Thursday, March 10, 2022

Chapter 18 Section 2

Bhagavad Gita

18.2

త్యాజ్య౦ దోషవది త్యేకే కర్మ ప్రాహు ర్మనీషిణః {18.3}

యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే

కర్మ దోషయుతమైనందున విసర్జనీయమని పండితులు చెప్పుదురు. మరి కొందరు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మలు విసర్జనీయములు కావు అని చెప్పుదురు

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భారతసత్తమ {18.4}

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ స్సంప్రకీర్తితః

అర్జునా! అట్టి కర్మత్యాగ విషయమున నా నిశ్చయమేమిటో చెప్పెదను. ఆలకింపుము. పురుషవ్యాఘ్రమా! త్యాగము త్రివిధములుగ చెప్పబడి యున్నది

ఆధ్యాత్మిక సాధకులు ప్రపంచ విషయాలు తమను స్వార్థ కర్మలకు, సంబంధాలకు దారి తీస్తాయని భావిస్తారు. యుద్ధం, కరవు, హింస మొదలగునవి తమను ఆందోళన పరచి ఆధ్యాత్మిక విషయాల మీద ఏకాగ్రత లేకుండా చేస్తాయని భావిస్తారు. ప్రపంచ విషయాలను వదిలిపెట్టి, సన్యాసం తీసికొని, ఏ అరణ్యానికో ఎందుకు వెళ్ళకూడదు?

నా ఉద్దేశంలో అది పనిచేయదు. ఏ విమర్శకుడు చుట్టు ప్రక్కల లేకపోతే, మన మనస్సు శాంతంగా ఉంటుంది. దాని పాటికి దాన్ని వదిలేస్తే మనస్సు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దానివలన అహంకారం అధికమౌతుంది. ఒకరు మిమ్మల్ని విమర్శిస్తే -- ఉదాహరణకు మీరు ప్రపంచానికి ఏమి ఇస్తున్నారు అని అడిగితే-- మీరు ఆగ్రహం చెందవచ్చు. మనస్సులో ప్రతి సంస్కారం ఉంటే, సాధనలో ప్రగతి పొందనట్లే.

కొంతమంది మనకు ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక సలహాలు ఇస్తారు: "అందరితో కలిసి వెళ్ళు", "ప్రతి విషయం తేలికగా తీసికో", "చిన్న విషయాల్ని పట్టించుకోకు". నాకు ఇవి మానసిక వ్యధ కలిగించేవి. కొందరు అటువంటి సలహాలు ఆధ్యాత్మికతతో ముడిపడినవి అంటారు. నేను దానికి అంగీకరించను. గీత, జీసస్, బుద్ధుడు బోధించేది ప్రేమ, నిస్వార్థ సేవ. ధ్యానం, క్రిస్టియన్లు చెప్పే నిస్వార్థ సేవ ఉచ్ఛ్వాస నిస్శ్వాసల లాగ కలసి ఉంటాయి. "ఒకడు ధ్యానమును లోపలికి తీసికెళితే, ప్రేమను బయటకు తెస్తాడు" అని ఏక్ హార్ట్ చెప్పెను.

బుద్ధుడు ఇలా అడుగుతాడు: "కర్మ సిద్ధాంతము గురించి ఏమిటంటారు?" పూర్వకాలం భారత దేశంలో బ్యాంక్ లు ఇలా వ్యాపారం చేసేవి. బ్రిటిష్ అధికారి బ్యాంక్ పైనే నివసించేవాడు. అతని క్రింది ఉద్యోగులు బ్యాంక్ పని అయ్యేవరకు ఇంటికి వెళ్ళడానికి కుదరదు. నా మిత్రులు కొందరు అర్థ రాత్రి వరకు పని చేసేవారు. బ్రిటిష్ అధికారి ఇల్లు పై అంతస్థులో ఉండడంవలన ఎటువంటి ఇబ్బందికి గురి కాడు. పని అయిన తరువాత తలుపులకు తాళాలు తీసి తన క్రింది ఉద్యోగులను విడుదల చేసేవాడు.

కర్మ కూడా ఇటువంటిదే. మనం గత జన్మలలో అనేక తప్పులు చేసి, జీవైక్యము గురించి జ్ఞానము లేక, ఇప్పుడు మానవ జన్మ ఎత్తేం. మన చిట్టాలో ప్రతికూలమైన కర్మ బాకీగా ఉంది. ఆ బాకీని తీర్చే వరకూ జీవితం సాగుతూ ఉండాలి. అంటే మంచి కర్మలు చేస్తూ ఉండాలి. అప్పటికి గాని మనకీ ప్రపంచం నుండి విముక్తి లేదు. సమిష్ఠి పరంగా కూడా, అందరి శ్రేయస్సు కై పాటుబడడం నేర్చుకోనంతసేపూ, కర్మ పాశంతో బంధింపబడతాము. మనం పాత తప్పులనే చేసి, పర్యావరణ కాలుష్యం, ప్రమాదకరమైన పరిస్థితులు, చితికిపోయిన కుటుంబ వ్యవస్థ, భూగోళంలో యుద్ధాలు కలుగజేస్తాం.

మన "రాబడి బాకీ" చిట్టా కర్మ గురించి తెలుసుకోవడానికి బాగా పనికివస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత, మైత్రి లేకపోతే, వారు కారాలూ మిరియాలు ఒకరి మీద ఒకరు నూరుకుంటూ ఉంటే, అది వాళ్ళ ఆరోగ్యం, స్వస్థత, మనశ్శాంతి మీద చూపిస్తుంది. ఇంకా వాళ్ళు సహ ఉద్యోగులయితే లేక భార్యా భర్తలు అయితే వాళ్ళు శత్రువులులాగా ఉంటారు. దానివలన క్రోధం కలిగి, అది తక్కిన బంధాల మధ్య కూడా ప్రతిబింబుస్తుంది. కర్మ సిద్ధాంతం చెప్పేది రాబడిని, బాకీని సమం చెయ్యమని. దానివలన మనకు మనశ్శాంతి కలిగి, పాత కర్మల వలన భయం తగ్గి, భవిష్యత్ గురించి భయం లేక ఉంటాము. ఇవన్నీ మన ఏకాగ్రతను పెంపొందించి వైరాగ్యాన్ని ఇస్తాయి. దానివలన మన ధ్యానమునకు ప్రయోజనం కలుగుతుంది. ఇతరులకు నిస్వార్థ సేవ, అందరితో కలసిమెలసి చేయందే, ఒక వయస్సు దాటిన తరువాత ఆధ్యాత్మికలో ముందుకు సాగలేము.

ధ్యానానికి ముందు మనకు సంస్కారములను నియంత్రించుకొనే జ్ఞాన ముండదు. మన కర్మ ఇంకా బాకీలోనే ఉంటుంది. నిస్వార్థ సేవ చేయడం ఎందుకంటే ఆ బాకీని తీర్చటానికి. మంచి మాటలు, క్రియలు చేయడం ఈ బాకీని తీర్చటానికే కాదు. అవి మనం హృదయ పూర్వకంగా చేస్తే మన మానసిక స్థితి వృద్ధి చెంది, భవిష్యత్ లో చేసే పుణ్య కార్యాలికి నాందిపలుకుతుంది. ఈ విధంగా మన చేతన మనస్సులోని మార్పు వలన మన బాకీ తీర్చబడుతుంది.

నా అమ్మమ్మ ఒక భయం గొలిపే ఉదాహరణను ఇస్తుంది. మనం పూర్వ జన్మలో ఒకనితో తగువుపడి వాని కన్నును గాయపరిచేమనుకోండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మన కన్ను ఈ జన్మలో గాయపడాలి. అది ఎలాగైనా అవ్వ వచ్చు. అనగా ఒకనితో తగువు పడినా, ఏదో అప్రమేయంగా కళ్ళలో గుచ్చుకున్నా. కాని మన౦ మనసా వాచా కర్మా అహింసను పాటిస్తే మనకు కర్మ సిద్ధాంతం చెప్పే బోధ అర్థమయినట్లే. అయినప్పటికీ మన దగ్గర పుణ్యాన్ని హరిస్తుంది, కానీ బాకీని బాగా తగ్గిస్తుంది. అంటే కంటికి గాయం తగిలే బదులు కనుబొమలకు గాయం అవ్వ వచ్చు.

హిందువులు నమ్మేది చిత్రగుప్తుడు మన కర్మ ఆర్జితము, బాకీలను సమతుల్యం చేయడానికి చూస్తాడు. మనం అభద్రతతో ఉంటే అతను మన బాకీలనే చూస్తాడు. అలాకాక పోతే మన ఆర్జనని చూస్తాడు. కొన్నాళ్ళు ఎప్పుడూ పుణ్య కర్మలు చేస్తే మనం చిత్రగుప్తుని పరీక్షలో నెగ్గుతాము. ఇక కర్మబంధాన్నుండి విముక్తులమవుతాము. ఇది తప్పక మనలాంటి సాధారణ వ్యక్తులకు సాధ్యము. మనం సహజంగా ప్రేమిస్తాము, దయ చూపిస్తాము; వేరే జీవిని ఎన్నటికీ హింసించము.

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...