Bhagavat Gita
1.1
ధృతరాష్ట్ర ఉవాచ
{1.1}
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతసంజయ
ఓ సంజయా! ధర్మభూమి యగు కురుక్షేత్రము నందు యుద్ధము చేయుటకు కూడియున్న నా వారును పాండవులును ఏమి చేసిరి? ఀ
"గీత ఒక చారిత్రాత్మక బోధ మాత్రమే కాదు. ఆధ్యాత్మిక విషయాలు ఒ౦ట బట్టాలంటే దృష్టాంతాలు ఉండాలి. అది దాయాదుల మధ్య జరిగిన యుద్ధమే కాదు. మనలోని మంచి చెడు మధ్య జరుగుతున్న సంగ్రామము కూడా" అని గాంధీ మహాత్ముడు చెప్పెను. చరిత్రకారులు కురుక్షేత్ర యుద్ధం గురించి ఎన్నో విధాలుగా వ్రాసేరు. శ్రీకృష్ణుడు చెప్పిన బోధ ఆ నాటికే కాదు, నేటికి కూడా వర్తిస్తుంది. అది ఆచంద్రార్కం ఉండేది. నేటి కాలంలో ప్రపంచం యుద్ధాలతో నిండివుండి, హింసాకాండ బయట ఇంట జరుగుతూ, క్రోధం బంధాలను తెంచుతూ, చేతన మనస్సులో వేర్పాటు కోరుతూ ఉండగా శ్రీకృష్ణుని గీతా బోధ ఎంతో అవసరము. మనలో జరిగే హింస, పాతుకుపోయిన స్వచ్ఛంద అభిప్రాయాల వలన కలుగుతున్నాది. మనలో చాలామందిలో ఒక యుద్ధ వ్యూహం నిక్షిప్తమై ఉన్నది. అలాగే ఇళ్ళల్లో మెరుపు వేగంతో యుద్ధాలు జరుగుతున్నాయి. యోగులు చెప్పే యుద్ధాలు ఎక్కడో జరిగి, వార్తా పత్రికలలో వ్రాయబడినవి కావు. ఆ యుద్ధాలు స్వచ్ఛంద అభిప్రాయాలవలన వ్యక్తుల, కుటుంబాల, సమాజాల, జాతుల, దేశాల మధ్య జరుగుతున్నాయి.
నేను డిల్లీ నుంచి సిమ్లాకు రైల్లో వెళుతూ ఉండగా దారిలో కురుక్షేత్రం దగ్గర బండి ఆగింది. చాలామంది తోటి ప్రయాణీకులు దాన్ని చూడడానికి దిగేరు. నాకు దాన్ని చూడవలసిన అవసరంలేదు. ఎందుకంటే నాకు అక్కడ వున్న ప్రతి ప్రయణీకునిలో అంతర్యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉందని తెలుసు. మన గ్రంధాలలో యుద్ధానికి సంబంధించిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అవి ఎంతో కష్టంతో, ఎంతో కాలంతో కూడి చిరకాలము ఉండేవి. దానికి కారణం అహంకారం. అదే అన్ని దుఃఖాలకు కారణం. యోగులు మనస్సును, ఇంద్రియాలను జయించిన నిజమైన యుద్ధ వీరులు. వారు అంతర్యుద్ధంలో జయించి, స్వార్థం లేకుండా జీవించమని మనకు చెప్తారు.
కుటుంబంలో, సమాజంలో బ్రతుకుతున్న సామాన్య మానవులకు అంతర్యుద్ధంలో గెలుపు సాధించడం ఎలా? గీతలో శ్రీకృష్ణుడు మణుల హారంవలె ఆధ్యాత్మిక చింతన బోధించి, మనకు తక్షణమే జ్ఞానోదయం కలిగిస్తాడు. మనలోని స్వచ్ఛంద భావాలను, వేర్పాటును ఎదిరించే మార్గాన్ని ధ్యానంలో ఎలా చెయ్యాలో అతడు బోధిస్తాడు. అలాగే జీవితంలో పట్టుదలతో జ్ఞానంతో, క్రోధాన్ని దయగా, పిరికితనాన్ని ధైర్యంగా, లోభాన్ని పరోపకారంగా మార్చే ప్రక్రియను శ్రీకృష్ణుడు బోధిస్తాడు. 24
No comments:
Post a Comment