Bhagavat Gita
10.28
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
{10.39}
న తదస్తి వినా యతస్యా న్మయా భూతా౦ చరాచరమ్
అర్జునా! సకల భూతములకు బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏదియును లేదు.
నేనీ మధ్య స్పినోజా వ్రాసిన పుస్తకాన్ని చదువుతున్నాను. ఆయన యూదుల దృష్టిలో, ఎలాగైతే మైస్టర్ ఎక్హార్ట్ క్రిస్టియన్ ల దృష్టిలో సంప్రదాయేతరమైన వాడో, అంత సనాతన మైన వాడు కాడు. స్పినోజా చెప్పిన కొన్ని విషయాలపై నేను స్పందించి ఏకీభవిస్తాను. నేటి శాస్త్రజ్ఞులు, నాస్తికులైనా, ఆయనతో ఏకీభవించవచ్చు. స్పినోజా దేవుని పదార్థము అంటారు. దేవుడు ఒక్కడే నిజం, తక్కినదంతా ఆయన నీడ అంటారు. అర్జునుడు తత్త్వాన్ని అంత తెలిసిన వాడు కాదు కనుక, శ్రీకృష్ణుడు "నేను లేక, దేనికీ ఉనికిలేదు. నేను అన్ని చోట్లా ఉన్నాను" అని చెప్పెను.
స్పినోజా అన్నారు: ఒక వృత్తం గురించి తెలుసుకొంటే ఎలాగైతే తక్కిన వృత్తాల గురించి తెలుసుకొంటామో, భగవంతుని తెలిసికొంటే విశ్వం గూర్చి తెలిసికొన్నట్టే. నేను ఇల్లు కట్టేవాడిని ఒక క్లిష్టమైన భవనాన్ని కట్టమంటే, వాడు కొన్ని ఇటుకలు, కర్ర ముక్కలు తీసుకొచ్చి కట్టడం మొదలపెట్టడు. ముందు ఒక ప్రణాళిక వేసి, దాన్ని కాగితం మీద లేదా కంప్యూటరు లో గీస్తాడు. అలాగే భగవంతుడు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రణాళిక చేసి సృష్టిని గావిస్తాడు.
కొన్ని సంప్రదాయాలలో దేవుని ఇల్లు కట్టేవాడు (architect), లేదా నమూనాకారుడు (designer), లేదా విశ్వానికి గడియారాలను చేసేవాడు (watchmaker) గా వర్ణిస్తారు. మన సంప్రదాయంలో దేవుని ప్రణాళిక వేసేవాడులా కాక బీజాన్ని సృష్టించిన వానిగా వర్ణిస్తాము. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ "నా బీజం అన్ని జీవులలోనూ చూడవచ్చు" అంటాడు. ఎలాగైతే ఒక బీజంలో కంటికి కనబడని జన్యువులకు అనేక చెట్లను పుట్టించగల సామర్థ్యం ఉందో, సృష్టి అంతా దేవునిలో నిక్షిప్తమై ఉంది.