Thursday, March 10, 2022

Chapter 18 Section 3

Bhagavad Gita

18.3

యజ్ఞదానతపః కర్మ న త్యాజ్య౦ కార్యమేవ తత్ {18.5}

యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్

యజ్ఞ దాన తపస్సులు ఆచరించదగినవియే గాని విడువదగినవి కావు. యజ్ఞము, దానము, తపస్సు అనునవి పండితులకు పవిత్రములు

ఒక ఒలింపిక్ క్రీడాకారుడు అందానికై తన శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోడు. అది వాడు విజేత కావడానికి అవసరం. అదేవిధంగా శ్రీకృష్ణుడు సాధన మార్గాన్ని మంచి లేదా చెడు, ఒప్పు లేదా తప్పు అనబడే ద్వంద్వాల నుండి వేరుచేసి మనను సాధనలో ఒలింపిక్ క్రీడాకారునివలె ముందుకు సాగు మార్గమును చెప్పుచున్నాడు. ఇతరులను మనకన్నా ముందు పెట్టుకొని, నిస్వార్థ సేవ చేస్తే అది నైతిక మార్గమొకటే కాదు. మనము జీవితమిచ్చే గొప్ప బహుమతిని పొందాలంటే వాటిని మనం చేసే వ్యాయామం లాగే అనుదినం పాటించాలి. మనము అందరినుండి నిస్వార్థము, ఉదారత, క్రమశిక్షణ ఆశిస్తాము. మనలో కూడా ఆ మంచి లక్షణాలు ఉండవచ్చు కూడా. సాధన అనగా మనకు నచ్చినపుడే లేదా మనకు అవసరమైనపుడే చేయడం కాదు. ఒక ఒలింపిక్ క్రీడాకారునివలె ప్రతి దినము ఉత్సాహంతో, ఒక పద్దతిలో చేయాలి.

ఒక మిత్రుడు ఇలా అన్నాడు: "మనకు మనస్సును శుద్ధంగా ఉంచమని చెప్పేవారు, తమ అశుద్ధమైన ఆలోచనలను అణగదొక్కుకుంటారు. మనకున్న కోర్కెలే వాళ్ళకీ ఉంటాయి. కాని వాటిని కప్పిపుచ్చి మనకు సలహాలు ఇస్తారు. అది అపాయకరమైనదే కాక నిజాయతీ లేనిది"

"గీత అణగదొక్కమని చెప్పటం లేదు. అది మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంది. పతంజలి చెప్పినది మనస్సు ఒక స్ఫటికము వంటిది. దాని మీద దుమ్ము పడి ఉంది. మనస్సుతో సమంగా చూడాలంటే ఆ దుమ్ముని కడగివేయాలి"

"దుమ్ము అంటే ఏమిటి?"

"నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించడమే. ఎవడు తన గూర్చే నిరంతరం ఆలోచిస్తాడో వాడు కాలుష్యం పెంచే కారు పొగ లాంటివాడు"

స్మాగ్ ఉన్న రోజున కాలుష్యం విపరీతంగా ఉండి మన వాహనాన్ని మురికితో కప్పుతుంది. అలాగే అనేక జన్మల తరబడి పెంచుకొన్న అహంకారం మన మనస్సును కప్పి వేసింది. దానిని కడగివేయడానికి తీవ్ర ప్రయత్నం చేయాలి.

యజ్ఞం అంటే, నా దృష్టిలో, అహంకారాన్ని త్యాగం చేయడం. అనగా ఇతరులను మనకన్నా ముందు పెట్టుకోవడం. మనకి ఇష్టంలేని ఉద్యోగం చేయడం ఒక యజ్ఞం. ఎందుకంటే అహంకారాన్ని చంపుకొన్నాము గనుక. అలాగే మనని విరోధంతో చూసే వారియందు ఓర్మి కూడా అహంకారాన్ని అణగదొక్కడం. ఒక బలమైన స్వార్థపూరితమైన క్రియను చేయకుండా ఉండడం కూడా అటువంటిదే. ఒలింపిక్ క్రీడాకారులు ఎలాగైతే బరువును తగ్గించుకోడానికి వ్యాయామం చేస్తారో, మన కర్మను తగ్గించుకోవడానికి సాధన చేయాలి. అహంకారం ఎంత తక్కువ ఉంటే కర్మ భారం అంత తక్కువగా ఉంటుంది. దానివలన మనం సాధనలో వేగంగా ముందుకు వెళ్తాం.

యజ్ఞం వ్యక్తులకే పరిమితం కాక అంతర్జాతీయ బంధాలలో కూడా పనికివస్తుంది. కొందరు ప్రేమ మనుష్యుల మధ్యనే కాని రెండు దేశాల మధ్య లేదా అంతర్జాతీయ సంబంధాలలో ఉండరాదని అంటారు. గాంధీ చెప్పినట్లు సద్భావన, ప్రేమ, అహింసలతో ఒక అంతర్జాతీయ సమస్యను పరిష్కరించరు. ఎందుకంటే వైరం, యుద్ధం వాళ్ళకి ఇష్టం కనుక. దీనివలన తెలిసేదేమిటంటే శాంతి, సామరస్యం సాధారణంగా, సహజంగా ఉండేవి.

అశోకుని గూర్చి అందరికీ తెలిసిందే. అతడు ఒక చక్రవర్తియై కళింగ యుద్ధంనుండి విరమించుకొన్నాడు. హెచ్ జి వెల్స్ వ్రాసిన ఔట్లైన్ ఆఫ్ హిస్టరీ లో అశోకుని త్యాగం వంటిది అంతకు ముందెన్నడూ జరగలేదని చెప్పబడెను.

దాని పర్యావసానము ఏమిటి? అశోకుని సామ్రాజ్యము చితికిపోయిందా? లేదు. అది వృద్ధినొందింది. అశోకుడు భౌద్ధ మతాన్ని స్వీకరించి అందరికీ సంతోషకరమైన, సుఖదాయకమైన పరిపాలనను చేసేడు. అతను ఎన్నో పుణ్య కార్యాలు ప్రజలకై చేసేడు.

అశోకుడు పాలనలో ప్రజలు అభివృద్ధి చెందేరు, వ్యాపారము, సంస్కృతి వృద్ధి నొందేయి, చుట్టు ప్రక్కల దేశాలతో శాంతియుతమైన సంబంధాలతో దేశం వర్ధిల్లి౦ది.

ప్రస్తుతమున్న దేశాలు అశోకుని ఎందుకు అనుసరించరు? దేశాన్ని స్థాపించిన క్రొత్తలో సిద్ధాంతాలు అశోకునితో పొంతన ఉంటుంది. రానురాను అవి దిగజారుతాయి. అమెరికా, రష్యా తమ వైరాన్ని మరచి, కలసిమెలసి ఉండవచ్చు. అది జరగదని తలచేవారు, చైనా తో సత్సంబంధాలు గురించి ఆలోచించాలి. ఆ దేశంతో సంబంధాలు కల్ల లేదా అనైతికమని ఒకప్పుడు భావించేవారు.

నేను దేశాల మధ్య వైరం పూర్తిగా అంతరిస్తుందని అనను. మనం ఒకే దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా వైరం చూస్తాం. దేశాలు తమ మేధను కలసి ఉండడానికి వాడితే అనేక ప్రపంచ సమస్యలను పరిష్కరించవచ్చు.

నేను కోరేది చిన్న లేదా పేద దేశాలు గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు చూపే ఎరలను అధిగమించాలి. వారు ఉచితంగా ఇచ్చే ఆయుధాలను తీసికోకూడదు. వ్యాపార లోటుపాట్లతో, లేదా పరిశ్రమల స్థాపనతో ప్రపంచ శక్తులతో పోటీ పడకుండా ఉండాలి. తమ మధ్య కలిగే సమస్యలను తమంత తామే పరిష్కరించుకోవాలి. అనగా అంతకు ముందులాగా అమెరికా లేదా రష్యా వద్దకు వెళ్ళి వారి సహాయం కోరి, వారి మధ్య వైరం పెంచి తమ సమస్యలను పరిష్కరించు కోవడమనే ఆలోచనకు స్వస్తి చెప్పాలి. 383

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...