Thursday, March 10, 2022

Chapter 18 Section 4

html>

Bhagavad Gita

18.4

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ {18.6}

కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్

అర్జునా! ఈ యజ్ఞదాన తపస్సులను కూడా ఆశక్తిని ఫలాపేక్షను వదలి చేయవలెనని నా నిశ్చితాభిప్రాయము

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే {18.7}

మోహాత్తస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః

నియత కర్మలను త్యజించుట మంచిది కాదు. అజ్ఞానముచే ఎవ్వడైనను విడిచినచో అది తామస త్యాగము అని చెప్పబడును.

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయా త్త్యజేత్ {18.8}

స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్

దుఃఖము కలుగుననియు, దేహమునకు శ్రమ కలుగుననియు భయపడి కర్మను త్యజించువాడు రాజసత్యాగము చేసినవాడై త్యాగఫలమును పొందనేరడు

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున {18.9}

సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః

నియతకర్మ ఏదైనను చేయదగినదియే నని భావించి అభిమానమును, ఫలమును విడిచిపెట్టి ఆచరింపబడునో అది సాత్త్విక త్యాగమని చెప్పబడినది

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే {18.10}

త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః

సాత్త్వికుడును, ప్రజ్ఞావంతుడును, సంశయ రహితుడును అయిన త్యాగసీలుడు దుఃఖకర్మములను ద్వేషింపడు. సుఖకరములైన కర్మలయందు ఆసక్తి చూపడు

శ్రీకృష్ణుడు త్యాగము చేయుట ఒక మానసిక స్థితి అని చెప్పుచున్నాడు. మన వస్తువులన్నీ దానం చేసినంత మాత్రాన సరిపోదు. ఒకని త్యాగ బుద్ధి అప్పుడప్పుడు కలిగేది. వానికి దానము ఇచ్చిన తరువాత ఎందుకు దానమిచ్చేనా అనే భావన కలుగవచ్చు. లేదా ఉంకో వస్తువును పొందుటకై ప్రయత్నించవచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది త్యాగము చేయుటకై ఎటువంటి ప్రేరణ అవసరమని.

తామసికుడు తన భాద్యతలను విడనాడవచ్చు. చదువు మధ్యలో లేదా తన కుటుంబాన్ని పోషించాలనో, ప్రపంచ విషయాలు విస్మరించి బ్రతకాలని ఆవేశం చెందవచ్చు. అతడు ఎవ్వరికీ హాని కలిగించటం లేదని తనని తాను సమర్థించుకోవచ్చు. కాని దానికి ప్రేరణ "నాకు ఇతరులను పట్టించు కోవలసిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను"

ఇది మనుష్యులకే పరిమితం కాదు. ప్రభుత్వ వ్యవస్థ అంతా తమస్ తో నడుస్తుంది. వాళ్ళు తమ బాధ్యతను నెరవేర్చక, తక్కిన బరువైన బాధ్యతలు --ఉదాహరణకి ప్రభుత్వ ఆసుపత్రులు నడపడం --తమవి కావని తలచెదరు.

రాజసికుడు ఒకటి త్యజించాలంటే దానికి బలమైన కారణముండాలి. అతడు మిక్కిలి బాధతో ఏదైనా త్యజిస్తాడు. ఉదాహరణకి అతడు మద్యం సేవించ కుండా ఉండాలంటే కడుపులో పుళ్ళు ఉండి వైద్యుడు మద్యం తాగదవ్దని చెప్పి ఉండవచ్చు. అలాగే మిక్కిలి దగ్గు వలన ధూమపానాన్ని విడనాడవచ్చు.

నేను ధూమపానం విసర్జించిన వారిని సమర్థిస్తాను. ఒక బాధ మనను మార్పు చేసికోవడానికి ప్రేరేపిస్తుంది. దానివలన దుఃఖం కలిగినా, బాధ వలన ఎంతోకొంత నేర్చుకొనడం మేలు. కొందరు ధూమపానాన్ని విసర్జించినా తమ ప్రక్కన ఉన్నవాళ్ళు ధూమపానం చేస్తూ ఉంటే వారిపై అక్కసు పెంచుకొంటారు. వారికి ధూమపానం చేయాలనే కోరిక మనస్సులో ఇంకా ఉంటుంది. ఇటువంటి త్యాగంలో ఆనందం లేదా స్వేచ్ఛ లేదు. మనస్సు ఇంకా పదేపదే కోరుకుంటుంది. దీనివలన అధ్యాత్మికంగా ఎటువంటి లాభం లేదు. అలాగే దుష్కర్మ నుంచి విముక్తి లేదు. భౌతికంగా ఎటువంటి హాని కలగకుండుట మాత్రమే అటువంటి త్యాగం వలన కలిగే లాభం.

నా అమ్మమ్మకు ఇటువంటి ప్రేరణ ఇష్టం లేదు. ఆమె తన శరీరంపై స్వాధీనముంచుకొని, ఒక పాడు అలవాటుని స్వశక్తితో తొలగించుకోవాలని అంటుంది. అప్పుడు జీవితానికి "నీవేమి చేస్తావో చెయ్యి. నేను బంధ విముక్తి పొందేను" అని చెప్పవచ్చు.

రాజసికుడు తను కోరేది దేనినైనా బలవంతం పెట్టినా వదులుకోడు. అతడు బత్తాయి పళ్ళను తినడం మానుకోవలంటే, ఆపిల్ పళ్ళు తినడం మొదలుపెడతాడు. అదీ కాకపోతే అరటి పళ్ళను తింటాడు. సమిష్ఠి పరంగా చూస్తే దీనివలన చాలా సమస్యలు ఉంటాయి. రాజసికుడు పెట్రోలియం ఆయిల్ మీద ఇష్టం తగ్గితే, తన వాడుకను నియంత్రించుకోక, అణుశక్తిని వాడాలని తలుస్తాడు. దానికై యుద్ధం చేసి, ఒక ఊహ ప్రకారం, దానినుండి విరమించుకొంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత అదే యుద్ధాన్ని ఉంకో చోట చేస్తాడు. ఇటువంటి పరిస్థితిలో అతడు త్యజించ వలసినది స్వార్థం. అతడు ఒక బలమైన కోరికను ఎంత ఖర్చైనా సరే తీర్చుకోవాలనే పట్టుదల కలిగియుండును. ఆ కోరికను వదులుకొంటే, అన్ని సమస్యలనూ పరిష్కరించవచ్చు.

గీత చెప్పే బాధ, బుద్ధుడు చెప్పే దుఃఖం ఒకటే. దాని అర్థం భౌతిక పరమైన బాధ, వేదన, అన్యాక్రాంతము. మానవాళికి ప్రస్తుత పరిస్థితిలో కలిగే దుఃఖానికి కారణం సామాజిక లేదా పర్యావరణం వలన అని చెప్పవచ్చు. దానికి ప్రేరణ తమయందు ఉన్న కామం. దేశాలు క్షిపణులను వాడడం మానేస్తే మంచిదే. ఉదాహరణకు అణ్వాశ్త్రములు విడనాడితే అందరికీ మేలు. కాని దానిని తయారు చేయడానికి మూలకారణం ఏమిటో తెలిసికోరు.

కొందరు "నేను పనిని త్యజిస్తున్నాను. నాకు ధనార్జన మీద ఇష్టత లేదు. నేను డబ్బును తాకను కూడా" అని చెప్తారు. నేను డబ్బు నిస్వార్థ సేవకై వినియోగించుట ఎంతో అవసరమని చెప్తాను. గాంధీ మహాత్ముడు ధనికులను కొంత సొమ్మును పేదవారికై ఖర్చు పెట్టమని ప్రోద్భలం చేసేవారు.

మనకు ఈ జన్మ ఇచ్చింది పరులకు సేవ చేయడానికై. ఒకడు జీవితంనుంచి తనకు కావలసింది తీసికొని, ఇతరులకు ఇవ్వకుండా ఉంటే శ్రీకృష్ణుడు అట్టివాడు దొంగని చెప్పెను. 389

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...