Thursday, March 10, 2022

Chapter 18 Section 7

Bhagavad Gita

18.7

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే

సా౦ఖ్యే కృతా౦తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మాణామ్ {18.13}

అర్జునా! కర్మ సిద్ధాంతమును తెలుపు సాంఖ్య శాస్త్రమునందు సర్వకర్మలు నెరవేరుటకు చెప్పబడిన ఐదు కారణములను నా వలన వినుము

కర్మ చేయుట జ్ఞానము కొరకు. అనగా కర్మలు ధనార్జనకై, ఉదరపోషణకై , సుఖమునకై లేదా సమాజమునకై పాటుపడుట మాత్రమే కావు. అది ఐకమత్యంతో బ్రతకడానికి యున్న అవరోధములను నిర్మూలించుటకు. ఒక్కమాటలో ప్రేమించుటకై యున్న అవరోధములను తొలగించుకొనుటకు.

పుణ్య కర్మలు చేయుట గత జన్మలలో పోగుచేసుకున్న పాప కర్మలను నిర్మూలించుటకు. ఇతరులతో బంధముల వలన పాప కర్మలు పేరుకుపోయేయి. అవి ఓర్పు, సహనము, ఇతరులయందు దయ, సామరస్యంతో పని చేయుట, ఇతరులను గౌరవించుట మొదలగు వాని వలన నిర్మూలించబడును.

శ్రీకృష్ణుడు చెప్పేది నిస్వార్థ కర్మను గూర్చి. అనగా కర్మలను అహంకారముతో కాక, జ్ఞానముతో చేయవలెను. మనస్సును నిలకడగా ఉంచుకోవడం కూడ ఒక మంచి కర్మ. ఎందుకంటే అహంకార౦ మనస్సును ఉద్రేకపరచును.

మనస్సును నిలకడగా ఉంచుట, అహంకారమును వీడుట చాలా కష్టమైనవి. పూర్తి ఏకాగ్రతతో కర్మ చేసిన, మనస్సు నిలకడ చెందుతుంది. ఇష్టాయిష్టాలతో కర్మను ముడిపెట్టకుండా ఉంటే, అహంకారము తగ్గి, మనస్సును నిలకడగా ఉంచవచ్చు.

కొందరు నాతో వాళ్ళ ఉద్యోగము ఆసక్తికరమైనది కాదు లేదా సవాలు లేనిదని చెప్తారు. నిజానికి వారికి కావలసినది పేరుప్రతిష్ఠలు, ఇతరులపై ఆజమాయిషీ, మొదలగునవి. అవి తప్పు ఎందుకంటే అవి కర్మలు చేయుటకు పూర్తిగా వ్యతిరేకము. అహంకారం వలన, పేరు ప్రతిష్ఠలకై కలిగే ఆలోచనలు ఇలా ఉంటాయి: "నేను కర్తను; నేను నిర్ణయించేవాడను; జయాపజయాలకు నేనే కారకుడిని". అటువంటి ఆలోచనలు తొలగిపోతే మనస్సులో సంఘర్షణ ఉండదు. 396

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...