిగించుకోవడమే. అది ఎప్పుడ౦టే మనకు వేరే దారి లేకపోతే. లేదా శస్త్ర చికిత్స వలన ఆరోగ్యం ఎక్కువ మెరుగుపడితే అప్పుడు చేయించుకోవచ్చు. ప్రతి వైద్యుడు ఈ విషయంతో ఏకీభవిస్తాడు. అబ్రహాం మాస్లో చెప్పినట్లు, మన దగ్గర ఉన్నది సుత్తి మాత్రమే అయితే, అన్ని సమస్యలని మేకు వలె భావిస్తాము. ఒక శస్త్ర వైద్యుడు రోగాన్ని తనదైన దృక్పథం లో తను చదువుకున్నది, చూసినది, నేర్చుకున్నది రంగరించి తన బాధ్యత నిర్వహిస్తాడు. వాడు శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పేది వాని అనుభవం ఎప్పుడూ శస్త్ర చికిత్స చేయడమే కాబట్టి. ఉంకొక శస్త్ర వైద్యుడు కానివాడు మందులు మాకులు తీసికొమ్మంటాడు. నేను అనేది రెండూ కాదు, మనస్సును సరి చేసికో౦డని.

సాత్త్వికమైన వైద్యుడు తక్కువ మందులను వ్రాసి, అతితక్కువ శస్త్ర చికిత్స చేసి, దేహాన్ని దానంతట అదే నయం చేసుకునేటట్టు చేస్తాడు. రోగి యొక్క మానసిక స్థితిని బట్టి తాను చూడవలసిన వైద్యుడుని ఎన్నుకొంటాడు. నార్మన్ కజిన్ ఇలా చెప్పేరు: "దేహం, ఎంత జటిలమైన సమస్యతో కూడిన దైనా, తనంతట తానే నయమవ్వడానికి మనస్సు చేసే యత్నంను నేనెప్పుడూ తక్కువ అంచనా వేయను." సాత్విక వైద్యుడు లేదా ఉపచారిక (nurse) మన దేహం తనను తాను నయం చేసికోగలదని నమ్ముతారు. వారు ఎన్నటికీ రోగి నయంకాలేదని తలచరు. నేను పాడై పోయిన నాడులు కూడా తమను తాము పునః నిర్మించు కొంటాయని నమ్ముతాను. గాఢ ధ్యానం వలన దేహం, మనస్సు తమను తామే పునః నిర్మించుకొని పూర్వ స్వస్థ స్థితికి రాగలవు. కాని అలా జరగడానికి, వైద్యుడు మరియు ఉపచారిక రోగి యొక్క సంశయాలను తీర్చి, వానిలో స్వస్థమైన ఆలోచనలు కలిగించాలి.

ఈ విషయాలు వైద్య వృత్తికి సంభందించినవి అయినా వాటిని మరొక వృత్తికి వర్తింప చేయవచ్చు. విలియం జేమ్స్ మనం మన చుట్టూ గోడలు కట్టుకొని, మన పరిమితులకు లోబడి బ్రతుకుతాం అని చెప్పేరు. శ్రద్ధ ఇలా చేయిస్తుంది. మనందరిలో మానవ పరిమితులు--ఉదాహరణకు ఒక మైలు 4 నిమిషాలకు తక్కువగా పరిగెత్త లేము-- చాలా ఊహించుకొని బ్రతుకుతాము. నేను పరిమితులు లేకుండా బ్రతకమని అనటంలేదు. మనం చేసే జీవన యాత్ర పరిమితులకు లోబడి జరిగేది. కాని మన పరిమితులు --భౌతికమైన లేదా ఆధ్యాత్మిక మైన -- ఏమిటో మనకు చేసిచూపించే వరకూ తెలియదు. ఇది ఒక మంచి గురువు వలననే సాధ్యం. ధ్యానం శ్రద్ధ వలన కలిగే పరిమితులను త్రుంచి వేయ గలదు. గాఢమైన ధ్యానం వలన నయం చేయలేని వ్యాధిని కొన్నిసార్లు వెనక్కి లాగి నయం చేయవచ్చు. అలాగే వృద్ధాప్యం వేగిరంగా రాకుండా చేసికోవచ్చు. మనం ఎప్పటికీ జీవించి ఉండలేము. కానీ ఎవనికైతే ప్రాణం యొక్క మూలం తెలుసో, నిస్వార్థ సేవ చేస్తున్నాడో వానికి ఆయువు ఎక్కువ ఉంటుంది.

నార్మన్ కజిన్ ఇంకా ఇలా చెప్పేరు: "మన పరిమితులు మనలోని సహజమైన ఉత్సాహం, మన మనస్సు దేహానికి ఉన్న చైతన్యం వలన వాటంతట అవే తిరోగమిస్తాయి." సాత్త్వికులైన వైద్యులు, సహచారులు అట్టి సహజ స్థితిని ఉత్తేజపరుస్తారు. అదే కాకుండా ప్రతి ఒక్కడు ఉన్నత స్థితికి వస్తాడనే గాఢ నమ్మకం ప్రతి సాత్త్వికమైన వ్యక్తికి ఉంటుంది. అట్టి వారు ఏ కర్మలలో పాల్గొన్నా సరే. "ఒక రోగి తన వ్యాధిపై మానసిక శక్తి ప్రసరింప జేస్తే ఎటువంటి మందు మాకు ఇవ్వలేని ఉపశమనం పొందగలడు. ఈ నేపధ్యం లో ఒక మంచి వైద్యుడు రోగిని తనంతట తానే వ్యాధి విముక్తుడు కావడానికి దోహదం చేయాలి".

సాత్త్వికుడు కర్మ గురించి తాను ఏమి ఇవ్వగలడని ఆలోచిస్తాడు. రాజసికుడు తాను ఏమి పొందుతాడో ఆలోచిస్తాడు. మనందరిలో ఈ రెండు భావాలూ ఉంటాయి. నేను ఆల్డస్ హక్స్లీ జీవిత చరిత్ర చదివేను. ఆయనలో ఆధ్యాత్మికత చాలా ఉన్నదని తెలిసికొన్నాను. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి ప్రయత్నించిన వాడు, మేధావి, గొప్ప వ్యక్తి, మన సంస్కృతికి చిహ్నం, చక్కటి రచయిత. ఆయన ఇంకా స్వామీ ప్రభవానంద శిష్యుడు. ఆయన వ్రాసిన ది పెరిన్నియల్ ఫిలాసఫీ, ఎండ్స్ అండ్ మీన్స్ అనే పుస్తకాల ద్వారా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పాశ్చాత్యులకు వివరించేరు. కానీ ఆయనలోని రాజసిక గుణం వలన మాదక ద్రవ్యాలను వాడి ఇతరులకు అట్టి వానియందు మక్కువ కలిగించేరు. వాళ్ళ నమ్మిక మాదక ద్రవ్యాల వలన జ్ఞానము సులభంగా వస్తుందని. దాని పర్యావసానము నేటికీ చూస్తున్నాము. మనకు ఇలాంటి చాతుర్యం ఉంటే, ఇతరులకు మార్గ దర్శకులమయి ఉంటే, మనం చేసే ప్రతి కర్మా, చెప్పే ప్రతి మాట జాగ్రత్తతో కూడి ఉండాలి. లేకపోతే ఇతరులను తప్పు బాటన నడిపిస్తే వాళ్ళ కర్మ మనకు చెందుతుంది.

గీత చెప్పింది రాజసికుని కర్మలు ఒకటి పొందడానికి చేయటంవలన అవి నిస్వార్థమైన సేవ కింద రాదు. పూర్తిగా స్వార్థంతో చేసే పనులు మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. నేను చెప్పిన ఆసురిక సంస్థలు -- పేదదేశాలకు కృత్రిమమైన ఆహారం, ప్రమాదకరమైన మందులు, సిగరెట్ లు మరియు పొగాకు తో చేసిన పదార్థాలు, ఆయుధాలు, అణ్వాశ్త్రాలు అమ్మేవి-- ఈ కోవకు చెందినవి. ఇట్టి సంస్థలలో రజస్ మరియు తమస్ కూడి పనిచేస్తాయి. వ్యాపారం చేసి లాభం చేసుకుందామనే భావన రజస్ వలన కలుగుతుంది. తమస్ వలన అట్టి వ్యాపారం వలన ఇతరులకు కలిగే ప్రమాదం, నష్టం, దుఃఖం పట్టించు కోకుండా వ్యవహరిస్తారు 345

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...