Bhagavat Gita
10.10
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషా౦ రవి రంశుమాన్
{10.21}
మరీచి ర్మరుతామస్మి నక్షత్రాణా మహం శశీ
నేను ఆదిత్యులలో విష్ణువును. జ్యోతులలో కిరణములు గల సూర్యుడను. మరుత్తులలో మరీచిని. తారల యందు చంద్రుడను నేనే.
మన పూర్వీకులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు గూర్చి మాట్లాడుకునేవారు. నేటి శాస్త్రజ్ఞులు వాటిని దుర్భిణిలో చూసి లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు, వాని చుట్టూ తిరుగుతున్న సౌర కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు.
నా ఉద్దేశ్యంలో వాటినన్నిటినీ నడిపేది దేవుని శక్తి. అందుకే దేవుని విష్ణు -- అనగా అన్నిచోట్లా ఉన్న వాడు-- అని పిలుస్తారు. భగవంతుడు ఇదంతా ప్రేమపూర్వకంగా చేస్తాడు. మన కుటుంబాలలో అనుబంధాలు ఎలా ఉంటాయో, జగత్తు కూడా ఒక కుటుంబమై అన్యోన్యంగా ఉంటుంది. మనకి అతి దూరమైన గ్రహాలను -- ప్లూటో లేదా నెప్ట్యూన్ -- తీసివేస్తే భూమిమీద మన జీవితం మారవచ్చు. విశ్వంలో ఏదీ శకలంలా వేర్పాటుతో ఎన్నటికీ ఉండదు. ప్రతీదీ తక్కినవాటితో స్పందిస్తూ ఉంటుంది.
ఉదాహరణకి సూర్యుడు 60 వేల కోట్ల సంవత్సరాల నుంచి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశమునకు కారణం గూర్చి శాస్త్రజ్ఞులకు తెలిసిందల్లా సూర్యుని ఉపరితలంలో హైడ్రోజన్ హీలియం గా మారుతూఉంటుందని. ఇంకా సూర్యుని మధ్యలో 130 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. శాస్త్రజ్ఞులు చెప్పలేనిది దాని కారణం. కారణం తెలియాలంటే ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జనమొక్కటే దారి.
ఇంకా తెలియని విషయమేమిటంటే కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సూర్యుని కాంతి, మనదగ్గరకు వచ్చేసరికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది. అంటే మనం నివసించడానికి యోగ్యంగా ఉంటుంది. గీత చెప్పేది సూర్యుని లో శక్తి, పీడనము, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండే విధంగా భగవంతుడు సిద్ధాంత పూర్వంగా నిర్దేశించాడు. ఇదేవిధంగా భగవంతుడు మన సౌర కుటుంబాన్ని ఒక సిద్ధాంతం ద్వారా నడుపుతున్నాడు.