Bhagavat Gita
1.10
అహో బత మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః
{1.45}
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్
ప్రతీకారము చేయక, ఆయుధములు పట్టని నన్ను, శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధమునందు చంపుదురేని అదియును నాకు క్షేమకరమే కాగలదు
అర్జునుడు మనకు కలిగే అభద్రత, బంధుమిత్రులతో వచ్చే కలహాల గూర్చి విపులంగా చెప్తున్నాడు. అతను శ్రీకృష్ణునితో జీవైక్య౦ మనస్సులో పెట్టుకోకపోతే దాని పర్యావసానము ఎటువంటిదో చెప్పేడు. మన స్వంత ఆనందానికై బంధుమిత్రుల యొక్క, సమాజం యొక్క, పర్యావరణము యొక్క క్షేమాన్ని మనం విస్మరిస్తున్నాము. అర్జునుని కాలంలో రాజ్యమునకై ఆశ ఉంటే, నేటి కాలంలో పెద్ద జీతం, గొప్ప ఇల్లు, మనతో సదా అంగీకరించే సహధర్మచారిణి మొదలగువాటికై ఆశ పడతాం. మనం మన దేహమనే రాజ్యానికి రాజుగా భావిస్తున్నంత కాలం, మనలోని దేవుని గుడి తలుపు మూసివేసి, గందరగోళంతో బ్రతుకుతాము.
శ్రీరామకృష్ణ శ్రీరాముడు మనలో ప్రతిష్టింపబడాలంటే కామాన్ని వదులుకోవాలి అని చెప్పెను. ఆనందానికై మనకెంత ఆశ అంటే, ఏనుగు కడుపు ఒక వేరుశెనగ గింజతో నిండుతుందని భావించేటంత.
ఆంగ్ల యోగి విలియం లా ఇట్లు చెప్పెను:
ఇంద్రియ సుఖాలకై, కోరికలకు బానిసై బ్రతికే జీవి కలగంటున్నాడు అనవచ్చును. కల అంతమైతే ఏమీ నష్టం లేదు. కానీ జీవితమనే కల మరణంతో అంతమైతే మన మెందుకైతే భూమి మీద పుట్టేమో తెలిసికోకుండా పోతాము
ఒక నిస్వార్థమైన జీవితాన్ని గడిపే యోగిని చూడలేనంత కాలం, మనం మన స్వచ్ఛంద భావాలను వదులుకోవచ్చు అ౦టే నమ్మం. కానీ వేల యోగులు ధ్యానము ద్వారా మార్గదర్శకులై ఉన్నారు. మహాత్మా గాంధీ అటువంటి ఒక యోగి. ఆయన తన బాగును చూసుకోక, కోట్ల ప్రజలను బానిసత్వ౦నుండి, దుఃఖం నుండి విముక్తిచేసారు. భారతదేశం అవతరించక ముందు, దేశానికి పడమర నున్న యోధుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క స్వతంత్ర పోరాటం హింసతో కూడినదని చెప్పి, ఆయన మనస్సు మార్చి, ఆయనను తన శిష్యునిగా చేసికొన్నారు. ఆయననే ఫ్రా౦టియర్ గాంధీ అని పిలుస్తారు.
ఇంట్లో, సమాజంలో, దేశాల మధ్య జరుగుతున్న హింసను ఏ ఒక్కడు ఎదుర్కొన్నా అతడు తక్కిన వారలకు స్పూర్తినిస్తాడు. జీసస్ చెప్పిన బోధ పుస్తకాలవరకే, బుద్ధుని పేరు స్తూపాలపై చెక్కడం వరకే, గీతని తాళపత్రాలలో వ్రాయుటవరకే పరిమితం కాదు. ఎవరైతే వారి బోధను ఆచరణలో పెడతారో వారు జీవైక్యాన్ని గురించి తెలుసుకొంటారు. ఈ విధంగా చేసిన వారు క్రోధాన్ని దయగా, భయాన్ని ధైర్యంగా మార్చుకోగలరు. అట్టి వారు స్వార్థాన్ని సర్వజీవుల సామరస్యానికి ఉపయోగించి, కర్మ నాచరించుటకు కావలసిన శక్తిని పొందుతారు. 43
No comments:
Post a Comment