Bhagavat Gita
1.2
సంజయ ఉవాచ
{1.2}
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢ౦ దుర్యోధన స్తదా
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్
అప్పుడు రాజగు దుర్యోధనుడు వ్యూహాకారముగ
{1.3}
నిర్మించ బడియున్న పాండవసేనను జూచి,
గురువగు ద్రోణా చార్యులు వారిని సమీపించి
చెప్పుచున్నారు
పైశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్
వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా
ఆచార్యా! నీ శిష్యుడును, బుద్ధిమంతుడును, దృపదుని
{1.4}
కుమారుడును అగు ధృష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగ
నిలుపబడి యున్న పాండవుల గొప్ప సైన్యమును
వీక్షి౦పుము
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి
యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథః
ఈ పాండవసేన యందు శూరులును, గొప్ప
{1.5}
విలుకా౦డ్రును, భీమార్జునలతో సమానులును
గలరు. సాత్యకీయ, విరాట రాజును, మహారథుడగు
దృపదుడును
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజి త్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః
మఱియును ధృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన
{1.6}
కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, మానవ శ్రేష్ఠుడైన
శైబ్యుడు,
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః
పరాక్రమ శాలి యగు యుధామన్యుడును, బలవంతుడగు ఉత్తమౌజుడును, సుభద్ర పుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు గలరు. వీరందరు మహారథులే
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ
{1.7}
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థ౦ తాన్ బ్రవీమి తే
ఓ బ్రాహ్మణోత్తమా! మన వారిలో ఉత్కృష్టులు, మన సైన్యమునకు నాయకులై యుండువారిని మీకు జ్ఞాపకము చేయుటకు చెప్పుచున్నాను. అవధరింపుడు
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి౦జయః
{1.8}
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ
మీరు, భీష్మాచార్యుడు, కర్ణుడు, సమరవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును,
అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః
{1.9}
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః
ఇంకను అనేకమంది వీరశూరులు నా కొరకు ప్రాణములను విడుచుటకు అరుదెంచి యున్నారు. అనేకములగు శస్త్రాస్త్రములను ధరించి యున్నారు. యుద్ధ సమర్థులై యున్నారు
అపర్యాప్త తదస్మాకం బలం భీష్మాభిరక్షితం
{1.10}
పర్యాప్త౦ త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం
భీష్మాచార్యులు వారిచే రక్షింపబడుచున్న మన సైన్యము అపరిమితమైనది. భీమునిచే రక్షింపబడుచున్న పాండవుల సేన పరిమితమైనది
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః
{1.11}
భీష్మమేవాభి రక్ష౦తు భవంత స్సర్వ ఏవ హి
సర్వవిధముల మీరందరు మీమీ నియమిత స్థానములలో యుండి భీష్ముల వారిని రక్షి౦తురు గాక ఀ
మతము యొక్క ముఖ్యోద్దేశం జీవ సమైక్యత. ఇదే మానవులకు మూల స్తంభం. పరావిద్య చుట్టూ ఉన్న సమస్యలను కొంత వరకు పరిష్కరిస్తుంది. కానీ అపరావిద్య మనకు ప్రత్యక్షానుభవము ఇస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాల వలన శ్రీకృష్ణుడు, జీసస్, బుద్ధుడు మొదలగు వారల గురించి తెలిసికొనవచ్చును. కానీ వారి బోధను నిత్యజీవితంలో ఆచారిస్తామా? అది నేను జీవితంలో చేయబోయే సుదీర్ఘ యుద్ధానికి సహకరిస్తుందా?
శ్రీకృష్ణుడు మనలోని అంతర్యుద్ధానికి కావలసిన గుర్తులు, ప్రణాళిక, ఆయుధాలు అత్యంత దయతో ఇస్తాడు. మొదట గీత కౌరవుల, పాండవుల గుణాల గూర్చి చెప్తుంది. కౌరవులు మరణాన్ని, శోకాన్ని కలిగించే దుష్ట శక్తి. పాండవులు ఆహ్లాదము, భద్రత కలిగించే వెలుగు. ఇది ప్రేయ మరియు శ్రేయ అని పురాణాలలో చెప్పబడినది. ప్రేయ అనగా కొన్నాళ్ళు ఉండీపోయే ఇంద్రియలోలత్వం. ఇది చెడు అలవాట్లతోనూ, ఇతరులను బాధించేది గానూ ఉంటుంది. శ్రేయ వలన మానవ కళ్యాణానికి ఉపయోగపడే మంచి అలవాట్లు, యుద్ధానికై పూనుకొన్న ఇరుపక్షాలను మధ్య శాంతి, పరోపకారము కలుగుతుంది. ఈ రెండు అంశాలు ఇప్పటికీ వర్తిస్తాయి. మానవాళి పేదరికాన్ని, వ్యాధులను నిర్మూలించడంలో కొంత మటుకు సఫలమయింది. అలాగే అతి భయంకరమైన మారణాయుధాలను కూడా పోగుచేసుకొంది. మనము శాంతి, స్వేచ్చ ఆశిస్తాము. అలాగే స్వార్థంతో, లాభానికై, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాము. శ్రీ రామకృష్ణ "నువ్వు తూర్పు వెళ్లాలంటే పడమరవైపు చూడవద్దు" అని అన్నారు. మనకు మనమెళ్ళే దిక్కును ఎన్నుకునే శక్తిని పోగొట్టుకొని అంధకారంలో బ్రతుకుతున్నాం.
వెలుగు, చీకటి శక్తులను నిత్య, అనిత్య అని కూడా చెప్పుకోవచ్చు. నిత్య అనగా శాశ్వతమైన, మార్పులేని వెలుగు. దాని వలన మనకు కీడు తలపెట్టినవారిని క్షమించుట, మనతో ఏకీభవించని వారితో సామరస్యం కలిగి ఉండుట సాధ్యము. అనిత్య అనగా ఆశాశ్వతమైనది, దుఃఖాన్ని కలిగించేది. దానివలన క్రోధము; కుటుంబమునకు, సమాజమునకు ఉపయోగంలేని పనులు చేయడం కలుగుతుంది. మనము ఇతరులతో కలహించినా, అంతర్యుద్ధం చేస్తున్నా, ఇతరులకు లేదా మనకు హాని చేసుకొంటాం. అలాకాక మనం స్వచ్ఛంద అభిప్రాయాలతోనూ, నీచ బుద్ధితోనూ పోరు చేస్తే ఇతరులకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాం. ఇదే అన్ని గ్రంధాలూ చెప్పేది. ధ్యాన మార్గాన్ని అవలంబించి క్రోధ౦ మొదలగు అరిషడ్వర్గాలను వీడాలి. మన దృష్టి, శక్తి, ఓర్పు, క్షమ, నిస్వార్థ౦ వైపు మళ్లించాలి. 28
No comments:
Post a Comment