Bhagavat Gita
10.17
ఆయుధానా మహం వజ్రం ధేనూనామాస్మి కామధుక్
{10.28}
ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః
ఆయుధములలో వజ్రాయుధము, ధేనువులలో కామధేనువు, ప్రాణోత్పత్తికి కారకులలో మన్మథుడు, సర్పములలో వాసుకి నేనే
ఒకమారు అసురులు దేవతలకన్నా మిక్కిలి శక్తిమంతులై, యుద్ధాలలో దేవతాల్ని పరాజయులను చేస్తున్నారు. అప్పుడు దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్ళి తమను కాపాడమని వేడుకొన్నారు. ఇంద్రుడు దానికి బదులుగా తనకు శుద్ధమైన, సంపూర్ణమైన యోగి పుంగవుని ఎముకలతో చేసిన ఆయుధాన్ని ఇస్తే గాని దానవులతో యుద్దం చేయలేనని చెప్తాడు.
దేవతలు పయనమై అనేక యోగులను, ఋషులను, మునులను వేడుకొంటారు. ఎవ్వరూ దానికి ఒప్పుకోరు. చివరకు దదీచి అనే ఋషి తన అస్తికలను ఇవ్వడానికి ఒప్పుకొంటాడు. అతడు ధ్యానం చేస్తూ, భగవంతునిలో లీనమై తన తనువు చాలిస్తాడు. ఆయన అస్తికలతో దేవతలు వజ్రాయుధాన్ని చేసి, ఇంద్రునకు ఇస్తారు.
ఇది ఒక కట్టు కథ కావచ్చు. కానీ దానిలో ఒక ముఖ్యాంశం ఉంది. దదీచి దేవతలకొరకు తన ప్రాణాన్ని సైతం దారబోసేడు. ఇది అత్యంత ఉత్కృష్టమైన త్యాగం. ఎప్పుడైతే మనం ఇతరుల దుఃఖాన్ని నిర్మూలించడానికి సిద్ధపడతామో అది అత్యంత శక్తికి నిదర్శనం. శక్తి అంటే వేరొక దేశాన్ని, జాతిని, తోటివారిని యుద్దాలలో ఓడించడం కాదు. మనమెప్పుడైతే పరోపకారాన్ని దృష్టిలో పెట్టుకొని శక్తిని ప్రదర్శిస్తామో అదే నిజమైన శక్తి.
అలాగే కృష్ణుడు తనను కామధుక్ అనే గోవుతో పోల్చుకొంటాడు. దానినే కామధేనువు అంటారు. అది మన ప్రతి కోర్కెను తీర్చగల సామర్థ్యము కలది.
వాసుకి ఒక సర్పము. దాని నుపయోగించి దేవతలు, అసురులు అమృతం కొరకై పాల సముద్రాన్ని చిలికేరు.
శ్లోకంలో కందర్ప కామానికి ప్రతీక. కందర్ప అనగా మన్మథుడు. అతను తన బాణాలతో ఇతరులలో కామ సంకల్పాన్ని కలిగిస్తాడు.
నేననేది మొదటి మన్మథ బాణం తగలగానే మనస్సును నియంత్రించుకోండి. వీలైతే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యండి. జీసస్ "మనం ఆశల వలయంలో చిక్కుకోకుండా, చెడు కర్మల నుండి విముక్తి పొందాలి" అని చెప్పెను. ప్రసార మాధ్యమాలు మనలను మన్మథుని బాణాలకు తలవగ్గేలా ప్రభావితం చేస్తున్నాయి. అందువలన సాధకులుగా మనము మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. ముఖ్య విషయమేంటంటే మన బంధాలు లైంగిక కర్మల కొరకే కాకుండా, స్వార్థానికే కాకుండా ఒకరి సంక్షేమమునకై ఇంకొకరు ప్రవర్తించేలా ఉండాలి.