Bhagavad Gita
18.6
అనిష్ట మిష్టం మిశ్ర౦ చ త్రివిధం కర్మణః ఫలం
{18.12}
భవ త్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినా౦ క్వచిత్
ఫలాపేక్షను విడువక కర్మలనాచరించు వారలకు అనిష్టము, ఇష్టము, మిశ్రమము అనెడి మూడు విధములగు ఫలములు మరణానంతరము కలుగుచున్నవి. కర్మఫల త్యాగము చేసిన వారలకు అవి ఎన్నట్టికిని కలుగవు
కర్మ మిశ్రమ ఫలముల నిచ్చునది. అది ఒక శక్తివలె ప్రపంచమంతట ఆవరించి ఉన్నది. గురుత్వాకర్షణ గురించి ఎలా తెలిసికొ౦టామో, కర్మ, దాని పర్యావసానము గూర్చి కూడా తెలిసికోవాలి. దానిని మన జీవితముపై ఆపాదించి మనము అడుగవలసిన ప్రశ్నలు: "నేను ఎంత దయ గలవాడను? నేను ఎన్నిసార్లు దుర్భాష లాడేను? నేను ఎన్నిమార్లు ఇతరులయందు కఠినముగా నుండి వారిని నా స్వార్థమునకై వాడుకొన్నాను?" వీటి ధ్యేయం మనను దోషము గల వారిగా తెలిసికొనుటకు. అవి మనలోని లోటుపాట్లను తెలిసికొనుటకు , వాటిని సరిదిద్దు కొనుటకు, దుఃఖ విముక్తులగుటకు సహాయపడును.
కర్మ పునర్జన్మ గూర్చి హిందువులు, బౌద్ధులు కలిపి చెప్తారు. ఈ జన్మ ఒక వివిక్తమైన ఘటన వలన కలిగింది కాదు. మనం పూర్వం అనేక జన్మలెత్తి ఈ జన్మ పొందేము. భౌతికంగా అదైతే, ఆధ్యాత్మికంగా ఒక గొలుసులాగ ఈ జన్మ పరంపర సాగింది. మన కర్మల, ఆలోచనల ద్వారా ఈ గొలుసును మనమే చేసికొన్నాం. వివేకానందుడు కర్మ సిద్ధాంతం గూర్చి ఇట్లు చెప్పెను:
"మన ప్రతి ఆలోచన, కర్మ,బీజ రూపము దాల్చి, సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. కొంత కాలము తరువాత అది బహిర్గతమై ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా మానవుడు తన జీవితాన్ని తానే మలచుకొంటాడు. మానవుడు తను చేసికొన్న సిద్ధాంతముల వలననే జీవిస్తాడు. "
ఇంకా ఇలా చెప్పెను: "ఒకమారు మనము ఒక శక్తిని కదిలిస్తే, దాని పర్యావసానములకు మనమే బాధ్యత వహించాలి. ఇదే కర్మ సిద్ధాంతం".
కర్మ సాధారణముగా దుఃఖము కలిగించునది కావున ఒక సున్నితమైన స్వభావం గల వ్యక్తి ఈ లోకం యాతన పడడానికే అని తలచును. దానిలో కొంత నిజం లేక పోలేదు. మన౦ నివసించేది కర్మభూమి. అనగా పుట్టుక-మరణం, మంచి-చెడు, సత్యము-అసత్యము, ఐకమత్యము-ఏకత్వము మొదలగు ద్వంద్వాలు ఈ కర్మభూమిలో కలుగుతాయి. ప్రపంచం యొక్క బరువుతో బాధ పడుతున్నప్పుడు , ఈ కర్మభూమి యందే మనకు మంచిని లేదా చెడును ఎన్నిక చేసుకొని జీవులతో ఐకమత్యంగా బ్రతకగలమని తెలిసికొ౦టాము. ఎలాగైతే కటిక చీకటిలో దీపానికై వెతకుతామో, హింసా పూరిత ప్రపంచంలో ప్రేమకై అర్రులు చాచుతాము.
జంతువులకు పరిణామము సహజమైనది. మానవులకు అది ఒక ఎన్నిక. జంతువులు ఎటువంటి ప్రయత్నము లేక, సమస్యలను పరిష్కరించు కొనక, లేదా వాటి అభిరుచులను తెలుసుకోక పరిణామము చెందుతాయి. నా గురువు ఎప్పుడూ నా అభిరుచులను మార్చుకోమని చెప్పలేదు. జీవిత సిద్ధాంతాలను తెలిసికొని -- అనగా నా వ్యక్తిత్వాన్ని, సంస్కారములను, భవిష్యత్ లను మార్చుకొని -- నా జీవితానికి నేనే రాజునని తెలిసికొన్నాను.
ఈ ఎన్నిక ప్రతిఒక్కరికీ ఉంటుంది. మనము సాధన యందు మిక్కిలి పట్టుదలతో, అహంకారం లేక, మన అభిరుచులను మార్చుకొని ముందుకు సాగినచో, శ్రీకృష్ణుడు చెప్పేది మన తప్పుల పర్యావసానము పురోభివృద్ధిని ప్రభావితం చేయవని. కాని అహంకారంతో, అయిష్టతతో, సాధన చేస్తే కర్మ దానంతట అదే వస్తుంది.
మహాభారత౦ లో ఒక ఘట్టముంది. మనమెప్పుడైతే ఒక నిర్దయమైన కార్యం చేస్తామో, కర్మ అనబడే ఒక దూడని సృష్టిస్తాము. ఆ దూడ ఆవుల మందలో తన తల్లిని ఎలా గుర్తుపడుతుందో, ఒకని పాత కార్యాల పర్యావసానము ప్రస్తుత క్రొత్త జన్మలో వెతుక్కొని వస్తాయి. మనకు పూర్వ జన్మల ఎరుక లేక జీవితం సాగిస్తున్నప్పడు ఆ దూడ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం "నన్నే ఎందుకు పట్టుకుంది?ఎందుకు నా జీవితం అన్యాయమైంది?" అనుకుంటాం.
మనము పరులను గౌరవంతో చూసినప్పుడు, ఆ దూడ తనమటుకు తాను ఉంటుంది. అది పెరిగి పెద్దదైనప్పుడు, దాని అమ్మలా మందలో ఒక ఆవు. అలాగే పాత కర్మలు మన వద్దకు వచ్చి "నీవు నా యజమానివి కావు. నేను మందలో కలుస్తాను" అని వెళ్ళి పోతాయి. ఈ విధంగా మనకి గత జన్మలనుంచి విముక్తి కలుగుతుంది.
మనం ఆ దూడ యజమాని కాము. గత జన్మలలో చేసిన పాపాలు, ఆయా వ్యక్తులకే చెందుతాయి. చాలా సంవత్సరాల సాధనతో పుణ్యం చేసికొని యమధర్మరాజు ముందు నిలబడితే మన గురించి "ఇతడు నేరము చేసిన వ్యక్తి కాడు. ఇతడు పూర్తిగా మారిన మనిషి. ఇతని ప్రతి ఆలోచన ప్రేమతో నిండి ఉన్నది. అలాగే ప్రతి కర్మ దయతో కూడినది" అని చెప్పే ఆస్కారం ఉంటుంది.
మనము గతంలో చేసిన తప్పులు తవ్వుకోవడం వలన పొందే లాభం ఏమీ లేదు. ముఖ్యంగా మనము మార్పుకై ప్రయత్నించాలి. "నా గతం మరిచిపోయాను. నీవు మిగతా కార్యం చెయ్యి. కర్మ భారాన్ని నుంచి నన్ను విడుదల చేయి" అని శ్రీకృష్ణుని ప్రార్ధించ వలెను. 394
No comments:
Post a Comment