Thursday, March 10, 2022

Chapter 18 Section 5

Bhagavad Gita

18.5

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మా ణ్యశేషతః {18.11}

యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిధీయతే

దేహాభిమానము గలవారికి కర్మలను సంపూర్ణముగ త్యజించుట సాధ్యము కాదు. ఎవడు కర్మఫలములను త్యజించుచున్నాడో వాడే త్యాగియని చెప్పబడుచున్నాడు

మనము ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండాలి: భౌతికంగా నైనా మానసికంగా నైనా. 24 గంటలూ మంచం మీద పడుకున్నా, మన మనస్సు సదా పనిచేస్తూనే ఉంటుంది. డాక్టర్ హాన్స్ సెల్యే పని జీవ సంబంధమై తప్పని సరి, అన్నారు. మనం పరిణామంలో రాజసికులుగా ఎప్పుడైతే మారేమో సహజంగా పనిని చేయవలసిందే. మన౦ పనిచేయకుండా ఉండలేకపోయినా, ఎటువంటి కర్మ చేయాలో లేదా దానికి ప్రేరణ మేమిటో ఎన్నిక చేసికోగలం. పరులకై , నిస్వార్థంగా పని చేస్తే క్రమంగా మన చేతన౦ అధిక మవుతుంది, మన స్వార్థపూరితమైన ఆలోచనలు తగ్గుతాయి.

మనం మంచం మీద పడుకొని ఉన్నా కర్మ చేస్తున్నట్లే. లార్డ్ మౌంట్ బాటెన్ "నువ్వు ఏదీ చేయకుండా ఉన్నావంటే, ఏదో తప్పు చేసినట్లే" అన్నారు. ఏదీ చేయకపోవడం కూడా ఒక కర్మే. ఎందుకంటే అది మనం ఎన్నుకొన్నది. ఒక క్లిష్ట పరిస్థితిలో ఏమీ చేయకపోవడం చెడు కర్మ.

నేనో దినపత్రికలో పది మంది మాదక ద్రవ్యాలను తీసికొని మరణించేరని చదివేను. మాదకద్రవ్యాలను వాడి, ఇతరులకు ఆదర్శంగా ఉ౦డవలసిన వారు కూడా చెడు కర్మని పోగుచేసికొంటారు.

జీవితం సాగాలంటే పరస్పర సహకారం అవసరం. బ్రతికి ఉండడం కూడా కర్మే. కాబట్టి కర్మ కలగకుండా ఉండాలంటే మనలోని ప్రతి స్వార్థపూరితమైన ఆలోచనను తొలగించాలి. కర్మ బ్రతికినంత కాలం తప్పదు కాబట్టి కష్టపడి, ఇతరుల క్షేమం కొరకు నిస్వార్థంగా పనిచేసి, మంచి పుణ్యాన్ని పోగుచేసికోవాలని గీత చెప్పుచున్నది. 391

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda on Death - III

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 సృష్టి సృష్టి -- II మృత్య...