Bhagavat Gita
10.27
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం
{10.38}
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్
దండించువారి యొక్క దండమును నేనే. జయశీలురు యొక్క నీతిని నేనే. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానవంతులలో నేను జ్ఞానమునై యున్నాను.
శ్రీకృష్ణుడు నీతే కాదు నీతిని అమలుపరిచేవాడినని చెప్పుచున్నాడు. మనం చేసే ప్రతి తప్పుకి ఒక పర్యావసాన ముంటుంది. మనం ఎక్కువ తినకూడదని ఏ చట్టమూ లేదు. కానీ దానివలన కడుపు నొప్పి వస్తుందనే సిద్ధాంతం మన కణాల్లో ఉంది.
నేను పడవ ప్రయాణాల గురించి ప్రకటనలను దినపత్రికల్లో చదువుతున్నాను. అవి క్రొత్త ప్రదేశాలను, లేదా క్రొత్త భాషలగురించి తెలిసికోవడం గురించి కాక తిండి గురించే ఉన్నాయి. ఒక ప్రకటనలో తమ పడవలో 22 వంటశాలలు ఉన్నాయి, 181 వంటవాళ్ళు ఉన్నారు, ఒకరోజు వండిన వంట మళ్ళీ వండకుండా మిమ్మల్ని ప్రపంచమంతా తిప్పుతాము అని వ్రాసేరు. నా ఉద్దేశంలో అతిగా తినడంవలన ఊబ కాయం, అజీర్ణం మొదలగు ఇబ్బందులు కలుగుతాయి. అవి మన౦ తినే ఆహారాన్ని నియంత్రించడంవలన మాత్రమే సరి అవుతాయి. గీత మన ఆరోగ్యం, భద్రత, ఆనందం జన్మ హక్కు అంటుంది. కానీ ఆ హక్కుని పొందాలంటే జ్ఞానవంతమైన ఎన్నికలు చేసుకోవాలి.
శ్రీకృష్ణుడు తాను నాయకులలో రాజనీతిజ్ఞుడను (statesman) అని చెప్పుచున్నాడు. ఆయని రాజనీతి చాలా ఉన్నతమైనది. అది చెడ్డవారిపై దయ, హింసకి బదులుగా అహింసతో కూడిన నిరోధం (non-violent resistance) మొదలగు అంశాలతో కూడినది. మనలో చాలామంది హింసతో సమస్యలను పరిష్కరించగలమని తలుస్తాము. జీవితం గురించి తెలిసినవారు పగను పగతో సాధించలేమంటారు. బుద్ధుడు ప్రేమతోనే పగ చల్లారుతుందని చెప్పెను. ఈ సిద్ధాంతాన్ని ఉల్లంఘించలేము. మనము సంబంధాలలో అది పాటించకపోతే దుఃఖం అనుభవిస్తాము. మనము పరిణామ సిద్ధాంతం ప్రకారం, అరణ్యంలో ఉండే జంతువుల నుండి క్రమంగా చట్టబద్ధమైన జీవితంతో మనుష్యులుగా కొనసాగేము. జీసస్ చెప్పినట్టు "నన్ను తిట్టే వాళ్ళను దీవించు; నా మీద పగ పట్టినవారికి మంచి చెయ్యి".
మనం దేవుని సిద్ధాంతాలను వ్యతిరేకిస్తే ఏమవుతుందో ఊహించడం కష్టం కాదు. ఇది వ్యష్ఠి కి, సమిష్ఠి కి కూడా వర్తిస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ హింసను హింసతో అరికట్టలేము. మొదటి ప్రపంచ యుద్ధం శాశ్వతమైన శాంతిని స్థాపించడానికని నమ్మేరు. వర్సయిల్స లో జరిగిన ఒడంబడికలో జర్మనీని దోషిగా నిర్థారించడంవలన ఆ దేశానికి తీరని అవమానం కలిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఆ రోజుల్లో యుద్ధం వలన శాంతి రాదని నమ్మినవారు చాలా తక్కువ. ఇప్పుడు అలా కాక ప్రపంచమంతా ఏకమే, జీవులన్నీ ఏకమే, ఒక చోట యుద్ధం జరిగితే మనల్నందిరినీ బాధ పెడుతుంది అని నమ్మేవారు ఎక్కువమంది ఉన్నారు.