Bhagavat Gita
10.24
బృహత్సామ తథా సామ్నా౦ గాయత్రీ ఛ౦దసామహం
{10.35}
మాసానా౦ మార్గశీర్షో అహ మృతూనాం కుసుమాకరః
సామవేదములో బృహత్సామము, ఛ౦దస్సులలో గాయత్రి, మాసములలో మార్గశీర్షము, ఋతువులలో వసంత ఋతువును నేనే ఀ
సామావేదాన్ని అధ్యయనం చేసేవారు దానిని ఒక కీర్తనలా పాడుతారు. ఎందుకంటే అది అంత రసవత్తరంగా ఉంటుంది. కానీ ఎటువంటి పఠనం గాఢ ధ్యానంలో అధ్యయనం చేయడానికి సమానం కాదు. ఎందుకంటే ఆ పదములమీద దృష్టి కేంద్రీకరించి, చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అది ఎటువంటి ఇంద్రియ సుఖాలకన్నా మిన్న.
ఋగ్వేదంలోని గాయత్రి మంత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలనుంచి పఠిస్తున్నారు. గాయత్రి అంటే పఠనం చేసే వారిని అన్ని క్లేశాలనుండి రక్షి౦చేది. నాకు తెలిసిన స్విట్జర్లాండ్ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా గాయత్రీ మంత్రాన్ని పాటలా పాడుతాడు. కానీ దాని ఫలం పొందాలంటే మనకి సంగీతం రానక్కరలేదు. దేవుడు మన పఠనాన్ని విని స్వరం ఎక్కడో తప్పిందని అనడు. ఆయనకు కావలసింది మన౦ ఆ మంత్రాన్ని వీలయినప్పుడల్లా, ఏకాగ్రతతో, చిత్త శుద్ధితో, ప్రేమతో జపించడం.
మాసాలలో శ్రీకృష్ణుడు తాను మార్గశీర్షమని అంటాడు. అది తెలుగు క్యాలెండర్ లో మొదటి మాసం. బహుశా శ్రీకృష్ణుడు మనల్ని నూతన సంవత్సరంలో తనని జ్ఞప్తికి ఉంచుకోమని చెప్తున్నాడు. ఋతువులలో తాను వసంత ఋతువని చెప్పెను. ఎందుకంటే వసంత ఋతువు క్రొత్త ఆరంభం సూచించి ప్రపంచాన్ని అందంతో, సంతోషంతో నింపి ఉంచుతుంది.