Bhagavat Gita
10.30
అథవా బహునై తేన కిం జ్ఞాతేవ తవార్జున
{10.42}
విష్టభ్యాహ మిదం కృత్త్స్న౦ ఏకాంశేన స్థితో జగత్
అర్జునా! విశేషమైన నా ఈ విభూతులను తెలియుట చేత నీకు ఏమిలాభము? ఈ సమస్త జగత్తును ఒక అంశము చేతనే నేను వ్యాపించి యున్నాను
అర్జునుని మీద ఉన్న ప్రేమతో శ్రీకృష్ణుడు తాను సృష్టిలో ఎలా వ్యక్తమవుతున్నాడో వివరించేడు. సనాతన ఋషుల, నేటి కుటుంబాల, పౌరాణిక జంతువుల, వ్యాకరణ అలంకారాల, ఉదాహరణాలతో తాను అన్ని జీవులలోనూ, క్రియలలోనూ ఉన్నాడని చెప్పేడు. ఏదైతే సంపూర్ణమో, సౌందర్యవంతమైనదో, ఐకమత్యానికి చిహ్నమో, అది తానే అని వివరించేడు. ఈ విధంగా అర్జునునికి గురువువలె బోధ చేసి, అతనిని అంతములేని పదములలో దారి తప్పవద్దని చెప్పుచున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే కోట్లాను కోట్ల నక్షత్ర వీధులను నియంత్రించి, వాటిలోని జీవులను తన శక్తితో రక్షిస్తున్నాడని మనం తెలిసికొంటే చాలు.