Bhagavat Gita
10.18
అనంత శ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం
{10.29}
పిత్రూణామర్యమా చాస్మి యమ స్స౦యమతా మహమ్
నాగులలో నేను అనంతుడను. జలదేవతలలో నేను వరుణుడను. పితృదేవతలలో ఆర్యముడూ నేనే . దండించువారిలో నేను యముడును
అనంత అనబడే సర్పం మీద శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు. సర్పము కుండలిని శక్తికి ప్రతీక. వాహనానికి ఇంధనం ఎలాగో, కుండలిని మేల్కొలిపి వెన్నెముక ద్వారా సహస్రానికి చేర్చాలంటే లైంగిక కర్మల చేయకూడదు. మనము అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కుండలినిని ఉపయోగించాలి. ఆధ్యాత్మిక సాధనలో ఆ శక్తికి పరిమితం లేదు. అందుకే దాన్ని అనంత అంటారు.
ఆర్యముడు పితృదేవతలకు ప్రతీక. మనము అనేక తరాల తరబడి మన పితృదేవతల నుండి జన్యురూపేణా ఈ దేహాన్ని పొందేము.
ప్రపంచాన్ని నియంత్రించే శక్తులలో తాను యముడునని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. కఠోపనిషత్తులో నాచికేతుడను బాలుడు, తండ్రి మీద కోపంతో యమలోకానికి వెళ్తాడు. అప్పుడు యమలోకమలో యముడు ఉండడు. ఆ బాలుడు యముని రాకకై ఎదురు చూస్తూ చాలా కాలం గడుపుతాడు. చివరకు యముడు వచ్చి ఆ బాలుని భక్తికి మెచ్చి కొన్ని వరాలు కోరుకోమని అంటాడు. నాచికేతుడు సాధారణంగా అడిగే వస్తువుల కంటే మిన్న అయిన జ్ఞానాన్ని పొంద దలచి యముడ్ని "మరణించినవారు ఎక్కడికి వెళ్తారు?" అని అడుగుతాడు. యముడు ఎన్నో ఆశలు చూపి, చివరకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడు. ఇది కట్టు కథ కావచ్చును. మనం తెలిసికోవలసింది ధ్యానంతో మన దేహానితో తాదాత్మ్యం చెందకూడదు.
ఈ రోజుల్లో పెరుగుతున్న అరాచకాలవలన ఎందరో అకాల మరణం చెందుతున్నారు. ఉదాహరణకి పిస్టల్ నుపయోగించి దొంగతనాలు చేస్తూ, పగ తీర్చికొంటూ చేసే దురాగతాలను మనం పత్రికలలో చదువతున్నాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే మనము భౌతికమైన వస్తువులను, డబ్బును సేకరించడం తగ్గించాలి. ఇది పిస్టల్ కొనడకంకన్నా కష్ట సాధ్యము. మనలను నిరంతరము ఇంకా ఎక్కువ వస్తువులు కొనండి అని సంస్థలు ప్రోత్సాహించడంవలన అక్కరలేని వస్తువులు -- రెండు, మూడు వాహనాలు, ఇళ్ళు మొదలైనవి--కొంటున్నాము.
ఈ నేపథ్యంలో మన సమాజాన్ని మార్చాలంటే మనం బోధించ వలసింది జీవితం డబ్బు గురించి కాదు, బాంధవ్యాల గురించి మనకు ఇవ్వబడినది. అలా మాట్లాడితే సరిపోదు. దానిని ఆచరణలో చూపాలి. చాలా మందికి డబ్బు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదని చేతన మనస్సు లోతులలో తెలుసు. కాని వారికి ఉంకొక ఎన్నిక చేసికోవడం సాధ్యం కాదు. ఒక ధనవంతుడు, పరోపకారం చేస్తూ, బంధు మిత్రులతో మైత్రి పెంచుకుంటూ, సమస్థితిలో ఉంటే వానికి నిజమైన జీవితమంటే ఏమిటో తెలుస్తుంది.
మనము డబ్బుకై అతిగా పనిచేయక బంధుమిత్రులతో కాలం గడిపి, రెండు మూడు వాహనాలకై ఎగబడక, టివి చూసే సమయంలో సంఘ సేవ చేస్తూ ఉంటే దాని వలన కలిగే ఆనందం వర్ణించలేనిది.
హింసాకాండకు మరొక ముఖ్య కారణం రతి. దానిని ఆసరాగా తీసికొని పత్రికలు, సినిమాలు జనులను ప్రేరేపిస్తున్నారు. మనము మన డబ్బుతో వాటిని ఎన్నిక చేయకపోతే సమాజ పరిస్థితి ఉన్నతమౌతుంది. మన జీవిత౦లో కలకాలం ఉండే గాఢమైన బాంధవ్యాలు విశ్వాసం, ఒకరి మీద మరొకరికి గౌరవం వలన కలుగుతాయి. రతికి అటువంటి అనుబంధాలలో విలువ ఉంది. కాని రతికై ఇద్దరి మధ్య సంబంధం ఉండి, వారు అవిశ్వాసంతో ఉండి, తమ దారి తాము చూసుకొంటే చివరకు దుఃఖం కలుగక మానదు.