Bhagavat Gita
10.15
అశ్వత్థ స్సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
{10.26}
గంధర్వాణా౦ చిత్రరథ స్సిద్ధానాం కపిలో మునిః
వృక్షములలో నేను రావి చెట్టును. దేవర్షులలో నారదుడను. సిద్ధులలో కపిలముని
అశ్వత్థ వృక్షము యొక్క వేళ్ళు మీదనుండి -- అనగా దేవునిలో చొచ్చుకొని పోయి-- కొమ్మలు క్రిందనుంటాయి. మనమంతా దాని ఫలములము. మనము ఇతరుల కొరకై జీవించటానికై ఉన్నాము.
అశ్వత్థ వృక్షము ఎంతో సున్నితమైనది. ఏ ఒక్క ఆకైనా రాలిపోతే మొత్తం వృక్షం దుఃఖిస్తున్నట్టుగా ఉంటుంది. మనం వివిధ వ్యక్తులుగా, సమాజాలుగా, జాతులుగా, దేశ ప్రజలుగా, మనమంతా ఒకటే అనే ఎరుక లేక, చలామణి అవుతున్నాము.
కృష్ణుడు తాను గంధర్వులలో చిత్రరథుడని చెప్పుచున్నాడు. గంధర్వులు దేవదూతల వంటివారు. వారిలో నారదుడు గూర్చి చాలామందికి తెలుసు. అతడు నిరంతర కృష్ణ భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా విష్ణు నామము జపిస్తూ ఉంటాడు. ఒకమారు అతను శ్రీకృష్ణుని "ఎందుకు నీవు సంసారులను అంత ఎక్కువగా ప్రేమిస్తావు?" అని అడిగెను. శ్రీకృష్ణుడు దానికి బదులుగా ఒక వెలుగుతున్న దీపం ఇచ్చి, దీపం ఆరిపోకుండా ప్రక్కనున్న దేవాలయం చుట్టూ మూడు ప్రదిక్షణలు చెయ్యమని చెప్పెను. నారదుడు దీపాన్ని పట్టుకొని బయలదేరాడు. మొదట మరుతుడనబడే దేవుని గుడి చుట్టూ తిరగడానికి పూనుకొన్నాడు. మరుతుడు గాలికి అధిష్ఠాన దేవత. అతడు నారదుని పరిస్థితి తెలిసికొని, పెద్ద తుఫానును సృష్టి౦చేడు. నారదుడు తన శక్తినంతా ఉపయోగించి దీపాన్ని ఆరిపోకుండా మూడు ప్రదిక్షణాలు చేసి శ్రీకృష్ణుడు వద్దకు వచ్చేడు.
శ్రీకృష్ణుడు నారదుని "నారదా, నీవు నా భక్తులందరిలో ప్రముఖుడవు. నీవు ప్రదిక్షణాలు చేస్తున్నప్పుడు నన్ను ఎన్నిమార్లు తలచుకొన్నావు?" అని అడిగేడు.
నారదుడు నీళ్ళు నములుతూ "భగవాన్, తుఫానులో చిక్కుకొని, దీపం ఆరిపోకుండా చూడడం కోసం నా ఏకాగ్రత నీ మీద లేకపోయింది" అని అన్నాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు "సంసారులు తాము పడుతున్న అష్టకష్టాలను -- నీలా దీపాన్ని తుఫానులో కాపాడుతున్నట్టు -- మరచి, నన్ను తలచుకొంటే నాకు ప్రీతి కాక మరేమిటి?" అని అడిగేడు.
తరువాత కృష్ణుడు మునులలో తాను కపిలుడు అని చెప్పెను. కపిలుడు సాంఖ్య సిద్ధాంతాన్ని సాంఖ్య సూత్రములనెడి పుస్తకంలో వ్రాసేడు. ప్రపంచం ప్రకృతి, పురుషుడు, దేవుడు అనే త్రిపుటి అని చెప్పేడు. అతని శిష్యుడు పతంజలి యోగసూత్రాలను ప్రచురించేడు. గీతతో పాటు, కఠోపనిషత్తు, బుద్ధుని బోధనలు సాంఖ్య సూత్రాలతో ప్రభావితమైనవి.
ఈ శ్లోకంలో కపిలుని మునిగా శ్రీకృష్ణుడు వర్ణించేడు. ముని అనగా మౌన వ్రతాన్ని పాటించేవాడు. ఏ యోగులైతే మౌనము వహించి తమ అహంకారాన్ని జయించేరో వారు మునులు అనబడతారు. అలాగే చాలా ఏళ్ల ధ్యాన సాధనతో అహంకారాన్ని పోగొట్టుకొ౦టే మనము ఆ స్థితికి ఎదగవచ్చు. అప్పుడు మనము నిశ్చలంగా ఉండే సముద్రపుటడుగున ఉన్నట్టు చైతన్య సాగరంలో మునుగియుంటాము. ఆ నిశ్చలత్వము, అహంకారం యొక్క చంచలత్వము లేక, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. అట్టి స్థితిలో మనస్సు క్రోధము, లోభము, భయము లేక నిశ్చలముగానుండును.