Bhagavat Gita
10.21
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహ మర్జున
{10.32}
ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్
అర్జునా! సకల సృష్టులకును ఆది మధ్యా౦తములు నేనే. విద్యలలో నేను ఆత్మ విద్యను. వాదించు వారిలో నేను వాదమును
పతంజలి మనమెవరో తెలిసికొనడానికి ఆధ్యాత్మిక సాధన చేయవలెనని చెప్పెను. నాకు ఇదే అసలు విద్య --కాలేజీలో పట్టభద్రులు కావడానికి కాదు, జీవితం గురించి అభ్యసించేది --అని అనిపిస్తుంది. ఇది ధ్యానం వలన సాధ్యం. ధ్యానం వలన "నేనెవర్ని?" అన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మనకు క్రికెట్ గురించి, ఆంగ్ల సాహిత్యం గురించి ఎంతో తెలిసి ఉండవచ్చు. కాని అవి సంతృప్తి, భద్రత, మనశ్శాంతి ఇవ్వవు.
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఊహాతీత జ్ఞానం, లేదా మనలోని స్పష్టమైన జ్ఞానం గూర్చి కాక "నేనే అన్నిటికీ హేతువు" అని చెప్పుచున్నాడు. నేటి విజ్ఞాన శాస్త్రము మన వంట పూర్తిగా పట్టలేదు. ఉదాహరణకి క్రోధానికి, క్రోధమే బదులుగా ఇస్తూ బంధుమిత్రులతో ఎలా బ్రతకగలం? అణ్వాశ్త్రాలతో మారణహోమం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు శాశ్వతమైన శాంతి ఎలా నెలకొల్పగలం? విభేదాల మధ్య హృదయంలో శాంత౦గా ఉండి, ఇతరులను సహనంతో, క్షమతో ప్రభావితం చేయడానికి అంతర్గతంగా అమితమైన శక్తి ఉండాలి. అది ధ్యానంవలన క్రమంగా పొందవచ్చు.