Bhagavad Gita
17.9
శ్రద్దయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః
{17.17}
ఆఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే
ఫలము నాశి౦చని వారు, యోగయుక్తులును అగు మనుజులు ఉత్తమమైన శ్రద్ధను బూనినవారై ఆచరించే ఆ త్రివిధ తపస్సులును సాత్త్విక తపస్సులని చెప్పబడుచున్నవి
సత్కారమానపూజార్థ౦ తపో దంభేన చైవ యత్
{17.18}
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రుసమ్
ఇతరుల నుండి సత్కారములందు కొనుటకు, గౌరవుమలు పొందుటకు, పూజలు గ్రహించుటకు, దంభముతో చేసెడి తపస్సు చంచలమై, అస్థిరమై రాజస తపస్సని చెప్పబడుచున్నది
మూఢగ్రాహేణాత్మనో య త్పీడయా క్రియతే తపః
{17.19}
పరస్యోత్సా దనార్థం వా తత్తామస ముదాహృతమ్
మూఢ నమ్మకముతో తన దేహమును బాధించుకొనుట ద్వారాగాని, లేక ఇతరులను హాని చేయునది గాని యగు తపస్సు తామాస మని చెప్పబడినది
ఆధ్యాత్మిక పథంలో మూడు విధములైన వారిని చూడవచ్చు.
అందరికన్న క్రింద ఉన్నవాడు తామసికుడు. వానికి ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాడో తెలియదు. వాని జ్ఞానం భౌతికమైనది. ఒక మంచి గురువు లేకపోతే వానికి తీవ్రమైన సమస్యలు ఎదురవతాయి. ఎవరైతే భౌతికమైన ఉనికి గురుంచి ఆలోచిస్తారో, వారి ఇంద్రియముల కొరకై మనుగడ సాగిస్తారో, వారికి వేర్పాటు తప్పనిసరిగా అవుతుంది. వాళ్ళది ఒక రకమైన మతము. దానినుంచి తప్పించుకోవడం కష్టం. ఒక చక్కని గురువు వానియందు ఉత్తమమైన శ్రద్ధను నేర్పి, ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగించును.
ఈ మూడు గుణాల మన మార్పుకై చెప్పబడినవి. ఎవ్వరూ మానసిక వ్యధతో ఉండరాదు. మానసిక వ్యధతో, బద్దకముతో, ఎటువంటి సవాలును ఎదుర్కొనక యున్న వారికి కూడా గీత ఉపదేశిస్తుంది. గీత వ్యాధిని గుర్తించడమే కాకుండా దానిని ఉపశమనం చేసుకునే మార్గం కూడా చూపుతుంది. ఎలాగైతే హిమశైలము (glacier) కరిగి ఒక నదీ ప్రవాహాన్ని సృష్టిస్తుందో, తమస్ నుండి రజస్ ఆవిర్భవిస్తుంది. తమస్ క్రమంగా సత్త్వ౦ గా మారి ఉత్కృష్టమైన స్థితికి తీసికెళ్తుంది. కానీ దానికి మనం తీవ్ర ప్రయత్నము చేయాలి.
మనలో చాలామంది సమస్యలతో, నిర్ధిష్టమైన వ్యక్తిత్వముతో బాధపడుతూ, వాటిని మార్చుకోలేమని తలుస్తాము. మనలో భావావేశం లేకకాదు. మనం అప్పుడప్పుడు కుదేలయి, పట్టుదల సడలి, పరులకు మంచి కలిగించేది, మనకిష్టం కానిది అయిన పనిని చేయం. ఇంద్రియాలను నియంత్రించడం, పరోపకారం చేయడం, మన ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టడం మొదలైనవాటిని తపస్సు అనవచ్చు. ధ్యానం ఒక దుప్పటి లా౦టిది. మనకి బద్ధకంగా ఉంటే, దానిని కప్పుకొని, వేడిమి పొంది, కరడుగట్టిన తామసాన్ని రాజసంగా మార్చుకోవాలి.
సాధన మొదటి భాగానికి, రెండవ భాగానికి చాలా తేడా ఉంది. మొదటి భాగంలో తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. ఆ తప్పులను సరిదిద్దుకొని రెండవ భాగంలో ప్రవేశించాలి. అప్పుడు తప్పు చేస్తే ప్రజల దృష్టిలో చిన్న తప్పు, క్రమంగా పెద్దదవుతుంది. మనం క్రిందకు పడి లేస్తూ ఉంటే, దానివలన కలిగే దుఃఖం ఎక్కువగా ఉంటుంది.
ప్రతీ గురువుకు సాధన మార్గంలో కలిగే అవరోధాలను గూర్చి తెలుసు. ఈ శ్లోకాల పరమార్థం మన౦ సాధనలో చాలా అప్రమత్తంగా ఉండాలని. అలా చేస్తే ఒక పెద్ద సవాలు వచ్చినపుడు మన గమ్యాన్ని మరచిపోక, వెనకంజ వేయకుండా సాగిపోతాము.
సాధన ఆరంభంలో మనం ఉపరితలాన్నే చూస్తాం. మనం క్రమం తప్పకుండా, హృదయపూర్వకంగా, ఉత్సాహంగా చేయాలి. అప్పటికీ మనకు కలిగేది చేతనమనస్సుకు సంబంధించిన జ్ఞానం. అక్కడ మన౦ ఇంకా మనశ్శక్తి పొందలేదు. కొన్ని సంవత్సరాల తరువాత కరడుగట్టిన అహంకారం కరగడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో మగత, నిద్ర, మనకు తెలియకుండానే కలుగుతాయి. దాన్ని జయించి ముందుకెళితే చేతన మనస్సు లోపలకు వెళ్లగళం. మనం జీవుల ఐకమత్యం గురించి తెలిసికొని, మన మధ్య ఉన్న వేర్పాటు మనని బందీలగా చేసిందని తెలిసికొ౦టాం. ఇది వేరే ప్రపంచం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న పిల్లవాడు నడక నేర్చుకున్నట్టు మనం తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాలి.
దీనికై నేను అనభవపూర్వకమైన సలహాలు కొన్ని ఇస్తాను. మొదటది నిస్వార్థ సేవ. దాని వలన కలిగే శక్తిని పరోపకారానికి వినియోగించాలి. చైతన్య లోతులలో అనేక వనరులు, అమిత శక్తి విడుదలవుతుంది. వాటిని నిస్వార్థంగా ఉపయోగించలేకపోతే సమస్యలు ఎదురవ వచ్చు. ధ్యానం లోతుగా చేయాలంటే దానికై శ్రమ పడాలి. కష్టే ఫలే. మన౦ ధ్యానం సరిగ్గా చేస్తున్నామో లేదో అని తెలిసికోవటానికి ఆఫీస్ లో మన౦ పనులు ఎలా నిర్వర్తిస్తామో దాన్ని బట్టి చెప్పవచ్చు. మనం సమయానికి పనికి వెళ్తున్నామా, లేదా; మనం పని ఏకాగ్రతతో చేస్తున్నామా; మన సహఉద్యోగులతో కలసి మెలసి ఉన్నామా; పని సమయానికి చేసి, దానినుండి అవసరమైనప్పుడు విరమించుకొంటున్నామా; మొదలైన విషయాలు ధ్యానంలో ప్రగతిని సూచిస్తాయి.
రెండవది, తగినంత వ్యాయామం చేయాలి. అంతఃకరణంలో లోతుగా వెళ్లాలంటే వ్యాయామం అంత ఎక్కువగా చేయాలి. ఇది కొందరు మరచిపోతారు. కొందరు బద్దకాన్ని ఒత్తిడి లేకుండా పని చేయడమో లేక అది తమ సాధనకు ఉపయోగపడుతుందేమో అన్న అపోహతో ఉంటారు. మన శరీరము భౌతికమైన ఉపకరణము. దానిని ఎంత చురుకుగా ఉంచితే అంత ఉపయోగపడుతుంది. ఈత, పరిగెత్తడం, క్రీడలలో పాల్గొనడం మొదలైనవాటికి ఏకాగ్రత అవసరం కనుక తగిన వ్యాయామం అని చెప్పవచ్చు. వాటికై క్రమంగా పాటు పడాలి. ఒకే మారు అన్నీ చేస్తామనుకోవడం పొరపాటు.
మూడవది సత్సంఘం. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఆధ్యాత్మికత గురించి ఒంటరిగా ఉండాలని. నిజ౦ దానికి పూర్తిగా వ్యతిరేకం. మనకు ఇతరులతో మంచి సంబంధాలు ఉన్నప్పుడే ఓర్పు, దయ, పరుల తప్పులను క్షమించడం వంటివి సాధ్యమయి సాధనకు ఉపయోగపడతాయి.
బలమైన ఆహారం, తగినంత నిద్ర, చురుకుగా వ్యాయామం సాధనకి అవసరం. వీటన్నితోపాటు పట్టుదల ఉండాలి. అలా లేకపోతే ధ్యానం చేయడం వలన శరీరాన్ని బాధించడమే.
బ్రహ్మచర్యం వలన మనస్సు స్వాధీనంలో ఉంటుంది. బ్రహ్మచర్యం అనగా లైంగిక ఆలోచనలు లేదా కర్మలు లేకుండుట అనే అపోహ కలదు. దాని అసలు అర్థం భగవంతుని దగ్గరకు వెళ్లవలసిన లక్షణం. యోగులు తమ శక్తి నంతటిని సాధనకై ఉపయోగించి ఇతరములకై -- అనగా రతి, లైంగిక కర్మలు -- దుర్వినియోగము చేయుటకు ఇష్టపడరు. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్లాలనుకొంటే, ఇతరులను ప్రేమ పూర్వకముగా చూడాలంటే, లైంగిక ఆలోచనలు, కర్మలు వదులుకోవాలి. అట్టి వానిని బలవంతంగా కాక సున్నితంగా, ఒక క్రమ పద్దతిలో వదిలించుకోవాలి. ఎందుకంటే అది ఇతరులను ప్రేమించగల శక్తినిస్తుంది. అట్టి శక్తితో ఒకరి అవసరాలను మన అవసరాల కన్నా ముఖ్యమని తలుస్తాము. సున్నితత్వం, ఓర్పు, నిస్వార్థ సేవ, పరిశ్రమ, ప్రత్యోపకారాన్ని ఆశించక ఇతరులకు సేవ చేయుట, మన లైంగిక కర్మలను నియంత్రించుకొని క్రమంగా ఆ శక్తిని విడుదలచేయడం వలన సాధ్యం.`
లైంగిక ఆలోచనలను, కర్మలను నియంత్రించ కోవడం అంత సులభం కాదు. ప్రసార మాధ్యమాలు మనను వానికై ప్రేరేపిస్తాయి. శృంగారం గురించి ఎన్నో పుస్తకాలలో చదివేను. ముఖ్యంగా పద్యాల రూపేణా, నాటకాల లో అది ఎక్కువగా ఉంటుంది. కాని శృంగారాన్ని విడనాడి దానికై వెచ్చించిన శక్తిని పరుల సేవకై వినియోగిస్తే మనం దీర్ఘాష్యుతో, ఆరోగ్యంతో, చురుకుగా, సృజనాత్మక౦గా, భద్రతతో, సవాళ్లను ఎదుర్కోగల శక్తితో, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము. నేను సదా అప్రమత్తంగా ఉండి, సంవత్సరాల తరబడి అంతర్మధనం చెంది, వాటిని దాటగలిగేను. అది అతి క్లిష్టం, ఒకరకంగా కాని పని. దానిలో సఫలీకృతమైతే, హిందూ శాస్త్రములు చెప్పినట్లు అగ్ని వెలుగుగా మారినట్లు. అందువలన ప్రతి నిమిషం, ప్రతి బంధం పూర్ణమైన ఆనందాన్ని ఇస్తాయి.
No comments:
Post a Comment