Thursday, March 10, 2022

Chapter 17 Section 8

Bhagavad Gita

17.8

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌ చమార్జవమ్ {17.14}

బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శుచిత్వము, సత్ప్రవర్తనము, బ్రహ్మచర్యము, అహింస శారీరక తపస్సని చెప్పబడినవి

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ {17.15}

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే

ఇతరులను నొప్పించనదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, శ్రేయము నొనగూర్చునదియు, వేదాధ్యనము వాచిక తపస్సుగ చెప్పబడుచున్నది

మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః {17.16}

భావసంశుద్ధి రిత్యేత త్తపో మానసముచ్యతే

ప్రసన్నమైన మనస్సు, శాంత స్వభావము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి అనునవి మానసిక తపస్సుగ చెప్పబడుచున్నది

శ్రీకృష్ణుడు మూడు రకములైన సాధన గూర్చి చెప్పెను: కర్మ, వాక్, ఆలోచన. ఇవి వేర్వేరుగ ఉన్నప్పటికి, వాటిని ఏకం చేసికొని అభ్యసించవలెను.

మొదటి శ్లోకం భౌతికమైన సాధన గూర్చి చెప్పుచున్నా నేను మనస్సును నొక్కి చెబుతాను. బుద్ధుడు, జీసస్ కూడా మన వాక్, కర్మల మీద మానసిక స్థితి ప్రతిబింబిస్తున్నదని చెప్పేరు. ముఖ్యంగా మన మానసిక స్థితి ఎప్పుడో ఒకప్పుడు మాట లేదా కర్మగా ఘనీభవిస్తుంది.

మొదటి శ్లోకంలోని పూజ అనగా ఒక దేవుని ఆరాధించు ఆచారము. కానీ దానికి అంతర్లీనంగా ఉన్నది అఖండమైన భక్తి. గీత చెప్పునది అట్టివారు మన ప్రేమకు పాత్రులు. అనగా ఎవరైతే నిస్వార్థంగా మనకు నమూనాగా ఉంటారో వారి గూర్చి. యుక్త వయస్కులు ఇటువంటి శాశ్వతమైన విలువలను తెలిసికోలేకపోతున్నారు. అది వాళ్ళకున్న ప్రతిబంధకము. మనం చూసే టివిలో, సినిమాలలో; చదివే పత్రికలులో, పుస్తకాలలోనూ మనకు మార్గదర్శకులు అతి తక్కువగా కనబడతారు. వినోదం కలిగించే వ్యక్తులు, సంస్థల అధినేతలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మనం ప్రసార మాధ్యమాలలో ఎక్కువగా చూస్తాము. అవి ఒక చిన్న క్రియకి సంబంధించినవి అయి, మనల్ని అదే జీవితమని తప్పుడు దారి పట్టిస్తాయి. ఒకడు జీవితాన్నే ఒక కళలాగా తీర్చు దిద్దు కుంటాడు. కాని అట్టివాడు బహు అరుదు. మన౦ మార్గదర్శకులుగా చేసుకోవలసినది: ఎవరైతే మంచి హృదయంతో పరులకై జీవిస్తారో; ఎవరైతే ఇతరులకై కష్టపడి పని చేస్తారో; ఎవరైతే చపలత్వం, చిత్త చాంచల్యం, క్రోధము, అహంకారము లేకుండా ఉంటారో.

నేను ఎంతో మంది గొప్పవారిని కలిసినా, నా అమ్మమ్మ ఆ సద్గుణాలతో ఉండి నాకు మార్గదర్శికిగా ఉన్నది. ఒక ఆధ్యాత్మిక గురువు సాధారణంగా తన చుట్టూ గోడలు పెట్టుకుంటాడు. కానీ నా అమ్మమ్మకి ఎటువంటి హద్దులు లేవు. ఆమె అందరితో కలసిమెలసి జీవించింది. ఇతరుల సుఖాలను, దుఃఖాలను పంచుకొంది. అలా చేస్తూనే వారికి జీవన శైలిని నేర్పింది. దీనిలో అత్యంత కళాత్మకమైన అంశం ఉంది. ఆమెకు ఓటమి అంటే తెలియదు. అది తెలిసిన తరువాత, నేను నా గురువు లాగ బ్రతకడానికి తీవ్ర ప్రయత్నం చేసేను. హిందూ మతాచారం ప్రకారం, ఒక గురువు శాస్త్రాలు వలనించడమే కాదు, వాటిని ప్రతి రోజూ, ప్రతి నిమిషం ఆచరణలో పెట్టాలి. ఒకవేళ మన గ్రంథాలు పోయినా మనము ఒక మంచి గురువు సహాయంతో వాని దైనిందిక జీవితాన్ని అనుసరించి వాటిని తిరిగి వ్రాయవచ్చు. ౩౪౭

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...