Bhagavat Gita
10.14
మహర్షీణాం భృగురుహ౦ గిరామస్మ్యేక మక్షర౦
{10.25}
యజ్ఞానాం జపయజ్ఞో అస్స స్థావరాణాం హిమాలయః
మహర్షులలో నేను భృగు మహర్షిని. శబ్దములలో నేను ఓంకారమును. యజ్ఞములలో జప యజ్ఞమును నేనే. స్థావరములలో హిమాలయ పర్వతమును నేనై యున్నాను
పూర్వం బృఘు మహర్షి ఉండే ఆశ్రమంలో మునులు తమ ఇష్ట దైవాలను -- రాముడు, కృష్ణుడు, శివుడు, పరా శక్తి--ధ్యానించేవారు. ఒకనాడు నారద మహర్షి ఆ ఆశ్రమానికి వెళ్ళి, అంతా చూసి, వారు ధ్యానించే దేవతలలో ఎవరు గొప్ప అని అడిగి వెళ్ళిపోయేడు.
ప్రశాంతంగా ఉండే ఆశ్రమంలో నారదుని ప్రశ్నతో కలకలం రేగింది. నారదుడు కొంత కాలం తరువాత ఆ ఆశ్రమానికి వచ్చి ఎవరు గొప్పో నిర్ణయించుకున్నారా అని అడిగేడు. అప్పుడు విష్ణు భక్తుడైన బృఘు మహర్షి తాను శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి తన మాట నిరూపించుకుంటానని బయల్దేరాడు. అతను వైకుంఠం చేరి చూస్తే శ్రీ మహావిష్ణువు శేష తల్పంపై పడుకొని ఉన్నాడు. అప్పుడు బృఘుమహర్షి ఆతని రొమ్ముపై కాలితో తన్నాడు. శ్రీమహావిష్ణువు లేచి, బృఘుని క్షమించి ఆతని పాదము యొక్క చిహ్నము -- శ్రీ వత్స-- తాను ఎప్పుడూ ధరిస్తానని మాట ఇచ్చేడు. అందుకే శ్రీకృష్ణుని క్షమాసాగారుడంటారు.
పదములలో తాను ఓంకారమని శ్రీకృష్ణుడు చెప్పేడు. మనము ఓంకార జపం భగవంతుని నామమని గుర్తించలేము. సాధనతో ఆ మంత్రజపం ఒక భౌతికమైన క్రియ కాదని, అది భగవంతునితో అనుసంధానమైనదని తెలుసుకొంటాం.
మనలో చాలా మందికి ధ్యానం ద్వారా ఎంత ఎత్తుకు ఎదగగలమో తెలీదు. శాక్రమెంటో నగరంలో "నాకు నా కొండలతో సరిసమానమైనవారిని ఇవ్వండి" అని గోడమీద వ్రాసి ఉండడం చూసేను. మన దేశంలో హిమాలయాలకు సరిసమానమైన ఆధ్యాత్మిక యోగులు ఉన్నారు. అది మనకు గర్వకారణము. ఆధ్యాత్మిక జ్ఞానంలో హిమాలయాలను మించినదేమీ లేదు.
ఇక్కడ శ్రీకృష్ణుడు మనలో కూడా హిమాలయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే హిమాలయాల వంటి చేతన మనస్సు. ధ్యానం మొదట్లో మనం హిమాలయాల క్రింద చరియల్లో ఉంటాము. క్రమంగా కొండను ఎక్కుతాము. చివరికి ఒక చిన్న కొండ శిఖరాన్ని చేరుతాము. కాని అక్కడ విశ్రాంతి ఎక్కువసేపు తీసికోలేం. ఎందుకంటే మన ప్రక్కనున్న కొండ "నన్ను కూడా అధిగమించు" అని పిలుస్తుంది. ఇదే ధ్యానంలో ఉన్న పెద్ద సవాలు. మన౦ వంటినొప్పులతో, ఆక్సిజన్ తక్కువ ఉండడంవలన, విశ్రాంతి కోరుతాం. కాని అక్కడున్న వాటన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఎక్కాలనేది మన ధ్యేయం. ఈ విధంగా ఒక కొండ తరువాత మరొకటి ఎక్కుతూ పోతాం. ముందు రాబోయే కొండలు ఎక్కడం పాత వాటికన్నా కష్టం.
నాకు అశాంతితో ఉన్న వ్యక్తిని ఇవ్వండి, నేను వానిని తన అశాంతిని చేతనంలోని హిమాలయాల్ని ఎక్కడానికి ఉపయోగించేలా చేస్తాను. సంవత్సరాల తరబడి ఎక్కి మౌంట్ కృష్ణా లేదా మౌంట్ క్రైస్ట్ లేదా మౌంట్ బుద్ధ చేరి వాటన్నిటినీ ఒక జన్మలో ఎక్కలేమని తెలుసుకొంటాం. ఒక వేళ ఎక్కినా, అపరిమితమైన మౌంట్ బ్రహ్మన్ క్రిందనే ఉండి దిక్కులు చూస్తాం.